10
 

భ‌ద్ర‌కాళీ అంటూ పిలుస్తూ పెద్ద‌పెద్ద అడుగులు వేస్తూ ఎంతో చ‌నువుగా లోపలికి వ‌స్తున్న ఆ స్త్రీని చూసి అంద‌రూ విస్మ‌య ప‌డ్డారు. ఎవ‌రిని ఈమె భ‌ద్ర‌కాళీ అని పిలుస్తోంది ? అట్టే చూస్తే ఈమె చిన్న‌పాటి క‌పాలినిలాగ ఉంది. మెడ‌లో పెద్ద పెద్ద రుద్రాక్ష‌లు, కాషాయ రంగు ప‌ట్టుచీర‌, మోచేతి వ‌ర‌కు రంగురంగుల గాజులు నుదుట‌న కాసంత బొట్టు !

చేస్తున్న ప‌ని ఆపి జ‌య‌తి గ‌బ‌గ‌బా వ‌చ్చింది. నువ్వా వ‌సుంధ‌రా ! ఎన్నాళ్ళ‌కు మ‌ళ్ళీ క‌న్పించావు ? దా ! దా ! అంటూ లోప‌ల‌కి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అక్కా మా భ‌ద్ర‌కాళి ఏది ? వ‌చ్చిందట‌గా ? ఎవ‌రో చెప్ప‌రుటే, దివి నుండి ఒక దేవ‌త దిగి వ‌చ్చింది, అంద‌రిమీద ప్రేమ వ‌ర్షం కురిపించి భ‌క్తి మొల‌క‌లు మొలిపిస్తోంది అని. ఏమిటా అని వివరాలు సేక‌రించాను, తీరాచూస్తే నా చిన్న‌నాటి చెలిమిక‌త్తె జ‌యంతిని అంద‌రూ దేవ‌త దేవ‌త అంటున్నార‌ని తెలిసి నిజంగా ముందు మాత్స‌ర్య‌పడ్డాను. నేను చూడు ఇర‌వై ఏళ్ళ‌నుంచి శ్రీ చ‌క్రార్చ‌న చేస్తున్నాను, పూజ అయ్యాక కాళ్ళ‌కి ద‌ణ్ణం పెట్ట‌డంఱ్ఱా అంటే ఒక్క‌ళ్ళు వినిపించుకోరు ! మ‌రి జ‌యంతిని ఎందుకు నెత్తిమీద దేవ‌త‌లా చూస్తున్నారో తెల్సుకుందామ‌నుకుని వ‌చ్చాను ! అంది ఆ స్త్రీ !

వ‌సూ ! ఇంత‌కీ నీవు న‌న్ను చూడటానికి వ‌చ్చావా ? లేక న‌న్ను అంద‌రూ ఎందుకు పొగుడుతున్నారో తెలుసుకోడానికి వ‌చ్చావా ? వ‌సూ ! జ‌యంతి ఎప్పుడు వ‌చ్చిందో త‌న మాట‌లు ఎప్పుడు విందో చివుక్కున త‌ల‌తిప్పిచూసి భ‌ద్ర‌కాళీ అంటూ జ‌యంతిని కౌగించుకుని జ‌ల‌జ‌లా క‌న్నీరు కార్చింది వ‌సుంధ‌ర‌. జ‌యంతీ వసుంధ‌రా క‌లిసి ప‌ది సంవ‌త్స‌రాలు చ‌దువుకున్నారు. ప్ర‌తి రోజూ జ‌యంతిని చూడ‌గానే వ‌సుంధ‌ర జ‌యంతీ మంగ‌ళాకాళీ భద్ర‌కాళీ అని  పాడి నువ్వు భ‌ద్ర‌కాశివే జ‌యంతీ అనేది. నువ్వు క‌పాలినివే వ‌సుంధ‌రా అని జ‌యంతి ఇద్ద‌రూ వేళాకోళాలు చేసుకునేవారు.

వ‌సుంధ‌ర విఫ‌ల ప్రేమికురాలై మ‌న‌శ్చాంచ‌ల్యంతో ఒక సంవ‌త్స‌రం అటూ ఇటూ తిరిగి చివ‌రికి అమ్మ‌వారు శ్రీ చ‌క్రార్చ‌న చేయ‌మంటోంది అని పూజ‌లు చేయ‌డం మొద‌లు పెట్టింది. రోజూ ఏవో పూజ‌లు చేస్తుంది. అంద‌రూ న‌వ్వుతారు. పిచ్చిపూజ‌లు, పిచ్చిలోకం అంటారు. ఎంత న‌వ్వినా పోనీ చూద్దాం అని ప‌దో ప‌ర‌కో స్త్రీ జ‌నం ఆమె పూజ‌ల‌కి వెళ్ళి ఆమెపెట్టే ప‌ళ్ళూ ప్ర‌సాదాలూ తిని వ‌స్తుంటారు. ఆమె అడ‌గ‌కుండా వుంటే న‌మ‌స్క‌రించే వారేమోగాని, అంద‌ర్నీ పాద న‌మ‌స్కారాలు చేసుకోండి, ఏడేడు జ‌న్మ‌ల పాపాన్ని పోగొట్టుకోండి అని విసిగిస్తూ ఉంటుంది.

అవును వ‌సూ నువ్వు శ్రీ చ‌క్రార్చ‌న ఎలా చేస్తావు ? నీ పూజ‌కు న‌న్ను పిలుస్తావా ? అంది జ‌యంతి. వసుంధ‌ర పొంగిపోయింది. అంత అదృష్ట‌మా ! స్వ‌యంగా కాళీమాత నా పూజాగృహంలో అడుడు పెట్టింద‌నుకుంటాను. నువ్వొచ్చినప్పుడు న‌వార్ణ‌వ పూజ‌ను బ్ర‌హ్మాండంగా చేయిస్తాను. అంది ఆనందంగా వ‌సుంధ‌ర . వ‌సూ ! మ‌న‌కున్న‌వి స‌ప్త‌స‌ముద్రాలే క‌దూ, నువ్వు వాటిని తొమ్మ‌ది చేశావా ? అంది జ‌యంతి. స‌ముద్రాలూ న‌దులూ నాకెందుకు, నేను నిత్యం అమ్మ‌వారికి న‌వార్ణ‌వ పూజ చేస్తాను. ద‌స‌రాల్లో ఎంత ఘ‌నంగా చేస్తానో నువ్వొచ్చినప్పుడు కూడా అంతే ఘ‌నంగా చేస్తాను. అంది. వ‌సుంధ‌ర ఘ‌నం అంటే ? అంది జ‌యంతి. న‌వార్ణ‌వం అంటే న‌వ‌వ‌ర్ణాలు ! అంటే తొమ్మిది రంగులు. అమ్మ‌వారికి తొమ్మ‌ది రంగుల చీర‌లు పెడ‌తాను. న‌వ‌ర‌త్నాలు పొదిగిన హారాలు వేస్తాను, న‌వ‌కాయ పిండివంట‌లు చేస్తాను. ఖ‌డ్గ‌మాల‌ని తొమ్మ‌దిసార్లు చ‌దువుతాను, న‌వ విధ పుష్పాలు తెప్పించి పూల‌జ‌డ వేస్తాను.

అన్నీ నవాలే ! బాగున్నాయి. మీ అమ్మ‌వారు న‌వ యువ‌తియై న‌వ‌న‌వ‌లాడి పోతుంద‌న్న‌మాట ! బావుంది వ‌సూ ! అంది జ‌యంతి. ప్ర‌హ్లాద‌శాస్త్రి గార‌ని ఒక అమ్మ భ‌క్తుడు విశాఖ‌ప‌ట్నం ద‌గ్గ‌ర దేవిపురం అన్న ఊరిలో శ్రీ చ‌క్రం ఆకారంలో ఒక దేవాల‌యం క‌ట్టారుట నీకు తెలుసునా ? అంది. తెలీదు అంది వ‌సుంధ‌ర‌.

నిజంగా శ్రీ చ‌క్రం మాన‌వ రూపానికి ప్ర‌తికోణం. అంటే శ్రీ చ‌క్రానికీ మాన‌వాకృతికీ ఎంతో పోలిక వుంది. మూడు కొల‌త‌ల‌లో ఉండే శ్రీ చ‌క్రాన్ని అంటే త్రికోణాకృతిలో ఉండే శ్రీ చ‌క్రాన్ని మేరువు అంటారు. ఈ మేరువులు స్ప‌టికంతో గాని, ప‌గ‌డంతో గాని, బంగారు వెండి మొద‌లైన లోహాల‌తో గాని నిర్మించి పూజిస్తారు.

ఇందాక నువ్వు న‌వార్ణ‌వం అన్నావే ఆ మాట స‌రికాదు. న‌వావ‌ర‌ణ అన‌డం స‌రైన మాట‌. అన‌గా అమ్మ‌వారిని చేరుకోవాలంటే న‌వావ‌ర‌ణ‌లు దాటాలి ! ఆవ‌ర‌ణ అంటే నీకు తెలుసుగా ! ఒక్కో త‌లుపు తీస్తే ఒక్కొక్క ఆవ‌ర‌ణ‌లోకి ప్ర‌వేశించే వీలు క‌లుగుతుంది. నిజానికి ఈ ఆవ‌ర‌ణ‌లు అన‌గా మ‌న‌కూ అమ్మ‌కూ ఉన్న ప్ర‌తిబంధ‌కాలు, ఇన‌ప తలుపులై వీటి ర‌క్ష‌ణ‌కు దేవ‌త‌లు నియ‌మింప బ‌డ్డారు. ఆ దేవ‌త‌ల‌ను గ‌న‌క మ‌నం ప్ర‌స‌న్నం చేసుకుంటే మా తలుపులు తెర‌వ‌మ‌ని ఆజ్ఞ జారీ అవుతుంది. కాబ‌ట్టి ఈ న‌వావ‌ర‌ణ ర‌క్ష‌కులైన దేవ‌తామూర్తుల‌ను మ‌నం భ‌క్తి త‌త్ప‌ర‌త‌తో సేవించుకుని క‌డ‌కు అమ్మ వొడిలో వాల‌డ‌మే న‌వావ‌ర‌ణ పూజాఫ‌లం !

మొద‌టి ఆవ‌ర‌ణ‌కు అధికారిణి త్రైలోక్య‌మోహ‌న . ఈమెచే పాలింప‌బ‌డే చ‌క్ర వ‌ర‌ణ‌న త్రైలోక్య‌మోహ‌న చక్రం అంటారు. ఈమె ఆధీన‌లో అనేక‌మంది దేవ‌త‌లు ఉంటారు. మ‌నిషికీ శ్రీ చ‌క్రానికీ సంబంధం ఉన్న‌ద‌ని చెప్పాను క‌దా ! మ‌న‌లో స్ప‌దించే భావాలు వీటిని మూడ్స్ అంటే బాగా అర్ధం అవుతుంది. అనేక ర‌కాలైన ఆవేశ‌కావేషాలు ఎక్క‌డ‌పుడ‌తాయో, ఎక్క‌డ ఇంద్రియాల క‌తీత‌మైన శ‌క్తుల గురించి ప‌రిశోధ‌న చేసే త‌త్త్వం ఉన్న‌దో అదే త్రైలోక్య‌మోహ‌న స్థానం !

రెండవ ఆవ‌ర‌ణ ; స‌ర్వ ఆశ‌ల‌కు జ‌న్మ‌స్థానం. పంచ జ్ఞానేంద్రియాలే, క‌ర్మేంద్రియాలు, పంచ‌భూతాలు మ‌న‌స్సు. ఈ ప‌ద‌హారిటినీ అదుపులో పెట్ట‌గ‌లిగిన చ‌క్రం. స‌ర్వోశాప‌రిపూర‌క చ‌క్రం.

మూడ‌వ ఆవ‌ర‌ణ స‌ర్వ‌సంక్షోభ‌ణ చ‌క్రం ; ఇక్క‌డ సంక్షోభ‌ణం అంటే యుద్దాలు, క్షోచించ‌డాలూ కాదు. విప్ల‌వాత్మ‌క‌మైన యోచ‌న‌లు, ప్ర‌భ‌వించే స్థానం. అంత‌కుముందు ఉన్న ప‌ద్ధ‌తులకూ, పాత భావాల‌కూ విప్ల‌వాత్మ‌క స్థానం. ఈ స‌ర్వ‌సంక్షోభ‌ణ చ‌క్ర స్థానం. స‌ర్వ‌సౌభాగ్య‌దాయ‌క చ‌క్రం. ప‌ధ్గాలుగు నాడుల‌కు ఇచ్చ‌ట ప్ర‌కోప‌నం. శాంతి. సంతోషః, సౌభాగ్యం మొద‌లైన జ‌గత్కల్యాణ కార‌కాలైన సుస్వ‌భావాల పుట్టిలు ఈ చ‌క్రం.

స‌ర్వార్థ సాధ‌క చ‌క్రం ఐద‌వ ఆవ‌ర‌ణ‌. ఇక్క‌డ మ‌నిషి త‌న‌ను తాను అదుపు చేసికొని స‌ర్వార్థాల‌ను ఏది కావాలంటే దానిని పొంద‌గ‌ల స్వాస్థ్యాన్ని సాధ‌న‌ద్వారా పొంద‌గ‌లిగే స్థాయి ఇచ‌టే ఉద్భ‌విస్తుంది. త‌రువాత స‌ర్వ‌ర‌క్ష అంటే అనేక ర‌కాలైన చెడుత‌ల‌పులు, చెడు భావాలు.వీటిని సంహ‌రించి ఆత్మ‌ను దుష్ర్ప‌భావ ఛాయ‌ల‌నుండి ర‌క్షించే తావు. ఈ చ‌క్రానికి చేరుకోవాలంటే మ‌నిషి త‌న దుష్ట స్వ‌భావ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు న‌రుక్కుంటూ స‌ద్భావాల‌ను పోషించుకుని పెంచుకునే సంస్కారం పొంద‌గ‌లిగి ఉండాల‌న్న‌మాట‌. స‌ర్వ‌రోగ‌హారం ఏడ‌వ చ‌క్రం. ఇదీ మ‌న‌సు, బుద్ది, అహంకారం, వీటిని అదుపులో పెట్టుకోగ‌ల్గ‌డాన్నే సూచిస్తుంది.

ఇన్నిటిని ఇన్ని చ‌క్రాల‌ని ఇన్ని త‌త్వాల‌ని ఇన్ని గుణాల‌ని దాటుకుని వెళ్తే స‌ర్వ‌సిధ్ధి ప్ర‌ద‌మైన స‌ర్వ‌సిద్ధి ప్ర‌ద చ‌క్రం వ‌ద్ద ఆవ‌ర‌ణ నుండి ఇంకొక ఆవ‌ర‌ణ‌లోకి ప్ర‌వేశించి స‌ర్వానంద మ‌య‌మైన ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపైన ఆది మ‌ధ్వాంత‌ర‌హిత‌మైన శ్రీ చ‌క్ర‌న‌గ‌ర సామ్రాజ్ఞి శ్రీ రాజ‌రాజేశ్వ‌రీ అమ్మ‌వారి సాన్నిధ్యం ల‌భ్య‌మౌతుంది. వ‌సుంధ‌ర‌కు ఆనందంతో పూన‌కం వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

ఆయ్యో జ‌యంతీ ఎంత అజ్ఞానంతో ఇన్నాళ్ళూ పూజ‌లు చేశాను అని సంతోషం దుఃఖం క‌లగ‌లుపుకాగా జ‌యంతిని కౌగ‌లించుకుంది. వ‌సూ ! పూజ ఎప్పుడూ పూజే తెలిసిచేసినా తెలీక చేసినా పాపాన్ని ఎలా అనుభ‌వించాలో పుణ్యంకూడా అలాగే మ‌న‌ను ఆలింగ‌నం చేసుకుంటుంది అంది జ‌యంతి. ఇక రామ‌దాసుల వారు ర‌చించిన రాచచంద్ర చూర్ణిక‌ను చ‌దువుకుందాం - ల‌లిత కీ రామ‌చంద్రునికి భేదం.