107
 

రామ‌భ‌ద్రాంబ వారిన‌డిగితే ? నా మ‌నోనాథులెక్క‌డ ? నా ఆత్మ విభులెందు చేత నాప‌ట్ల ఇంత నిర్ద‌య‌ను ద‌య‌చేస్తూ ఉన్నారు ? అని అడిగితే ? ఎంత లోకువ ? స్త్రీ త‌న హృద‌యాన్ని ఎన్న‌డైనా మాట‌ల‌తో బ‌హిర్గ‌తం చేయ‌గ‌ల్గునా ? ఎందుచేత స్త్రీ హృద‌యం పై ఇంత వ్రీడాభారాన్ని మోపినాడు భ‌గ‌వంతుడు ? అలాగ అడ‌గ‌డం నావ‌ల్ల‌కాదు. నా ప్ర‌ణ‌యేశ్వ‌రుని చూడ‌కుండా మ‌న‌గ‌ల‌డం భార‌మైపోతూన్న‌ది. ప్ర‌భూ ! ప్ర‌భూ ! శుక‌వాణి క‌న్నీళ్ళ‌తో ప‌ట్టుదిండ్లు త‌డిసి ముద్ద‌లైన‌వి.

ద‌శ‌విధ మ‌న్మ‌ధావ‌స్థ‌ల‌లో మూడ‌వ‌ది అయిన సంక‌ల్పం వ‌ల‌న నాయిక నిదుర‌కు దూర‌మైన‌ది. స‌హ‌జంగా కృశాంగియైన గోదాదేవి రాత్రి జాగ‌ర‌ణ‌ల‌తో మ‌రింత‌గా కృశించిన‌ది. ఆమెకు దేనిపైన‌ను ప్రీతిలేదు. భోజ‌నాదిక‌ములు మరింత‌గ ప‌రిమిత‌మైన‌వి. చ‌తుస్తాళ‌, చ‌తుష్కాల ప‌ద‌గ‌తులు మంద‌గించిన‌వి. ఆభ‌ర‌ణాల భార‌ము అధిక‌మైనందున స‌ఖియ‌లు పుష్పాభ‌ర‌ణాల‌ను మాత్ర‌మే అలంక‌రించినారు. ఓ కుసుమ కోమ‌ల ల‌లితాంగీ ! ఈ కేశ‌భారాన్నెలా మోస్తావో తెలియ‌కుండా ఉంది. ఆ కేశ‌వుడు కాస్త సాయానికి రారాదా ? అని మేల‌మాడి ఆమె హృద‌య భారాన్న‌ధికం చేసినారు. రంగ‌నాధునికె ప‌రిత‌పించు గోదాదేవి మ‌న‌స్థితికిన్నీ, ర‌ఘునాధుల‌కై ప‌రిత‌పించు శుక‌వాణి హృద‌యావ‌స్థ‌కున్నూ అభేదావ‌స్థ సంక్ర‌మించిన‌ది. మ‌హారాజుల వారు అత్యంత ఆస‌క్తిగా, ఆనందంగా నాట్యాన్ని మ‌హావ‌త్ర దీక్ష‌తో వీక్షించ‌కుండా ఉన్న‌ట్లాయెనా శుక‌వాణీదేవి మంజీర నిక్వాణ‌ములు ర‌వ‌ళించేవికావు. ఆమె కాలియందెలు ఘ‌ల్లుమ‌ని ప‌ల్ల‌వించేవి కావు. అంత‌గా శుక‌వాణి స్త‌బ్ధురాలై, మందోత్సాహ‌యై, నిరుత్సాహ నిర్వేదావ‌స్థ‌లో మహా దుఃఖ స‌ముద్రాన మున‌క‌లిడుతూ ఉండెను.

ధృజ్ఞ్మ‌న‌స్సంగ సంక‌ల్ప జాగ‌రః కృశ‌తార‌తిః
హ్రీత్యాగో..........అన్న‌ట్లుగా ల‌జ్జాత్యాగ‌ము చేసి ప్రియుని నామ‌మే ప‌దే ప‌దే జ‌పించుచున్న గోదాదేవి పై చెలియ‌లు జాలి చెంది, పెంపుడు కోయిల‌ల‌ను ప్రియుని చెంత‌కు రాయ‌బార‌మంప‌మ‌ని హితోప‌దేశ‌ము చేసిరి.

చిన్న నాట నుండి క‌నుల‌కు రెప్ప‌లాగా కాపాడుకొన్న కోయిల‌ల‌ను శ్రీ విష్ణుమూర్తుల చెంత‌కు రాయ‌బార‌మంపిన‌ది, గోదాదేవి.

ఓసీ కోకిల‌మ్మా ! ఇంత‌దానినింత‌దాన‌ను చేసినాను కాద‌టే ?

కాద‌న్న దెవ‌ర‌మ్మా ! ఏమి ఆజ్ఞాపింతువో తెలిపేది.

నా మాన‌స‌చోరుని, సుంద‌ర మందార‌హారుని, కోటిమ‌న్మ‌ధాకారునిన‌ను ద‌య‌చూడ‌మ‌ని చెప్పిరాగ‌దే. మ‌రి వేగ పోరాగ‌దే !

జ‌గ‌న్మోహ‌న రాగాలాప‌న‌లో రాగిణియై న‌ర్తించిన‌ది శుక‌వాణి.

ఆవ‌స్యం పోయివ‌త్తున‌మ్మా ! నీ విభుడుండేది ఏడ‌న‌మ్మా !

పాల‌సంద్ర‌పుట‌ల‌ల‌లో పాము ప‌డ‌గ‌నీడ‌లో ప‌వ్వ‌ళించెనె నా స్వామి పోయిరాగ‌దే . మ‌రివేగ పోయిరాగ‌దె.

అయ్యో, ఇదేమివింత తల్లీ ! గుక్కెడుపాలు ఎక్కువ గ్రోలితే క్ర‌క్క‌ద‌నంటావే, వాన‌పామును చూసి జ‌డుచుకుంటావే. పాల‌క‌డ‌లిని కొమ్మ‌రోనువు కాపుర‌మ్మెట్లు సేతువే ఎలా పాము ఒళ్ళో వెళ్ళ‌దీస్తావే అమ్మ‌రో ? అయినా మాకెందుకుగాని ఇంత‌గా వేగిపోతున్నావే. ఆ మ‌హానుభావుడి రూపం ఎలా ఉంటుందో కొంచం గుర్తులు తెలిపేది.

మెడ‌లో.....మెడ‌లో....

ఊ.....మెడ‌లో ?

తుల‌సీద‌ళ‌హార‌ము....

ఒహోహో...... ! ఆకుల‌ల‌ముల‌ను ధ‌రించే అడ‌వి మానిసా ఏమిట‌మ్మా ?

ఉహూ, కాదే కౌస్తుభ‌మ‌నే పెద్ద‌మ‌ణికూడా ఉంటుంది.

రాళ్ళూర‌ప్ప‌లుకూడా ధ‌రిస్తాడ‌న్న‌మాట‌. త‌రువాత ?

నీల గంభీర‌ప‌యోధి తుల్య ఘ‌న‌శ్యామాంగుడున్నూ, ప‌ద్మ‌ప‌త్రాయ‌తాక్షుడున్నూ...

ఉండు త‌ల్లీ ఉండు...న‌ల్ల‌నివాడున్నూ, ఎఱ్ఱ‌ని క‌న్నుల‌వాడున్నూ ఇదేమి అందం త‌ల్లీ రాక్ష‌సునివ‌లె నాకు గోచ‌రిస్తూ ఉన్న‌డే..

పిల్ల‌న‌గ్రోవిపై భువ‌న‌మోహ‌నంగా రాగాలాపన చేస్తూ వ్య‌త్య‌స్థ పాదార‌విందుడైన గోపాలుని నా మాన‌స‌చోరిని......