47
 

అప్పుడు గుగ్గిలం మంట‌లు గుప్పుమ‌ని ఒక్క‌సారి వెలిగిన‌వి. ఆ త‌ళుకుల‌లో అవ‌నిక వెనుక‌కు పోయిన‌ది. కాగ‌డాల వెలుతురున రూపెత్తిన సౌంద‌ర్యంలా త‌ల‌వంచి, స‌మ‌భంగా కృతి అంజ‌లిహ‌స్త‌యై, పూవులు అంజ‌లిలో ధ‌రించి, క‌న్నులు మెర‌సిపోవు వేషంతో శుక‌వాణీ నిలుచుండి ఉన్న‌ది.

అప్పుడు నాట్య గురువు,

దివ్య వ‌స్త్ర ధ‌రాం నారీం దివ్యాభ‌ర‌ణ భూషితాం

ఏవంతు మేళ్యం కృత్వా రంగ‌స్థానం ప్ర‌వేశ‌యేత్ అని పాడి పాత్ర ప్ర‌వేశ‌ము వినిపించిన‌వాడై, ఆ గురువు ఆమె ఎడ‌మ‌వైపుకు పోయి నిలిచినాడు. తాళం వాయించే చెలిక‌త్తె ఆమెకు కుడివైపున‌ను వీరిరువురూ గీతాదులు పాడ‌డంలో నాట్యం చేయ‌బోయే చెంచుల‌క్ష్మికి హంగుగా ఉండ‌బోతున్నారు.
నాట్యంకై తెర‌తీయ బోయ‌ముందే నేప‌ధ్యంలో బ్రాహ్మ‌ణులు రంగాధిదేవీ పూజ చేసినారు. అప్పుడు శుక‌వాణి కంఠ‌మెత్తి,

న‌ఖ‌జిత శ‌శిరేఖా న‌మ్ర మందార శాఖా
మ‌ణి ముకుర క‌పోలా మంజులానే క‌లీలా
క‌ర‌ధృత శుభ‌వీణా కామ‌ర‌క్షా ప్ర‌వీణా
క‌ల‌యతు మ‌ణి నీవీ కాపి రంగాధిదేవీ !
భ‌ర‌తుకుల భాగ్య‌క‌లికే
భావ ర‌సానంద భూషితాపాంగే
జ‌గ‌దేక మోహ‌న క‌రు
జ‌య జ‌య రంగాధి దేవ‌తే దేవీ, అని ప్రార్ధంచిన‌ది.

ఆ దినం శుక్ర‌వారం అవ‌డంచేత ఆమె అంజ‌లియందు జాజులు మ‌ల్లిక‌లు ఉన్న‌వి.
జపా కుసుమ పున్నాగ ద్రోణ‌కేత‌క చంప‌కాః

జాతీవ‌కుళ పుష్పాణి ర‌వివారా దిషుక్ర‌మాత్ అని నాట్య‌శాస్త్ర‌మందు చెప్ప‌బ‌డి ఉన్న‌ది. సూర్యునికి జ‌ఫా పుష్పాలు, క‌మ‌లాలు సూర్య‌కాంతి పుష్పాలు, సువ‌ర్ణ‌క‌ర‌వీరాలు ఇష్టం కాబ‌ట్టి ఆదివారం నాడు నాట్య‌మైతే ఆ పుష్పాలు న‌ర్త‌కి ధ‌రించ‌వ‌ల‌సి ఉన్న‌ది. సోమ‌వారం నాడు చంద్రునికిష్ట‌మైన పున్నాగలు. శిరీషాలు, తెల్ల క‌లువ‌లు, చంద్ర‌కాంత‌లు, మాల‌తీ మాధ‌వీ పుష్పాలు ఏవైనా అంజలియం దుండాలి. మంగ‌ళ‌వారం నాడు కుజునికిష్ట‌మైన తుమ్మిపూవులు, ర‌క్త‌క‌ర‌వీరాలు, ఎఱ్ఱ‌క‌లువ‌లు, కాళీర‌త్నాలు ఉంవ‌ల‌సి ఉన్న‌ది. బుధ‌వారంనాడు మొగ‌లిపువ్వులు, కురువ‌క‌, మ‌ర‌వ‌క‌, దేవ‌కాంచ‌నాలు, గురువారం నాడు చంప‌క‌జాతులు, నందివ‌ర్ధ‌నాలు, గోరింట పూవులును, శుక్ర‌వారం నాడు జాజిజాతులు, క‌డిమిపూవులు, శ‌నివారం నాడు పొగ‌డ‌లు, నీలిక‌లువ‌లు, శేఫాలిక‌లు అంజ‌లియందు ధ‌రించ‌వ‌ల‌సి ఉన్న‌ది.

ఆ వెనుక శుక‌వాణి స‌భ‌ను ఉద్దేశించి,

నానా శాస్త్ర స‌రిత్స‌మేత మ‌మ‌లం ఛందః ప‌యఃపూరితం
త‌ర్కోక్తి ర్విశ‌దోక్తి మౌక్తి క‌చ‌యం వేదాంత వాక్యామృతం
స‌మ్య‌న్‌జ‌య స‌హ‌స్ర ర‌త్న‌నిక‌రం హాసాఖ్య ఫేనోజ్వ‌లం.....
....వందే స‌భావారిధిం. అని ప్రార్ధించి, అంజ‌లి పుష్పాలు స‌భ అన్ని వైపులా చ‌ల్లిన‌ది.

ఆమెకు వెనుక నుండిన నాట్య గురువు కంఠ‌ము త‌న‌గ‌ళానికి మంద‌ర శృతికాగా స‌భ‌కు పునఃపునః త‌ల‌వంచి న‌మ‌స్క‌రించిన‌ది.

ఒక్క‌సారిగా మృదంగ‌ము ప‌లుక‌గా తాళ‌ము ల‌య‌కాగా నాట్య గురువు, తోధ గిధాం ధాం ధాం ధిక్క తోధిక‌తా అని అక్ష‌రాల‌తో అల‌రింపు ప్రారంభించినాడు.

చెంచుల‌క్ష్మి వృత్తానంద అయిన‌ది. ల‌య ప‌ర‌వ‌ళ్ళెత్తిన‌ది. ఆ బాలిక రూప‌ము మెరుము త‌ళుకులైన‌ది. ఆమె పాదములు అతివేగంతో గ‌తిని విశ్వ‌కాల శ్రుతిని చేస్తున్న‌వి. ఆమె హ‌స్తాల క‌ద‌లిక గ‌తినిసామ్యం చేస్తున్న‌ది. త‌నువు ల‌త‌వ‌లె ఊగుతున్న‌ది. చంక్ర‌మ‌ణ మండ‌లాదులు ప‌న్నీటి సుడులో, ప‌రీమ‌ళాల ప‌డ‌వ‌లో !

చివ‌ర‌కు తొంగుత్త‌కా ది అక్ష‌రాల‌తో అల‌రింపు పూర్తి చేసిన‌ది. ఆ వెంట‌నే తాన‌వ‌ర్ణం నాట్యం స‌లిపి ఒక ప‌ద‌ము అభిన‌యించ‌ట‌ము ప్రారంభించిన‌ది.