14
 


ఈ వ‌య‌సున‌కింక‌ను ఆమెలో భ‌క్తి బీజ‌ప్రాయ‌ముగ మాత్ర‌మే సూచిత‌మైన‌ది. మ‌ఱియు నొకానొక య‌వ్య‌క్త‌స్థితిలోకూడ నున్న‌ద‌ని చెప్ప‌వ‌చ్చును. శివుని సేవింప‌వ‌లెనా కృష్ణుని సేవింప‌వ‌లెనా య‌న్న‌దామె మ‌న‌సున‌కు రూఢ‌ముకాక ధ‌ర్మారావును అడిగిన‌ది. ఈ ప్ర‌శ్న‌వ‌ల‌న గిరికా మ‌నోరంగ‌స్థ‌లిపై జ‌గ‌న్నాట‌క సూత్ర‌ధారియ‌గు వేణుగోపాల‌స్వామివారి ప్ర‌వేశ‌మింక‌ను జ‌రుగ‌లేద‌న‌వ‌లెను. శివుడు జ్ఞాన‌యోగుల‌కు సేవ‌నీయుడ‌నియు, విష్ణుడు భ‌క్తి యోగ‌మున‌భ్య‌సించిన‌వారికి సుల‌భుడ‌నియు ధ‌ర్మారావు గిరికకు భోదించెను. ఆ య‌మాయ‌క‌క‌ప్పుడు భ‌క్తియ‌న‌నేమియా జ్ఞాన‌మ‌న్న‌నేమియా తెలియ‌దు. అన్న‌ను సందేహ నివార‌ణ‌మున‌కై ప్ర‌శ్నించిన‌ది. భ‌క్తియ‌న్న‌నేమి ? య‌ని, ఇట్టి ముగ్ధ‌బాలిక‌ను విశ్వ‌నాథ‌వార‌తి చాతుర్య‌ముతో సాధ‌న చేయించి ఉప‌వాస‌ముల‌చే కృశింప‌చేయించి క‌ళాత‌పస్సు చేయించి మంత్ర పుర‌శ్చ‌ర‌ణానంత‌ర‌ము శంఖ చ‌క్ర గ‌దా శార్జ‌పాణియ‌గు మ‌హావిష్ణువు సాక్షాత్కార‌ము ల‌భింప‌జేసిరి. యుగ‌యుగ‌ముల గోపికా త‌త్త్వ‌మంత‌యును దేవదాసియైన గిరిక‌లో పున‌రుజ్జీవిత‌మైన‌ది.

గిరిక‌కు భాగ‌వ‌త‌ము చిన్న‌నాడే కంఠ‌స్థ‌మైన‌ది. కొంత వ‌య‌సు వ‌చ్చిన త‌రువాత ధ‌ర్మారావాప‌ద్య‌ముల క‌ర్థ‌ముల‌ను, అంత‌రార్ధ‌ముల‌ను బోధించెను. ఆమెకు అన్న చెప్పుట య‌న‌గా భ‌గ‌వంతుని యెదుట కూర్చున్న‌ట్లుగ న‌నిపించెడిది. ధ‌ర్మారావుపై నంత‌టి గౌర‌వ‌ము, భాగ‌వ‌త‌మ‌న్న‌చో నంత‌టి య‌భిమాన‌ము.


గిరిక‌కు వ‌య‌సు వ‌చ్చుస‌రికి గోపిక‌లు పొందిన శృంగార భావ‌మంత‌యు న‌నుభ‌వ‌మునకు వ‌చ్చిన‌ట్ల‌యిన‌ది. భ‌గ‌వంతునికై నిత్య విర‌హిణియైన‌ది. కృష్ణ‌క‌ర్ణామృత‌ము, గోపికాగీత‌ము, గీత‌గోవింద‌ము, లీలాత‌రంగిణి, భ్ర‌మ‌ర‌గీత‌లు మొద‌లైన వానిని పుక్కిట‌బ‌ట్టి అర్థ‌మును మ‌ర‌సార భావింప‌గల్గిన ప‌రిణ‌తి వ‌చ్చిన‌ది.

పదిహేను సంవ‌త్స‌ర‌ములు వ‌చ్చుస‌రికి గిరిధారి గిరికామ‌నోహారియైనాడు. గిరిక త‌న‌ను తాను స‌త్య‌భామ‌గ‌ను, రుక్మిణిగ‌ను పోల్చుకొని శృంగార‌ర‌సాధి దేవ‌త‌యై వేణుగోపాలుని ప‌ద‌క‌మ‌ల‌ములు కందిపోకుండ త‌న క‌ర‌క‌మ‌ల‌ముల న‌డ్డుపెట్ట‌వ‌లెన‌న్న స్థాయికి వ‌చ్చిన‌ది.

ఒక‌త‌రి గిరిక దేవాల‌య‌మున‌కు వ‌చ్చి స్వామిని సేవించుచుండ‌గా రాణీ రుక్మిణ‌మ్మారావుకూడ వ‌చ్చిన‌ది. రాణికూడ గొప్ప కృష్ణ‌భ‌క్తురాలు. గిరిక తదేక ధ్యాన‌ములో కృష్ణుని చూచుచు ఏదియో భావించుచు నులికిప‌డిన‌ది. రాణి యామె యులికిపాటున‌కు కార‌ణ‌మ‌డిగిన‌ది. గిరిక తాను తెల్ల‌నిచీర దాల్చిన‌ది. స్వామికి తెల్ల‌చీర చూచిన‌చో పాల‌స‌ముద్ర‌ము గుర్తున‌కు వ‌చ్చునేమోయ‌ని భావించుకొన్న‌ది. మ‌ర‌ల‌నేవియో మ‌ధురోహ‌లు. సిగ్గుప‌డుచు ఇట్లు చెప్పిన‌ది. నీ చ‌ర‌ణ ప‌ద్మ‌ములు చ‌న్నుల‌మీద మోపి... మ‌ర‌ల సిగ్గుప‌డెను గిరిక క‌న్నుల‌లో నీళ్ళునిల‌చెను. బాధ హ‌రింపు వ‌రింపు మాధ‌వా...అని చ‌దివిన‌ది. రాణిగారు గిరిక యొక్క తాదాత్మ్య‌మున‌కు మురిసి యామెను కౌగ‌లించుకొని ముద్దు పెట్టుకొనిన‌ది. ఈ స‌మ‌య‌మున గిరిక యొక్క మ‌ధుర‌భ‌క్తి యొకానొక యున్న‌త‌మైన స్థాన‌మున‌కు చేరికొని విర‌హావ‌స్థాంత‌ర్గ‌త‌మైన‌ద‌న‌వ‌లెను. స్వామి నొక విగ్ర‌హ‌ముగ త‌ల‌ప‌క నొక ప్ర‌త్య‌క్ష పురుషునివ‌లె భావించి అత‌డు త‌న య‌లంక‌ర‌ణ‌మునుగూర్చి యెట్లు భావించును ? ఇష్ట‌ప‌డునా లేదా య‌న్న సందిగ్ధ‌మున కొట్టుకొనిపోయిన‌ది. స్వామి నిత్య‌ము త‌న‌చెంత‌నున్న‌ట్లుగ భావించుచు ఊహ‌ల‌లోనే ముచ్చ‌టించుచున్న‌ది. ఒక‌నాడు పొడ‌వైన త‌న జ‌డ‌కు మ‌ల్లెపూలు కుట్టించుకొన్న‌ది. న‌ల్ల‌ని కేశ‌ములు తెల్ల‌ని మ‌ల్లెల‌తో మిళిత‌మైన‌నా సిగ కాళియాహిని గుర్తున‌కు తెచ్చుచున్న‌ద‌ని వ‌దిన‌లు మేల‌మాడ‌గా నానంద‌ప‌డిన‌ది. మ‌ఱియెక‌నాడు నల్ల‌ని చీర ధ‌రించిన‌ది. కృష్ణున‌కు ప్రియ‌మైన య‌మున‌ను తోపించుచున్న‌ద‌న‌గా వివ‌శ‌యైన‌ది. తెల్ల‌చీర స్వామికి ప్రియ‌మైన‌దని యామె య‌న్న‌గారు చెప్ప‌గా సాధ్య‌మ‌యినంత యెక్కువ‌గా తెల్ల‌ని చీర‌యే ధ‌రించెడిది. పాల‌స‌ముద్ర‌మును తెల్ల‌చీర స్వామికి గుర్తున‌కు తెచ్చున‌ని గిరిక త‌లంచెడిది. ఆమె య‌లంక‌ర‌ణ‌ములు కృష్ణుడు ప్రియ‌ముగా నుండ‌వ‌లెన‌ని య‌హ‌ర‌హ‌ము భావించుచుండెడిది.

గిరిక‌కు తాను భోగాంగ‌న‌కు జ‌నించిన‌దాన‌నని స్వామి త‌న‌ను ఇష్ట‌ప‌డ‌డేమోన‌న్న భ‌య‌ము క‌లిగిన‌ది. స‌ర్వ‌జంతు స‌మ‌తా సాధు ! త‌వ‌విదితా స‌ర్వ‌బుద్ధి షు ప్ర‌హితా సాచ‌వేద విహితా దేవ య‌ని పాడిన‌ది. భ‌గ‌వంతుడు స‌ర్వ‌జంతు స‌ముడ‌గుట‌చేత త‌న జ‌న్మ యెట్టిదైన‌ను త‌న‌యందు ద‌య చూపుమ‌న్న‌ట్లుగ దీన‌ముగ స్వామికి విన్న‌వించుకొనున‌ది.

మ‌ర‌ల గిరిక‌యే స‌త్రాజిత్తుక‌న్న త‌న తండ్రి చెడిపోయెనా ? అన్నగారు రుక్మిక‌న్న చెడిపోయెనా ? స్వామి న‌న్నేల యంగీక‌రింప‌డు అన్న ధీమంత‌మును వెలిబుచ్చిన‌ది.


కొంత‌కాల‌మామెకు భ‌క్తి వేరుగ‌ను నాట్య‌ము వేరుగ‌ను నుండెడిది. కాని కాల‌క్ర‌మ‌మున‌నా ద్వైవిద్య‌ము న‌శించి భ‌క్తియును నాట్య‌మును ఏకీకృతములైన‌వి. నాట్య స‌మ‌య‌మున తాను గోపిక‌గ‌ను గుడిలోని స్వామి త‌న్నా శ్వాసించు కృష్ణునిగ‌ను భావింప‌గ‌ల దృఢ‌చిత్త‌యైన‌ది.