86
 

దేవీన‌వ‌రాత్రుల‌కు నాట‌క‌శాల ప్రారంభింప‌బ‌డిన‌ది. ప్రారంభ‌దినాన విఘ్నేశ్వ‌ర విజ‌య‌ము అనే శివ‌పురాణాంత‌ర్గ‌త వినాయ‌క జ‌న‌న‌గాధ‌, నాట‌క‌ముగ య‌జ్ఞ‌నారాయ‌ణునిచేత వ్రాయ‌బ‌డి, వేంక‌ట‌మ‌ఖిచేత ప‌ద్య‌ముల‌కు నూత్న‌రాగ‌ముల‌తో స్వ‌రక‌ల్ప‌న చేయ‌బ‌డి ప్ర‌ద‌ర్శింప‌బ‌డిన‌ది. దేశాన్ని పాలించే రాజులు వైష్ణ‌వ‌మ‌తాభిమానులై యుండిన్నీ శివ‌త‌త్త్వ పూరిత‌మైన గాధ‌ను ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని కొంద‌రు మ‌తోన్మాదులు అడ్డుప‌డ ప్ర‌య‌త్నించారు.

గోవింద‌దీక్షితులు శివ‌కేశ‌వుల అభేధాన్ని గురించి వారి మ‌న‌స్సుల‌కు హ‌త్తుకొనేలా, క‌డుహృద్యంగా ప‌టిష్ఠ‌మైన వాద‌ల‌ను చేసి ఒప్పించినారు. ఏ మ‌తాల మాట ఎట్లున్నా,అటు వినాయ‌కుడున్నా ఇటు ఆంజ‌నేయుడున్నూ అంద‌రికీ ఆరాధ్య‌దైవాల‌నే మాట‌ను ఎవ్వ‌రూ కాద‌న‌లేక పోయినారు. స‌ర్వ‌కార్యాల‌కూ, ఆరంభ‌వేళ‌ల‌లో, నిర్విఘ్నం కురుమేదేవ స‌ర్వ‌కార్యేషుస‌ర్వ‌దా అని విఘ్న‌రాజుని పూజించ‌క మ‌రొక‌రిని పూజింప‌రాదు. ఆంజ‌వేయుడు శివాంశ‌సంభూతుడున్నూ, శ్రీ‌రామ‌ప‌ద‌స‌రోజ చంచ‌రీకుడున్నూ అయి ఉండ‌డంచేత అంద‌రికిన్నీ ఆరాధ్యుడే.

రెండ‌వ‌నాడు క్షీర‌సాగ‌ర‌మ‌ధ‌న‌ము. ఈ నాట‌క‌మునూ సంగీత‌నాట్యాల‌నూ మ‌నోహ‌రంగా స‌మ్మేళ‌నం చేసి ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను అమృతాప్లావిత‌ము చేసిన‌వారు కృష్ణాన‌దీ తీర‌కూచిపూడి గ్రామ‌నివాసస్థులు. సిద్ధేంద్ర మ‌హాక‌వి ఋషితుల్యుడై. నూత్న‌సంప్ర‌దాయోప‌దేష్ఠ‌యై విరాజిల్లినాడు.

మూడ‌వ‌నాడు అశ్వ‌ఘోషుడు ర‌చించిన శారిపుత్ర అనే శాంతి బోద‌క రూప‌క‌మును ప్ర‌ద‌ర్శించినారు. త‌ధాగ‌తుడు మూర్తీభ‌వించిన శాంత‌యూర్తియై స‌హృద‌య హృద‌య సంత‌ప్తాగ్నుల‌ను త‌న ద‌యార‌స దృష్టుల‌లో స్నాన‌మిడించి స‌మాహ్లాద‌న ప‌రిచ‌నాడు. శారిపుత్ర మౌద్గ‌ల్యాయ‌నుల‌ను స్వ‌య‌ముగా త‌న‌ద‌రికి చేర్చుకొని ప్ర‌శాంత‌చిత్తుల‌ను జేసినాడు.

రాజ‌శేఖ‌రుని క‌ర్పూర‌మంజ‌రి, ప్ర‌హ్లాద విజ‌య‌ము, దుర్గావ‌తార‌ము మొద‌లైన భ‌క్తిర‌స ప్ర‌ధాన నాట‌క‌ముల‌తోపాటు శృంగార, హాస్య‌ర‌స ప్ర‌ధాన‌మైన త‌త్త్వ‌మ‌సి అనే నాట‌క‌ము విశేషంగా జ‌నాకర్ష‌ణ‌ను పొంద‌గ‌ల్గిన‌వి.

శృంగార సావిత్రిన్నీ, త‌త్త్వ‌మ‌సిన్నీ యువ‌రాజులైన శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాధుల‌వారిచే విర‌చింప‌బ‌డిన‌వ‌ని తెలిసికొన్న ప్ర‌జ‌లు త‌మ ప్ర‌భువుల శ‌క్తిసామ‌ర్ధ్య‌ముల‌నే గాక లోక‌జ్ఞ‌త‌నుకూడ చూచి ఎంత‌గానో సంత‌సించినారు. దిన‌దిన‌ము వారు చూచుచున్న అనేక‌ములైన న‌య‌వంచ‌న‌లనూ, నీర‌స‌మాన‌వ స్వ‌భావ‌జ‌నిత‌ములైన హీన‌బుద్ధుల‌నూ యువ‌ప్ర‌భువు చ‌క్క‌గా ఆక‌శింపు చేసికొని హాస్య‌ర‌స‌ము ఉప్పొంగున‌ట్లుగా లోపాల‌ను యెత్తి చూపినాడు. బంగ‌రు తూగుటుయ్య‌ల‌లో లీలావిలాసంగాకాలం గడుపుతూ పూలశ‌య్య‌ల‌పై ప‌వ్వ‌ళించే రాకుమారుల‌కీ విష‌యాల‌న్నీ ఎలా గోచ‌రించినాయా అని వారు సంభ్ర‌మంలో ప‌డిపోయినారు.

ర‌ఘునాథుడు ఆయా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనిన స‌ర్వ‌క‌ళాకారుల‌కూ మ‌హ‌దానంద‌ముతో బంగారు మాడ‌ల‌ను ప‌ళ్ళెర‌ముల నిండుగా కాన్క‌జేసినాడు.

శ్రీ‌రామ‌సౌధ నిర్మాణ‌మును దేశ‌దేశాల నుండి జ‌నులు వ‌చ్చి చూచి పోవుచున్నారు. ఎగురుట‌కు సిద్ధ‌ముగా నున్న పుష్ప‌క విమాన‌మువ‌లెనున్న ఆ సౌధ‌ము యొక్క బంగ‌రు రెక్క‌లు ఎంతో స‌హ‌జ‌ముగ ఉండున‌ట్లుగా సౌంద‌ర్య‌మ‌య‌ముగా తీర్చిదిద్దినారు. శిల్ప‌బ్ర‌హ్మ‌లు సృష్టించిన శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేక ఘ‌ట్ట‌ము జీవ‌క‌ళ‌తో ఉట్టిప‌డుతూ, సౌధాంత‌ర్భాగాన ప్ర‌కాశిస్తూ ఉన్న‌ది. శ్రీ‌రామ‌సౌధ‌కంఠోప సీమ‌యందు రెండు బంగ‌రు గోపుర‌ముల‌ను నిర్మింప‌జేసినాడు, ర‌ఘునాధ‌నాయ‌కుడు. అందొక‌టి గూఢ‌గోపుర‌ము. ఇందులోని చ‌ర‌మాంత‌రువు నుండి శ‌త్రువుల రాక‌ను క‌నిపెట్టుట‌కు దూర‌ద‌ర్శ‌న‌మ‌గు న‌ట్లుగా ర‌హ‌స్య‌ద‌ర్ప‌ణ‌ములు అమ‌ర్చ‌బ‌డిన‌వి. ఈ ద‌ర్ప‌ణ‌ముల‌ను విదేశీ నావికులు అచ్యుత‌నాయ‌క ప్ర‌భువుల‌కు కానుక‌గా అర్పించుకొని ఉన్నారు. కొట్ట‌ములో నిరుపయోగంగాప‌డి ఉన్న వీటిని యువ‌రాజు ఈ ప్ర‌కారంగా ఉప‌యుక్త‌ముల‌ను చేసినాడు. క‌డ‌లూరు స‌ముద్ర‌తీర‌మున‌కు వివిధ విదేశీ వ‌స్తువుల‌ను తీసికొనిచ్చిని గ్లోబ్ అనే ఓడ‌లోనికి ఎక్కి దుర్భిణీ యంత్ర‌ము నుండి దూర తీరాల‌ను చూచిన నాటి నుండి రాజ‌కుమారునికి ఈ ద‌ర్ప‌ణ‌ముల‌ను ఇట్లు ఉప‌యోగించ‌వ‌లెన‌న్న యోచ‌న‌క‌ల్గిన‌ది ఈ గూఢ గోపుర‌మున్నూ, రెండ‌వ గోపుర‌మున్నూ జ‌నుల‌కు చూడ‌టానికి పైకి ఒకే విధ‌ముగా, క‌వ‌ల‌లాగ‌, ఉన్న‌ప్ప‌టికిన్నీ రెంటి ఉప‌యోగ‌ములూ ప‌ర‌స్ప‌ర విరుధ్ధ‌ములుగానే ఉంటాయి.