59
 

పాణి గ్ర‌హ‌ణ‌మ్‌

మంత్ర‌ఘోష‌ల మ‌ధ్య అగ్నిసాక్షిగా మెడ‌లో మంగ‌ళ‌సూత్రం క‌డితే పెళ్ళి. దండ‌లు మార్చుకుంటే పెళ్ళి. ఇంతేకాదు చేయిప‌ట్టుకుంటే అందునా కుడిచేయి ప‌ట్టుకుంటే పెళ్ళి అయిపోన‌ట్లేట !

నూతిలోనుండి చేయిప‌ట్టుకుని పైకి లాగి ర‌క్షించిన పాపానికి ఆమె అత‌ణ్ణి నువ్వు నా ద‌క్షిన హ‌స్తం ప‌ట్టుకుని పాణిగ్ర‌హ‌ణం చేశావు క‌నుక నువ్వే నా భ‌ర్త‌వి అన్న‌ది. ఆమెని పెళ్ళాడ‌క అత‌డికి త‌ప్ప లేదు. అందునా అది కులాంత‌రం కూడాను. ఆమె  అంత‌టి గ‌డుగ్గాయి. అత‌డు ఆమె వ‌ల‌లో అంత తేలిక‌గా ప‌డ‌టానికి అమాయ‌కుడా ?   ఉహు. అంత‌క‌న్నా కాదు. ఇంత‌కూ ఆమె శుక్రాచార్యుల కుమార్తె దేవ‌యాని. అత‌డో న‌హుష చ‌క్ర‌వ‌ర్తి కుమారుడు య‌యాతి ! 

మ‌హాభార‌తంలో దేవ‌యాని పాత్ర మ‌హా చిత్రంగా ఉంటుంది. త‌న‌కు కావ‌ల్సిందాన్ని కొట్టోతిట్టో స్వంతం చేసికోవాల‌నే పసిపిల్ల మ‌న‌స్త‌త్వం దేవ‌యానిలో క‌న‌బ‌డుతుంది. ఇందుకు తండ్రి చేసిన గారాబ‌మే కార‌ణం.

తండ్రి శుక్రాచార్యుడు రాక్ష‌స‌రాజుకు గురువు. అస‌లు రాక్ష‌సుడే బ‌ల‌వంతుడు అందులో రాజు ఇంకా బ‌ల‌వంతుడు. ఆ రాజునే శాసించే గురువు ఇంకా బ‌ల‌వంతుడు. ఈ బ‌లం భుజ‌బ‌లం కాదు. బుద్ధిబ‌లం. ఆత్మ‌బ‌లం, త‌పోబ‌లం. ఇంత‌టి బ‌ల‌వంతుడైన వానిని క‌నుస‌న్న‌ల‌లో పెట్ట ద‌గ్గ మ‌హా మ‌హా బ‌ల‌శాలిని దేవ‌యాని ! ఈమెది ప్రేమ‌బ‌లం, పైగా తాను ఏది కోరితే దానిని తెచ్చి ఈయందే నిద్ర‌ప‌ట్ట‌ని తండ్రిని చూసుకుంటే త‌గ‌ని ధీమాగా ఉండేది. దేవ‌త‌ల గురువైన బృహ‌స్ప‌తి కుమారుడు రాక్ష‌స గురువైన శుక్రాచార్యుల ద‌గ్గ‌ర‌కు మృత‌సంజీవ‌నీ విద్య‌ను నేర్చుకోడానికి వ‌చ్చాడు. ఇందువ‌ల్ల శుక్రాచార్యుల గొప్పద‌నం అర్థం అవ‌డమే కాదు, విద్య‌ను నేర్చుకోడానికి శ‌త్రువునైనా ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌నీ, ఆశ్ర‌యిస్తే శ‌త్రువుల‌కైనా విద్య‌నేర్ప‌డ‌మే స‌ద్గురువు క‌ర్త‌వ్య‌మ‌నీ బోధ‌ప‌డ‌తుంది.

ఇలా తండ్రి ద‌గ్గ‌ర‌కు విద్య నేర్వడానికి వ‌చ్చిన క‌చుణ్ణి చూచి దేవ‌యాని మోజుప‌డుతుంది. మృత‌సంజీవిని దేవ‌త‌ల వ‌శం కావ‌డాన్ని రాక్ష‌సులు స‌హింప‌లేక క‌చుణ్ణి వ‌ధిస్తారు. దేవ‌యాని క‌చుణ్ణి చూడందే ఉండ‌లేన‌ని తండ్రిని బ్ర‌తిమాలి క‌చుణ్ణి తిరిగి బ్ర‌తికేలా  చేస్తుంది.

దేవ‌యానికి క‌చుడిపై ఉన్న‌,ప్రేమ మ‌మ‌కారం అత‌డిని ముమ్మారు బ్ర‌తికింప చేస్తుంది. క‌చుడు స్వ‌గృహానికి వెళ్ళిపోయే త‌రుణంలో అత‌డితో అంటుంది నువ్వు బ్ర‌హ్మ‌చారివి. నేను క‌న్య‌ను. నీకూ నాకూ మునుపే భావ‌జ శ‌క్తితో వివాహం అయ్యే పోయింది అని  దేవ‌యాని ఎంత‌గ‌డుసుగా మాట్లాడిందో చూడండి. పెళ్ళిచేసికోమ‌న‌లేదు ఎప్పుడో అయిపోయింది అంది. క‌చుడు బుద్ధిమంతుడు, గురువుల‌కు శిష్యులు పుత్రులు. అలాగ నేను శుక్ర‌పుత్రుణ్ణి నీవు శుక్ర‌పుత్రిక‌వి. నీవు నా సోద‌రివి అన్నాడు. అయినా దేవ‌యాని స‌రిపెట్టుకోలేక శాపం ఇచ్చింది. అత‌డూ ఆమెకో శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు.ఇక అంతటితో అత‌ణ్ణి మ‌ర‌చేపోయింది. ప్రేమా దోమా అంటూ శోకిస్తూ కూర్చోలేదు.

ఒక‌నాడు రాజ‌కుమార్తె, మ‌రి కొంద‌రు స‌ఖుల‌తోనూ స‌రోవ‌రంలో స్నానం చేసిన దేవ‌యాని పొర‌పాటున రాకుమార్తె శ‌ర్మిష్ట దుస్తుల‌ను ధ‌రించింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్ద‌రూ వాదులాడుకున్నారు. రాజ‌సంగ‌ల శ‌ర్మిష్ట దేవ‌యానిని నూతిలోకి తోసి వెళ్ళిపోయింది.

ఆ త్రోవ‌నే వెడుతున్న య‌యాతి మ‌హారాజు ఆమెను చేయిప‌ట్టి పైకిలాగి ర‌క్షించాడు. దేవ‌యాని కోపం తీర్చ‌డానికి శ‌ర్మిష్ట‌ని ఆమెకు దాసిగా చేశాడామె తండ్రి.

త‌రువాత కొన్ని రోజుల‌కు య‌యాతిని చూసి మోహించిన దేవ‌యాని మ‌ళ్ళీ క‌చుడు ద‌గ్గ‌ర పాడిన‌పాటే పాడింది. మ‌నిద్ద‌రికీ ఇదివ‌ర‌కే పెళ్ళ‌య్యింది క‌దా అని. కూప‌ము వెల్వ‌రించునాడు గ్ర‌మ‌యూక సాక్ష్య‌ముగా నున్న‌త ద‌క్షిణ పాణిజేసి భూపాగ్ర‌ణి నాదు ద‌క్షిణ క‌రాబ్జ‌ము వ‌ట్టితి కాన‌మున్ను పాణిగ్ర‌హ‌ణంబు సేసితి అన్న‌ది పైగా నీబోటి వాడికి విస్మ‌రించ‌డం త‌గునా అని ధ‌ర్మం న్యాయం చెప్పింది కూడా. నీవు బ్రాహ్మ‌ణివి నేను క్ష‌త్రియుడ‌ను ఈ వివాహం ధ‌ర్మ‌బ‌ద్ధం కాదు అని య‌యాతి మొత్తుకొన్నాడు. ఆమె వినిపించుకోలేదు. మీ తండ్రి వ‌చ్చి ఇది ధ‌ర్మ విరుద్ధం కాదు అంటే అప్పుడు పెళ్ళాడ‌తాన‌న్నాడు. తండ్రి కుమార్తెకు ప్రీతిచెయ్య‌డానికే వచ్చిన‌ట్లుగా వ‌చ్చాడు. కుమార్తె గారాలు పోయింది. చూడు నాన్నా మున్న గృహీత‌మై యున్న నా క‌ర‌ము ఇంకొక‌రికి అర్హంకాదు క‌దా నువ్వే చెప్పు అంటూ ప్ర‌శ్న‌లోనే స‌మాధానం వచ్చేలాగా చెప్పింది. అప్పుడు కుమార్తె కోసం శుక్రాచార్యులు రూల్సు మార్చేసి అప‌క్ర‌మ‌దోషంబు లేకుండుగాక అని వ‌ర‌మిచ్చేశాడు.

దేవ‌యానియోసంచేసిందా ?  లేదు య‌యాతి అమాయ‌కుడా ?  కాడు. ఆమె గ‌డుసుగా త‌న భ‌ర్త‌ను తానే వెతుక్కుంది. అత‌డు రాక్ష‌స గురువు శాపానికి వెరిచి ఆమెను చేపట్టాడు. ఇంత‌కన్న ఇంకొక ముఖ్య‌మైన విష‌యం కూడా వుంది. దేవ‌యానికి దాసిగా ఉన్న శ‌ర్మిష్ట సౌంద‌ర్యం య‌యాతిని ఆక‌ర్షించింది. అలా ఆక‌ర్షిస్తుంద‌ని శుక్రుడికికూడా తెల‌సు. అందుక‌నే శ‌ర్మిష్ట‌ను శ‌య‌న విష‌యంలో దూరంగా ఉంచ‌మ‌ని బోధించాడు.

దేవ‌యాని క‌న్న మ‌రి మూడాకులు ఎక్కువే తిని ఆ రాజును పెళ్లాండింది శ‌ర్మిష్ట అది వేరుగాథ‌.