42
 

స‌రోజ‌లోచ‌న‌

 

చంద‌వోలురాణియొక్క పాత్ర చిత్ర‌ణ‌ములో వేయిప‌డ‌గ‌లు లోని దేవదాసియైన గిరిక‌పోలిక‌లు కొన్ని తొంగి చూచుచుండును. గిరిక‌కు కృష్ణుడారాధ్య‌దైవ‌ముకాగా స‌రోజ‌లోచ‌న‌కు చెన్న‌కేశ‌వుడారాధ్యుడు. గిరిక‌ను కృష్ణ‌దేవుడు స్వ‌ప్న‌మున క‌నుపించి మురిపించ‌గా స‌రోజ‌లోచ‌న‌కు చెన్న‌కేశ‌వుడేరాయ‌నిగ రూపాంత‌ర మందినాడు. వేయిప‌డ‌గ‌లు లోని రాణి రుక్మిణ‌మ్మారావున‌కు కూడ కృష్ణ‌దేవుడు త‌న‌భ‌ర్త య‌గు కృష్ణ‌నాయ‌నివ‌లె తోచెను. నావిష్ణుఃపృథివీప‌తః విష్ణ్వంశ‌లేనివాడు రాజుకాడ‌న్న వాక్య‌ము ప్ర‌కార‌ము రాజున‌కు దైవ‌మున‌కు న‌భేద‌ప్ర‌తిప‌త్తిని విశ్వనాథ‌వారు ప్ర‌తిపాదింప‌ద‌ల‌చి ర‌నిపించును. స‌రోజ‌లోచ‌న కూడ‌గిరిక‌వ‌లె భోగాంగ‌న‌యే. ఇరువురి మ‌ధుర‌ప్రేమ‌యే. స‌రోజ‌లోచ‌న చెన్న‌కేశ‌వుని యాజ్ఞ‌చేత తెనుంగాధీశునితో జీవిత‌ము పంచుకొన్న‌ది. కానియామెప్ర‌వృత్తి శ‌రీర‌మాత్రావ‌స్థ‌నుదాటి యాత్మార్ప‌ణావ‌ధిగ ప‌రిణ‌మించిన‌ది. గిరిక‌దినాట్య‌యోగ‌ము స‌రోజ‌లోచ‌న నాట్య‌ముతోపాటు శ‌రీర‌సుఖ‌ముల న‌నుభ‌వించుచుండియు న‌నుభ‌వించ‌నిదై చూచియు చూడ‌నిదానివ‌లె నిస్సంగియై వేదాంత‌మున చెప్ప‌బ‌డిన మ‌హోత్క‌ష్ట‌ద‌శ‌కు చేరుకొనిన‌ది. ఇందువ‌ల‌న గిరిక‌ది భ‌క్తి మార్గ‌ము. స‌రోజ‌లోచ‌న‌ది వేదాంత‌మార్గ‌ము అని చెప్ప‌వ‌చ్చును.

స‌రోజ‌లోచ‌న జాంబ‌వ‌తియ‌ను భోంగాగ‌న‌కు జ‌నించిన‌ది. ఆమెయు నామెమిగిలిన పుత్రిక‌లునుకూడ వృత్తి న‌వ‌లంబించిన‌వారలేగాని కొంత ప‌రిమిత‌న‌వ‌లంబించికొని నీతుల‌కు క‌ట్టుబ‌డియున్నావారు. స‌రోజ‌లోచ‌న యొక్క సౌంద‌ర్య‌ము ఆయూరిలోని పురుషుల‌కంద‌ని జాబిల్లివంటిదైన‌ది. ఆమెవృత్తి చేయ నిరాక‌రించుట‌తోనున్న‌త స్థాన‌మున‌నున్న పురుషుల‌కు స‌హిత‌ము వాంఛాస్థాన‌మైన‌ది. దుర్గ‌ర‌క్ష‌ణ సైన్యాధిప‌తియును, ప‌న్నెండు గ్రామ‌ముల‌పై న‌ధికార‌ముగ‌ల రాజబంధువైన దాయాది చోదుడ‌నువాడు స‌రోజ‌లోచ‌న‌పై మోహ‌ప‌డెను. ఆమెద్వారా వంశోద్ధార‌కుని క‌న‌వ‌లెన‌ని భావించియామెకొర‌కు వారి గృహ‌మున‌కు వెళ్ళెను.

ఆమెయంద‌చంద‌ముల‌ను గుణ‌గ‌ణ‌ముల‌ను వృత్తి చేయ‌నన్నయామె ప‌ట్టుద‌ల‌ను మెచ్చుకొను కొంద‌రామెపై భ్రాంతిని వ‌ద‌ల‌లేక చంద‌వోలురాణి య‌నిపిలువ‌సాగిరి. దుర్గాధిప‌తుల‌కును కోటీశ్వ‌రుల‌కును, ధ‌నుమునుఋణ‌మీయ‌గ‌ల క‌న్న సెట్టియ‌నువాని కుమారుడు వెంక‌న్న‌సెట్టి చంద‌వోలురాణి సౌంద‌ర్య‌ము చూచివ‌ల‌చి ప‌దివేల‌దీనార‌ముల వెల‌చేయు ర‌త్న‌హార‌ము నామెకు కాన్క‌పెట్టెను. త‌దాది వెంక‌న్న‌సెట్టికి విర‌హ‌ముతో నొక‌విధ‌మైన యున్మ‌దావ‌స్థ‌క‌లిగిన‌ది. దాయాదిచోళుడు త‌నాసించిన స్త్రీని వెంక‌న్న సెట్టి యాసించుట స‌హింప‌క వెంక‌న్న సెట్టిని వ‌ధింపజేసెను. లేకున్న‌నువిర‌హావ‌స్థ‌లో తుదియ‌వ‌స్థ‌య‌గు మ‌ర‌ణ‌మున‌త‌డే పొందియుండెడివాడు.

చంద‌వోలురాణి అధికార‌మున‌కుగాని ధ‌న‌మున‌కుగాని లొంగ‌లేదు. దాయాదిచోశునితో రాణియిట్ల‌న్న‌ది. నేను వృత్తిచేయ‌ను. భ‌గ‌వంతుడు నాకెట్టియాజ్ఞ‌నిచ్చునో య‌ట్టియాజ్ఞ‌నే నిర్వ‌ర్తింతును దాయాదిచోళుడు అధికార‌మున్న‌వాడు. క్రూరుడు, అవ‌స‌ర‌మ‌గుచో క‌క్ష‌సాధింప‌గ‌ల‌వాడు. అయిన‌ను రాణి ధైర్య‌ముగ న‌త‌నిని కాద‌నిన‌ది. వెంక‌న్న‌సెట్టి వ‌ద‌లివెళ్ళిన ర‌త్న హార‌మును స‌రోజ‌లోచ‌న య‌వ‌ల‌కు ద్రోసివైచిన‌ది. త‌ల్లి దాయాదిచోళునిగాని వెంక‌న్న సెట్టినిగాని వ‌రింపుమ‌ని యొత్తిడిచేసిన‌ది. దాయాదిచోళున‌కు రాజ్యాధికారికాగ‌ల కుమారునిమ్మ‌న్న‌ది.

లేకున్న కోటీశ్వ‌రుడ‌గు వెంక‌న్న‌సెట్టిని కోట్ల‌కుప‌డ‌గ‌లెత్త‌మ‌న్న‌ది. రాణి రెంటికి నంగీక‌రింప‌లేదు. నేనెవ‌రినైన చేప‌ట్టిన‌చో దానికి చెన్న‌కేశ్వ‌రుని యాజ్ఞ‌కావ‌ల‌యును. నాజీవున‌కు కామ‌ములేద‌ని నేనెట్ల‌న‌గ‌ల‌ను అనిన‌ది. ఇందువ‌ల‌న‌రాణి వివాహ‌మున‌కు విముఖురాలుగాని వాంఛార‌హితురాలు గానిగాక స‌ర్వ వ్యాపార‌ములు చెన్న‌కేశ్వ‌రుని యాజ్ఞ‌పై జ‌రుగుచుండ‌గా నామెమాత్ర‌ము నిమిత్త‌మాత్రురాలివ‌లె నిర్లిప్త‌త‌ను పాటించున‌ని తెలియుచున్న‌ది.

రాణికి జీవిత‌ములో నొత్తిదు లెక్కువ‌గుచుండ‌గా స్వ‌ప్న‌మున స్వామికూడ క్ర‌మ‌క్ర‌మ‌ప‌రిణామ మందుచు నేదోయొక య‌ద్భుత‌ము జ‌రుగ‌బోవున‌ట్లు సూచింప‌సాగెను. ఆమెకుస్వామి ద‌రిదాపుల‌లో వంద‌సార్ల‌యిన‌ను స్వ‌ప్న ద‌ర్శితుడైనాడు.

ఒక‌నాటి ద‌ర్శ‌న‌మున చెన్న‌కేశ్వ‌రుడు న‌గుమోముతో న‌గుపించెను. ఆమూర్తి క్ర‌మ‌క్ర‌మ‌ముగ మార‌జొచ్చిన‌ది. శిఖిపింఛ‌ము కిరీట‌ముకాగా వేణువున‌కు బ‌దులు ఖ‌డ్గ‌ము ప్ర‌కాశ‌ముకాగా నీల‌మేఘ శ్యామ‌వ‌ర్ణ‌ము హేమ‌సుంద‌ర‌మై క‌నుపించిన‌ది. ఇట్టిక‌ల‌గ‌న్న త‌రువాత రాణి నాస్వ‌ప్న మూర్తి క‌ల‌వ‌ర‌పెట్టిన‌ది. ఆరూపుహృద‌య‌మున గాఢ‌ముగ‌న‌త్తుకొన్న‌ది. ఆరూప‌మామెలోని స్త్రీ భావ‌మును మేల్కొల్ప‌గా స్వామి యామూర్తిని త‌న‌కు భ‌ర్త‌గ నిశ్చ‌యించెన‌ని భావించిన‌ది.

మ‌రునాటి యుద‌య‌మున నేరెళ్ళ‌బావికి మంచినీటికై త‌న‌కుమించిన బిందెను తీసికొని రాణివెడలిన‌ది. ఆమె పెద్ద‌బిందెను నెత్తిపైకొత్తుకొన‌లేక సాయ‌ముకొర‌కు న‌లువైపుల‌కు దృష్టిచిసారించెను. ఒక‌తావున రాణికి స్వ‌ప్న‌మూర్తి సాక్షాత్కారించిన‌ట్లైన‌ది. ఆపురుషుడాదేశాధిప‌తి. అతడామెను క‌నురెప్ప‌వేయ‌క చూచుచుండెను. ఆమెవివ‌శ‌యై నేల‌బ‌డ‌బోవుచుండ‌గా న‌త‌డు స‌రోజ‌లోచ‌న‌ను గ్రుచ్చిప‌ట్టి లేవ‌నెత్తెను. కొంత‌వ‌డికామెకు ఆ పురుషుడు త‌మ‌యేలిక‌యే అని తెలిసి దుఃఖించుట మొద‌లిడిన‌ది.


ఆమె దుఃఖ‌ముతో నావ‌ల‌న‌ద్రోహ‌ము జ‌రిగిన‌ది నేను శిక్షార్హురాల‌ను. నేను మ‌హారాజుతోనెట్లు మాటాడ‌వ‌లెనో తెలియ‌ని య‌శిక్షితురాల‌ను మోక‌రించ‌వ‌లెనో దోసిలిమొగ్గ‌వ‌లెనో, జ‌య‌జ‌య‌మ‌హారాజ య‌న‌వ‌లెనో...నాత‌ప్పులు మ‌న్నించ‌వ‌ల‌యును. నేటిరాత్రికీజీవి బ్ర‌తికియుండ‌దు అని ఆమె ప‌ల్కిన‌ది. అత‌డుకూడ‌నిట్ల‌నెను, నీవ‌నినట్లునీ ప్రాణ‌ములు తీసికొంటివా రాజ‌ద్రోహ‌మును చేసిన‌దాన వ‌గుదువు. ఇదిరాజాజ్ఞ‌...రాజ‌ద్రోహ‌ము చేసిన‌పాప‌ము నిన్నువ‌ద‌ల‌దు అనెను. రాజు ఆమె వెళ్ళిపోవుచుండ‌గా నామెనురాణిగ త‌న‌కోట‌లోనికి పిలిపించుకొందున‌ని ఆమెకుచెవిలో ర‌హ‌స్య‌ముగ చెప్పెను.

రాణిని ఇంటిలో త‌ల్లియు అక్క‌లును అగ‌చాట్లు పెట్టుచుండెడివారు. సంపాద‌న‌లేనందున ఇంటిలోని ప‌నియంత‌యు రాణిచేత‌లమీద‌గ‌నే జ‌రుగ‌వ‌ల‌సియుండెను. రాజు జాంబ‌వ‌తిని మంద‌లింపుమ‌ని త‌న‌భ‌టునిపంపెను. వారు రాజు స‌రోజ‌ను మోహించుచుండెన‌నియు నామెకై వార్త నంపున‌నియు భావించి యామెకు స‌క‌లోప‌చార‌ములు చేయ‌ప్రారంభించిరి. కాని రాణి మాత్ర‌ము త‌న‌ను య‌థాప్ర‌కార‌ముగ మాత్ర‌మే చూడుడ‌ని కోరిన‌ది. రాజెంత‌కు వ‌ర్త‌మానమంప‌క పోవుట‌చే జాంబ‌వ‌తి మొద‌లైన వారెమెను మిగుల‌వేధింప‌సాగిరి. చంద‌వోలురాణి యాలోచ‌న ప‌రిప‌రివిధ‌ములు పోయిన‌ది. అత‌డురాజు. తాను వేశ్య‌. త‌మ‌యిద్ద‌రికిని చెన్న‌కేశ్వ‌ర‌డేమి బంధ‌ము వ్రాసెనాయ‌ని దుఃఖింప‌సాగిన‌ది. ఆమెలో స్వ‌ప్న‌మున‌కు బాహ్య‌మున‌కుగ‌ల యంత‌ర‌ము భాసింప‌సాగిన‌ది. ఒక‌రాజొక వేశ్య‌ను గ్రుచ్చి కౌగ‌లింత‌ప‌నిజేసి యామెను క్రింద‌ప‌డ‌కుండ ర‌క్షించెన‌న‌గా రాజుపై జ‌నేలేమి నింద‌వైతురో, ఆనింద‌కు తానుకార‌ణ‌మున‌ని చింతించుట‌చే తానానాడు మ‌ర‌ణింతున‌ని రాజుతో చెప్పిన‌ది. ఆమె రాజు యొక్క యీ చ‌ర్య‌వ‌ల‌న త‌ను గ‌నిన‌క‌ల ఫ‌లించున‌న్న భావ‌మును పొంద‌జాల‌క‌పోయిన‌ది. త‌న‌వంటి హీన‌కుల‌స్థురాలికంత యంద‌నివాడు భ‌ర్త‌య‌గుట‌యా య‌నిభీతిచెందిన‌రాణి యొక్క సంభాష‌ణ మిచ‌ట‌పేల‌వ‌ముగ నుండెనేగాని రాజు కూడ శ్రీ‌ల‌లితో పాస‌కుడ‌గుట‌చే నా దేవి యాత‌నిక‌ల‌లో నొక‌జ‌గ‌న్మోహ‌న‌మైన రూప‌ముతో దీపించెడిది.ర‌స‌పూర‌క‌ముగ‌లేదు.


ఒక‌నాటి స్వ‌ప్న‌మున నొక‌మోహ‌నాకృతి నేరెళ్ళ‌బావియొద్ద నిల‌బ‌డి బిందె పై కెత్తుమ‌న్న‌ట్లుగ రాజువంక చూచిన‌వ్విన‌ది. ఇట్లీయిరువురును దైవ‌సంక‌ల్ప‌మున నేరెళ్ళ‌బావియొద్ద క‌లిసికొనిన‌ను ఒక‌రుత‌క్కువ‌త‌న‌ము చేత‌ను రెండ‌వ‌వారాధికార‌ముతో కూడిన ఎక్కువ‌త‌న‌ముచేత‌ను త‌మ‌ప్ర‌థ‌మ స‌మాగ‌మ‌మును ర‌స‌భంగ‌ము గావించిరి. ఇరువుర‌కు మ‌న‌సులో ప్రేమ యుండిన‌ను రాణియొక్క క్ష‌మాభిక్షార్థ‌న‌ములును రాజుయొక్క ఆజ్ఞాప‌న‌ములును, మిక్కుట‌మైనాసంఘ‌ట‌న‌మున కుండ‌వ‌ల‌సిన మ‌ధురిమ‌కు ఆభావ‌మేర్ప‌డిన‌ది.


నీల‌మ్మ‌య‌ను జ్యోతిశ్శాస్త్ర‌వేత్రి జాంబ‌వ‌తిని రెండుప్ర‌శ్న‌లను వైచిన‌ది. వాని స‌మాధాన‌ముల‌పై చంద‌వోలురాణి భ‌వితవ్య‌మాధార‌ప‌డి యుందుట‌చేత నిజ‌ము చెప్ప‌వ‌ల‌యునో అబ‌ద్ధ‌ముచెప్ప‌వ‌ల‌యునో తెలియ‌ని జాంబ‌వ‌తి య‌బద్ధ‌మేచెప్పిన‌ది. వెంట‌నే రాణి స‌త్య‌ముచెప్పివైచిన‌ది.

చెన్న‌కేశ‌వ‌స్వామి స్వ‌ప్న‌మున క‌నుపించి త‌న‌స‌న్నిధిని నాట్య‌ము చేయ‌మ‌ని రాణినాదేశించెను. అప్పుడారాణి దేవాల‌య‌మున స‌హాయ వాద్య‌ములులేక‌నే నాట్య‌ముచేసిన‌ది. ఆల‌య‌ములో నాట్య‌ముచేయుట‌కాజ్ఞ‌గ‌ల మ‌రియొక వారంగ‌న వీరిపై యుద్ధ‌మున‌కువ‌చ్చిన‌ది. రాణినిర్మ‌ల‌చిత్త‌ముతో స్వామియాజ్ఞ‌యైన‌ది, కావున నాట్య‌ముచేసితిన‌న్న‌ది. త‌న‌నావుట‌కెవ‌రికిని సాధ్య‌ముకాద‌న్న‌ది. స్వామిర‌మ్మ‌న్న‌చో నాత‌ల‌పోయిన‌ను వెళ్ళుదును. మ‌హారాజున‌న్ను బంధించిన‌చోనాక‌చ‌ట క‌ర్తృత్వ‌ములేదు అని శాంత‌ముగ చెప్పిన‌ది. మ‌రునాడుమ‌ల్ల‌న్న అనురాజ‌సేవ‌కుడు స‌రోజ‌నోచ‌న‌కు ఆల‌య‌మున నాట్య‌ముచేయుట‌కు అధికార‌ప‌త్ర‌మును పుట్టించెను. ఈమెకు గురువులు డుంఠిశ‌ర్మ‌, భ‌గీర‌థ‌శాస్త్రి ఫ‌ల్గుణ‌శ‌ర్మ‌. కాని తండ్రివంటి గురువు మ‌ల్ల‌న్న‌. ఆమెదేహాత్మ‌ల‌ను కాపాడిన‌వాడు. ఆమెమ‌న‌స్సు వైరాగ్య‌ము చేత‌పండిన‌ది. మ‌ల్ల‌న్న‌లేచిచోనామె జీవిత‌మింకొక‌ర‌క‌ముగ తెల్ల‌వారియుండెడిది. మ‌ల్ల‌న్న‌లేనిచో చంద‌వోలురాణి ఈనాటికిట్లుండెడిదికాదు. త‌ల్లియొత్తిడిచేత భ్ర‌ష్టురాల‌య్యెడిది.

రాజుడుంఠిశ‌ర్మ‌య‌ను త‌న చిన్న‌నాటి చెలికాని స‌హాయ‌ముతో రాణిని ర‌హ‌స్య‌ముగ త‌న‌భ‌వంతికి రప్పించుకొనుచుండ‌సాగెను. డుంఠిశ‌ర్మ జాంబ‌వ‌తి యింటికిని రాజ‌దుర్గ‌ముయొక్క ప్ర‌హ‌రీకిని స‌రిహ‌ద్దుగ‌నున్న దుర్భేద్య‌మైన ప్రాకార‌మును కొంత‌మేర ప‌గుల‌గొట్టించి య‌చ‌ట ఇనుప క‌వాట‌ములు పెట్టించిమార్గ‌మును క‌ల్పించెను. ఆమార్గ‌ముగుండ చంద‌వోలురాణిని పిలిపించుకొని రాజు ఆమెతో రాత్రులుగ‌డిపెడివాడు. దేశ‌మునేలెడి ప్ర‌భువుయొక్క‌గాని సుశీల‌య‌నియు భ‌క్తురాల‌నియు చెప్ప‌బ‌డు స‌రోజ‌లోచ‌న యొక్క‌గాని యీర‌హ‌స్య శృంగార‌ముయుక్త‌మా ? పాత్ర‌పోష‌ణ‌ములో నిచ‌ట కించిల్లోప‌ము క‌లిగెన‌నియున‌నిపించును. రాజును రాణియును దైవ‌ప్రేర‌ణ‌ము కార‌ణ‌ముకాగా క‌లుసుకొన్న‌వారు. ఆమెక‌త‌డు కృష్ణప్ర‌సాద‌ము.అత‌నికామె ల‌లితాప్ర‌స‌న్న‌త‌వ‌ల‌న ల‌భించుట జ‌రిగిన‌ది. ఇట్టివీరు, ర‌హ‌స్య‌ముగ‌ప‌రుల క‌న్నుగ‌ప్పి రాత్రులందు క‌ల‌సికొనుచున్నందువ‌ల‌న శ‌రీర‌సుఖ‌ముల‌కెక్కువ‌ ప్రాముఖ్య‌మునిచ్చిన‌ట్లుగుచున్న‌ది. ఇంత‌టిమేలైన దాంప‌త్య‌మైన వీరి యొక్క క‌ల‌యిక‌వ‌ల్ల నొక‌వంశోద్ధార‌కుడు ఉద‌యించిన‌చో నాపుత్రుడు దేశ‌మును మ‌రింత‌శుధ్ద‌ముగ పాలించుచున‌న్న కార‌ణ‌భూత‌మైన సంతాన‌ముకూడ రాణికి క‌లుగ‌లేదు. కేవ‌ల‌శృంగార‌ముగ‌కూడ ప‌రిణ‌మించ‌లేదు. లేదావ్య‌వ‌స్థాత్మ‌క‌మైన వివాహ‌ధ‌ర్మ‌ము వీరిరువురు బంధింప‌క మునుపే వీరిరువురి శ‌రీర‌ములేక‌ము లైన‌వి. జ‌నుల‌నిట్లు ప్ర‌తారింప‌జేయుట‌లోనున్న దోష‌మంత‌యు రాజున‌దే. రాణికిందున‌భాగ‌ముత‌క్కువ‌. ఆమెకు వివాహ‌ముగాని బంధ‌ముగాని య‌క్క‌ర‌లేదు. చెన్న‌కేశ్వ‌రుడాజ్ఞాపించెను గ‌నుక రాజుతో కాల‌ముగ‌డుపుచుండెను. లేకున్న నామెదృష్టిలో రాజున‌కుగాని పేద‌కుగాని భేద‌ములేదు. ఆమెధ‌న‌మునో య‌ధికార‌మునో వాంఛించియ‌త‌ని పొందుకోర‌లేదు. కొన్ని నెల‌లు రాజు రాణితో సుఖించిన త‌రువాత రాజామెను శాస్త్రీయ‌ము వివాహ‌మాడి రాణిని రాణివ‌లెకోట‌కు పిలిపించుకొనెను. ఈ వివాహ‌ము యొక్క ప్రయోజ‌న‌మొక్క‌టియే. అది చంద‌వోలురాణియ‌ను ఆమెపేరు సార్థ‌క‌మ‌గున‌ట్లుగ రాణినివ‌లె ఆమెను కోట‌కు ర‌ప్పించుకొందున‌న్న రాజుచేసిన వాగ్దాన‌మునెర‌వేరుట‌. ఆమె రాజున‌కుంపుడుగ‌త్తెవ‌లెగాక మ‌హారాణివ‌లె యంతఃపుర‌ము ప్ర‌వేశించిన‌ది. నిర్లిప్త‌త నిర్మోహ‌ముగ‌ల రాణికిదంత‌యు నొక‌నాట‌క‌ము. ఆమెత‌న‌పుట్టింట ఆహోరాత్ర‌ములు శ్ర‌మించిన‌ప్పుడెట్లుండునో అంతఃపుర‌వాసినియైన త‌రువాత కూడ‌న‌ట్లేయుండెను. వివాహ‌మైన త‌రువాత త‌న‌స‌ద్గుణ‌ముల‌తో స‌ప‌త్నుల‌ను గెలిచిన‌ది. ఆమె కాల‌మును వ్ర‌త‌ముల‌తో నియ‌మ‌ముల‌తో సంత‌ర్ప‌ణ‌ముల‌తో స‌మారాధ‌న‌ముల‌తో గ‌డుపుచెండెడిది.