పాలపొంగు
సావిత్రి తెల్లవారుఝామున ఫోన్ చేసింది. నిద్ర పూర్తిగా వదలిపోలేదు. జోగుతూనే రిసీవర్ ఎత్తి హలో అన్నాను. దీని మాటలు వినే సరికి నా నిద్రమత్తు కాస్తా వదలి పోయింది. ఏమిటి ? అంటూ సందేహం తీరక మళ్ళీ అడిగాను. ఏమీ లేదే ఓ ఇరవై గొబ్బిపిడకలూ, ఓ శేరు ఆవుపాలు పంపించు. మా ఆయన ఇప్పుడే బయలు దేరి మీ ఇంటికి వస్తున్నాడు అంది. గొబ్బిపిడకలు మా ఏరియాలో ఉన్న ప్రైవేట్ సూపర్ మార్కెట్‌లోగాని గవర్నమెంట్ సూపర్ బజార్‌లోగానీ దొరకవే. ఇకపోతే ఆవుపాల కోసం పాపం మీ ఆయన ఇరవై మైళ్ళు రావాలటే. మీ చుట్టుప్రక్కల దొరకవూ ? అన్నాను. అదేం సోద్యమే ఇద్దరు ఆడపిల్లలు మీ ఇంట్లో ఉండగా గొబ్బి పిడలక కోసం సూపర్ బజార్లలో వెదకమంటా వేమిటి అంది. తల్లీ ఇది హైదరాబాదు. తామరకొల్లు కాదు అన్నాను. మా మేనమామ కూతురు సావిత్రి. ఇటావలె పెళ్ళయ్యి హైదరాబాదు వచ్చింది. అంతకు ముందు దాకా ఓ శుద్ధ పల్లెటూర్లో ఉండి వచ్చింది. దీన్ని చూస్తుంటే మా పిల్లలందరికీ నవ్వు. ఆ మధ్యన ఇట్లాగే తెల్లారకట్ల మూడింటికి ఫోన్ చేసి అన్నాలు తిన్నారటే అంటూ మా అమ్మాయిని అడిగింది. అంటీకి మధ్య మధ్యలో పిచ్చెక్కుతుందా ఇప్పడు అన్నాలు తినడమేమిటి అని నన్ను లేపింది. దాంతో మాట్లాడాక అసలు సంగతి తెల్సింది. ఆ రోజు అట్లతద్దిట. అప్పటికే సావిత్రి లేచి మీగడ పెరుగులో అన్నం తినేసి, జడవేసుకుని చేమంతి పూలు పెట్టుకొని తాంబూలం సేవిస్తోందట ! ఇహ ఆడుకోవాలి అని భర్తని లేపుతుంఏ ఎంతకీ లేవడం లేదుట ! పోనీ మాటలన్నా ఆడదామని మాకు ఫోన్ చేసింది. నువ్వు పల్లెనించీవచ్చావు. మాకు అట్లతద్దులూ, ఉండ్రాళ్ళతద్దులూ, కార్తీక స్నానాలూ ఉండవు అని చెప్పదల్చుకోలేదు. కొత్తగా వచ్చింది రెండెళ్ళలో అదే తెల్సుకుంటుందని ఊరుకున్నాను. తెల్లవారి లేచాక ఒకటే హఢావుడి. బస్సులతో పోటీగా వరుగెత్తాలి ! బట్టలు ఇస్త్రీ చేసుకోవటం దగ్గర్నుంచి బజారు పన్లదాకా అన్నీ స్వయంగా చేసుకోవాలి. ఇక పండుగ సరదాలూ సంబరాలూ చేసుకునేంత మానసిక విశ్రాంతి ఉండనే ఉండదు అంతా యంత్రంలా రొటీన్‌గా రోజులు దొర్లించెయ్యటమే.
సావిత్రి ఆవుపాలూ గొబ్బి పిడకలూ అనే సరికి ఇవాళ రధసస్తమికి మా మామయ్య గారి పల్లెలో ఉండడం సంభవించింది. వాళ్ళ ఉత్సాహం భక్తీ గుర్తుకు వచ్చినప్పుడల్లా చెప్పలేని దివ్య అనుభూతి కల్గుతుంది. ఇవ్వాళ సూర్యుడి పుట్టినరోజు చేసినట్లుగా అందరూ సూర్యదేవుణ్ణి సంతృప్తిరచుస్తారు. లేస్తూనే వాకిట్లో కల్లాపు జల్లి రథం ముగ్గుకి ఓ తాడు లాగా గీసిన రథంముగ్గు వేస్తారు. అన్ని గుమ్మాల తాడు ఊరు చివరి దాకా సాగుతుంది. తలమీద తెల్ల జిల్లేడు ఆకులు పెట్టుకుని నూతిలో నీళ్ళు తోడుకుని చన్నీటి స్నానాలు చేస్తారు. తులసి గట్టకు రంగులు వేసి పసుపు కుంకుమలతో పూలతోను అలంకరించి సూర్యుడు పై కొస్తుండగా సంక్రాంతి నెల్లాళ్ళూ ఇంతి ముంగిళ్ళల్లో పెట్టిన గొబ్బెమ్మలని పిలడకలగా చేసిన వాటితో పేర్చి అగ్నిని రగిల్చి ఆవు పాలలో వండిన పాయసాన్ని సూర్యుడికి నైవేద్యంగా చేస్తారు. చిక్కుడు కాయల్ని కొబ్బరి పుల్లలతో గుచ్చి రథంలాగా తులసెమ్మదగ్గర పెడతారు. మనం భక్తిగా పూజిస్తే సూర్యుడు ఆ రథం మీదకు వస్తాడని వీళ్ళ నమ్మకంట. ఈ రోజు తరిగిక కూర వండకూడదట ! ఆ పాయసం రుచి గుర్తుకొస్తే అలాంటిది ఇంతవరకూ తినలేదనిపిస్తుంది. నిజానికి రథసప్తమి పాయసానికి ఉన్న రుచి మరి ఏ పాయసానికి ఉండదేమో !
సూర్యుడు రథం మళ్ళిస్తాడట ఈ రోజు అంటే ఎండాకాలం ప్రారంభమైనట్లే ! ఈ సౌరోపాసన వేదకాలంనాటి నుండీ ఉన్నది. నవగ్రహాలకీ అధిపతి సూర్యుడు.
ఋగ్వేదకాలంనుండీ సర్వశక్తిమంతుడు, సమస్త విశ్వవ్యాపకుడు, దుర్నిరీక్ష్యుడు, ప్రభాభాస్కరుడు, తేజోమూర్తి పిపీలికాది సమస్త చరా చర కోటి జీవనధాత, యావత్ర్పకృతికి ఆధారభూతుడూ, శాస్త్రధర్త అయిన ఆదిత్యుణ్ణి ఆరాధించడం అనవాయితీగా వస్తున్నదే. జగన్మాత అయన లక్ష్మీదేవి సూర్యమండల మధ్యస్త పరమేశ్వరునికి నేత్ర సమానుడు. సాక్షిన్నారాయణుడే సూర్యనారాయణగా పూజింపబడుతున్నాడు. అనాది నుండీ యజ్ఞరూపంలో అగ్నిగా ఆరాధింపబడుతున్నాడు. ఇప్పుడు యజ్ఞాలు చెయ్యకపోయినా చిరుదీపారాధనతో అగ్ని సాక్షిగా సమస్తార్చనలూ జరుపుకుంటన్నాము. ఈ ఆదిత్యుడు ఒక్కడే కాడు పన్నెండని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. మిత్ర రవి, సూర్య, ఖగ, పూష, హిరణ్యగర్భ, షరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరాది ద్వాదశనామాలు సూర్యునికే చెందినా హ్యత్పత్తుల్లో భేదాలుండటం గమనించివచ్చు. ఈ అగ్నిస్వరూపుడు స్థల నిర్దేశము లేనివాడు. మిత్రుడ, పగటికి వరుణుడు, రాత్రికి చిహ్నములు, ఉదయాన బ్రహ్మసముడు. మధ్యాహ్న మార్తాండుడ. శివసముడు సాయం సమయాన శ్రీ మహావిష్ణువు. విశ్వామిత్ర సృష్టియైన గాయత్రీమంత్రమునకు అధిదేవత సవిత్రమూర్తి అయిన అదిత్యుడే.
వాహినో అగ్న ఏనసే స్వాహా
పాహినో విశ్వ వేదసే స్వాహా
యజ్ఞం పాహివిభావసో స్వాహా
మాకు పాపముల నుండి బాధ కలగనీయకుండ రక్షింపుము. మాకు జ్ఞానమును సిద్ధింపజేయి. మా యజ్ఞమును రక్షింపుము. ఇలాంటి మంత్రాలు ఉచ్ఛరించకుండానే అమాయకంగా ఆడవారు రథసప్తమి నాడు పాలను పొంగిస్తూ సంప్రదాయాన్ని రక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో పాలపొంగులతో, సుఖసంతోషాలతో ఉండాలన్నదే ఈ పూజలోని ముఖ్యోద్దేశం. |