13
 


ఆ స‌మ‌యంలో అల్లంత‌దూరంలో ఉన్న న‌కుల‌, స‌హ‌దేవుల‌ను బీముణ్ణి నిల‌బ‌డ‌మ‌ని సౌజ్ఞ‌చేసి ధ‌ర్మ‌రాజు విరాట రాజువద్ద‌కు నెమ్మ‌దిగా చేరాడు.

అస్త్ర‌శ‌స్త్ర ప్ర‌యోగాల‌న్నీ ఒక ఋషివ‌ద్ద అభ్య‌సించాను. ఈ మ‌ధ్య స‌మ‌రం చేయ‌లేదు. కాని గోవుల‌ను ర‌క్షింప‌డానికి నువ్వు, బంధువులు వెడుతూ ఉంటే చూస్తూ నేను ఇంటివ‌ద్ద ఉండ‌టం న్యాయం కాదు. నాకు కూడా ఒక ర‌థం ఇప్పించు అన్నాడు కంకుడు.

విరాటుడు ఒప్పుకున్నాడు.

మ‌న న‌ల‌లుడు ఉన్నాడే మ‌హాబ‌ల‌వంతుడు, శౌర్య‌వంతుడున్నూ. మ‌న దామ‌గ్రంధి, తంత్రీపాలుడు కూడా మంచి యుద్ధ‌నిపుణులు, వీరి సంగ‌తి నాకు కొంత తెలుసు. వారికి కూడా మంచి ర‌థాలు ఇప్పించి మ‌న వెంట‌నే తీసుకుపోదాం అన్నాడాత‌డు విరాటునితో.

విరాటుడు సంత‌సించాడు. ఈ న‌లుగుర‌కూ నాలుగు ర‌థాలు మంచివి ఇప్పించు. మంచి చాప‌ములు, ఇర‌త ఆయుధాలు ఇప్పించు. ఈ త్వ‌ర‌గా ?  అని శ‌తానీకుణ్ణి ఆజ్ఞాపించాడు. శ‌తానీకుడు వారిని తీసుకువెళ్ళి వారికి కావ‌ల‌సిన స‌మ‌స్త‌ము స‌న్న‌ధ్దం చేయించినాడు. వారు త‌మ‌త‌మ ర‌థాల‌ను తోలుకుంటూ వ‌చ్చి విరాట‌రాజును క‌లుసుకున్నారు.

విరాట‌రాజు సైన్యం క‌దిలిపోయి సుశ‌ర్మ సైన్యాన్ని ముట్ట‌డించింది. రెండు మ‌హాస‌ముద్రాలు ఒక‌దానితో ఒక‌టి పోరుతున్న‌ట్లున్న‌దా పోరు. ఏనుగుతో ఏనుగు, గుర్రంతో గుర్రం, కాల్బంటుతో కాల్బంటు పోరు సాగుతున్న‌ది. శ‌తానీకుడు, సుదిరాశ్వుడు, సూర్య‌ద‌త్తు, శంఖుడు మ‌హాపౌరుషంతో, ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారు. విరాటుడు స‌రాస‌రిగా పోయి సుశ‌ర్మ‌ను ఎదుర్కొన్నాడు. సంగ్రామం ఘోరంగా సాగింది. సూర్యుడు ప‌శ్చిమ దిశ‌కు వాలిపోతున్నాడు. భ‌టులు అల‌సిపోయారు. సూర్యాస్త‌మ‌యం అయింది. చీక‌ట్లు క‌మ్ముకొన‌సాగిన‌వి. చీకట్లో గ‌త్యంత‌రం లేక కొంత‌సేవు సంగ్రామం ఆగింది. ఇంత‌లో చంద్రోద‌యం అయింది. వెన్నెల వెలుతురు వ‌చ్చింది. యుద్ధం తిరిగి ప్రారంభ‌మ‌యింది. విరాటుడు సుశ‌ర్మ‌తో తిరిగి క‌ల‌య‌బ‌డ్డాడు. విరాటుని ర‌థ‌సార‌థి, పిద‌ప గుర్రాలు ప్రాణాలు పోగొట్టుకున్న‌వి. విరాటుడు విర‌ధుడ‌య్యాడు. అత‌ణ్ణి సుశ‌ర్మ పట్టుకొని త‌న ర‌థంలో ఎక్కించి తీసుకుపోతున్నాడు. సుశ‌ర్మ విజ‌య‌ధ‌రీలు ఒక్క‌సారిగా మార్మోగాయి. సుశ‌ర్మ విజ‌య‌ఢంకా నాదం మిన్నుముట్టింది.

అప్పుడు ధ‌ర్మరాజు భీమునికి విరాట‌రాజు యుద్ధం చేస్తూ ఉన్న వైపు చూపి...

ఇత‌ని ఆశ్ర‌యంవ‌ల్ల మ‌న‌మంతా బ్ర‌తికి ఉన్నాము. ఇత‌నిని శ‌త్రువ‌శం గాకుండా విడిపించ‌డం మ‌న ధ‌ర్మం. నీవు పోయి అత‌నికి స‌హాయ‌ప‌డు అన్నాడాత‌నితో.

భీముడు ఉప్పొంగి ఇదుగో ! ఈ మ‌ద్దిచెట్టుతో శ‌త్రుసైన్యాన్ని చావ‌గొట్టి, సుశ‌ర్మ నీచ‌మ‌డిచి విరాటుణ్ణి విడిపంచుకువ‌స్తాను. నువ్వూ, త‌మ్ముళ్ళూ అలాగ నిల‌బ‌డి చూస్తూండండి అన్నాడు ఆనందంతో.

ధ‌ర్మ‌రాజు న‌వ్వి నువ్వు చెట్టు పెర‌కి భుజాన వేసుకువెడితే ఉభ‌య సైన్యాలు ఆశ్చ‌ర్య‌ప‌డి నువ్వు భీముడివ‌ని సులువుగా గుర్తుప‌డ‌తారు. అలాగ ఎందుకు ?  న‌కుల స‌హ‌దేవులు నీకు స‌హాయ‌కులుగా ఉంటారు. లోకంలో సామాన్యంగా ఉప‌యోగించ‌బ‌డుతున్న విల్లు, బాణ‌ము, క‌త్తి, గ‌ద మొద‌ల‌గు ఆయుధాల‌తో విరోధి వ‌ధ చేసి వేగంగా విరాటుణ్ణి విడిపించు అని క‌ర్త‌వ్యం ఉప‌దేశించినాడు ధ‌ర్మరాజు.

అలాగే క్ష‌ణంలో విరాట‌రాజును విడిపించి తెచ్చి నీ ముందు పెడ‌తాను అన్నాడు భీముడు.

ధ‌ర్మరాజు ముందుగా శ‌త్రుసేన మీద‌కు న‌డ‌చాడు. పిమ్మ‌ట భీముడు, న‌కుల స‌హ‌దేవుడు క‌లియ‌బ‌డ్డారు. అప్పుడు జ‌రిగిన యుద్ధంలో దాదాపు నాలుగువేల ర‌థాలు ముక్క‌చెక్క‌ల‌యాయి. సుశ‌ర్మ ర‌థం విరిగిపోయింది. గుర్రాలు చ‌చ్చిపోయాయి. ఆ స‌మ‌యంలో వృద్ధుడైన విరాట‌రాజు త‌రుణ వ‌య‌స్కుని ఉత్సాహంతో గ‌ద‌నెత్తి సుశ‌ర్మ‌ను కొట్టినాడు. సుశ‌ర్మ చేతులు వెనుక‌కు విరిచిక‌ట్టుకుని జ‌య‌ధ్వానం చేశాడు. త‌మ రాజు ప‌రాజ‌యం చూసి సుశ‌ర్మ సైన్యం ప‌లాయ‌న మంత్రాన్ని పారాయ‌ణ చేసింది. భీముడు వారిని వెన్నంటి త‌రిమి, గోవుల‌ను మ‌ళ్ళించుకుని తిరిగి విరాట‌రాజును త‌న అన్న‌ద‌మ్ముల‌ను క‌లుసుకొన్నాడు.

విరాటుడు బ్ర‌హ్మానంద‌ప‌డ్డాడు. పాండ‌వుల‌ను అభినందించాడు.

నా మాన‌ము, ప్రాణ‌ము కాపాడావు. దీనికి తుల్య‌మైన ప్ర‌త్యుప‌కారం నీకు ఏమి చేయ‌గ‌ల‌ను ?  నా రాజ్యం తీసుకో, నాకు సిరి, శ‌రీర‌మూ నువ్వు ఇచ్చిన‌వే ! క‌నుక ఈ రెండూ నీకు స‌మ‌ర్పించుకుంటున్నాను. ద‌య‌తో అంగీక‌రించు. ఈ మ‌త్స్య‌దేశాన్ని ర‌క్షించు. నేను నీ సేవ చేస్తాను. న‌న్ను కాపాడు అంటూ విరాటరాజు ధ‌ర్మ‌రాజును ప్రాధేయ‌ప‌డ్డాడు.

మ‌హారాజా ! నా పైన నీకు గ‌ల అభిమానం అటువంటిది ! శ‌త్రువుల‌ను జయించి, దిగ్విజ‌యోత్సాహంతో నీవు న‌గ‌ర ప్ర‌వేశం చేస్తూ ఉంటే నాకు తేజ‌ము, సంప‌ద‌, గౌర‌ము కాదా ?  మేము  చేసింది ఏమంత గొప్ప ప‌ని. మా విధి మేము నెర‌వేర్చాము. ఈ పాటి దానికి ఇంత ఏమిటి ? అన్నాడు ధ‌ర్మ‌రాజు.

విరాట‌రాజు విస్మ‌య‌ము, సంత‌స‌ము క‌లిగాయి.

నువ్వు నేడు చూపించిన ర‌ణ నైపుణ్యానికి కార‌ణం ఉప‌కార‌మో, అభిమాన‌మో నేను ఊహించ‌లేకుండా ఉన్నాను. అగ్నిహోత్రం వంటి శ‌త్రుసైన్యాన్ని శంక కొంకు లేకుండా తెగ‌టార్చిన మ‌హా అద్భుత శ‌క్తిశాలి మ‌న వంట‌వాడు ! ఇటువంటి వాణ్ణి వేరొక‌చోట క‌న్నామా, విన్నామా !  నిజంగా న‌న్ను యుధ్ధంలో గెలిపించిన‌వాడు ఇత‌డే ! కుత్తుక‌లు ఉత్త‌రించి తాటిప‌ళ్ళు రాల్చిన‌ట్లు త‌ల‌లు రాల్చినాడే దామ‌గ్రంధి ! ఎక్క‌డ చూచినా తానే క‌నిపిస్తూ మ‌న తంత్రీపాలుడు శ‌త్రువుల్ని ఎంత‌గా చీల్చిచెండాడాడు ! మీ న‌లుగురుతో పోల్చ‌ద‌గిన భ‌టుడు మ‌న సైన్యంలో మ‌చ్చుకైనా లేడు.

స్నేహితుడి ఆప‌ద‌ల‌కు అడ్డుప‌డ‌ట‌మే మ‌గ‌త‌నం. అట్టివాడే మ‌గ‌వాడు. క‌నుక మీకు ఏనుగులు, గుర్రాలు, బంగారు ర‌త్న‌విభూష‌ణాలు దేవ‌క‌న్య‌ల్లాంటి ప‌రిచారిక‌లు, మీరు వాంఛించే వైభ‌వాలు అన్నీ ఇస్తాను. ఇంకా ఏం కావాలో చెప్పండి అన్నాడాత‌ము ఆనందంతో.

మ‌మ్మ‌ల్ని క్రొత్త‌వారివ‌లె ఎంచి అలాగ ఇలాగ అన‌కు. ఊళ్ళోకి వెళ్ళాక నీకు ఎలాగ తోస్తే అలాగ స‌త్క‌రించ‌వచ్చు అన్నారు వారు ఏక‌గ్రీవంగా.

నేను మాత్రం ఒక‌టి కోరుతున్నాను. ర‌ధ‌, గ‌జ‌, అశ్వాల‌తో స‌హా, సుశ‌ర్మ‌ను విడిచి పెట్టండి. ఇదే నేను కోరే కానుక‌. మ‌న ప‌ట్ట‌ణంలోన‌కి చాటింపు వేసే వారిని పంపించి నీ విజ‌యాన్ని చాటించ‌మ‌ను. విజ‌య ప‌తాకం ఎగుర‌వేసి, మంగ‌ళ తూర్య‌నాదాల‌తో, గీత‌, వాద్య‌, నృత్యాల‌తో పౌరులు పండుగ చేయాలి అన్నాడు ధ‌ర్మ‌రాజు.

తెల్ల‌వారే స‌రికి విరాట‌రాజు ప‌ట్ట‌ణంలో విజ‌యం చాటించ‌బ‌డింది. ఊరంతా అలంకించ‌బ‌డింది. అక్క‌డ ర‌ణ‌భూమిలో సిగ్గుతో తల‌వంచుకొని కృంగిపోయిన సుశ‌ర్మ‌ను విడిచిపుచ్చారు.

త‌ల తెగిప‌డిన మొండెముల‌తో శిర‌స్సుల‌తో, అంగాల‌తో ర‌ణ‌భూమి నానా భీభ‌త్సంగానూ ఉన్న‌ది.

దానికి అన‌తి దూరాన ఉన్న ఒకానొక పైక‌త‌స్థలాన పాండ‌వులు, విరాటుడు ఆ రాత్రి గ‌డిపారు.

మ‌ర్నాడు ఏమ‌యిందీ ?  జ‌న‌మేజ‌యుడు ఆతృత‌గా అడిగాడు.