166
 

వేంక‌ట : నిజ‌మే ! ఏ దేశ‌మేగినా వీరి మ‌ధ్య‌వైరం అజ‌రామ‌రం...

సంఘి : కాని, పోను పోను, పాండ్య‌రాజ్యం అంత‌రించి, చోళ‌రాజ్యం మా దేశాల‌ను కొన్నిట‌ని స్వాథీన‌ప‌ర‌చు కొన‌గ‌లిగిన‌ది. ఈలాగున సింహ‌ళ‌దేశం స్థానికుల పాల‌న‌లో కొంతభాగం, త‌మిళుల పాల‌న‌లో కొంత‌భాగం విడిపోయింది. అందుచేత ఉత్త‌ర సింహ‌ళాన్ని, త‌మిళ సింహ‌ళం అని అన‌డం కూడా క‌ద్దు.

వేంక‌ట : అయితే ఇక్క‌డ హిందూసాంప్ర‌దాయాలు..

సంఘి : ఆ ! ప‌ద‌కొండ‌వ శ‌తాబ్ద‌ము నుండి మా దేశ‌ము హిందూదేవాల‌యాల‌తోను, హిందూదేవ‌త‌ల విగ్ర‌హాల‌తోనూ, శిల్ప క‌ళా సౌంద‌ర్యంతోను ఓల‌లాడిపోతున్న‌ది. విజ‌య‌బాహు ప‌రాక్ర‌మ‌బాహువంటి ధీరోదాత్తులైన ప్ర‌భువ‌లు దేశాన్ని చ‌క్క‌గా పాలించ‌న‌ప్పటికిన్నీ ప‌ర‌దేశీదాడుల‌ను అణ‌చాడానికే వీరిశ‌క్తీకాల‌మూ స‌రిపోయేవి. చివ‌ర‌కు చీనాదేశ‌ము నుండి కూడ మాకు దాడి తప్ప‌లేదు. ప‌దునాలుగో శ‌తాబ్దంలో మా ప్ర‌భువునే చైనీయులు బందీచేసి తీసుకొనిపోయినారు. ఎప్పుడూ సింహ‌ళం చ‌క్కగా పండిన పండులాగా విదేశీపాల‌కుత‌కు నోరు ఊరిస్తూ ఉంటుంది. మా దేశ‌సంప‌ద‌కు వారిక‌న్నులు కుడుతూనే ఉంటాయి. ఏ దేశ‌ప్ర‌భువు శిర‌స్సుపైనున్న కిరీటం చూసినా మా దేశాన్నుంచి త‌ర్లించుకోపోయిన వ‌జ్ర‌మాణిక్యాలే అగుప‌డ‌తాయి !

వేంక‌ట : సంఘిల‌క‌ప్ర‌భూ ! సింహ‌ళ‌దేశం చిన్న‌దే అయినా చ‌రిత్ర చాలా పెద్దిదిగా ఉన్న‌ది సుమా !

సంఘి : అంతేనా మిత్ర‌మా, బాధాక‌రంగాలేదా ? మ‌హాప్ర‌భూ, నేను సాటి సామంత రాజుల‌నుగాక త‌మ‌ను శ‌ర‌ణు వేడ‌డంలో అంత‌రార్ధం మీకు అవ‌గ‌త‌మయ్యే ఉంటుంది. మా జాఫ్నారాజ్య ప్ర‌జ‌ల భాష‌, సంస్కారం, మ‌తం, వేషం, సంప్ర‌దాయం, పెండ్లి, పేరంటం అన్నీ మీ దేశం వారివ‌లెనే ఉంటాయి. అందుకే మ‌మ్ముల‌ను ఇత‌ర సింహ‌ళీయులు త‌మిళ రాజ్యాల‌ను చూసిన‌ట్లు పెర‌వారిగానే చూస్తారు. ఇందుకే మిమ్మ‌లను సాయంకోర‌డ‌మే త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌ని మా మంత్రులు చెప్పినారు.

ర‌ఘు : ఎందుకింత వ్య‌ధ‌. సంఘిల‌క ప్ర‌భూ ? వేరు మాట‌లెందుకు ? మీ నుండి మాకు ప్ర‌తి సంవ‌త్స‌ర‌ము క‌ప్ప‌మువ‌స్తూ ఉండాగా, మీ రాజ్య‌ర‌క్ష‌ణ భారం మాదికాకుండా పోతుందా ?

శ్రీ‌శ్రీ‌శ్రీ రఘునాథ మ‌హారాజులు బోధించిన ధైర్య‌స్థ‌యిర్యాలు జాఫ్నా ప్ర‌భువు సంఘిల‌కున‌కు మిక్కిలి ఊర‌ట క‌లిగించిన‌ది.

చిదంబ‌ర‌దాసు అతి నిశితంగా నౌకాద‌ళ‌మును పారికిస్తూ, వ్యూహ ర‌చ‌న‌క‌నువుగ ప‌డ‌వ‌లు గమ్యాన్ని చేరులాగున అన్ని ఏర్పాట్లుగావిస్తూ ఉండెను. శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ మ‌హారాజులు అత‌ని వ్యూహ‌కౌశ‌ల్యాన్ని గ‌మ‌నిస్తూ ఉండిరి.

దాసూ, ఈలాగి గుండ్ర‌ని ప‌డ‌వ‌ల‌ను పాంబం నుండి గాక తొండి తీరాన్నుండి ఎందుకొర‌కు పంప‌వ‌ల‌సి వ‌చ్చిందో ? అని వేంక‌ట‌ప‌తి ఎరుగ‌గోరెను.

అయ్యా ఈ గుండ్ర‌ని పడ‌వ‌లు ఎక్కువ బ‌రువు మోయ‌డానికి మిక్కిలి ప్ర‌శ‌స్తంగా ఉంట‌వి. మ‌రిన్నీ గుండ్రని ప‌డ‌వల్లో ఆహార‌ప‌దార్ధ‌ములు, ఆయుధాలు యున్న‌గు సామ‌గ్రిని చేర‌వేయ‌డం సులువు. వీటి నిర్మాణంలో ఈసారి బెస్త‌లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకొన‌డ‌మేగాక‌, గొప్ప బుద్ధి కౌశ‌ల్యాన్ని కూడా తోడు చేశారు. ఈ గుండ్ర‌ని ప‌డ‌వ‌ల‌ని పుట్లు అని అంటారు. ఈ పుట్లుకూడా, పొడుగు ప‌డ‌వ‌ల‌వ‌లె వేగంగా ప్ర‌యాణించ‌డానికి చాలా అనుకూలంగా ఉండ‌డ‌మేగాక‌, కోసుప‌డ‌వ‌ల కంటె వేగంగా ప‌య‌నించ‌గ‌ల‌వు ప్ర‌భూ, ఈ పుట్లు మీద అశ్వ‌ద‌ళాన్ని కూడా ఎంత పెద్ద న‌దినైనా దాటించ‌వచ్చుగాని, సముద్రంలో అల‌ల తాకిడివ‌ల‌త‌న ఇది సాధ్యంకాదు. చెక్క‌ల‌ను వ‌రుస‌గా అమ‌ర్చి, ఇనుప‌మేకుల‌తో బంధించిన త‌రువాత‌, చుట్టూ వేప‌బెత్త‌ముతో అల్లిక చేయించి, నీరులోనికి జొర‌కుండా ప‌శుచ‌ర్మాల‌ను తాప‌డం చేయించి ఈ తెప్ప‌లు నిర్మించాము. ఇవి కూడా ఎంత పెద్ద బ‌రువు వేసినా మునిగిపోవు. అంచులు ఉన్న తెప్ప‌లు న‌ల‌బ‌దివేలున్నూ, అంచులు లేని తెప్ప‌లు ఎనుబ‌ది వేలున్నూ సిధ్ధ‌ప‌ర‌చినాము. ప్ర‌భువులున్నూ సేనానాయ‌కులున్నూ ప్ర‌యాణించ‌డానికి పెద్ద నౌక‌లు సిద్ధ‌ముగా ఉన్న‌ది చిదంబ‌ర‌దాసు నావికాద‌ళ వివిర‌ణ ఇచ్చి, ఏప‌డ‌వ‌లు ఏ మార్గాన ఏలాగున ప‌య‌నించ‌వ‌లెనో విన్న‌వించినాడు.