ముందుమాట
ఒకసారి నేను రాష్ట్ర సేవికా సమితి సంఘటన విశేష సంచిక చదువుతున్నాను. దానిలో రక్షాబంధన్ ఉత్సవం గురించి ఈ విధంగా చదివాను. ఇంద్రుడు యుద్ధం కొరకు బయలుదేరినపుడు ఇంద్రపత్ని శచీదేవి రక్షాకంకణము కట్టింది. తన తపస్సు యొక్క ఫలితాన్ని ఇంద్రుని రక్షణ కొరకు ధారపోసింది ; నిలబెట్టింది. భార్య తాను పొందిన శక్తిని భర్త కొరకు వినియోగించటం హృదయాన్ని స్పందింపచేసే సంఘటన కదా !
తదుపరి బౌద్దిక్‌లో నేను ఇంకొక విషయం విన్నాను. స్వకార్య సమర్పిత, పతికార్య సమర్పిత అని. తన జీవితానికి ఉన్నత లక్ష్యాన్ని ముందుంచుకొని దానికొరకు జీవితాన్ని సమర్పించే స్త్రీ, భర్త చేస్తున్న పని యొక్క యశస్సు కొరకు అన్ని విధాలా సహకారాన్ని అందించే స్త్రీ.
వం తాయీజీ జీవితాన్ని పరిశీలించినపుడు ఈ మూడు విషయాలు కన్పిస్తాయి. శ్రీ వినాయకరావు ఆప్టే సంఘకార్యం చేయాలని నిశ్చయించారు. వెనువెంటనే వారు తమ న్యాయవాదవృత్తిని వదిలి పెట్టారు. అయితే, ఈ రెండు విషయాలు వం|| తాయీజీ యొక్క మానసిక, శారీరక శక్తిని పరీక్షించే సంఘటనలు.
సంఘకార్యం వలన బంధువుల సంఖ్య పెరిగింది. ఆదాయం తగ్గింది. ఖర్చు పెరిగింది. కానీ వం|| తాయీజీ యొక్క కష్టాలు త్యాగము, సహనశీలత, విషాదమెరుగని నిత్యానందతత్వం సమతౌల్యమైనది. ఒకవేళ యిలా కాకపోతే శ్రీ వినాయకరావుగారి కార్యమనే చక్రము శబ్ధంతో నడిచేది.
వం|| తాయీజీ కేవలం ఇది చేసి మాత్రమే ఆగలేదు. సమాజ రూపీ శకటం సరిగ్గా నడవడానికి సమాంలోని సగభాగమైన స్త్రీలు సమర్థవంతులు కావాలనే ఆలోచన వారికి కలిగి, కార్యాన్ని ప్రారంభించారు. అప్పటికి వారి వయస్సు 25 సం|| మాత్రమే. ఆఖరి శ్వాస వరకు 84 సం|| గలన వం|| తాయీజీ ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా పని చేస్తూనే వున్నారు.
ఈ సమాజంలోని భాగముగా మనం ఏమిచేయాలి అన్న విషయాన్ని బౌద్ధిక్‌ల ద్వారా కాక ప్రత్యక్షంగా ఆచరించి సేవికల ముందుంచారు. వం||తాయిజీ ఆలోచన క్రియగా మారింది. కానీ ఉచ్ఛారణ ఎప్పటికీ జరగలేదు. సుగంధాన్ని యిస్తూ యిస్తూ పువ్వు ఎప్పుడు వాడిపోయిందో తెలియలేదు. దీపం ఒత్తి వెలుగుతూ వెలుగుతూ ఎప్పడు ఆయిపోయిందో తెలియలేదు. ఆరిపోయిన తరువాతే తెలిసింది. అయినా చీకట్లో లేము. ఎందుకంటే, ఈ జ్యోతి తాను ఆరిపోకముందే అనేక జ్యోతులను వెలిగించింది.
ఇటువంటి ఒక చిరంజీవ జ్యోతికి మరియు కిరణానికి చేసిన వంనమే ఈ పుస్తకము.
డాక్టర్ శకుంతలా దవ్వే
|