102
 

వైదిక ఋషులు ముఖ్యంగా ప్ర‌కృత్యారాధ‌కులు. మాన‌వ మ‌నుగ‌డ‌కు ముఖ్య‌ కార‌ణాలైన పృథ్వి, జ‌లము, వాయువు, అగ్ని, ఆకాశ‌ముల‌ను పంచ‌భూతాల‌ను ప‌ర‌మ‌భ‌క్తితో పూజించినారు. ఇంద్ర‌, వ‌రుణ అగ్రి, వాయువు, ఉషోదేవ‌త‌ల‌తో పాటుగ విష్ణు రుద్రుల‌కు స‌హిత‌ము ఋషులుకై మోడ్పు లందించినారు.

త్రీణి స‌దా విచ‌క్ర‌మే విష్ణుర్గోపా అదాభ్యః
త‌ద్విష్ణో ప‌ర‌మం ప‌దం స‌దా ప‌శ్యంతిశూర‌యః

ఈలాగున, చ‌తుర్ద‌శ భువ‌నాల‌నూ త‌న‌లో ధ‌రించి పోషించువాడు విష్ణువ‌నిన్నీ, ఐశ్వ‌ర్య ప్ర‌దుడున్నూ, ల‌య‌కారుడున్నూ, ప‌ర‌మేశ్వ‌రుడున్నూ అయిన‌వాడు రుద్రుడ‌నిన్నీ వేదఋషులు కీర్తించియున్నారు. ఇరువుర‌కున్నూమంత్ర‌ద్ర‌ష్ట‌లు భేద‌ము చెప్ప‌క పోయిన‌ప్ప‌టికిన్నీ కాల‌క్ర‌మాన శివ‌భ‌క్తుల‌కున్నూ విష్ణుభ‌క్తుల‌కున్నూ భేద‌భావ‌మంకురించి, స్ప‌ర్ధ‌ల‌ధిక‌మైన‌వి. మ‌త‌ముల పేరిట ప‌రస్ప‌ర దూష‌ణ‌ము కావించు కొనుచు, హింసాయుత‌మైన కార్య‌ములు చేయుట‌కు స‌హిత‌ము ఈ మ‌త‌మౌధ్యులు వెర‌వ‌కుండిరాయెను.

తంజాపుర ప్ర‌భువులు, శివ‌స్య హృద‌యం విష్ణుః విష్ణోశ్చ హృద‌యగ్ం శివః అనే మ‌హాభావాన్ని శిరోధార్యం చేసికొనిన‌ప్ప‌టికిన్నీ శ్రీ‌శ్రీ‌శ్రీ చిన చెవ్వ‌ప్ప భూపాలుర హృద‌య పీఠాన స్వ‌స్థుడైన ప్ర‌భువు ఈశ్వ‌రుడే అన‌వ‌లెను. తిరుమ‌ణ్ణామ‌లైలో వేంచేసి ఉన్న అరుణాచ‌లేశ్వ‌ర ఆల‌యానికి ఎత్తైన గోపుర‌ములు, ప్రాకార‌ములు, ర‌థ‌ములు, మంట‌ప‌మ‌లు, త‌టాక‌ములు, వ‌న‌ములు మొద‌లైన అర్ధ‌శ‌త నిర్మాణ‌ముల‌ను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో గావించిన‌డు. ఆ స్వామి కైక‌ర్యార్ధ‌ము విప్ర‌వ‌రుల‌కు అనేక భూఆగ్ర‌హార దాన‌ముల‌ను చేసినాడు. ఇలాగున‌నే వృద్ధా చ‌లేశ్వ‌రున‌కూ, శ్రీ‌శైలేశ్వ‌రున‌కూ, ఏకామ్రేశ్వ‌రున‌కూ శాశ్వ‌తానేక కైంక‌ర్య‌ముల‌ను చేసినారు. వేంక‌టాచ‌ల‌ప‌తి స్వామివారికి హేమ విమానాన్ని స‌ర్వ‌క‌ళాత్మ‌కంగా నిర్మింప‌జేసినారు.

శ్రీ‌శ్రీ‌శ్రీ ఆచ్యుత‌ప్ప మ‌హారాజుల‌వారు శ్రీ రంగ‌నాథ స్వామివారికి అశ్వ గ‌జ‌ర‌ధతుర‌గాదుల‌నేగాక సామంత‌రాజుల‌ను జ‌యించి తెచ్చిన స‌ర్వ సంప‌ద‌ల‌ను అర్ప‌ణ‌ము చేసినారుజ దివ్య విమానాన్ని విర‌చింప‌జేసి, ర‌త్న కిరీట‌మునూ, మ‌ణిమ‌య సింహాస‌న‌మునూ, వ‌జ్ర క‌వ‌చ‌మునూ, శంఖ‌చ‌క్ర గ‌దాది స్వ‌ర్ణాయుధ‌ముల‌ను, న‌వ‌ర‌త్న ఖ‌చిత కిరీట రాజ‌మును స‌మ‌ర్పించినారు. ప్ర‌తి సంవ‌త్స‌ర చైత్రోత్స‌వాన పేద‌ల‌కు ముక్త‌తులా పూరుష‌దానాన్ని వీరు త‌ప్ప‌నిస‌రిగా ఆచ‌రించేవారు. ప్ర‌తి దిన‌ము వేయిమందికి త‌క్కువ గాకుండ ఉచితాన్న దాన‌ములను అనేక గ్రామాల‌లోను ప‌ట్ట‌ణాల‌లోను ఏర్పాటు చేసిరి. అచ్యుత‌ప్ప నాయకుల హృద‌యం విష్ణువ‌రంగా మొగ్గుచూపింది.

శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ యువ‌ప్ర‌భువులు వ‌య‌సున చిన్న‌యైన‌ప్ప‌టికిన్నీ తండ్రి తాత‌ల హృద‌యాల నేలిన కేశ‌వునికి శ‌వునికి కూడా అనేక ఆల‌యాల‌ను క‌ట్టించి అర్చ‌న‌ల నిమిత్తం గ్రామ‌సీమ‌ల‌కు దానం చేస్తూ ఉన్నారు.

శివ‌భ‌క్తుల‌కు వైరాగ్య‌ము ప్ర‌ధాన‌ము. విష్ణుభ‌క్తుల‌కు భ‌క్తి ప్ర‌ధాన‌ము. ద‌క్షిణ భార‌త‌దేశాన నాయ‌నార్ల‌ను వారు శైవ‌మ‌త‌యునున్నూ, ఆళ్వార్లు అనువారు వైష్ణ‌వ మ‌త‌మునున్నూ ప్ర‌చార‌ము చేయ‌సాగిరి. దేశాల‌నేలు రాజులు ఏ మ‌త‌స్థులైనిచో క‌వులున్నూ ప్ర‌జ‌లున్నూ కూడ రాజ‌దండ‌మున‌కు వెర‌చి త‌న్మ‌తావ‌లంబ‌కులే అగుచుండిరి. ఆళ్వారుల‌చే పోషింప‌బడుచున్న ప‌ర‌మ పౌరాణిక మ‌త‌మైన వైష్ణ‌వాన్ని శ్రీ‌శ్రీ‌శ్రీ రామానుజాచార్య గురుపాదులు విశిష్టాద్వైతముగా ప్ర‌తిపాదించి యున్నారు. రామానుజుల వారి శ్వేత‌చ్ఛ‌త్ర‌ము క్రింద శ్రీ వైష్ణ‌వ‌ము ద్రావిడ దేశాన్ని అధిగ‌మించి స‌ర్వ భార‌తావ‌నినీ ఆక్ర‌మించ‌గ‌లిగిన దాయెను. ఆశ్వారులు ర‌చించిన నాలుగు వేల పాశుర‌ముల‌ను ద్ర‌విడ వేద‌ము అను పేర ప్ర‌జ‌లు విస్తార‌ముగ ఆద‌రించ‌సాగిరి.

బ్ర‌హ్మ‌వైవ‌ర్త పురాణ‌ములోను, గ‌ర్గ పురాణ‌ములోను చెప్ప‌బ‌డిన శ్రీ కృష్ణ ప‌ర‌బ్ర‌హ్మ‌మే శ్రీ మ‌హావిష్ణువ‌ని వైష్ణ‌వుల గాఢ‌న‌మ్మ‌క‌ము. ఊర్ధ్వ లోక‌ముల‌న్నింటి కంటె ఊర్ధ్వ‌మైన లోక‌ము గోలోక‌ము. ప‌దునాలుగు భువ‌నాల‌లోని స‌ర్వ స‌మ్మోహ‌న‌క‌ర‌మైన సౌంద‌ర్యం అంతా ఆ గోలోకంలోనే నిక్షిప్త‌మైయున్న‌ది. ఆ జ‌గ‌దేక సుంద‌ర లోకాన్ని ఏలే మ‌హాప్ర‌భువైన కృష్ణ భ‌గ‌వానుడు వేయిమంది శేషువుల వేవేల నాల్క‌ల‌తోనైనా వ‌ర్ణించ‌న‌ల‌వి కానంత రూప సంప‌ద‌తో, పిపీలికాదా బ్ర‌హ్మ ప‌ర్యంత‌మూ ఉన్న సర్వ జీవ‌రాసుల‌నూ త‌న సుంద‌ర రూపంతో ప‌ర‌మాక‌ర్ష‌ణీయ‌మైన వేణుగానంతో, త‌న వైపున‌కు స‌న్నిక‌ర్షం చేసికొంటూయున్నాడు. ఆ జ‌గ‌మేలే ప‌ర‌మాత్మ యొక్క హృద‌య ప‌ద్మ‌పీఠ‌స్థ ప్రేమ స్వ‌రూపిణి, ఆ చ‌క్క‌న‌య్య‌క‌న్న ప‌దింత‌లు చ‌క్క‌నైన క‌న‌క వ‌ర్ణాంగి, ప్ర‌కృతి మాత‌కు క‌న్న‌తల్లి, .జ‌గ‌దాంబ‌, విశ్వ‌జ‌న‌ని రాధాదేవి. ఈ రాధాదేవియే ల‌క్ష్మి, పార్వ‌తి, శార‌దా, ర‌తీదేవి. ఈమె స‌ర్వ‌దేవ‌తా స్వ‌రూపిణి. శ్రీ‌కృష్ణుడున్నూ రాధ‌యున్నూ ఒక్క జీవిక‌యొన‌రించు ఉచ్ఛ్వాస నిశ్వాస‌ప్రాయులుగా ఎడ‌బాయని జంట‌గా ప‌ర‌స్ప‌ర‌ము నిమేష‌ములోని శ‌తాంశ‌కాల‌మైన‌ను విడ‌చి మ‌న‌జాల‌ని ప్రేమ‌స్వ‌రూపులుగా కీర్తింప‌బడుతూ ఉన్నారు. ఈ గోలోక‌ములోని గోవులు గోపాల‌కులు కృష్ణుని దేవేరియైన రాధ రోమ‌కూప‌ముల‌నుండి జ‌నించిరి.