20
 


అర్జునుడి స‌త్ర్ప‌వ‌ర్త‌న‌కు ద్రోణుడు పొంగిపోయాడు.

పాదాల ద‌రికి రెండు బాణాలు వేయ‌డం పూర్వ‌కంగా, నాకు న‌మ‌స్కారం చేస్తున్నాడు. చిర‌కాలంనుంచి విడిచి ఉండ‌డంవ‌ల్ల కుశ‌ల ప్ర‌శ్న‌లు అడుగుతున్న‌ట్లుగా చెవుల‌కు సోకీ సోక‌న‌ట్లు, రెండు బాణాలు వేశాడు. ప‌ద‌మూఢేళ్లు నానా ఆగ‌చాట్లు ప‌డిపడి, పొంగుతున్న కోపంతో వ‌చ్చాడీత‌డు. ఈ మూక‌ను ఇప్పుడే బ‌లిపుచ్చుకొంటాడు ! అర‌ణ్య‌వాసం, అజ్ఞాత‌వాసం నియ‌మ ప్ర‌కారం న‌డిపి, నూత‌నాభ్యుద‌యం పొంది, రాత్రి ఎట్లో గ‌డిపి ఉద‌య‌మే మ‌హా తేజంతో విచ్చేసే సూర్యుడిలా ఉజ్జ్వ‌లుడై ఉన్నాడు ! అని ద్రోణుడు త‌న ప‌రిస‌రాల్లో ఉన్న ఆప్తుల‌తో చెపుతున్నాడు.

అర్జునుడి బాణాల అంత‌రార్థం ఏమిటో కృపుడు భీష్ముడు కూడా గ్ర‌హించి సంతోషించారు. అర్జునుడు ఆ సేన‌లోని త‌దిత‌రుల‌ను నిర్ల‌క్ష్యంచేసి గోవుల స‌మీపానికిపోసాగాడు.

ఆహా ! అర్జునుణ్ణి చిర‌కాలానికి చూచాము ! ఏమి అత‌ని ఆకారంలో ఆ మ‌హాదాత్త‌త ! జ‌గాన్ని ఏల‌త‌గిన ఆ స‌ముజ్జ్వ‌ల‌త్వం ! మ‌న‌వెన‌కాలే వ‌చ్చి మ‌న‌ల్ని క‌లుసుకున్నా మ‌న‌తో క‌య్యం ఇష్టంలేక క్రీగంట చూస్తూ దాటి వెళ్ల‌పోయాడు ! ఈ సేన‌నంతా క‌ల‌య‌జూచి ఊర‌కే వెళ్లిపోవ‌డాన్ని బ‌ట్టి చూస్తే అత‌డిక్క‌డ రారాజు కొర‌కు వెద‌కినాడ‌నీ, అత‌నిక్క‌డ క‌న‌ప‌డ‌క‌పోతే ఎక్క‌డ దొర‌కుతాడో అని వెదుకుతూ వెళ్లిపోయాడ‌నీ నిస్సందేహంగా తోస్తోంది. మ‌న‌కూ దుర్యోధ‌నుడికే మ‌ధ్య జొర‌ప‌డ్డాడంటే, అత‌డు ఇత‌నితో ఒంట‌రిగా పోరాడ‌లేడు. ఇత‌నితో ఒంట‌రిగా పోరాడ‌డం ఈశ్వ‌రుడికే వశం కాక‌పోతే త‌దిత‌రుల‌కు శక్య‌మ‌వుతుందా ! ఇప్పుడు మ‌న‌మంతా దుర్యోధ‌నుడి చెంత‌కు  పోక‌పోతే వ్య‌వ‌హారం చెడిపోతుంది. అర్జునుడు రారాజును ముట్ట‌డించి ఏదైనా ప్ర‌మాదం తెస్తే మ‌న ప్ర‌యోజ‌నం ఏమున్న‌ది ?  ఆ ఆల‌మంద‌లెందుకు ?  సిరిసంప‌త్తులెందుకు ?  అంటూ భీష్ముడు సైన్యాన్ని హెచ్చ‌రించి త‌న ర‌థాన్ని స‌త్వ‌రంగా పోనిచ్చాడు.  ఈ ప్రకారంగా ఆమేటి సేన మ‌హావేగంతో న‌డుస్తూన్న‌ది. గోవుల‌కు కాపున్న సైన్యం కూడా వాటిని అర్జునుడా సైన్యంతో క్రోశుల దూరం పోయాడు.

అవిగో ఆల‌మంద‌లు ! మ‌నం ఇక ఆగ‌వ‌చ్చు. ఆ సైన్యం కూడా మ‌నల్ని గ‌దుముకుంటూ వ‌డిగానే వ‌చ్చిందే ! ఈ రెండిటి న‌డుమ‌నూ చొచ్చుకుపోయి, ఆ వ‌చ్చే వీరుల‌కు భుజ‌బ‌లం చ‌విచూపించి వార‌ల‌గ‌ర్వం అణ‌గద్రొక్కాలి. ఆవుల‌ను మ‌ర‌ల్చాలి. రాజు ఎలాగూ నా చేతిలో చిక్క‌డం త‌థ్యం అని అర్జునుడు అనే స‌రికి ఉత్త‌రుడు ర‌థాన్ని తూర్పు దిక్కుకు న‌డిపించి, కౌర‌వ‌సైన్యం క‌ట్టెదురు, అడ్డంగా, నిల‌బెట్టాడు. ర‌థం సేన ద‌రిగానే అర్జునుడు చేయిపైకెత్తి నిల‌బ‌డండీ, నిల‌బ‌డండి అని ఎలుగెత్తి అద‌ల్చాడు.

అప్పుడు అటు సేననుండి, ఇటుగాండీవంనుండి వెలువ‌డే బాణ ప‌రంప‌ర‌ల‌తో ఆకాశం మూసుకుపోయింది. అంతా అంధ‌కార‌బంధుర‌మైంది. మ‌హాభ‌యంతో బెగ్గ‌డికి కురుసైన్యాల గుండెలు అవిసిపోయాయి. పురోగ‌మించ‌డానికి గాని, తిరోగ‌మించ‌డానికి గాని కాళ్లాడ‌క వెరగుప‌డి నిల‌బ‌డిపోయాయి.

త‌న‌వింటి దారిని మ్రోగించి, శంఖంపూరించేస‌రికి పశువులు బెద‌రి నేల‌ను ముట్టిస్తూ, తోకలెత్తుకొని ద‌క్షిణ దెస‌కు లంకెలు పెడుతూ ప‌రుగెత్తాయి. గోవుల‌తో బాటు ప‌ట్టుబ‌డ్డ గొల్ల‌వాళ్లు ఆ సావ‌కాశం చూచుకొని ప‌శువుల వెంబ‌డిపారిపోయారు. ఈ బ‌లం ప‌శువుల‌ను అడ్డ‌గించ‌కుండా అటు ప్ర‌క్కకి నెట్టేదాం. ర‌థం అటుపోనియ్యి అన్నాడ‌ర్జునుడు. ఉత్త‌రుడు ర‌థాన్ని న‌డిగా గొల్లం దెస‌కు పోనిచ్చాడు.

ఓ గొల్ల‌లూ ?  ఏమీ భ‌యంలేదు ప‌శువుల‌ను తోలుకెళ్లండి, అని పెద్ద‌కేక పెట్టి వాళ్ల‌ను హెచ్చ‌రించి, గిరుక్కున తిరిగి కౌర‌వ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు, అర్జునుడు.

బెదిరిన గోవుల‌ను కూడ గట్టుకొని వాళ్లు ప‌చ్చిక‌బ‌య‌ళ్లలోకి తోలుకుపోయారు.

జ‌న‌మేజ‌యుడు విస్తుపోతూ వింటున్నాడు.

విచిత్రంగా ఉంది ! ప‌శువుల‌ను ర‌క్షించాక అర్జునుడేం చేశాడు ?  రారాజు, దుర్యోధ‌నుడేం చేశాడు. కురుసైన్యాలేమైనాయి ?  భీష్మాదివీరులు  ఏంచేశారు ?  అంటూ వైశంపాయ‌నుడిపై ప్ర‌శ్నప‌రంప‌ర కురిపించారు.