ఆ స‌మ‌యాన‌, కుమార వీరుడు చ‌క్ర‌వ‌ర్తి అని తెలిసి, త‌న తండ్రిని అవ‌మానించిన అత‌డు త‌న‌ను మోస‌గించ య‌త్నించాడ‌ని రోష‌క‌షాయిత నేత్ర అయింది అర‌వింద‌. అత‌డెవ‌రో త‌నకు తెలియ‌కుండా, గోప్యంగా ఉంచి, గురువుకూడా మోసంలో పాలుపంచుకొన్నాడ‌నుకొంటుంది. మ‌హోగ్రంతో ఆ క్రొత్త‌వాని చెంత‌కు వెళ్ళి త‌న‌ను అనుగ్ర‌హించ‌మ‌ని వేడుకొంటుంది. ఆమె వెంట‌నంటి వెళ్ళిన కుమార వీరుడు నిర్విణ్ణుడౌతాడు. ఆమె త‌న స‌ర్వ‌స్వం అనుకొన్నాడు. ఇన్నాళ్ళు తాను క‌న్న క‌ల‌లు వ్య‌ర్థ‌మేనా అని వాపోయాడు.

ఆనూత‌నుడు పృధుక‌ల్పాచార్యునికే గురుత్వం వ‌హించ‌గ‌లంత పాండిత్య‌మూ, ప్ర‌తిభా క‌ల‌వాడు. ఆ యువ‌తీ, యువ‌కులు తాము ఒక‌రినొక‌రు ప్రేమించిన్నీ త‌మ ప్రేమ‌ను తాము గుర్తింప లేని వారంటాడు. ప్రేమ‌నే గుర్తించ‌లేని వారికి క‌ళేమిటి ? క‌ళారాధ‌న‌మేమిటి ? అని నిందిస్తాడు. కుమార వీరుడు కూడా అత‌ని పాదాల‌చెంత వ్రాలిపోతాడు. వారిని వీణా వేణు మృదంగాను మ్రోగించ‌మ‌ని తాను నృత్యం చేయ‌సాగాడా నూత‌నుడు.

అత‌ని న‌వ్వుల్లో సంపూర్ణ‌జ్యోత్స్న‌ల ఉప‌యాద్రిపై సంధ్యారాగాలు, గోకోష్ఠాల‌లో అంబార‌వాలు, దేవాల‌యాల‌లో జే గంట దివ్య‌నాదాలు అంత‌టా ఏదో విచిత్రమైన రాగం అల‌ముకున్న‌ది. స‌ర్వ ప్ర‌పంచం త‌న ఉనికిని మార్చుకొన్న మ‌హిమ‌న్న‌గ శోభ రూపుదాల్చింది. వారు వాద్యాల‌ను మోయించ‌డం మాని, నిశ్చేష్టుడై చూస్తున్నారు.

ఆకాశానికీ, భూమికీ మ‌ధ్య‌న దివ్య నాట్యం చేస్తున్న ఆ న‌టుని పాదాలు, ప్ర‌వాళ‌ర‌జోమిశ్రితాలై గ‌మ‌న‌త్వ‌రితాలౌతున్న‌వి. అత‌ని హ‌స్తాలు, దృష్టులు, భ్రూవిలాసాదులు ఆశ్చ‌ర్య‌జ‌న‌కాలై, ప్రేక్ష‌కుల‌ను మ‌హానందంలో ప‌డ‌వేసిన‌వి. అసంక‌ల్పితంగా చేయెత్తి మ్రొక్కుతూ అత‌నిని శివునిగా భావిస్తూ త‌న్మ‌యులైనారు.

ఆ నృత్యం ఉద‌య సంధ్యానృత్యం, ఆనాట్యంలో జ‌త్కాళ్యాణ ప‌ద్మ‌రాగోజ్వ‌ల‌కాంతి చ‌క్రా కారంలో తేలియాడిన‌ది.

అంత‌లో కుమార అర‌వింద‌లొక‌రినొక‌రు అర్థం చేసుకొని చేయీ చేయీ క‌ల‌పుకొంటారు.

ఆ నూత్న పురుషుడెవ‌రు ? నాట్యాంత‌ర అదృశ్యుడైనందున అత‌నిని నాట‌రాజైన ప‌ర‌మ‌శివుడ‌ని భావించాలి. దేవుడే దిగివ‌చ్చి నాట్యం చేయ‌డం అసంభ‌వం. కానీ, క‌ళాకారులూ, ప‌ర‌మ శివ‌భ‌క్తులూ అయిన ర‌చ‌యిత దృష్టి సాక్షాత్తూ నాట్య ప‌ర‌మేశ్వ‌రుడే నాట్యం చేస్తూంటే ఎలా ఉంటుందోన‌ని ఊహ‌ల‌ను హిమాల‌య‌య నుండి కైలాసం వ‌ర‌కూ ప్ర‌స‌రింప చేశారు. పాపం ! భోళా ప‌ర‌మేశ్వ‌రుడు ఊరికే పొంగిపోతాడు క‌దా ! రాక ఏం చేస్తాడు.

వ‌చ్చాడు. వ‌చ్చి వ‌ట్టిగానే తిరిగిపోతే ఎలా అందుకే ఎడ‌మొగం పెడ‌మొగంగా ఉన్న ప్రేయ‌సీ ప్రియుల చేతులు క‌లిపి మ‌రీ వెళ్లాడు.

సంధ్యానృత్యం, బాపిరాజుగారి భావాలు ఎంత ఎత్తుకు ఎగ‌ర‌గ‌ల‌వో, అందంగా, క‌ళాత్మ‌కంగా వెల్ల‌డి చేయ‌గ క‌థ ప‌ర‌మ‌శివుడు నాట్యంలాగానే. వారి దృష్టి ఆకాశ భూమ‌ధ్యాన త్వ‌రిత గ‌మ‌నంతో నాట్య‌మాడుతుంది.

సామాజిక స్పృహ ఉన్న క‌థ‌లో ర‌చ‌యిత అనేక స‌మ‌స్య‌ల‌ను తీసికొన్నాడు. వింధా చ‌లం క‌థ‌లో వింధ్య‌కు ద‌క్షిణాన ఉన్న‌వారికీ, ఉత్త‌రాన ఉన్న‌వారికీ హృద‌యాలు క‌ల‌పుతారు. న‌ర‌స‌న్న పాపాయి క‌థ‌లో అట్ట‌డుగు వ‌ర్ణాల వాళ్ళు అనుభ‌విస్తున్న హింస‌లు, కిరాత‌కాలు క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు మ‌న‌స్సు తూట్లుప‌డేట్లు, సూటిగా వాడిగా చెప్పి అన్ని వ‌ర్ణాల వారి హృద‌యాలు క‌రిగిస్తారు. ఈ క‌థా క‌థ‌నం ఒక ప్ర‌త్యేక త‌ర‌హాగా ఉంటుంది.

నాగ‌లి క‌థ‌లో వ్య‌వ‌సాయం అంటే ప్రీతి ఉన్న క‌న్య‌, త‌న ప్రియుడు వ్య‌వ‌సాయం చేస్తేనే అత‌నితో వివాహాన్ని అంగీక‌రిస్తానంటుంది. అత‌డ కళాకారుడు. క‌ళాక్షేత్రాన్ని న‌డ‌పాల‌నుకొంటాడు. ఇరువురివీ ప‌ట్టుద‌ల‌గ‌ల మ‌న‌సులే, ఎవ‌రూ త‌గ్గ‌డానికంగీక‌రించ‌రు. కొంత సంఘ‌ర్ష‌ణ త‌రువాత‌, అత‌డే ఆమె కోసం, వ్య‌వ‌సాయం చేయ‌డానికి అంగీక‌రించి కొంత పొలంలో ఫ‌ల పుష్ప‌ప‌క్షాలు నాటి సేద్యం చేయ‌డం మొద‌లు పెడ‌తాడు. ఆమె ప‌ట్టుద‌ల‌తో మ‌రొక‌రిని చేసికొన‌డానికిష్ట‌ప‌డింద‌ని నిరాశ‌, నిస్పృహ‌ల‌తో జ‌బ్బు ప‌డ‌తాడు చివ‌రికి సుఖాంత‌మ‌వుతుంది. ఈ క‌థ‌లో
స్త్రీ పురుషులిద్ద‌రికీ త‌మ‌కు ప‌ట్టుద‌ల‌లున్న‌ప్ప‌టికీ ఒక‌రికోసం ఒక‌రు ఓడిపోడంతో ఇద్ద‌రూ గెలుపొందుతారు. వ్య‌వ‌సాయ‌, క‌ళాక్షేత్రాల‌లో ఇరువురూ క‌లిసి సాధ‌న చేస్తారు. ఈ క‌థ‌లో వ్య‌వ‌సాయాన్ని గురించీ, క‌ళ‌ల‌ను గురించీ కూడా వివ‌రంగా చ‌ర్చించారు ర‌చయిత.

బండ‌రాళ్ళు ఇది ర‌జాకార్ ఉద్య‌మంలో స‌ర్వం కోల్పోయిన నిర్భాగ్యుల‌గాథ భోధ‌గిరిరెడ్డి చెల్లెలు బ్ర‌తుకు బండ‌లైంది, భార్య విద్రోహుల చేత‌బ‌డ‌కుండా త‌నకు తాను పొడుచుకొని చ‌నిపోతుంది. అత‌డు ఏకాకి అయిపోయి, ఇల్లూ వాకిలీ, పొల‌మూ పుట్రా వ‌ద‌లి బండ‌రాళ్ళు మ‌ధ్య జీవితం సాగిస్తుంటాడు.

పోలీసు సాయంతో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డి హింసాత్మ‌క చ‌ర్య‌లు అరిక‌ట్ట‌బ‌డినాయి. ఆనాడు దేశంలో చెల‌రేగిన అన్యాయాలు హృద‌యం ద్ర‌వించేలా వ‌ర్ణించ‌బ‌డినాయి. దేశంలో క‌ల్లోలాగ్ని చ‌ల్ల‌బ‌డింది కాని బోధ‌గిరిరెడ్డి వ్య‌క్తిగ‌తంగా క‌ల్సివ‌చ్చిందేమీలేదు. అత‌డెప్పుడో స‌ర్వ‌నాశ‌న‌మ‌యాడు. త‌ల్లీ తండ్రీ తోడూ నీడా, గొడ్డూ, బిడ్డా ఏమీమిగ‌ల‌లేదు. ఇంటికి వెడితే ఆద‌రించి చ‌ల్ల‌ని నీళ్ళు ఇచ్చి, సేద‌తీర్చే రెండో ప్రాణిలేదు. అంచేత‌, మొద‌ట త‌న కాశ్ర‌య‌మైన బండ‌రాళ్ళ నీడ‌నే చిన్న పంచ‌ను నిర్మించుకొని, అక్క‌డ అడ‌వుల్లో దొరికే ప‌ళ్లూ ఫ‌లాల‌తో క‌డుపు నింపుకుంటూ ఉంటాడు.

ఓనాటి రాత్రి అక్క‌డ ఒక స్త్రీ వంట చేస్తూ ఉంటుంది. అత‌డు, ఎవ‌రునీవు ? అని అడుగుతాడు ఆమె అత‌న్నే తిరిగి ప్ర‌శ్నిస్తుంది. ఎవ‌ర్ని నేను ? అని ఆమె కూడా భోధ‌గిరిరెడ్డి లాగానే స‌ర్వం కోల్పోయి, మ‌తిచెడి ఊరూరూ తిరుగుతూ అక్క‌డికి చేరుకొంటుంది. ఆ స్త్రీ, తెలుగుదేశ‌మే స్త్రీ రూపం దాల్చిన‌ట్లుగా అత‌నికి రూపుగ‌డుతుంది. ఓ తెలుగు నాటి స్త్రీ ! నీ హృద‌యంలో మాయ‌రాని గాయాలు త‌గిలిన‌వా, నీ బ్ర‌తుకు ఖండ ఖండాలుగా గొడ్డ‌లి వ్రేటుపాలై దుమ్ములో రాలిపోయిందా ? అనుకుంటాడు. ఆమె అత‌నికి ఒక చిన్న బిడ్డ‌లాగా క‌నిపిస్తుంది. ఎడారిలో ఏకాకినియై ఎలుగెత్తి ఏడ్చే నిర్భాగ్యురాలిలా క‌నిపిస్తుంది. అక్కున‌జేర్చి సేద‌దీరుస్తాడు.

అత‌డు తెలంగాణా ప్రాంతానికి చెందిన‌వాడు. ఆమె ఏ ప్రాంతానికి చెందిన‌దో తెలియ‌దు. ఇద్ద‌రూ ఒకే ప్రవాహంలో కొట్టుకొనిపోతున్న రెండు మ్రోడులు వారి జీవితాలు అలా అంతం కారాదు. వీరు క‌లిసి జీవించి, మోడైన జీవ‌న వృక్షాల‌ను తిరిగి ఎందుకు చిగురింప జేసికోకూడ‌దు ? వారు చేజేతులా చేసిన పాపం ఏమీలేదు. క‌సాయి చ‌ర్య‌ల‌పాలై ఒంట‌రి వాళ్ళ‌యారు. ఆమెకు తాను తోడు, గుబ‌గుబ‌లాడే ఆమె గుండెకు ఆస‌రాగా త‌న గుండెతోడు. ధృఢ నిశ్చ‌యానికి వ‌చ్చాడు రెడ్డి. భోధ‌గిరిరెడ్డి క‌రుణాపూరిత‌మైన మ‌న‌స్సును వెల్ల‌డి చేయ‌డం కాలేదు...మాన‌వుని ఆశా బంధాలెలాంటి గ్రీష్మాత‌పాల‌కైనా వాడిపోయిన‌ట్లు క‌న్పించినా, చిన్ని చిన్ని నీటిచుక్క‌లు సోక‌గానే తిరిగి చిగురించ‌డానికాత్ర‌ప‌డుతూంటాయ‌నే న‌గ్న స‌త్యాన్ని వెల్ల‌డిస్తోందీ క‌థ‌.

ఆమె ఎండిపోయిన వ‌రీరం నూత‌నార్ధ్ర‌త‌ను పొంద‌డానికి త‌గిన అవ‌కాశాన్ని అత‌డిచ్చాడు. బండ‌రాయివంటి అత‌ని జీవితంలో ఆనంద మ‌హావృక్షాన్ని మొలిపించిందా తెలుగునాటి స్త్రీ ! ఇద్ద‌రికీ నూత‌న జీవితాశ ! న‌వ్య‌శ‌క్తి ! బ్ర‌తికి ఉండే మ‌రోజ‌న్మ ఎత్తిన‌ట్లుగా ఇద్ద‌రూ చేయీచేయీ క‌లుపుకొని జీవితాన్ని న‌డిపించ‌డానికి సిద్ధ‌మైనారు.

దేశంలో ఎక్క‌డ ఎలాంటి ఉత్పాతాలు ఉద్య‌మాలు, తిరుగుబాట్లు, యుధ్ధాలు, అల‌జ‌డులు జ‌రిగినా, ఉరుమురిమి మంగ‌లం మీద ప‌డ్డ‌ట్లు, నీచుల క‌ళ్ళు స్త్రీ జాతిమీద ప‌డ‌ట‌మూ స్త్రీలు నిష్కార‌ణంగా, అన్యాయ‌మై పోవ‌డ‌మూ జ‌రుగుతూనే ఉన్న‌ది. భోధ‌నిగిరిరెడ్డి అమాయ‌కురాలూ, నిర్భాగ్యురాలూ అయిన ఒక స్త్రీ కి ప‌రిపూర్ణ హృద‌యంతో చేయూత‌నిచ్చి ఆద‌ర్శ పురుషుడైనాడు.

ఉద‌ర‌పోష‌ణ‌కు కాయ‌క‌ష్టం చేసికోలేని అవిటివారి జీవితంలో చెల‌రేగే ఘ‌ర్ష‌ణ‌ను వివ‌రించే క‌థ‌లు, తిరుప‌తి కొండ‌మెట్లు, గుడ్డిపిల్ల‌, క‌న్ని.

మ‌హాక‌వులు, ర‌చయిత‌లు, క‌ళాకారులు, నాయ‌కులు, ధ‌న‌వంతులు వీరిలోనే కాక మాత్స‌ర్యం అనేది బిబ్బ‌మెత్తుకొని తినేవారిలో కూడా ఉంటుంద‌నే న‌గ్న స‌త్యాన్ని వెల్ల‌డిస్తుంది. తిరుప‌తి కొండ‌మెట్లు గాథ‌.

తిరుమ‌ల‌కొండ మీదికి, కాలిబాట‌న వెళ్లే మెట్ల‌మీద‌, ముష్టి ఎత్తుకుని జీవ‌నం సాగిస్తుంటాడు, పున్నెడు. ఒక‌ప్పుడ‌త‌డు పొలం, ఇల్లు ఉన్న చిన్న రైతే. కోర్టు తగాదాల్లో రెండు కాళ్ళ‌తో స‌హాస‌ర్వం పోగొట్టుకొని, మెట్ల‌మీద త‌న‌మొండికాళ్ళ‌తో ర‌క‌ర‌కాల స‌ర్క‌సు విద్య‌ల‌ను ప్ర‌ద‌ర్శించి, డ‌బ్బు దండిగా దండుకోగ‌ల్గుతూంటాడు. అత‌ని మొగ్గ‌లూ ఆస‌నాలూ యాత్రికులు వినోదంగా చూసి, వారి సంతోషానికి, సానుభూతికి త‌గ్గ‌ట్గుగా ప్ర‌తిఫ‌లాన్ని అత‌ని జోలిలో వేసేవారు.

అత‌డి రాబ‌డిని చూచి తోటి యాచ‌కుల‌కు క‌న్నెర్ర అయింది. యాచ‌కోయాచ‌క‌న్య శ‌త్రుః అన్న‌ట్లుగా ఇత‌నిని విరోధించ‌డంలో వారంద‌రూ ఏక‌మ‌య్యారు. ఈ ఏకీక‌ర‌ణ‌తో వారి శ‌క్తి ఎంత‌గా ఎదిగి పోయిందంటే, నిత్య‌వ‌సంతంగా ఉండే కాశ్మీరు దేశాన్ని వారు ఎడారిగా మార్చ‌గ‌ల‌ర‌ట‌. ఇక పున్నెడ‌న్న అర్భ‌కుడు వారికొక‌లెక్కా ! పున్నెడిని మెట్ల‌పైనుండి తోలియేయాల‌న్న‌ది వీరి ధృఢ‌సంక‌ల్ప‌మైన‌ది. వీరికి సాయ‌మైనారు చిన్న చిన్న వ్యాపార‌స్థులు. అంద‌రూ అత‌ణ్ణి వెలివేశారు. అన్నం పొట్లాలు అమ్మేవాళ్ళు, స‌రుకులు అమ్మేవాళ్ళు పున్నెడికి అమ్మ‌టం మానేశారు.