వాల్మీకి రామాయణము, భాసనాటకాలు, కాళిదాసు నాటకాలు, కావ్యాలు, భవభూతి నాటకాలు, బాణుడు, మాఘుడు, శ్రీ హర్షుడు, దండి, భారవి, భర్తృహరి, మురారి, రత్నభేట దీక్షితులు, అప్పయ దీక్షితులు, గంగాదేవి, కులశేఖరులు మొదలగువారు రచించిన దివ్య కావ్యాదులు ఆ గృహంలో ఉన్నాయి.
గంగాదేవి రచించిన మధురా విజయమూ, కాళిదాసు కావ్యాలు, భవభూతి ఉత్తర రామచరిత్ర తానున స్వయంగా రాసుకొన్నది.
ఉత్తర రామచరిత్ర జ్ఞప్తికి రాగానే తన రఘునాథనాయకుడు తన మనోఫలకాన దివ్యమూర్తిగా ప్రత్యక్షమైనాడు. కోర్కెలు చిక్కబడుతున్న ఆ బాలికకు, తాను పూర్ణయవ్వన అయినట్లుగా, రఘనాధుడు తన్ను వరించినట్లు, తామిద్దరు శృంగారకేళీ మంధిరంలో ఒంటిగా ఉన్నట్లు రఘునాధుడు తన్ను బిగియార కౌగలించినట్లు, సువ్వున ఎత్తితన్ను తల్పముపై తన ప్రక్కన చేర్చినట్లు తోచి పారవశ్యం పొందింది.
కిమపి కిమపి మందం మందమానస్తి యోగా
దవిరళఙతకపోతా జల్పతోరక్రమేణ,
అశిధల పరిరంభవ్యాపృతై కెకైక దోషో
రవిదితగత యామారాత్రి రేవవ్యరం సీత్.
అన్న పరమ మధుర శ్లోకమామె హృదయంలో తోచింది. ఒకరి కొకరి మీద ఉండే ఆసక్తిచేత ఏవో అర్థంలేని మాటలు ఆడుకుంటూ, ఒకరి నొకరు బాహువులతో గాఢపరిష్వంగం జేసికొని, జాములు ఎలా గడిచినలో తెలియకుండా రాత్రి అంతా ఇట్టే గడచిపోయిందట, ఆ సీతారాములకు. ఓహొహొ ఏమి భవభూతి !
ఆ బాలిక కపోలాలు ఎర్రపడి, సిగ్గుతో దీపం వత్తులన్నీ అర్పి రెండంగలలో తన నిద్రాగృహంలోనికి పోయి ప్రక్కమీద వాలిపోయింది. ఆ బాలిక నిదురకూరింది.
5
చెంచెలక్ష్మీ ! అలంకారశాస్త్రం శాస్త్రస్వరూపంగా కాకపోయినా వేదకాలం నుంచీ ఉన్నది. గోవింద దీక్షిత మంత్రిగారి వద్దకు సంస్కృతం నేర్చుకుంటోంది చెంచులక్ష్మి.
వేదాలలో అలంకారశాస్త్రం ఉన్నదా గురుదేవా ?
వేదాలలో అలంకారశాస్త్ర బీజాలన్నీ ఉన్నయి. ఇతిహాసాలు త్రయీ సూక్తాలలో ఎన్నో ఉన్నాయి. ఉపమాలంకారము దివ్యప్రత్యక్షము. భగవంతుడు కావ్యరూపం కాదలచి భారతి అయినాడు. భారతి అక్షరరూపమై, భావంగా ప్రత్యక్షమై. కావ్యంగా రూపొందడమై, ఉపమగా దివ్య పరీవళమైపోయింది. బాలబాలికలు మాటలు నేర్వడంతోనే ఉపమాలంకారంతో ప్రారంభిస్తారు. వేదాలలో ఈ రీతిగా అలంకారశాస్త్రము ప్రారంభమైంది.
బ్రాహ్మణ. అరణ్యక, ఉపనిషత్తులలోనూ ఈ దివ్యాలంకారరూపం వ్యక్తం అయినదా గురుదేవా ?
అవునమ్మా ! అలా వ్యక్తం అయి, కావ్యమాధుర్యం గ్రహించి దివ్య విచారణ శీలురైన మన మహర్షులు కావ్యానందం ఎందుకు కలుగుతున్నదన్న విషయం విచారణ చేయడం రసోవైసః అన్న పరమ సూత్రం ప్రారంభించి, అలంకార సూత్రాలు, నాట్యసూత్రాలు ఉద్భవింపచేశారు అని గోవింద దీక్షిత మహామంత్రి చెంచులక్ష్మి మోము చూచి, అమ్మాయీ ! ఈ దినం ఇంత ఆనందంగా ఉన్నావు ? అని ప్రశ్నించాడు. ఆమె నవ్వుతో ముఖం వాల్చుకొన్నది. ఆమో కపోలాలు ఎరుపెక్కినాయి.
గోవిందదీక్షిత మహాపండితులు చాళుక్యులతోపాడు కళ్యాణిపురానికి వలసవచ్చిన ఆంధ్ర బ్రాహ్మణ వంశంవాడు. ఆ వంశం వశిష్ట గోత్రజము. రానురాను కాకతీయులకాలం నాటికి ఈ వంశం వారు హొసలకర్ణాట బ్రాహ్మణులై తమ ఆంధ్రత్వం మరిచిపోకుండా కాకతీయలు కత మంత్రులు అయి ఉండేవారు.
కాకతీయ సామ్రాజ్యము విచ్ఛిన్నమైనప్పుడు ఓరుగంటి నుండి ప్రతాపరుద్ర మహాచక్రవర్తి సేనాపతులయిన హరిహర బుక్కరాయులు విజయనగర సామ్రాజ్యం స్థాపించినప్పుడు, ఆ సామ్రాజ్యానికి ఆత్మ అయిన బ్రాహ్మణవంశజ్ఞులైన జగద్గురు విద్యారణ్యులు, సోదరుడు, సాయణా చార్యులవారూ విద్యానగర పురోభివృద్ధికెంతో తోడ్పడుతూ ఉండిరి. |