స్వాతంత్ర్యం మా జ‌న్మ‌హ‌క్కు అది ఒక‌రు వేసే బిచ్చం కాదు అన్న‌ది బాల‌గంగాధ‌ర తిల‌క్ జాతికిచ్చిన దివ్య మంత్రం. లాల్‌-బాల్‌-పాల్ ఈ సందేశ స్వ‌ర‌ల‌హ‌రికి త‌న గొంతులిచ్చి గానం చేశారు. వారిలో బిపిన్‌చంద్ర‌పాలుని గొంతు మూడ‌వ‌తాళం మూర్తీభ‌వించిన స్థాయిలో వుండేద‌ట‌. వారిచే నుత్తే జితుడై త‌న గొంతునెత్తిన బాపిరాజు స్వ‌తంత్ర‌మంటే ఏమిటో, నిత్య జీవితానిక‌న్వ‌యించి త‌రువాత చ‌ర‌ణంలో ఇలా అంటారు :-

కంఠ‌మెత్తీ గాన‌మెప్పుడు ?
క‌లం హాయిగ ఖదం ఎప్పుడు ?
కంటిచూపుల‌లో స‌ముజ్వ‌ల‌
క‌ళ‌లు తోచేనా ?

క‌ళ‌ల‌కూ, సాహిత్యానికీ, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలూ, సామాన్య ప్ర‌జానీకంలో నిర్భీత‌మైన చైత‌న్య‌దీప్తీ నిండ‌నిదే ఎవ‌రికి ఎన్ని ఉద్యోగాలొచ్చినా తెల్ల‌వాడి బ‌దులు మ‌న‌వాళ్లే ప‌రిపాల‌కులైనా జాతికి మోచ‌నం లేదంటూ గేయంలో నాటికీ, నేటికీ అన్వ‌యించ‌ద‌గిన ప‌దాల న‌ల్లాడాయ‌న‌.

పాత‌క‌త‌లూ, పాతవెత‌లూ
పారిచ‌నె, స్వేచ్ఛాప‌తాక‌ము
నెత్త‌రా, ఎత్త‌వేం ఎత్తు,
పుడుద్వీపాల‌న్‌.

సామాన్య ప్ర‌జానీకానికి చారిత్ర‌క విజ్ఞానం లేదు. పైగా బానిస చ‌దువుల‌లో నేర్పేదంతా, జాతి ఆత్మ విశ్వాసాన్ని భంగ‌ప‌రిచేదిగానే వుంది. పాల‌కులు భార‌త చరిత్ర‌ను వారి క‌నుకూలంగా వ్యాఖ్యానించి వ్రాసుకున్నారు. మ‌నం ఎన్న‌డూ స్వ‌తంత్రులం కాము, మ‌న‌కు జ‌వ‌స‌త్వాలు లేవు. జాతీయ వైభ‌వం లేదు. నేడు ఆంగ్లేయుల కొలువుక‌న్న మ‌నం చేయ‌గ‌లిగింది లేద‌నేదే నేటి చ‌రిత్ర మ‌న‌కు చెప్పే పాఠం. ఇట్టి విద్యాప్ర‌ణాళిక‌ను మార్చాలి. మ‌న ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన జాతీయ చ‌రిత్ర‌ను చెప్పాలి. అది వారిలో మ‌హ‌త్వ‌కాంక్ష‌ను, వీర‌వ్ర‌తాన్ని, ధ్యేయ నిష్ఠ‌ను ర‌గుల్కొల్పాలి. అది ఒక త‌పఃస్సాధ‌న‌లా చిర‌కాలం కొన‌సాగ‌వ‌ల‌సిన కృషి. క‌డ‌వ‌ర‌కూ ఆగ‌రాదు. గ‌తంలో మ‌న చరిత్ర అంతా అంధ‌యుగ‌మ‌ని మొగ‌లు యుగ‌మ‌ని, ఆంగ్లేయుల యుగ‌మ‌ని, అంటున్నారు. ఆ చరిత్ర దానిలో మ‌నం ప‌డిన బాధ‌లూనిన్నటి క‌థ‌. ఓట‌ములు ప‌ట్టించుకోకు నిరంత‌రం పోరాటం జ‌రుగుతూనే ఉన్న‌ద‌ని గుర్తించు. ఈనాడు ఈ పోరాటాన్నే కొన‌సాగించు మ‌న‌కా స్వాతంత్యం కావాలి. మ‌న స్వేచ్ఛావ‌తారాన్ని యావ‌త్ర్ప‌పంచం లోనూ స‌గ‌ర్వంగా ఎగిరించాలి. ర‌మ్మ‌ని స్వ‌దేశీయునికి వెలుగునిచ్చారు శ్రీ బాపిరాజు. ఈ ర‌చన లోని చ‌మ‌త్కారం ఎత్త‌రా , ఎత్త‌వేల , ఎత్తు అన్న పున‌రుత్తిలో వుంది. అది కేవ‌లం స్వాతంత్య్ర వాంఛ మాత్ర‌మేగాదు. స‌మ‌ష్టి కృషికి పిలుపు అది ఒక ఆజ్ఞ‌. ఆత్మీయ‌త‌తో గూడిన ఆదేశం. అది ఆనాటి జాతీయోద్య‌మ వీరావేశానికి ఒక గుర్తుగా చెప్ప‌ద‌గిన పాట‌. దేశీయుల‌ను త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మున కుద్య‌మంప‌చేయు సాధ‌న‌ము.

కాని, ప్ర‌పంచ‌మున వింత ల‌న్నిటిక‌న్న వింత‌, వ్యాపార‌మున‌కు వ‌చ్చిన ఒక కంపెనీ కోట్ల‌కొల‌ది ప్ర‌జ‌లు, వేలాది సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌, ఉత్కృష్ట‌మైన ఆధ్మాత్మిక‌, వైజ్ఞానిక క‌ళామ‌య జీవ‌న‌ము న‌నుభ‌వించిన స‌మాజ‌మును, వంద‌ల ఏండ్లు, బానిస‌గా చేసి పాలించ‌గ‌ల్గుట దీనికి మౌలిక‌మైన కార‌ణం, భార‌తీయుల‌లోని అనైక్య‌త‌, త‌త్ఫ‌లిత‌మైన ఓట‌మి, ఓట‌మి తెచ్చిపెట్టె విష‌ప‌రిణామ‌ము, ఆత్మ‌విశ్వాస‌రాహిత్యం తానెవ‌రో, తానేమిటో, త‌న చ‌రిత్ర ధ‌ర్మ‌ము స‌మాజ జీవ‌న‌ములు ఎంత‌టివో తెలియ‌నివాడు ఒక జాతి జాతిగా మ‌న‌నేర‌దు. కేవ‌ల‌ము మ‌నుజుల మంద‌గా మాత్ర‌మే త‌న మ‌నుగ‌డ నాశించుచుండును. కాబ‌ట్టి జాతీయోద్య‌మమున స్వ‌దేశ చ‌రిత్ర‌, సంస్కృత‌, స‌భ్య‌త‌ల‌ను గురించి ప్ర‌బోధ‌ము అత్యంతావ‌శ్య‌క‌ము. ఇది గుర్తించియే బాపిరాజుగారు ఆరు చారిత్ర‌క న‌వ‌ల‌లు, నాలుగు సాంఘిక న‌వ‌ల‌లూ, వంద‌వ‌ర‌కూ గేయ‌ములూ వ్రాసిరి.

ఆంధ్రుల‌లో తొలి రాజ‌వంశ‌మైన శాతవాహ‌నుల చ‌రిత్ర‌నూ, నాటి స‌మాజ జీవిత‌మూ, సంస్కృతీ, స‌భ్య‌తా, ప్ర‌కృతి వ‌న‌రులూ, క‌నుల‌కు కట్టున‌ట్లుగా ఆయ‌న హిమ‌బిందు న‌వ‌ల‌ను రూపొందించెను. త‌ద‌నంత‌ర కాల‌మున ఆంధ్ర‌భూమి నేలిన ఇక్ష్వాకుల వంశ చ‌క్ర‌వ‌ర్తుల చ‌రిత్ర‌ను ప్ర‌తిబింబించే రీతిగా అడ‌వి శాంతిశ్రీ య‌ను న‌వ‌ల ర‌చించెను. పిమ్మ‌ట కాక‌తీయుల ప‌రిపాలించిన కాల‌ఖండ‌మున‌, ఆంధ్ర ప్రాంత‌మంద‌లి జ‌న జీవ‌న చ‌రిత్ర‌నంత‌నూ, గోన‌గ‌న్నారెడ్డి న‌వ‌ల‌లో ఆయ‌న క‌నుల‌కు క‌ట్టించెను. అశుమ‌తి అను న‌వ‌ల‌ను ర‌చించి, అందులో ఆంధ్ర‌దేశ మేలిన చాళుక్య చ‌క్ర‌వ‌ర్తుల స‌మ‌కాలీన స‌మాజ‌మును చ‌క్క‌గా వివ‌రించెను. త‌ద‌నంత‌ర‌ము, తంజావూరు, నాయ‌క రాజుల కాల‌మును క‌ద్ద‌ము ప‌ట్టు రీతిగా మ‌ధుర‌వాణి య‌ను న‌వ‌ల‌ను వ్రాయుచూ అది పూర్తికాక‌ముందే బాపిరాజుగారు మ‌ర‌ణించారు. ఈ చారిత్ర‌క న‌వ‌ల‌ల‌న్నీ పాఠ‌కుని ఆయా కాలాల లోనికి రెక్క‌లు క‌ట్టి రివ్వున ఎగ‌రేసుక‌పోయి. అందువానిని తాదాత్మ్య మందించి ల‌లిత‌క‌ళా విన్యాస‌ముల చ‌మ‌త్కార‌ముల‌లో, కాంతా స‌మ్మితంగా, జాతీయ‌తా ప్ర‌బోధ‌మున ప్ర‌భావితుని చేయును. స‌ర్వ‌విధ‌ములా ప్రామాణిక‌త, ఈ చారిత్ర‌క న‌వ‌ల‌లు ప్ర‌త్యేక‌త‌. చారిత్ర‌క న‌వ‌ల‌ల కాంధ్ర‌మున ఆయ‌న‌దే వ‌ర‌వ‌డి. నారాయ‌ణ‌రావు తుఫాను , కోణింగి వంటి సాంఘిక న‌వ‌ల‌లో ఆధునిక జీవిత‌ము. దానిలో భార‌తీయమైన విలువ‌ల‌కుగ‌ల స్థాన‌మూ, అవ‌స‌ర‌మూ, సాధ‌క బాధ‌కముల‌ను గూర్చిన విశ్లేష‌ణ‌ము, సుల‌భ‌శైలిలో జ‌రుప‌బ‌డిన‌ది.

బానిస‌లైన కృంగిపోయిన ప్ర‌జ‌ల‌కు, నిండై న‌భావుక‌త గూడ క‌ర‌వేయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అందుకే భావ‌న‌లో ప‌రిపూర్ణ‌త‌, శ్రేష్ట‌త్వ‌ములు, ర‌చ‌న‌ల‌లో ప‌దే ప‌దే ప్ర‌తివాదింప‌బ‌డిన‌దే, స్వాభిమాన జ్యోతి వెలుగులు పుంజుకొన‌దు. కావున‌నే బాపిరాజుగారి న‌వ‌ల‌ల్లో నాయ‌కులంద‌రూ, ఆద‌ర్శ‌మూర్తులూ, స‌ర్వ‌స‌ద్గుణ స‌మ‌న్వితులు, వారికిరాని విద్య ఉండ‌దు. వారు చేయ‌లేని ప‌నియుండ‌నేర‌దు. ఒకానొక చిత్ర‌ణ‌ము, సార‌తంత్య్ర స‌మాజ‌మును బ‌ట్టిన ఒకానొక మాన‌సిక నూన్య‌తా భావ‌మును తొల‌గించుట‌కు ఔష‌ధ‌ము కాగ‌ల‌దు.