42
 

క‌ట్నం !  ఒక‌రికి వ‌రం -  మ‌రొక‌రికి శాపం

 

ఈనాడు ఎక్క‌డ‌కు వెళ్ళినా క‌ట్నాల స‌మ‌స్య‌ను గురించే చ‌ర్చిచ‌డం వింటున్నాం, చూస్తున్ఆం. ఈ క‌ట్నాలూ కానుక‌లూ కొత్త‌గా వ‌చ్చిన‌వి కాదు. ఆర్థిక స్తోమ‌త‌ను బ‌ట్టి వ‌రుడికి వ‌ధువు వంక‌వాళ్ళు కొన్ని కానుకు లీయ‌డం ద్వారా వారి వారి అభిమానాన్ని ప్ర‌క‌టించుకోడానికి ఇది ఒక మార్గంగా ప్రారంభ‌మ‌యి వుంటుంది.

ఆడ‌పిల్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు ల‌క్ష్మిలాగా భావింప‌బ‌డి త‌మ‌యింట్లో పెరిగిన‌ది. అత్త‌వారింటికి వెళ్ళ‌వ‌ల్సి వ‌చ్చిన‌ప్పుడు ముద్దు మురిపాల‌తో పెరిగిన త‌మ బిడ్డ‌కు శ‌క్తి కొల‌ది కానుక‌ల‌ను పంపాల‌ని త‌ల్లిదండ్రులకుండ‌టం స‌హ‌జం. ఎక్క‌డో కొత్త చోటుకు వెడుతుంది. అక్క‌డ ఏ క‌ష్టాలు ప‌డాల్సివ‌స్తుందో న‌న్న భ‌యం, అనుమానం, ఆ అత్త‌గారి త‌ర‌పు వాళ్ళ‌ని మంచి చేసుకోడానిగ్గాను వాళ్ళ‌కి శ‌క్తికి మించి క‌ట్నాలు కానుక‌లు చీరెలు సారెలు చ‌దివించ‌డం మొద‌లు పెట్టివుంటారు.

ఈ దేశంలో ఈ స‌మ‌స్య హిందువుల‌కే కాదు. ముస్లింల‌కూ క్రైస్త‌వుల‌కూ కూడా కొద్దో గొప్పో లేక‌పోలేదు. ముస్లిములు మెహ‌ర్ అంటారు. క్రైస్త‌వులు సెటిల్‌మెంట్ అనీ ప్రెజంటేష‌న్స్ అనీ అంటారు. పెట్టుబడి దారీ అర్థిక వ్య‌వ‌స్థ‌లున్న దేశాల్లో కూడా అంటే యూరోపియ‌న్ దేశాల్లో కూడా ఈ ఆచారం వ‌స్తూనే వుంది. ఈ సంగ‌తి గిరీశం హాస్యంగా చెప్పాడు. ల‌క్ష‌లు విలువ‌చేసే స్థిర చ‌రాస్థులు ఈ రూపేణా చేతులు మారుతుంటాయి.

వ‌జ్ర వైఢూర్యాలూ కంపెనీల‌లో షేర్లు ప‌ట్ట‌ణాల‌లో భ‌వంతులు కూఆ ఈ లిస్టులో చేర‌తాయి.

ఇంత డ‌బ్బిస్తేగాని పెళ్ళి చేసుకోం అని వ‌రుడు త‌రుపు వాళ్ళు అన‌డం. త‌మ శ‌క్తికి మించినా, ఆమ్మో, అప్పుజేసో అమ్మాయికి పెళ్ళిచేసి ఆర్థికంగా దిగ‌జారిపోవ‌డం నేడు స‌ర్వ‌సాధార‌ణ విష‌యాలై పోయినాయ్ ! ఏజాలిగుండె గ‌ల పెద్ద‌మ‌నిషో క‌ట్నం వ‌ద్ద‌న్నాడ‌నుకోండి అత‌న్నో ద‌ద్ద‌మ్మ కింద చూస్తారు. ఎందుకొద్దు అంటున్నాడో, ఏమైనా లొసుగులున్నాయేమో అంటారు. ప్ర‌స్తుతం క‌ట్నాల స‌మ‌స్య క‌న్య‌ల పాలిట పెనుభూత‌మైంది. అమ్మాయిలు అబ్బాయిల్తో స‌మానంగా చ‌దివినా  సంపాదిస్తున్నా, అంద‌చందాలూ ప‌నిపాట‌లూ వ‌చ్చినా క‌ట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు కావ‌టంలేదు. ఉన్న‌వాళ్లు త‌మ‌కున్నంత‌లో ఇచ్చుకుంటున్నారు. లేనివాళ్లు త‌మ‌స్థాయికి త‌గ్గ సంబంధాల‌తో స‌రిపెట్టుకుంటున్నారు.

ఇక ఎటొచ్చీ బాధంతా త్రిశంకు స్వ‌ర్గంలో ఉన్న మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ళ‌దే !  త‌మ‌కంటే త‌క్కువ వాళ్ళ‌కి పిల్ల‌నివ్వ‌లేరు. ఎక్కువ వాళ్ళ ఆశ‌ల‌ను తీర్చ‌లేరు. ఈ మ‌ధ్య‌త‌ర‌గ‌తి అనేది వివాహం విష‌యంలోనూ మాత్రం అమ్మాయిల‌కేగాని అబ్బాయికి వ‌ర్తించ‌దు. పిల్ల‌వాడి త‌ర‌పువాళ్ళ‌గోల‌కూడా మ‌నం కొంచెం వినాలి ! వాళ్ళ ఆశ‌ల‌న్నీ వాడిమీదే నాయెను. ఆ డ‌బ్బుతో ఎన్ని ఇబ్బందులు తీర్చుకోవాలో ఎన్ని ఋణాలు చెల్లించాలో ఎ చెల్లిలి పెళ్ళి చెయ్యాలో క‌దా మ‌రి !  పెట్టుబ‌డి లేని వ్యాపారం, వ‌చ్చిదంతా  రాబ‌ట్టుకోవటం తెలివిగ‌ల వాళ్ళ ల‌క్ష‌ణం !

క‌ట్నాల చావుల‌కి కార‌ణం ఎవ‌రు ?   ప్ర‌త్య‌క్షంగా అబ్బాయిత‌రుపు వారి అత్యాశ కార‌ణంగా క‌న్పిస్తున్నా ప‌రోక్షంగా అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కి కూడా ఇందులో భాగం లేకుండా లేదు. శ‌క్త‌కి మించి క‌ట్నం ఇవ్వ‌డానికి ఎందుకు ఒప్పుకోవాలి ?  తీరా పెళ్ళి స‌మ‌యానికి డబ్బంద‌క పీట‌ల మీద పెళ్ళిళ్ళు ఆగిపోవ‌డ‌మో ?  లేక మ‌గ‌పెళ్ళివారి కాళ్ళూ గ‌డ్డాలూ ప‌ట్టుకుని బ్ర‌తిమిలాడి త‌రువాత ఇస్తామ‌ని పెళ్ళి జ‌రిపెయ్య‌డ‌మో చేస్తారు. అమ్మాయి న‌త్తారింటికి పంపిచేతులు దులుపుకుంటారు. ఇహ అక్క‌డ్నించి అటువేపు నుండి అమ్మాయికి ఆర‌ళ్ళు ఎక్కువౌతాయి. క‌ట్నం డ‌బ్బు తెస్తావా, ఛ‌స్తావా అంటారు. ముందు తిట్లు శాప‌నార్థాలూ, ఆ పైన మొట్లూ అమ్మాయికి తెలుసు తండ్రి శ‌క్తి ! అందుక‌నే ఎన్నితిట్టినా కిమ్మ‌న‌క పళ్ళ‌బిగువుతో అన్ని బాధ‌లూ భ‌రిస్తుంది. ఆమె స‌హ‌నం బాధించే వాడిని వెర్రెక్కిస్తుంది. ఒళ్ళు మండిస్తుంది. ఫ‌లితంగా అమ్మాయి ఒళ్ళూమండుతుంది. పొద్దున్నే వార్త మ‌రో క‌ట్నంచావు అంటూ ఎక్క‌డ చూసినా  ఇదే క‌థ‌. నాక‌న్పిస్తుంది ఆ తండ్రే ఆపిల్ల చావుకి కార‌ణ‌మేమోన‌ని !

 

ఈ క‌ట్నాల బెడ‌ద ఎలాపోతుంది శాస‌నాల వ‌ల్ల పోతుందా చ‌ట్టాల‌వ‌ల్ల పోతుందా ?  1961లో వ‌ర‌క‌ట్నాన్ని నిషేదిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం చ‌ట్టాన్ని చేసింది. ఆ చ‌ట్టం క‌ట్టుదిట్టంగా లేక‌పోవ‌డం మూలాన నిర‌ర్థ‌కం అయిపోయింది. ప్ర‌స్తుతం పార్ల‌మెంటులో త‌గు మార్పులు చేసి బాగా అమ‌లు ప‌ర‌చాల‌ని ఏర్ప‌ట్లు జ‌రుగుతున్నాయి.

హ‌త్య‌లూ, దొంగ‌త‌నాలూ, మాన‌భంగాలు మొద‌లైన‌ అనేక నేరాల‌కు ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లో జుల్మానాలు జైళ్ళు ఉరి మొద‌లైన శిక్ష‌లెన్నో ఉన్నాయి !  అయినా నేరాల్ని చేయ‌ద‌ల‌చుకున్న వాళ్ళు నిర్బ‌యంగానే చేస్తూనే ఉన్నారు. కానీ నేరాలు చేసేవాళ్ళ సంఖ్య చాలా త‌క్కువ . (మ‌న జ‌నాభా లెక్క‌ల్తో పోలిస్తే ) క‌ట్నం తీసుకోవ‌డం నేరం, శిక్షార్హం అని గ‌ట్టి శాస‌నం చేసినా వీరి సంఖ్య చాలా అధికం అయినా శిక్ష‌లు ఎంద‌రికి ప‌డ్తున్నాయి ?  ఎన్ని కేసులు కోర్టుదాకా వ‌స్తున్నాయి అస‌లెవ‌రైనా రిపోర్టు చేస్తున్నారా ?  బాగా ఆలోచించండి !

మ‌న అమ్మాయి మ‌న అల్లుడు అని ఏదో ముచ్చ‌ట‌కొల‌దీ వున్నంత‌లో ముట్ట‌చెప్పాల‌ని త‌ల్లిదండ్రుల‌కుంటుంది. కానీ దాన్నే అబ్బాయి త‌రుపువాళ్ళు కిరాత‌క‌మైన వ్యాపారంగా మార్చ‌డం ఘోరం ! ఇందుకు మ‌నిషిలో ఉండే అత్యాశే కార‌ణం. తేర‌గావ‌స్తే అనుభ‌వించాల‌నే ఆల‌స బుద్ధే కార‌ణం. సంస్కార రథానికి వ‌ధూవ‌రులిద్ద‌రూ స‌మాన వాహ‌కుల‌ని గ్ర‌హించ‌క పోవ‌డ‌మే కార‌ణం. కోడ‌ల్ని క‌న్న‌బిడ్డ‌లా చూడ‌లేని భేద‌బుద్దే కార‌ణం. హింస‌పెట్టి ఆనందించే రాక్ష‌స ప్రవృత్తే కార‌ణం !

మ‌నిషి ఈ అవ‌గుణాల్ని గ్ర‌హించుకొని త‌న్నుతాను సంస్క‌రించుకొనే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడే ఈ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం.