ఈయ‌న పార‌శీక చిత్ర‌క‌ళ‌ను పున‌రుద్ద‌రించారు. గాలిబ్ గీతాల కీయ‌న రూప‌క‌ల్ప‌న చేసారు. ఆ స్థాయిని మ‌రెవ‌రూ అందుకోలేక పోయారు. మూడోవాడు ప్ర‌మోద‌కుమార్ ఛ‌టోపాధ్యాయ‌. ఈయ‌న గుర‌వు కెదురు తిరిగాడు. అస‌లు చిత్ర‌క‌ళ ఆంధ్రుల‌ద‌ని బౌద్ధ గ్రంథావ‌లోక‌నం వ‌ల్ల గ్ర‌హించాడు. ఆశాస్త్రాల‌న్నీ ఇప్ప‌టికి టిబెట్‌లో వున్నాయి. శాంతినికేత‌నం విడిచిపెట్టి లాసా చేరుకొన్నారు. అక్క‌డ ధాన్య‌క‌ట‌కానికి అనువాదియై తూపాంగ్ విశ్వ‌విద్యాల‌య‌ములో చిత్ర‌క‌ళా గ్రంధాల్ని అధ్య‌యనం చేసాడు. వారి రేఖా పుష్టిని, రూప‌లావ‌ణ్యాదుల‌ను ఆక‌ళించు కొన్నాడు. భార‌తీయ క‌ళోద్ధ‌ర‌ణ‌కు ఆంధ్ర‌దేశ‌మే అనువైన స్థానం అనుకొని యిక్క‌డికి వ‌చ్చాడు. బంద‌రు జాతీయ క‌ళాశాల ప్రిన్సిపాల్‌గా, చిత్ర‌కాళాధ్యాప‌కుడుగా నియ‌మితుడ‌య్యాడు. ఆయ‌న బాపిరాజు గారి గురువు.

భార‌తీయ చిత్ర‌క‌ళ‌కు రేఖ‌ప్రాణం. మ‌ధ్య‌యుగీన పాశ్చాత్య చిత్ర‌క‌ళ‌కు శ్యామోజ్వ‌ల (లైట్ అండ్ షేడ్) వ‌ర్ణ‌లేప‌న ముఖ్య‌ము అందుక‌నే విష్ణుధ‌ర్మోత్త‌ర కారుడు

రేఖాం ప్ర‌శంస‌త్యాచార్యావ‌ర్త‌నాంచ విచ‌క్ష‌ణాః
స్త్రీ యోభూష‌ణ మిచ్ఛంతి వ‌ర్ణాఢ్య మిత‌రేనాః అన్నాడు.

దీన్నిబ‌ట్టి రేఖ ప్రాణం అని వ‌ర్త‌న విధాన‌ము స‌ప్రాణ‌మ‌ని మ‌న‌కి విదిత‌మ‌వుతుంది. బుద్ధుడు, బ్ర‌తికుండ‌గా కృష్ణాతీర‌వాసులైన వ‌ర్త‌కులు కొంద‌రు ఆయ‌న్ని చూడ‌టానికి రాజ‌గృహం వెళ్ళారు. వేణువ‌నారామ‌నిలో ఆయ‌న ద‌ర్శ‌నం చేసుకొన్నారు. బుద్ధుడ‌ప్ప‌టికి న‌డివ‌య‌స్సులో ఉన్నారు. ఆయ‌న‌తో అవీ యివీ మాట్లాడిన‌పిమ్మ‌ట అయ్యా ! త‌మ రూప చిత్ర‌మున‌కు అనుమ‌తిస్తారా అని మ‌న యువ చిత్ర‌కారుడ‌డిగాడు. బుద్ధుడు న‌వ్వుతూ అందుకు ఒప్పుకున్నాడు. బుద్ధుడు ఎండ‌లో ఒక బండ‌మీద నిల‌బెట్టాడు. వెదురు క‌ర్ర చ‌ట్రంలో వ‌స్త్రాన్ని బిగించాడు. చ‌ట్రాన్ని బుద్ధుని వెనుక వ‌ర్త‌కులు ప‌ట్టుకున్నారు. దానిమీద ఆయ‌న నీడ‌ప‌డింది. చిత్ర‌కారుడు ఆ నీడ‌న‌నుస‌రించి ముందు రేఖ‌లు గీసుకొన్నాడు. త‌ర్వాత చ‌ట్రాన్ని ప‌ట్టుకొని యింటికి వ‌చ్చి క‌న్ను ముక్కు జాగ్ర‌త్త‌గా గీసుకొన్నాడు. గ్రంధ‌స్థ‌మైన భార‌తీయ ప్ర‌థ‌మ చిత్ర ర‌చ‌న అదే. అదేనేటి శిల్పాల‌కు, చిత్రాల‌కు మాతృక ఈ రెండు క‌ళ‌ల‌కు ఉన్న‌త‌స్థాయి పెంచిన‌వారు బౌద్ధులు. వారికి మాతృక నందించిన వారు తెలుగు వారు . అయిన‌ప్పుడు భార‌తీయ చిత్ర‌క‌ళ‌కు మూలం తెలుగు చిత్ర‌క‌ళ అంటే త‌ప్పేమిటి ?  బుద్ధమ‌హావీరుల త‌ర్వాత చిత్ర శిల్పాల కెక్కిన‌వాడు ఏసుక్రీస్తు. ఏసుక్రీస్తు ఆరూపం ఆయాదేశాల‌నుబ‌ట్టి, చిత్ర‌కారుల భ‌వ‌శిల్పాల‌త‌ను బ‌ట్టి మారుతూ ఉంటుంది. కానీ ఏశిల్పి మలిచినా, ఎవ‌రు చిత్రించినా బుద్ధునిరూపం ఒక్క‌టే భేదం లేకుండా ఉంటుంది. మ‌హావీరుడు భార‌త‌దేశం దాటిపోలేదు. కాని బౌద్ధ‌మతం ఆగ్నేయాసియా, చైనా జ‌పాన్‌, ర‌ష్యాల‌లో కూడా ఉంది. ఏదేశంలో చూసినా బుద్ధ ప్ర‌తిమ‌లో తేడా క‌నిపించ‌దు. అందుకు కార‌ణం ఆయ‌న జీవిత‌కాలంలో ఆయ‌న్ని చూసి మ‌న తెలుగువాడు చిత్రించిన బొమ్మ అని మ‌నం స‌గ‌ర్వంగా చెప్పుకోవ‌చ్చును. శిల్పానికైనా స్థాప‌త్యానికైనా మూలం చిత్ర‌క‌ళ‌. అందుక‌ని భోజుడు ఇలా అంటున్నాడు.

అధ ప్ర‌పంచ‌తేస్మాభి ర్విన్యాస్స చిత్ర‌క‌ర్మ‌ణః
చిత్రంహి స‌ర్వ‌శిల్పానాం ముఖం లోక‌స్య‌చ‌ప్రియ‌మ్‌

చిత్రాల‌ల చాలార‌కాల ఉన్నాయి. వాటిని అభిల‌షితార్థ చింతామ‌ణి కారుడు విపులంగా వివ‌రించాడు. సాదృశ్యం విఖ్య‌తేయ‌త్తు ద‌ర్ప‌ణే ప్ర‌తిబింబ‌వ‌త్ చిత్రం విద్ధ‌మిత్యాహ‌ర్విశ్వ క‌ర్మాద‌యో బుధః ఆక‌స్మికే లిఖామితి యాదాతూద్ధిశ్య లిఖ్య‌తే ఆకార‌మంత‌, సంప‌త్యే త‌ద‌విత్థ‌మితి స్శృత‌మ్ స‌ద్ర‌వేర్వ‌ర్ణ కైర్లేఖ్యం ర‌స‌చిత్రం విచ‌క్ష‌ణైః చూర్ణి తేర్వ‌ర్ణ కైర్లేఖ్యం ధూలిచిత్రం విదుర్భ‌ధ సుప్ర‌మాణం త‌ధా విత్థ‌మ‌విత్థం బావ‌చిత్ర‌కం ర‌స‌ధూలి గ‌తం ప్రోక్తం మాన‌సౌల్లాసి పుస్త‌కే.

ఇందులో సాదృశ్యం గ‌ల‌ది విత్థ చిత్రం. దీన్నే మ‌నం యిప్పుడు పోట్రేట్స్ అంటున్నాము. ఆక‌స్మికంగా ఆకార మాత్రంగా గీసింది భావ చిత్రం. ఇదికేవ‌ల రేఖాచిత్రం కావ‌చ్చు. భావా నుగుణంగా కార్టూన్ చిత్రం కావ‌చ్చు. శృంగారాది ర‌సాల‌ను ప్ర‌తిబింబించేది భావ చిత్రం. ఇది హాస్యంలో భాగ‌మైన కార్టూన్ కావచ్చు. ఇత‌ర ర‌సాల్లో ప్ర‌తి బింబింపవ‌చ్చు. ద్ర‌వ చిత్రం అంటే వాట‌ర్‌క‌ల‌ర్ చిత్రం కావ‌చ్చు. ఆయిల్ క‌లర్ చిత్రం కావ‌చ్చు. ముగ్గులు రంగ‌వ‌ల్లులు, పేష్ట‌ల్ క‌ల‌ర్ బొమ్మ‌లు అన్నీ ధూళి చిత్రం క్రింద‌కు వ‌స్తాయి. పూర్వ శాస్త్ర‌కారులు చిత్రాల‌కెన్నో ప్రమాణాలు నిర్ణయించి రూపాల్ని నిర్ధార‌ణ చేసారు. కానీ అభిల‌షితార్థ చింతామ‌ణి కారుడు మాత్ర‌ము వాటికేమి ప‌రిమితుల‌ను పెట్ట‌లేదు.

అసంఖ్యాతాని స‌త్వాని శక్యంతే నైవ‌భాషిత‌మ్‌
త‌త్త‌ద్రూపానుసారేణ లేఖ‌నీయాని కోవిదః

వేదాంతులైతే జీవులెనుబ‌ది నాలుగు ల‌క్ష‌ల‌ని సంతృప్తి ప‌డ‌వ‌చ్చును. చిత్ర‌కారుడి క‌లాకాదు. స‌త్వ‌మంటే జీవులేకాదు దృశ్యమాన స‌క‌ల చ‌రాచ‌ర జ‌గ‌త్తు అంతాను. దీనికి త‌న భావ‌న కూడా జోడించుకుంటే జ‌గ‌త్తులో ఒక్క న‌రునికే ప‌ది త‌ల‌లు. ఇర‌వై చేతులు క‌ల్పించుకోవ‌చ్చును. ఆయుధాల‌ను మార్చి కేశ‌వాది మూర్తుల‌ను ఊహించుకోవ‌చ్చును. ఆఖ‌రి అర్థ‌నారీశ్వ‌రుని క‌డా ఊహించుకోవ‌చ్చును. ఈమేశ‌వింపులో స‌త్వాల‌ను లెక్క క‌ట్టేవాడెవ‌డు ? బాపిరాజు గారికి విష‌యాల‌న్నీ తెలుసు. పైగా ఆయ‌న వ‌డి తిరిగిన చేయి. సాధార‌ణంగా శాస్త్ర‌విదునికి క‌ర్మ‌కౌశ‌లం ఉండ‌దు. క‌ర్మ‌కుశ‌లునికి శాస్త్రంరాదు.

న‌వేత్తి శాస్త్ర‌విత్ క‌ర్మ‌న‌శాస్త్ర‌మ‌సి క‌ర్మ‌విత్‌
యోవేత్తి ద్వ‌య మ‌ప్యేత‌త్ న‌హి చిత్ర‌క‌రోవ‌ర‌

అంటాడు భోజుడు. ఇది చిత్ర‌కారునికొక్క‌రికే కాదు. స‌క‌ల‌క‌ళాకారుల‌కు, శాస్త్ర‌కారుల‌కు కూడా వ‌ర్తిస్తుంది. బాపిరాజు గారు శాస్త్రం, క‌ర్మ‌ల రెండింటిలోను పార‌ముముట్టిన‌వారు. అందువ‌ల్ల‌నే ఆయ‌న చిత్రాల్లో శాస్త్ర ప‌రిజ్ఞాన‌ము స్ఫుటంగా క‌న్పిస్తుంది.

గంగా సంగ‌మ‌మిచ్చ‌గించునే ర‌హిన్ కావేరి దేవేరిగా నంగీకార‌ము సల్పునే...నీ యంగంబంటి సుఖించెనేని గుణ‌భ‌ద్రా తుంగ‌భ‌ద్రాస‌తీ

అని ఒక క‌వి వ‌ర్ణించాడు. ఆయ‌న తుంగ‌భ‌ద్రాతీర వాసి అయి యుండ‌వ‌చ్చును. తుంగ‌భ‌ద్ర ఉప‌న‌ది మాత్ర‌మే. స‌ముద్రుని బాహుబంధంలో అల్లుకుపోయింది. కృష్ణ‌వేణి. అలాగే కిన్నెర‌సాని కూడా గోదావ‌రికి ఉప‌న‌ది. దానికి స‌ముద్ర‌ప‌రిష్వంగ యోగం లేదు. అయినా విశ్వ‌నాథ‌వారు త‌మ భావ శ‌బ‌ల‌త‌తో ఆయోగం క‌ల్పించారు.

చిత్ర‌కారుల గురించి వ్యాసుడేం చెప్పాడోచూడండి,

అత‌ధ్యాన్య‌పి త‌ధ్యాని ద‌ర్శ‌యంతి విచ‌క్షిణాః
స‌మే నిమ్నోన్న‌తా నీవ చిత్ర‌క‌ర్మ‌విదోజ‌నాః

బ‌హుశా మ‌యుడు ఈ చిత్ర‌క‌ళా కౌశ‌ల్యంతోనే స‌భ‌ను నిర్మించియుంటాడు. దానివ‌ల‌న దుర్యోధ‌నుడు భంగ‌ప‌డ్డాడు. విశ్వ‌నాధ‌వారు కూడా త‌మ క‌విత‌లో అత‌ధ్యాన్ని త‌ధ్యంగా ద‌ర్శించాడు. ఆయ‌న ద‌ర్మ‌నాన్ని అలౌకికంగా రేఖ‌లో చూపించారు బాపిరాజు గారు. ఆయ‌న భావ శ‌బ‌ల‌తకు త‌త్త‌ద్దేశ‌కాల వేషాభూషాది ప‌రిజ్ఞానానికి నిద‌ర్శ‌నం ఆయ‌న గీసిన చంద్ర‌గుప్తుని వ‌ర్ణ‌చిత్ర‌ము. కిన్నెర‌సాని పాట‌ల‌కు గీచిన రేఖా చిత్రాలు. రూప‌భేదం, ప్ర‌మాణం, క్ష‌య వృద్దిక్ర‌మం సాదృశ్యం, వ‌ర్ణికాభంగం ఇవిచాలామంది చిత్ర‌కారుల‌కు తెలుసు. వాటిని త‌మ చిత్రాల‌లో సాధించారు కూడా. కానీ భావ‌లావ‌ణ్య యోజ‌నాలు మాత్రం ఒక్క బాపిరాజు చిత్రాల‌లో క‌న్పిస్తాయి. లావ‌ణ్య‌బంటే ఏమిటో ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ స‌రిగా చెప్ప‌లేక పోయారు. కానీ ప్ర‌తి సాహిత్య‌కారుడు ఆ శ‌బ్దాన్ని ప్ర‌యోగిస్తుంటాడు.

ప్ర‌తీయ‌మానం పున‌ర‌న్య‌దేవ వ‌స్త్వ‌స్తి వాణీషుమ‌హా క‌వీనాం
య‌త్త‌త్ ప్ర‌సిద్దావ‌య వాతిరిత్తం విభాతి లావ‌ణ్య మివాంగ‌నాసు
అని ఒక్క ముక్క‌తో చేతులెత్తి ద‌ణ్ణం పెట్టాడు ఆనంద‌వ‌ర్థ‌నుడు.

ముక్తాఫ‌లేషు ఛాయాయాః తెర్ల‌త్వ‌మివాంత‌రా
ప్ర‌తిబాతి య‌దంగేషు త‌ల్లావ‌ణ్య మితీత‌మ్‌