ఇక్కడ ఒక చిన్నకథ గుర్తుకొస్తుంది. ఒక పండితుడు, పాలూ పెరుగూ అమ్ముకుని జీవించే ఒక గొల్లభామకు దేవుణ్ణి తలచుకుంటూ నదిమీంచి నడిచి వెళ్ళమని హాస్యంగా చెపుతాడు. ఆమె నిష్కళంకమైన అచంచలమైన మనస్సుతో, దైవధ్యానం చేస్తూ నదిని విస్తరిస్తుంది. ఆ పండితుడు నివ్వెరపోయి, భగవన్నామనస్మరణ కింత మహాత్వమున్నదా అన్న విచికిత్సతో తానూ, రామ రామ అనుకుంటూ నదిని దాట ప్రయత్నించి, అందులో మునిగిపోతాడు. ఆమెకు సంపూర్ణమైన విశ్వాసం ఈతనికి పాండిత్యమున్నా అనుమానంతో కూడిన నమ్మకంలేనితనం, ఆపనమ్మకం, ఎలాగ మహాతపస్వియైన ఆనందస్వామి, నిరుపమలు సంసార మహానదిని తరించడంలోగల తారతమ్యం వర్జితమైంది.
నిరుపమ పండితురాలుకాదు. శాస్త్రాలు చదువుకోలేదు. కానీ, సర్వసృష్టి రహస్యాలూ ఆమెకు బోధపడినాయి. కేవలం ఒక సాధువుంగపుడకి సేవచేయడం వల్ల ఇది సంభవమా ? జ్ఞానమన్నది పూర్వజన్మ సంస్కార విషయం. ప్రపేదిరేప్రాక్తన జన్మవిద్యా, అంటాడు కాశిదాసు. అలాగుననే, ఆమె శకణాగత భావంతో సర్వార్పణంతో ఆమెలో గతజన్మ సంపాదితమై మరుగునపడిన అనేక మహాభావాలు జాగృతమైనాయి. జన్మం మనస్సు, నాన్నా ! ఆత్మ పరమతేజం అంతా నిండి వుంటుంది... అనగల హృదయాదార్థ్య మామెకు కలిగింది. జన్మం మనస్సు అనడంలో, మనస్సులోని కోరికలతోనే పునః పునః జీవుడు జన్మించడం జరుగుతుందనీ, కామ (కోరికలు) రాహిత్యంతోకాని జన్మరాహిత్యం జరగదనే ఉత్కంష్ఠ భావన నామె చేయగల్గినది. హిందూమతం గానీండి, బౌద్ధం గానీండి, మరోమతం మరో మతం కానీండి, చెప్పింది ఈ విషయమే.
ఈమె పూర్వజన్మ సంస్కారం ఈ విధంగా ఫలితాన్నిస్తే, ఆనందజీకి మరో విధంగా ఉంటుంది. అతడూ సంస్కారే, నిర్మముడే, కామక్రోధాల నడంచిచిచ్చప్తి నుద్దీపింపచేయగల్గినవాడే. కాని, ఎందుచేత నిరుపమాదేవి ఆకర్షణలో చిక్కుకుపోయాడు ? అంతకు ముందు స్త్రీలను చూచి వుండడా ? సౌందర్యవతులను చూచి ఉండడా ? అంతకుముందు చలించని మనస్సు నిరుపమను చూడడంతోటే ఎందుకు చలించింది ? ఇదొక వ్యక్తంచేయలేని విషయం ఎవరు ఎవరికి, ఏ గుణాలని, ఏ స్వరూపాన్ని, ఏ కారణంచేత ఆకర్షణ కలుగుతుందో వివరించడం ఆసాధ్యం. దీనిని రచయిత, ఒక విచిత్ర ముహూర్తం అంటారు. ముహూర్తం అఖండకాలంలో మహాస్వల్పాతి స్వల్పమైన కాలఖండం, కాలస్వరూపిణి జగన్మాత, మహాకాళి. ఈ కాలపు ప్రభావం ఎంతటివారూ తప్పించుకోలేదన్న దాన్ని ఆనందజీ గాథ నిరూపిస్తుంది.
ఇక మహాతపస్వియైన ఆనందజీవి ఇంద్రియ నిగ్రహం కోల్పోయినంత మాత్రం చేత దొంగసన్యాసి అనవచ్చునా ? సృష్టికి ప్రతిసృష్టిని చేసిన విశ్వామిత్రుణ్ణి మనం అలా అనగలిగితే ఆనందజీవి కూడా అనవచ్చును. దేహేంద్రియ శక్తులు మహాబలవంతమైనవి. ఎంతో పైకిపోవాలని, ఎంత కఠోర నియమాలు తపస్సులు చేసి, ఇనుప కచ్చడాలనుకట్టుకొన్నా, భూమ్యాకర్షణ శక్తిలాగా, ఇంద్రియాకర్షణ శక్తి కిందికి లాగుతూనే ఉంటుంది. ఇక దాని ప్రభావానికి లొంగిపోయి, మరింతగా పతనం చెందటమేనా ? వ్యక్తి దాన్ని జయించడానికి ఏ మాత్రమైనా కృషిచేస్తున్నాడా ? అన్నదాన్నిబట్టి ఆ వ్యక్తి సంస్కారాన్ని మనం అంచనా కట్టాల్సి ఉంటుంది. ఈ మహా సత్యాన్ని విశ్వామిత్రుడు ఆచరించి చూపించాడు. ఎన్ని వ్యామోహాలు, ఎన్నిసార్లు క్రిందికి గుంజి పడదోసినప్పటికీ, మరింత పట్టుదలగా పైకిపోయి, బ్రహ్మర్షిత్వాన్ని పొందుతాడు. ఈ నిరంతర కృషియే మానవ కళ్యాణానికి కూడా దారి తీస్తుంది. ఒక యోగి, తన మోక్షాన్ని తాను పొందటమేగాక, అతని ఉనికి లోకకళ్యాణ కారకంకూడా అవుతుందని కాళిదాసాదులు ఉల్లేఖించారు.
ఇకను, ఆనందజీ తపోదీక్షను వర్ణించిన తీరు చూస్తూంటే రచయిత ఉపాసనా అనుభవం కలవాడని అనిపించకమానదు. ఉపాసనగాని, కుండలిని మొదలైన శక్తులు ఉద్భుధ్ధానికిగాని, ఆసనాదులు ప్రాణాయామాది యమ నియమాదులు అన్నివేళలా, అందరికీ తప్పనిసరికావు. జగన్మాత యొక్క కరుణాకటాక్ష వీక్షణా ప్రసాదం లభ్యమైనట్లయితే యోగమాత తనంతట తాను భక్తునికి వశురాలవుతుంది. ఇది శాస్త్రసమ్మతం కాకపోచ్చుగాని అనుభవజ్ఞుల మాట కాదనటానికి లేదు. ఒక సాధనకు ప్రారంభదశను కనులు మూసుకుంటే మొదట గోచరించేది అంతులేని నలుపు. ఎక్కడా రవ్వంత వెలుగురేఖకు కూడా తావు లేని మహాకటిక చీకటిదాటి రెండోదశకు చేరుకొన్నాక, ఘోర జీమూతంలో పడి, ఆయోమయావస్థలో పడి పోతాడు. క్రమక్రమంగా చిచ్ఛక్తి భ్రూమధ్యనున్న అజ్ఞానచక్రాన్ని చేదించుకొని పైపైకి పోతూంటే బాహ్యావస్త నశించి శరీరం జడప్రాయం అవుతుంది. ఇదంతా అనందజీకి అనుభవమయింది. చివరకు శివునకు తనకు అభేదావస్థ సంఘటిల్లింది. శివోహం అని దృఢంగా అనుకోగలిగిన స్థితికి ఆనందస్వామి చేరుకొన్నాడు. ఇంతటి అవస్థ లభించినా కూడా మళ్ళీ క్రిందికి దిగి కామానిక లొంగిపోయినాడు. ఆరునెలలు సమాధి స్థితిలో ఉండి పెనుచీకటి కావలనున్న మహా జ్యోతిని కానగల్గిన ఆనందజీ ఎందుకలా అయాడు ? ఇంకా శరీరభావం నశించలేదెందుచేత ? అతని తపస్సులో ఏదోలోపం ఉండే ఉంటుంది.
ఆనందజీకి ఇంకనూ పరిపూర్ణంగా జ్ఞానం లభ్యం కాలేదు. తాను ఏదో పాపం చేశానన్న భావం అతనిని పట్టి పీడించింది. పశ్చాత్తాపం దహిస్తూండగా, తపస్సు చేసి ఆ పాపాన్ని దగ్థం చేసుకోవాలనుకున్నాడు. అంటే అన్ని కర్మలకూ తానే కర్తననే అహంభావం అతనిని వీడలేదన్నమాట ! హిమాలయాలపై నుండి ఆత్మహత్య చేసికొనదల్చుకున్నాడు. ఇదొక ప్రతీకాత్మకమైన భావం. ఇది ఆనందజీ అజ్ఞానానికి దర్పణప్రాయమైన ఊహ. అగాధంలో పడకుండా ఒక చెట్టు ఆపుతుంది. ఈ చెట్టు అతనిని నిలబెట్టిన పూర్వతపః ఫలభరితమైన సాధన అనే వృక్షం మరింత పట్టుదలతో, ఘోరతపస్సు చేసి, పాపం ప్రక్షాళనమైనదనుకొని, నిరుపమ తల్లిదండ్రులను క్షమ నర్థించడానికి వస్తాడు. నిరుపమ తండ్రి అతని శిరస్సును కర్రతోకొట్టి, ఛేదించదల్చుకొంటాడు. అంటే ఆనందజీకి మరికొంత దండన అవసరమనే సూచన ! కాని, అతని కాళ్ళను పట్టుకొని ఎవరో లాగినట్లవుతుంది. అతని మనుమడే ఆ పని చేస్తాడు. తన మనుమడి జన్మకూ తన ఆనందానికీ కారకుడైన ఆనందజీని దండించకుండా వదలిపెడతాడు. ఇదొక ఆశాలత ! ఏ తావున తన తపస్సు భగ్నమైపోయిందనుకొన్నాడో ఆ తావున తానెంతో ప్రయాసలకోర్చి పొందిన సిద్ధిని అలవోకగా పొందగల్గిన అమాయకురాలి చెంత నిలబడే సమాదిస్థితిలోకి వెళ్ళిపోయినాడు. హిమాలయంలోకి చొచ్చుకొని పోతున్న అనుభూతిని పొందుతాడు.
హిమాలయం యోగభూమి. తరతరాలుగా మృత్యుంజయులైన మహర్షులకది, కైలాసాన్ని మించిన దివ్యధామం. వారిలో ఒకడు కాగలిగాడు, ఆనందజీ. అతని సాధన పరిపూర్తయింది. ద్వైతభావం నశించి శివో హం అన్న పదానికి సరైన వ్యాఖ్యాత అయినాడు. అంతర్ముఖంగా తనను తాను తెలిసికొన్న వారు కర్మలు చేసియు చేయనివారే. ఈ భావానికి మిధిలానాధుడైన జనక మహారాజును ఉదాహరణగా చెప్పవచ్చు. నిరుపమ ఈ స్థితికి చేరుకొని ఆత్మార్పణ తో విముక్తిని సాధించగల్గినది.
ఎన్నో అంతరాలను దాటుకుంటూ, కామాది పరిచారకులను ఆజ్ఞాపించలేక, వారి ఆజ్ఞలకు తాను లోబడి, తరువాత విచారించి మరల మరల సాధనచేసి, అవరోధాలను అధిగమించి, పైస్థాయికి చేరుకొన్నాడు ఆనందస్వామి ఇలాగ, రెండు మార్గాల ద్వారా వీరిరువురూ గమ్యాన్ని చేరుకొనడాన్ని రచయిత, మన హృదయాలకు హత్తుకొనే లాగా లలితంగా చెప్పారు
|