40
 

విశ్వ‌నాథ‌వారు చిత్రించిన‌పాత్ర‌ల‌లో చాలామందికి త‌మ‌మ‌ర‌ణ‌మెప్పుడో తెలియుచునేయుండును. ఇందుకు కార‌ణ‌ము బ‌హుశః వారికిత‌మ‌మ‌ర‌ణ కార‌ణ‌ము తెలిసిన వారితోపిర‌య‌ముండుట‌యే. విశ్వ‌నాథ‌వారి ఆప్త‌మిత్రుడు కొడాలి సుబ్బారావుగారి కిట్టి జ్ఞాన‌ముక‌ల‌ద‌ని తెలియుచున్న‌ది. విశ్వ‌నాథ వేంక‌టేశ్వ‌ర్లుగారు ఈ విష‌య‌మునిట్లు వ్రాసిరి. అత‌డు జ్యోతిష్యంబాగా తెలిసిన‌వాడు. ద‌శాంత‌ర్ద‌శ‌ల‌న్నీ లెక్క‌గట్టి జాత‌కం త‌న‌మృతిదినందాకావేసి క్రింద ఎర్ర‌సిరాతో అడ్డ‌గీటు పెట్టుకొని స‌రిగా ఆనాడే ప్రాణంవ‌దిలాడు. ఇట్లు తెలియుట‌య‌న్న విష‌య‌ము న‌వ‌ల‌లో అద్భుత‌ర‌స‌ప్రేర‌క‌ముగ‌నున్న‌ను జ‌రుగ‌బోవున‌దిముందుగ‌నే తెలియుట‌చే న‌వ‌ల‌యందుత్కంఠ త‌గ్గుట‌య‌న్న దోష‌ముప‌ట్ట‌వ‌చ్చును. అందుచేత‌నే విధాత‌కూడ మాన‌వుల‌కు మ‌ర‌ణ కాల‌మును తెలియ‌నీక గుంభ‌న‌ముగ‌నుంచెను. ప్ర‌తిజీవియు తాను నూరేళ్ళు బ్ర‌తుకుదున‌న్న యాస‌తోనెన్ని క‌ష్ట‌ముల‌నైన న‌ధిగ‌మించుట‌కు ప్ర‌య‌త్న‌ము చేయును, మ‌ర‌ణ‌కాల‌ము తెలియుట‌చే న‌నేకాన‌ర్ధ‌ములు జ‌రుగ‌గ‌ల‌వు.

అరుంధ‌తి యారోగ్య‌ము క్షీణించుచున్న ద‌శ‌లో వేణుగోపాల‌స్వామికి క‌ళ్యాణోత్స‌వ‌ములు ప్రారంభ‌మ‌యిన‌ది. బంధుమిత్రుల‌నేకులువ‌చ్చుట‌యు వ్యాధిపీడుతురాలైన య‌రుంధ‌తికి యూపిరిస‌లుప‌నిప‌నిపై బ‌డుట‌యుజ‌రిగిన‌ది. అయిన‌ను ఆనందాతిశ‌య‌ముతో శ‌రీర‌మును లెక్క చేయ‌క క‌ళ్యాణోత్స‌వ‌ముల‌ను గిరికానాట్య‌ప్ర‌ద‌ర్శ‌న‌మును క‌నులార‌గాంచిన‌ది. గిరిక యొక్క భ‌క్త్యావేశ‌ముల‌నుగాంచిన య‌రుంధ‌తి యుద్విగ్న‌మ‌న‌స్క‌యైన‌ది. ప‌తిన‌నుక్ష‌ణ‌ము త‌న‌చెంత‌నేయుండుమ‌ని బ‌ల‌వంత‌పెట్టిన‌ది. ప‌తివ్ర‌త‌యైన య‌రుంధ‌తి ప‌తినెడ‌బాసి బ్ర‌తుక‌లేనిస్త్రీ. ఆమెయూపిరి, యాహార‌ము నానంద‌ము స‌ర్వ‌స్వ‌మునాత‌డేయై యుండెను.


గిరిక వేణుగోపాలునికై ప‌డుచున్న విర‌హ‌వేద‌న నంత‌యును త‌న యువ‌తార‌నాట్య‌మున ప్ర‌ద‌ర్శించిన‌ది అరుంధ‌తి తాదాత్మ్య‌మందిన‌ది. గిరిక ప‌తినెడ‌బాసి యుండ‌లేదు...నేనునుండ‌లేను...నాగుండెలోతుల‌లోనుండి ప్రాణ‌ముల త్ర‌వ్వి మీపాద‌స‌న్నిధాన‌మున నైవేద్య‌ము చేసెద‌ను. మీనుండి భిన్న‌మైన మ‌న‌సునాకువ‌ల‌దు. అని ధ‌ర్మారావుతో ప‌లికిన‌ది. అరుంధ‌తిలోని ప్రేమ తీవ్రత యిట్టిది.


అరుంధ‌తి గిరిక‌ను త‌న‌సంగ‌తి యేమ‌ని ప్ర‌శ్నించిన‌ది. వ‌దినేనీవు నావెంట‌నేవ‌చ్చుచుంటివి. నీధ‌న్య‌త నాకెచ్చ‌టినుండివ‌చ్చును. నేనుబ‌హు ప్ర‌యాస‌ప‌డి సాధించుచున్న‌ది నీకుబూర్వ‌జ‌న్మ సంస్కార‌ముచేత స‌హ‌జ‌ముగా ల‌భించిన‌ది అని గిరిక చెప్పిన‌ది. ఇంత‌మూడునెల‌ల‌కు అరుంధ‌తి త‌న‌ను అనుస‌రించున‌ని చెప్పిన‌ది. ప‌తియందేకాగ్ర‌త కుదుర‌ట సుల‌భ‌మ‌నియు భ‌క్తిమార్గ‌మున నున్న‌క‌ష్ట‌ములు పాతివ్ర‌త్య‌మార్గ‌మున‌లేవ‌నియు గిరిక‌య‌భిప్రాయ‌ప‌డిన‌ది. హార‌ప్ప‌నాయుడు అరుంధ‌తీదేవి ముఖ‌మున‌త‌న‌కు పాత‌వ్ర‌త్య‌రేఖ‌త‌ప్ప మ‌రొక‌టి క‌న్పించ‌లేద‌ని త‌ల‌చెను. ఆయ‌రుంధ‌తి వ‌ల‌న వ‌సిష్ఠుడు బ‌విత్రుడ‌న‌నుకొనెనుగాని ఈయ‌రుంధ‌తివ‌ల‌న నీ వ‌సిష్ఠుడు అట్లుభావించుట లేద‌నుకొనెను. య‌యాపూతం మ‌న్యేనిధిర‌పి ప‌విత్ర‌స్య‌మ‌హ‌సః, అని య‌రుంధ‌తి వ‌ల‌న మ‌హ‌ర్షియైన‌నుదానుబ‌విత్రుడ‌న‌ను కొన్నాడ‌ట‌. ఈ య‌రుంధ‌తీదేవి వ‌ల‌న నీ వ‌సిష్ఠుడునుకొన్న‌ట్లులేదు అని హ‌ర‌ప్ప‌త‌ల‌చెను. వ్యాధిగ్ర‌స్తురాల‌యిన భార్య‌యందుకంటె దేవదాసి మోక్ష‌మార్గ‌నందు ధ‌ర్మారావు మిక్కుట‌మైన‌యాస‌క్తి ప్ర‌ద‌ర్శించుట‌జూచిన హ‌ర‌ప్ప య‌రుంధ‌తి మీద సానుభూతిని చూసినాడు.

స్వామి రెండ‌వ‌ప‌డ‌గ మాసిపోయిన‌ది మ‌ఱియొక‌దానినియేర్ప‌ర‌చి ఆకృతితేవ‌లెన‌న్న గ‌ణాచారి మాట‌ల‌ను అరుంధ‌తి క్రియారూప‌మున‌ప‌ట్టిన‌ది. ధ‌ర్మారావు మిత్రుడ‌గు ప‌వువ‌తి త‌న‌కుమ‌ర్తెకు అరుంధ‌తియ‌ని పేరు పెట్టుకొనినాడు. ఈ చిన్న‌య‌రుంధ‌తి మ‌న‌సులో పెద్ద‌య‌రుంధ‌తి తామిద్ద‌రు ఒక్క‌టే య‌న్న భావ‌మును క‌ల్గించిన‌ది. చిన్న‌య‌రుంధ‌తిలోనొక భావ‌ము చెల‌రేగిన‌ది. పెద్ద‌య‌రుంధ‌తిప‌ట్ల ధ‌ర్మారావువెట్లు ప్రేమ‌గ వ్య‌వ‌హిరించుచుండ‌నో చిన్న య‌రుంధ‌తి ప‌ట్ల‌కూడ‌న‌ట్లే వ్య‌వ‌హిరింప‌వ‌ల‌న‌న్న భావ‌ము చెల‌రేగిన‌ది. పెద్ద‌య‌రుంధ‌తిప‌ట్ల ధ‌ర్మారావెట్లు ప్రేమ‌గ వ్య‌వ‌హ‌రించుచుండెనో చిన్న‌య‌రుంధ‌తి ప‌ట్ల‌కూడ‌న‌ట్లే వ్య‌వ‌హ‌రింప‌వ‌లెన‌న్న భావ‌ము క‌లిగిన‌ది. ధ‌ర్మారావు అరుంధ‌తి శ‌యినించు వేళ‌ల‌కూడ చిన్నియ‌రుంధ‌తి వారిన‌డుమనుండి నిష్ర్క‌మించుట కిష్ట‌ప‌డ‌లేదు. దేవాల‌య‌ములోనాట్యోత్స‌వ‌ములు చూచి యింటికి తిరిగివెళ్ళున‌పుడు న‌డువ‌లేనియ‌రుంధ‌తిని త‌న‌చేతులంమీద‌రుగ ధ‌ర్మారావెత్తుకుని న‌డ‌చుట చిన్న‌య‌రుంధ‌తి చూచిన‌వ్విన‌ది. అపుడ‌రుంధ‌తి నిన్నును నెత్తుకోనునులే దిగులుప‌డ‌కుము ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ది అనెను. చిన్న‌పిల్ల మ‌ధుర‌ల‌జ్ఞాభిన‌యుచేసిన‌ది. ఈ స‌మయ‌మున‌కే చిన్న‌య‌రుంధ‌తిలో ధ‌ర్మారావునెడ ప్రేమ‌బీజ‌ములునాటు కొనుట‌యు తానును అరుంధ‌తియు నొక్క‌టేయున్న న‌మ్మ‌క‌ము క‌లుగుట‌యు సంభ‌వించిన‌ద‌న‌వ‌లెను త‌రువాత నాన‌మ్మ‌క‌ము మ‌హావృక్ష‌మైన‌ది.

అరుంధ‌తి కాపుర‌మున‌కు వ‌చ్చిన‌పుడు రంగాజ‌మ్మ‌గారొక చీర‌ను బ‌హుక‌రించిన‌ది. అరుంధ‌తి యాచీర‌ను రంగాపురములో వ‌దలివ‌చ్చెను. చిర‌కాల‌ముగ నామెకాచీర‌ను ధ‌రింప‌వ‌లెన‌న్న వాంఛ ప్ర‌బ‌లియున్న‌ది.

మ‌ర‌ణ‌కాల‌మున‌కాచీర ధ‌రింప‌వీలైన‌ది. మ‌ర‌ణోన్ముఖుదాలైన అరుంధ‌తి హృద‌య‌మున తానెఱింగిన ధ‌ర్మారావు యొక్క స్వ‌రూప‌ము వివిధాకృతుల దాల్చి ప్ర‌స్పుటించిన‌ది. ప్రేమ‌లేనియ‌రుంధ‌తిని లాలించి బెదిరించుభ‌ర్త‌, భార్యాద్వితీయుడై య‌ర్థ‌నారీశ్వ‌ర మందిన‌వాడు, ఒక‌తావున గురువై ఒక్కొక్క‌మారు త‌న‌యాజ్ఞావ‌ర్తియై, మ‌ఱియొక‌సారి భార్యాభ‌క్తుడై యున్న‌ట్లుగ ధ‌ర్మారావు అరుంధ‌తీ హృద‌య‌మున విరాట్స్వ‌రూప‌మున ప్ర‌త్య‌క్ష‌మైనాడు. ఇదిఆమె హృద‌య‌మున‌కున్న ఏకాగ్ర‌తాస్ఫూర్తియ‌న‌వ‌లెను. ఆమెభావ‌నాగాంభీర్య‌మ‌న‌వ‌లెను. ఆమె మ‌నోనైశ్చ‌ల్య‌ద్ర‌ఢిమ‌య‌న‌వ‌లెను. ఇంత‌టిస్ఫూర్తి క‌ధానాయ‌కునిలో సృష్టింప‌బ‌డ‌లేదు. మృత్యుముఖ‌రాలైన భార్య‌స్ప‌ర్శ‌కు పుల‌కితాంగుడై త‌ననుతాను దూషించుకొన్న‌వాడ‌త‌డు. ఆమెమ‌నస్సువేరు, శ‌రీర‌మువేరుయ‌ని భ‌ర్త‌నోదార్చిన‌ది. నేను మంచ‌మున మృత్యుదేవ‌త‌కు స‌న్నిహితురాల‌నైయున్నాను. అనార్త‌వ‌మైన పుష్ప‌మువ‌లె నిత్య‌వికాస‌ముచెడ‌ని మీరిచ‌ట‌నున్నారు. ఎన్న‌టికైన బ్ర‌కృతి చెడునుగాని పురుషుడు చెడ‌డుక‌దా అనిప‌లికిన‌ది. త‌న‌మ‌న‌సు చంచ‌ల‌ముకాదు భ‌ర్త యందే మ‌గ్న‌మైయున్న‌దని ప‌లికిన‌ది. తాను ప్ర‌కృతి నాశ‌మున్న‌ది. అత‌డు పురుషుడు నాశ‌ర‌హితుడు అన్న‌ది. అన‌గ‌మ‌ర‌ల ధ‌ర్మారావును వివాహోన్ముఖుని గావించుట‌కిట్లు చెప్పిన‌ద‌న‌వ‌లెను. ప్ర‌కృతి పురుషుల‌యిన అరుంధ‌తీ ధ‌ర్మారావుల శ‌రీర‌ములు పాంచ‌భౌతికాత్మ‌క‌మ‌యిన‌వే. ఇరువురును క‌ల‌సి త‌మ‌పుత్రునియందు శాశ్వ‌త‌త్వ‌మందియున్నారు. సృష్టిప‌రంప‌ర య‌ట్లునిర్గ‌మింప‌వ‌ల‌సిన‌దే కాని పున‌ర్వివాహ‌ప్రేర‌క‌మైన ప్ర‌కృతి పురుష నిర్వ‌చ‌న మీతావున‌కు స‌రిప‌డుట‌లేదు. ధ‌ర్మారావు తండ్రి త్ర‌యీవిద్య‌కు వ్యాఖ్యాతాత్మ‌క స్వ‌రూపుడై, వ‌ర్ఱాశ్ర‌మ‌విధాన‌మున కొక‌వ్యాఖ్యాత‌యైకూడ మ‌ర‌ణించుట జ‌రిగిన‌ది. త‌ల్లియ‌ట్టేయున్న‌ది. సావిత్రీ రామేశ్వ‌ర‌శాస్త్రుల ప్ర‌కృతి పురుష‌త్వ‌ము లోక‌సామాన్య‌ముగ వ్యాఖ్యానింప‌బ‌డిన‌ది. స్వామి రెండుప‌డ‌గ‌ల వృత్తాంత‌మున‌కు స్ఫూర్తి క‌లిగించుట‌కై మ‌త్ర‌మే ప్రవేశ పెట్ట‌బ‌డిన రెండ‌వ య‌రుంధ‌తిపాత్ర కేవ‌ల‌ము ర‌చ‌యిత‌యొక్క స్వీయానుభ‌వ వివ‌ర‌ణ‌మ‌నవ‌ల‌సి వ‌చ్చుచున్న‌ది. స్వ‌ర్గానికి నిచ్చెన‌లు లోని వ‌సుంధ‌ర చిన్న‌త‌న‌మున‌నే భ‌ర్త‌ను కోల్పోయి మ్రోడువ‌లె జీవింప‌వ‌ల‌సివ‌చ్చింది. రెండ‌వ‌ప‌డ‌గ స్త్రీ యెడ‌ల మ‌ర‌ల‌న‌తుకు పెట్ట‌బ‌డ‌కుండుట ఇట‌గ్రాహ్య‌ము, అరుంధ‌తి మర‌ణించిన‌ది. అత‌డు శోక‌మున‌మునిగెను.


అచ‌ట చిన్న య‌రుంధ‌తి యౌవ‌న‌వ‌తియైన‌ది. ఆమె ధ‌ర్మారావును త‌ప్ప‌మ‌రొక‌రిని పెండ్లియాడ‌న‌ని ప‌ట్టుప‌ట్టిన‌ది. త‌ల్లిదండ్రులందుల‌కియ్య గొన‌లేదు. ఇరువురుకును వ‌యోభేద‌ముకూడ హెచ్చుగ‌నున్న‌ది. చిన్న య‌రుంధ‌తి ధ‌ర్మారావు కొర‌కు స‌త్యాగ్ర‌హ‌ముచేసి మంచ‌ముప‌ట్టిన‌ది. ధ‌ర్మారావునందుగ‌ల ఏకాగ్ర‌తాత్మ‌క‌త్వ‌మున‌కు చిన్న య‌రుంధ‌తి పెద్ద య‌రుంధ‌తికీడైన‌ది. ప‌శుప‌తి ధ‌ర్మారావుకు తంతియిచ్చి పిలిపించెను. ధ‌ర్మారావు మందుయిచ్చిన‌గాని అరుంధ‌తి పుచ్చుకొనెడిదికాదు. ధ‌ర్మారావు త‌న‌ను పెండ్లియాడున‌న్న విష‌య‌ము తెలిసికొనిన త‌రువాత‌గాని యామెలో క్రొత్త‌యాశ‌లంకురించి తేజ‌స్సులు విర‌జిమ్ముట జ‌రుగ‌లేదు.

ఒక‌నాటి రాత్రి ధ‌ర్మారావు త‌న‌కుప‌రిచ‌య‌మున్న స్ప‌ర్శ‌సుఖానుభూతి న‌నుభ‌వించి యులికిప‌డెను. ఆస్ప‌ర్శ‌న‌త‌డు క‌ర‌మున‌బంధించెను. చిక్కిశ‌ల్యావ‌శిష్ట‌మైన అరుంధ‌తి. పెద్ద అరుంధ‌తికిని చిన్న అరుంధ‌తికిని గ‌ల స్ప‌ర్శాసామ్య‌మున‌క‌త‌డు ఆశ్చ‌ర్య‌పోయెను. ఆమెయిట్ల‌న్న‌ది. చ‌నిపోయిన మీ భార్య‌మీకు జ్ఞాప‌క‌ములేదా ? ఆమె చ‌నిపోయిన‌ప్పుడెట్లున్న‌ది. అవును అప్పుడునిట్లేయున్న‌ది...నీ వెవ‌ర‌వు ? అనెను. ఆ అరుంధ‌తియే యీ అరుంధ‌తియా ? ధ‌ర్మారావులోనొక విచిత్ర‌మైన స్పంద‌న‌ముక‌ల్గిన‌ది. ముమ్మూర్తుల ఆమె త‌న‌య‌రుంధ‌తి వ‌లెనేయున్న‌ది. స్ప‌ర్శ‌స‌హిత‌మ‌ట్లే యున్న‌ది. ధ‌ర్మారావు అంద‌రియెదుట అరుంధ‌తిని చూచుట‌కు సిగ్గుప‌డును కాని అరుంధ‌తి యాత‌నిపై నుండి క‌నులు త్రిప్పుకొన‌లేదు. అరుంధ‌తి కోప‌మువ‌చ్చిన‌చో చుర‌చుర‌చూచును. ఇత‌నికాచూపు యెచ్చ‌ట‌నో చూచిన‌ట్లే యుండును.


ఒక‌నాటి ఏకాంత స‌మ‌య‌మున అరుంధ‌తి నేనెవ‌ర‌ను ? అని ధ‌ర్మారావును ప్ర‌శ్నించి తానే నేను మ‌ర‌ల‌వ‌చ్చితిని న‌న్ను గుర్త‌ప‌ట్ట‌లేరా అని ప్ర‌శ్నించిన‌ది. ప‌తివ్ర‌త‌యైన అరుంధ‌తి, ధ‌ర్మారావునెడ య‌ఖండ‌మైన ప్రేమ‌గ‌ల య‌రుంధ‌తి భ‌ర్త‌నువిడ‌జాల‌క త‌నుమ‌న‌స్సును కాంక్ష‌ను ప్రేమ‌ను స‌ర్వ‌చైత‌న్య‌మును చిన్న య‌రుంధ‌తిలో నిక్షేపించిన‌ది. ఇదిలౌకిక‌ముగ న‌సాధ్య‌విష‌య‌మన‌వ‌లెను. య‌థార్ధ‌మున‌కు కొంత‌స్వ‌యం క‌ల్పిత‌మును జోడించి ర‌చించుట న‌వ‌లా ల‌క్ష‌ణ‌ముల‌లోనొక‌టి అందుచేత నిదిసుంద‌ర క‌ల్ప‌న మ‌న‌వ‌ల‌యును. పెద్ద‌య‌రుంధ‌తి చిన్న య‌రుంధ‌తితో తామిరువురు నొక్క‌టియే య‌న్న భ్రాంత‌ని క‌ల్గించిన‌ది. ఆబాలిక‌యొక్క హృద‌య‌మున ధ‌ర్మారావు యొక్క మూర్తి గాఢ‌ముగ‌నాటుకొన్న‌ది. ఆమె య‌త‌నినిగాఢ‌ముగ ప్రేమించి జ‌బ్బుతెచ్చుకొనిన‌ది. ధ‌ర్మారావీమెను పెండ్లియాడ‌క‌త‌ప్ప‌లేదు. మ‌న‌సుచేయున‌ల‌జ‌డిని, పెద్ద‌య‌రుంధ‌తికిని చిన్నయ‌రుంధ‌తికినిగ‌ల సామ్య‌ల‌క్ష‌ణ‌ముల‌ను చూచియ‌డ‌గించు కొనినాడు. అరుంధ‌తిని వివాహ‌మాడుట కిచ్చ‌గించిన త‌రువాత‌నే ధ‌ర్మారావున‌కు చిన్న య‌రుంధతితో పెద్ద‌య‌రుంధ‌తి కాన‌వ‌చ్చిన‌ది. చిన్న‌య‌రుంధ‌తి అత‌ని క‌న్నుల‌లో క‌న్నులుంచి

నేను మిగిలితిని అన్న‌ది. నిజ‌మున‌కుధ‌ర్మారావు మొద‌ట‌నీమాట‌య‌న‌వ‌ల‌సిన‌ది. నీవు మిగిలితివి అని ఇదినాజాతిశ‌క్తి నా య‌దృష్ట‌ము నీవెమిగిలితివి అని ధ‌ర్మారావ‌నెను. ఇరువురుయ‌రుంధ‌తులు ప‌తివ్ర‌త‌లే. ఈ వ్ర‌త‌ము నిర్మ‌ల‌మై, భ‌ర్త‌యంద‌లిప్రేమ‌తో ముడిప‌డి యుండుట‌చే ర‌మ్య‌ముగ నున్న‌త‌ముగునున్న‌ది. మూర్ఖ‌మైన ఆచార‌ముల‌తో భ‌ర్త యొక్క పాద‌ముల‌చెంత‌ప‌డియుండి. అత‌డు మూర్ఖుడైన‌ను వానిని భ‌క్తితోసేవించుచు వాని దుర్గ‌ణ‌ముల‌ను స‌హించుచునుండుట పాతివ్ర‌త్య‌ము కాదు.

అరుంధ‌తీ ధ‌ర్మారావుల ప్రేమ యాద‌ర్శ‌వంత‌మైన ల‌క్ష్మీనారాయ‌ణుల ప్రేమ‌ను త‌ల‌పింప‌జేయుచుండ‌గా అరుంధ‌తీ పాతివ్ర‌త్య‌ములో పేరెన్నిక‌గ‌న్న వ‌సిష్ఠ‌మ‌హ‌ర్షిప‌త్నియైన య‌రుంధ‌తికి దీటుగ‌తీర్చిదిద్ద‌బ‌డిన‌ది. పాతివ్ర‌త్య సిద్ధాంత‌మున‌కు అరుంధ‌తీ చిత్ర‌ణ‌ము సుంద‌ర‌త‌ర‌మైన వ్యాఖ్యాన‌ము.