95
 

అని పాడుచు ప‌న్నీరు చిలికి శ్రీ గంధ‌మల‌దిన‌ది. ఒక‌ర్తె ప‌చ్చ క‌ప్పుర హార‌తి అందించిన‌ది. అత‌నికి ఊపిరి........ఆగిన‌ద‌నుకొనినాడు. శుక‌వాణి రాగ‌ము మార్చిన‌ది.

మెల్ల క‌న్నే లేక‌పోతే
మ‌ద‌న దేవున కీడుగాడే.
కురుచ భుజ‌మైన నేమాయె
కోదండ దేవుడు వీగిపోడే.
గూని న‌డుమూ గూబ‌క‌నులూ
అంద‌మంతా రాసిపోసీ
ఉన్న‌శ‌క్తిని కూడదీసీ
అత్త‌కొడుకుగ సృష్టి చేశాడే !
ఆ బ్ర‌హ్మ‌దేవుడు
మా అత్త‌కొడుకుగ సృష్టిచేశాడే || కో ||

పాట పూర్తి కావ‌చ్చిన‌ది. సైనికుని వేషాన ఉన్న ర‌ఘునాథ ప్ర‌భువులు ఆమె కొంటెత‌నానికి తాళ‌లేక ఆస‌న‌ము నుండి లేచి చ‌ర‌చ‌ర న‌డ‌చి వెళ్ళిపోయిరి. అత్త‌రు ప‌న్నీరులు ఇంకిపోయిన‌వి. శుక‌వాణి మృదుహ‌స్త‌ముతో తాకి గంధ‌మ‌ల‌దిన కంఠ‌ము, గండు, చెక్కిళ్ళు, ఆ స్ప‌ర్శా మాధురిని మ‌రువ‌ము అంటున్న‌వి.

వెనుక నుండి క‌న్య‌లంద‌రూ నంద‌న‌వ‌నాన విరిసిన పారిజాత‌ముల‌వ‌లె న‌వ్వుల జ‌ల్లుల‌ను కురిపించిన‌దా చెవులు విస్మ‌రించ‌లేక‌పోతున్న‌వి. ఎంత‌మంది బాలిక‌లు ! ఎలా న‌వ్వారు !

******

ప్ర‌తి శుక్ర‌వార‌ము నాడున్నూ మ‌హాల‌క్ష్మీ అమ్మ‌వారికి ఉద‌యాన స‌హ‌స్ర కుంకుమార్చ‌న పూర్తియైన పిద‌ప తీర్ధ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించి యువ‌రాజుల వారున్నూ వేంక‌ట‌ప‌తి రాజున్నూ జ‌వ‌నాశ్వాల‌పై ప‌య‌న‌మై వెడుతూ ఉంటారు. వారు స‌మీపార‌ణ్యాల‌లోని కోయ‌గూడెముల‌లో సంచ‌రించుచున్నార‌ని మ‌హారాజున‌కు క‌ర్ణాక‌ర్ణిగ తెలిసిన‌ది.

కుమారులే ప‌ని చేసిన‌ను మిగుల యోచించి మాత్ర‌మే చేయుదుర‌ని అచ్యుత‌నాయ‌నిం వారికి ఎరిక‌యే ! జింజిన‌గ‌ర స‌మీపార‌ణ్యాల‌కు మాత్ర‌ము వెళ్ళ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించ‌ద‌ల‌చుకొన్నారు కాని వారి ఆలోచ‌న ఆలోచ‌న‌గానే మిగిలిపోయిన‌ది. యువ‌రాజులు నారాయ‌ణ వ‌నంలోనూ, దిండిగ‌ల్లు, ఉద‌క మండ‌ల‌ము, దేవికోట మున్న‌గు ప‌ట్ట‌ణ స‌మీపాల ఉన్న కొండ‌లోయ‌ల‌లోనూ నివ‌సిస్తున్న భిల్ల‌జాతుల‌ను, కొండ‌కోయ జాతుల‌ను బాగుగా ప‌రిశీలించి, వారి వారి ఆచార వ్య‌వ‌హారాదులేగాక మాన‌సిక ప్ర‌వృత్తుల‌ను సైత‌ము ఆక‌శింపు చేసుకొన్నారు. ఇది ప్ర‌భువుల‌కు లీలావినోద కేళీమాత్ర‌ముగా నిర్వ‌హించ‌గ‌ల ప్ర‌జ్ఞావంతులు.

ఈ భిల్ల‌జాతుల‌లోని మెరిక‌ల‌వంటి యువ‌కుల‌ను, గురికాండ్ర‌ను ఈ టెకాండ్ర‌ను, ధ‌నుర్విద్వాకుశ‌లుర‌ను, జంతు త‌త్వ‌ప‌రిశీల‌కుల‌ను నాయ‌కులుగా నియమించి వారి వారి గూడెముల నుండి శ‌క్తిమంతులైన వారంద‌రినీ స‌మీక‌రించి శిక్ష‌ణ ఇప్పిస్తూ ఉన్నారు. ఏ గూడెమున‌కా గూడేమే ఒక యుద్ధ శిబిర‌ము. అయిన‌ప్ప‌టికిన్నీ ఆ వార్త బ‌య‌ట‌కు పొక్క‌దు. ప్ర‌జ‌లు నృత్య‌గాన వినోదాల‌తో, సంబ‌రాల‌తో ఆనంద‌ముగ ప్రొద్దు పుచ్చుచున్న‌ట్లే కాన్పింతురు.

ర‌ఘునాథ నాయ‌కులు ప్ర‌ప్ర‌ధ‌మాన‌, వేగుల‌వారంద‌రినీ రావించి, వారిలో ఒక్కొక్క‌రితో విడివిడిగ సంప్ర‌దింపులు చేసి, వారి గుణ‌శీలాద‌లును త‌న మేధాశ‌క్తితో అంచ‌నా వేసి గ్ర‌హించుకొన్నారు. న‌మ్మ‌క‌స్థులుగ దోప‌ని వారిని, ధ‌నాశాప‌రుల‌ను, ధ‌ర్మ‌దూరుల‌ను, రాజ‌భ‌క్త శూన్యుల‌ను, దేశ‌ద్రోహుల‌ను గుర్తించి వేరుపురుగులు వంటి ఇట్టివారి నేరిపార‌వైచినారు. ఈ బృహ‌త్కార్య‌మున గోవిందుల‌వారేగాక‌, య‌జ్ఞ‌నారాజ్ఞ‌ణుడున్నూ, వేంక‌ట‌ప‌తి రాజున్నూ, కోయ‌దొర అయిన క‌ప్ప‌ల దొర‌యున్నూ త‌మ‌త‌మ బుద్ధి కౌశ‌ల్యాల‌ను అందించి తోప్ప‌డినారు. ఆ ద్రోహుల‌ను దండించ‌లేదు. ఉద్యోగ‌ము నుండి తీసివేయ‌లేదు. కోశాగార ర‌క్ష‌కుల‌పైనున్న నిఘూ విభాగ ర‌క్ష‌కులుగ ఉన్న‌తోద్యోగ‌ముల‌లో కొంద‌రిని నియ‌మించి, వారిపై మ‌రిత క‌ట్టుదిట్ట‌మైన గూఢ‌స్థుల‌ను నియ‌మించినారు. కోశాగార భ‌ద్ర‌త మిక్కిలి బాధ్య‌తాయుత‌మైన ప‌ని. పైకి ఆనంద‌క‌ర‌ము అగునప్ప‌టికిన్నీ, అటునిటు బెస‌గుట‌కు వీలుగాక వీరికి కుడితిని బ‌డ్డ ఎలుక‌ల తంతాయెను.

ఇట్టి యేర్పాట్ల‌తో రాజ్య‌ములోని వార్త‌లు పెర‌రాజ్య‌ముల‌కు చేరుట అరిక‌ట్టబ‌డిన‌ది. చెదురు మదురుగా కొంత‌మంది చేర్చుట‌కు య‌త్నించిన‌దీ ప‌రాయిపాల‌కుల‌ కందినదీ అస‌త్య‌వార్త‌లే ! ఉక్కిరి బిక్కిరి అయిన హృద‌య‌ముతో, ఏక‌బిగిని మ‌నోవేగాన దిండి వ‌నాన‌కు చేరిన పిద‌ప‌గాని ర‌ఘునాధులు అశ్వ‌మునాప‌లేదు. వేంక‌ట‌ప‌తిరాజు శ్ర‌మ‌తో సొక్కిపోయినాడు. అశ్వ‌ములు రొప్పుచు నోటివెంట నురుగులు కార్చుచుచున్న‌వి.