64
 

ఆహా ! అయితే క‌త్తి సంగ‌తే కాకుండా క‌విత్వం సంగ‌తి కూడా నీకు తెలిసిన‌ట్లున్న‌దే !

నీతో మాట‌లు పెట్టుకొని కూర్చొన‌టానికి నాకు వ్య‌వ‌ధిలేదు. కాని నీ మాట‌లు న‌న్నింత‌సేపు నిల‌బెట్టినాయి. నీవు దొంగ‌ల ముఠాసంగ‌తి ప్ర‌స్తావించావు. ఆ సంగ‌తి వివ‌రంగా చెప్పు.

ఇంత‌లో ఇరువ‌ది అశ్వ‌ముల‌పై సాయుధులైన సైనికులు వ‌చ్చి, ప‌దిబార‌ల దూరంలో గుఱ్ఱ‌ముల‌ను ఆపి దిగి నిల‌బ‌డి, ఈ సైనికున‌కు వంద‌న‌ము చేసి, విన‌య‌ముగా నిల‌బ‌డినారు.

మిత్ర‌మా ! నీవు సామాన్య సైనికుడివికావు. వీరికి నాయ‌కుడివి. అందుచేత‌నే వారు నీ ప‌ట్ల అంత విన‌య‌ము ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఓ క‌వీ ! నన్ను మిత్ర‌మా అని సంభోధించావు. ఈ క్ష‌ణ‌మే అది నిజ‌మ‌గుగాక ! అని సైనికుడు వేంక‌ట‌ప‌తిని ప్రేమ‌గా ఆలింగ‌నం చేసికొన్నాడు.

కార‌ణ‌ము లేని మైత్రి. ఇదోక విధి వైచిత్ర్య‌ము !

ఓయీ, సైనికా ! మ‌న సాంగ‌త్య‌ము నిశ్చ‌య‌మ్ము, నిలుచున్నా చంద్ర‌తార‌ర్క‌ముల్‌, అని సైనికుని వెన్నుత‌ట్టి, నీ దివ్య‌నామ‌ము తెల‌పి కొన‌వ‌చ్చునా ? అన్నాడు, వేంక‌ట‌ప‌తి.

పేరు త‌రువాత తెలిసినొందువుగాని, మందు చోరుల సంగ‌తి చెప్పితే అర‌ఘ‌డియ‌లో వారిని దునుమాడి వ‌చ్చి, నీ సంగ‌తుల‌ను విని నా సంగ‌తుల‌ను చెప్తాను.

ఓహో ! ఏమి లౌకికుడ‌వు ! చోరుల‌ను దుసుమాడిన త‌రువాత‌కూడ ముందు నా సంగ‌తే తెల‌య‌వ‌ల‌యును క‌దా ! నీ విష‌య‌ములు ఆ తరువాత చెప్పెద‌వా ?

మిత్ర‌మా ! కాల‌హ‌ర‌ణః చేయ‌డం నీవంటి సూక్ష్మ‌జ్ఞానికి త‌గ‌దు. వేంక‌ట‌ప‌తి ఆశ్య‌ర్యానందాల‌తో సైనికుని మోము ప‌రికించినాడు.

ఏమి ఈ సామాన్య‌ద‌ళ‌వాయి బుద్ధి నైశిత్య‌ము ! కేవ‌ల‌ము సంభాష‌ణ‌లోనే త‌న‌ను క‌విగా గుర్తించినాడు ! పుట్టి పెరిగిన ప‌ట్ట‌ణాన లేని గుర్తింపు ఈ మార్గ‌మ‌ధ్యంలో క‌ల్గింది, మ‌రిన్నీ నా బుద్ది సూక్ష్మ‌త‌ను కూడా తెలిసికో గ‌ల్గినాడు ! అనుకున్నాడు, వేంక‌ట‌ప‌తి.

స్నేహితుడా, విను ఈ పాటికి చోర‌ద‌ళం ప‌ద‌హారు ఇర‌వై క్రోసుల దూరం పోయి ఉండ‌వచ్చును. ప్ర‌స్తుత‌ము వారి నాయ‌కుడు నా క‌త్తివేటుతో కోల్పోయిన మొండిచేతికి శ‌స్త్ర చికిత్స చేయించుకునేటందుకు ఏదైనా ద‌గ్గ‌ర గ్రామానికో, వైద్య స‌దుపాయం ఉండే చోటుకో చేరే ఉంటాడు. లేక‌పోతే ఈ పాటికి శీత‌లం క‌మ్మేఅవ‌కాశం ఉంది.

ఏమిటీ ! చోర‌నాయ‌కుడు నీ చేతిలో గాయ‌ప‌డినాడా ?

అత‌డు నాయ‌కుడో కాడో నాకు తెలియ‌దుకాని మిగ‌తావారిలో ప్ర‌త్యేకంగా ఉన్నాడు. అత‌డు న‌ల్ల‌గా, ఆర‌డుగుల పొడ‌వు, చిన్న‌వైనా క్రూర‌మైన క‌ళ్లు, నిమ్మ‌కాయ‌నిల‌చేంత దట్ట‌మైన మీసాలు. ఇంకొక మార్పు క‌న్పించింది. ఉష్ణీవం ద‌క్షిణాది ప్ర‌జ‌లు ధ‌రించే మాదిరికాక ఒక చిన్న వ‌స్త్రాన్ని త‌ల‌కు క‌ప్పుకొన్న‌ట్లుగా ఉన్నాడు.

ఒహో ! అత‌డు మేర్వారుకు చెందిన గంగారామ్. అత‌ని చేతిని ఖండిండా వంటే ఆ రాక్ష‌సుడు చోళ‌గుడికి కుడిభుజం పోయిన‌ట్లే కాక‌పోతే గంగార‌మ్ చోళ‌గుడి అంత‌టి భ‌యంక‌రుడు కాడు. నూత‌నూడా ! ఈనాడు నాకెంతో ఆనందాన్ని క‌ల్గించావు. మ‌ర‌ల రేపు క‌లుసుకుంటాను. ఇప్ప‌టికి సెల‌విత్తువా ?
వేంక‌ట‌ప‌తి ఇచ్చే స‌మాధానం విన‌క‌నే అత‌ని భుజాన్ని త‌ట్టి క్ష‌ణంలో క‌నుమ‌రుగై పోయినాడు, సైనికుడు, మిగిలిన అశ్వికులు అనుస‌రించారు. వేంక‌ట‌ప‌తి విర్విణ్ణుడ‌యి అలాగే చూస్తుండి పోయినాడు.

అన్న‌య్యా ! అని అన్న‌మ‌రాజు త‌ట్టి పిలిచాడు.

త‌మ్ముడూ, చూశావుట‌య్యా కావేరీతీర వాసులెంత సూక్ష్మ‌గ్రాహులో ! ఈ సైనికుడు వేషాన్ని బ‌ట్టి ఎంతో సాధార‌ణంగా అగుప‌డుతున్న‌ప్ప‌టికీ ఎంతో ఠీవీగా ఉన్నాడు. ముఖంలో రాజ‌స‌ము వెలిగిపోతున్న‌ది. పాల‌కులు మారు వేష‌ముల‌లో సంచ‌రిస్తారంటారు. ఒక వేళ ఇత‌డు ఏ రాజోకాడు గ‌దా !