165
 

సంఘిల‌క ప్ర‌భువుల‌కు...ర‌వ్వంత‌రోష‌ము వ‌చ్చిన‌ది. ఈ ప్ర‌శ్న త‌న ధైర్య‌సాహ‌సాల‌ను కించ‌ప‌ర‌చేదిగా ఉంది. కాని వేంక‌ట‌ప‌తిక‌వి త‌న‌ను చిన్న పుచ్చేందుకు అడిగి ఉండ‌డు. అత‌డు మిక్కిలి స‌హృద‌యుడు, కాగా శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ మ‌హారాజులు కూడ త‌న వివ‌ర‌ణ వినేందుకు సంసిద్ధులై న‌ట్లుగ‌, ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తూ ఉండిరి. సంఘిల‌కుని వ్య‌ధ‌ను తేలిక‌ప‌ర‌చ‌ద‌ల‌చిరి.

ర‌ఘు : పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా ప్ర‌ధ‌మంగా కాలిక‌ట్టు చేరినప్పుడు, అక్క‌డి పాల‌కుడు, జామొరిన్ పోర్చుగీసుల‌కు వ‌ర్త‌క కేంద్రం ఏర్ప‌రచుకొన‌డానికి అనుమ‌తి నివ్వ‌డ‌మే, మ‌న దేశీయులు చేసిన మొద‌టి త‌ప్పు, పోర్చుగీసు అక్క‌డ త‌మ కేత‌నం పాతి, ప‌డ‌మ‌టి కోస్తా వెంబ‌డి కొచిన్‌, గోవా, డ‌యు, దామ‌న్, పాల్సెట్టి మొద‌లైన ప్రాంతాల్లో కూడ వ‌ర్త‌క‌స్థావ‌రాల పేరుతో యుద్ధ‌స్థావ‌రాల‌నే ఏర్ప‌ర‌చుకొన్నారు. తూర్పు తీరాన శాన్‌థోమ్‌చ నాగ‌ప‌ట్ట‌ణం, బెంగాలు సీమ‌లో హుగ్లీ, ఇవేగాక‌, పార‌శీక సింధుశాఖ నుండి మ‌ల‌యావ‌ల‌ర‌కూగ‌ల హిందూ మ‌హాస‌ముద్ర రేవుల‌న్నీ కైవ‌శం చేసుకోగ‌లిగారు. మ‌న‌వంటి వారి చేతుల్లో చావుదెబ్చ తిన్న త‌రువాత‌గ‌దా వారికి ఇక్క‌డ తావులేకుండా పోయింది !

సంఘి : అవును, ప్ర‌భూ ! వారు హిందూదేశానికి వ‌చ్చిన త‌ర్వాత‌, ఏడేళ్ళ‌ను పోర్చుగీసు నావ ఒక‌టి తుఫాను తాకిడికి లోనైంది. అది గాలివాటానికి సింహ‌ళ‌ద్వీపానికి కొట్టుకొని వ‌చ్చింది. అప్ప‌ట్లో కొట్టె...అనే ప‌ట్ట‌ణం రాజ‌ధానిగా ఉండేది అలాగ వ‌చ్చిన పోర్చుగీసు నావికుల‌కు సింహ‌ళీయులు ఆరుదినాలు చుట్టుదారుల్లో ప్ర‌యాణం చేయించి చ‌క్ర‌వ‌ర్తిక‌డ‌కు తీసికొని వెళ్ళారు. అప్ప‌డు క‌ఫ్తాను త‌మ పోర్చుగోసు వారు మా సింహ‌ళ‌దేశంతో వ్యాపారం చేసుకోడానికి చ‌క్ర‌వ‌ర్తి అనుమ‌తిని కోరాడు. సింహ‌ళ‌దేశ స‌రిహ‌ద్దు తీరాల‌ను పోర్చుగోసులు ప‌రిర‌క్షించేట‌ట్లునూ, ఇక్క‌డి పండిన దాల్చిన చెక్క‌, ఏల‌కీ ఫలాలు, ల‌వంగ మొగ్గ‌లు వారి దేశానికి ఎగుమ‌తి చేసుకొనేట‌ట్లునూ ఒడంబ‌డిక చేసుకొన్నారు. నాటి చ‌క్ర‌వ‌ర్తి పేను జ్ఞాప‌కం ...రావ‌డంలేదు.

వేంక‌ట : ఆ! త‌ర్వాత ....ఏమైంది ?

సంఘి : ఈ బ‌డంబ‌డిక‌వ‌ల్ల మా దేశంలో విదేశీయుల‌కు హ‌క్కులు, అధికార‌ములు ల‌భించాయి. వారు క్ర‌మ‌క్ర‌మంగా రాచ‌కుటుంబాల్లో క‌ల‌హాలు క‌ల్పించ‌డం, ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌డం, ప్ర‌భుత్వ‌కార్యాల‌లో జోక్యం క‌లుగ‌జేసుకోవ‌డం ప్రారంభించారు.

ఒక‌నాడు ఒక పోర్చుగోసుమ‌తాధికారి ఒక చ‌క్ర‌వ‌ర్తితో...ఆయ‌న పేరు ధ‌న‌పాలుడ‌ని జ్ఞ‌ప్తి...న‌ర‌కాన్ని గురించి ప్ర‌సంగిస్తూ, న‌ర‌కం ఎంత భ‌యంక‌రంగా బాధాక‌రంగా ఉంటుందో వ‌ర్ణించి చెప్పాడు. ధ‌న‌పాలుడికి న‌వ్వొచ్చి అయ్యా ! త‌మ‌రు న‌ర‌కాన్ని య‌ధాత‌థంగా వ‌ర్ణించిన‌ట్లేనా ? న‌ర‌కం ఇలాగే ఉంటుందా ? అని ప్ర‌శ్నించాడు. చిత్తం మ‌హాప్ర‌భూ ! నూటికి నూరుపాళ్లూ ఇలాగే ఉంటుంది. ఇందులో అణుమాత్ర‌మైన అబ‌ద్దంలేదు అన్నాడా మాతాధికారి. వెంట‌నే చ‌క్ర‌వ‌ర్తి న‌వ్వుతూ అయితే త‌మ‌రు చూచి ఎన్ని నాళ్ళ‌యిందో ! ఈపాటికి ఏ కొద్దిమార్ప‌యినా రాకుండా ఉంటుందంటారా ? అనేస‌రికి అక్క‌డ స‌భ‌లో ఉన్న‌వారంతా ఫ‌కాలున న‌వ్వినారు. ఆ మ‌త‌భోధ‌కుడు రాయ‌బారికూడాను. త‌న ఆగ్ర‌హాన్ని లోలోన అణ‌చుకొని ప‌ళ్ళు నూరుకొన్నాడు. ఆ త‌రువాత చ‌క్ర‌వ‌ర్తి అంగ‌ర‌క్ష‌కున‌కు వేల బంగారు నాణాల‌ను ఎర‌చూపి, రాజును చంపించి, అత‌ని త‌మ్ముడు మాయ‌ధునికి ప‌ట్ట‌ము గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నించాడు....

వేంక‌ట : వాడు మ‌త‌బోధ‌కుడు కాడు. కిత‌వుడు ద్రోహి...పాపి !

సంఘి : ప్ర‌జ‌ల‌కు ధ‌న‌పాలుడు ఎంతో ఇష్టుడు. ఆయ‌న‌ను హత్య చేసిన పోర్చుగీసుపై ఆగ్ర‌హం చెందారు. వారి ఆయుధ‌బ‌లాన్ని చూసి భీతి చెందారు. మిన్న‌క ఉండిపోయారు. ఆ త‌రువాత ధ‌ర్మసింహుడు సింహాస‌నం అధిష్టించినాడు, పోర్చుగీసు వ‌ల‌లో ప‌డ్డాడు, త‌న పేరునూ, త‌న రాణీ పేరునూ పోర్చుగీసుకు అనుగుణంగా మార్చుకొన్నారు. ధ‌ర్మ‌సింహుడు డాన్‌జాన్ అయాడు. అత‌ని రాణి డోనాదేథ‌రీనా అయింది. ఇక ప్ర‌జ‌ల సంగ‌తి వేరుగా ప్ర‌స్తావించ న‌క్క‌ర‌లేదుక‌దా !...

వేంక‌ట : అవును, పాల‌కుడే ప‌త‌నం అయాక‌,, ఇక ప్ర‌జ‌లు...

సంఘి : దేశంలోని రాజ‌కీయ ప‌రిస్థితులు ఇలాగ ఉన్నా, ప్ర‌జ‌లు మాత్రం బౌద్ధ మ‌త‌మును శిరోధార్యంగానే భావించినారు. ఇలారుడ‌నే హిందూ వీరుడు భార‌త‌దేశానుండి లంక‌పై దాడిచేసి, న‌లుబ‌ది నాలుగేండ్లు రాజ్య‌పాల‌న చేశాడు. ఇత‌డు బౌధ సింహ‌ళ క‌న్య‌ల‌ను పెండ్లాడి నాడు. ఇలాగే ద‌క్షిణ‌భార‌త‌దేశాన్ని పాలించే పాండ్యులూ చోళులూ కూడ సింహ‌ళ‌దేశాన్ని ఏలాల‌నే వాంఛ‌తో దండ‌యాత్ర‌లు చేస్తూడేవారు. మా దేశంలో కొన్ని రాజ్యాల‌ను పాండ్యులు, కొన్ని రాజ్యాల‌ను చోళులు వ‌శం చేసుకొని, ఒక‌రినొక‌రు జ‌యించాల‌నే కాంక్ష‌తో నిరంత‌రం యుద్ధాల‌ను చేస్తూ ఉండేవారు. వీరిరువుర మ‌ధ్య భార‌త‌దేశంలో యుద్ధం సంభ‌వించిన‌ప్పుడ‌ల్లా సింహ‌ళాన‌కూడా యుధ్ధాలు జ‌రుగ‌వ‌ల‌సిందే!...