16
 


నువ్వు పొర‌బ‌డుతున్నావు. నేను చెపుతానిను. అత‌డు నిజంగా అర్జునుడే అయితే అత‌ణ్ణి అత‌ని అన్న‌దుమ్ముల్నీ తిరిగి ప‌న్నెండేళ్లు అర‌ణ్య వాసానికి పంపిస్తాను కాక‌పోతే నా శాపానికి ఎర గావిస్తాను అన్నాడు దుర్యోధ‌నుడు.

అవున‌వును. అంతే అన్నాడు యావ‌న్మందీని.

అక్క‌డ జ‌మ్మి చెట్టు వ‌ద్ద ర‌ధాన్ని ఆపు చేయించాడు అర్జునుడు.

ఈ చెట్టు మీద గాంఢీవం ఉంది. ఈ విల్లులు ఎంత పెద్ద‌వైనా అది త‌ప్ప ఇవేవి నా బాహుబ‌లానికి తాళ‌లేవు. ఇలాంటి ల‌క్ష విల్లుల బ‌లం దానికి ఉన్న‌ది. వీర విహారానికి ఈ విల్లులు ఆగ‌వు. వీటితో దేనిని బ‌డితే దానిని కొట్టి చంప‌డానికి సాధ్య‌మా ?  స‌రియైన ఆయుధం లేకి శౌర్యం వృధా కాదా ?  క‌నుక నువ్వు ఈ చెట్టెక్కి, ఆ చాపం తెచ్చి పెట్టు. ధ‌ర్మ‌రాజు, భీముడు, అర్జునుడు, న‌కులుడు, స‌హ‌దేవుడు త‌మ త‌మ ఆయుధాల‌న్నీ క‌లిపిక‌ట్ట గ‌ట్టి ఈ చెట్టుపూ పెట్టారుట‌. ఆ క‌ట్ట విప్పి అందులోంచి గాంఢీవం తీసి మిగ‌తేవి అన్నీ మ‌ళ్లీ ఎప్ప‌ట‌ల్లాగ‌నే కట్ట గ‌ట్టి అక్క‌డే ఉంచు అంటూ బృహ‌న్న‌ల శ‌వాకారంగా ఉన్న అస్త్ర‌శ‌స్త్రాల క‌ట్ట‌ను ఉత్త‌రుడికి చూపించాడు.

ఏమిటి బృహ‌న్న‌లా నీ అభిప్రాయం ?  పీనుగును ముట్టుకోమంటావా న‌న్ను ?  మ‌హారాజు కొడుకునే అని అయినా  ఆలోచించ‌క న‌న్ను ఈ నీచ‌పు ప‌నికి నియోగించ‌డం న్యాయ‌మా నీకు ?  పాపం క‌దా ?  అన్నాడు ఉత్త‌రుడు.

ఎవ‌రూ ముట్టుకోకుండా మ‌భ్య‌పెట్ట‌డానిక‌ని అలాగ కట్ట‌బ‌డిన అస్త్ర శ‌స్త్రాల క‌ట్టేగాని అది శ‌వం కాదు. అది నిజంగా పీనుగే అయితే నీకు ఇటువంటి ప‌ని చెపుతానా ?   నా మాట న‌మ్ము. అది ఆయుధాల మోపు చెట్టెక్కి చాపం నాకు అందియ్యి  అన్నాడు బృహ‌న్న‌ల‌. ఏమీ చేయ‌లేక ఆ అమాయ‌కుడు చెట్టెక్కాడు.

అర్జునుడు ర‌థంలో నిల‌బ‌డి ఊ ! త్వ‌ర‌గా అంటున్నాడు. ఉత్త‌రుడు ఆయుధాలు మోపు విప్పినాడు. ఆ విల్లుల కాంతులు సూర్యోద‌యంలాగ న‌లు దిక్కులా జాజ్విల్యంగా ప్ర‌స‌రించాయి. అతని క‌ళ్లు మిరుమిట్లు గొల్పాయి. పెద్ద పెద్ద పాములాగ ఉన్న ఆ ఆయుధాల‌ను చూచి అత‌డు భ‌యంతో వ‌ణికాడు. అర్జునుడాతనికి తగు మాట‌ల‌తో ధ‌యిర్యం చెప్పి భ‌యం పోగొట్టినాఉ. ఉత్త‌రుడు ఒక్కొక్క విల్లునూ విస్తుపోతూ చూడ‌సాగాడు.

సార‌ధీ ! ఈ విల్లు చూడు ! పెద్ద కొండ చిలువ లాగ ఎలాగ ఆశ్చ‌ర్యంగా ఉందో ! త‌ళ త‌ళ‌లాడుతోంది. పాండ‌వుల్లో ఈ విల్లు ఎవ‌రిదో ! ఈ విల్లుల్లో ఏది ఎవ‌రిదో చెప్పు అని అతి కుతూహ‌లంతో అడిగేడు.

తొలుత‌గా నువ్వు న‌న్ను అడిగిన దొడ్డ విల్లున్న‌దే అది గాంఢీవం. అది అర్జునుడిది. అదంటే అత‌నికి ప్రాణం ఆ విల్లును బ్ర‌హ్మ నూరు వేల యేళ్లు ప్ర‌జాప‌తి అర‌వై వేల యేళ్లు, ఇంద్రుడు అయిదు వేల యేళ్లు, సోముడు అయిదు వంద‌ల యేళ్లు , వ‌రుణుడు వంద‌యేళ్లు ఉప‌యెగించారు. వ‌రుణిడి వ‌ద్ద నుండి అగ్ని వేడుక‌ప‌డి పుచ్చుకున్నాడు. పిమ్మ‌ట  అర్జునుడు చేసిన అత్య‌ధ్భుత కార్యానికి మెచ్చి అత‌డు అర్జునిడికి ఇచ్చాడు. దానిని అర్జునుడు అర‌వై అయిదేళ్లు ఉప‌యోగిస్తాడు.

సువ‌ర్ణ వృష‌బాలు చెక్క‌బ‌డి క‌లువ కాంతులు వెద‌జ‌ల్లుతున్న‌దే ఆ చాపం ధ‌ర్మ‌రాజుది. బంగారు వేళ్ళ‌తో తాళ వృక్ష ప్ర‌మాణంగా ఉన్న‌దే ఆ కార్ముకం భీముడిది. క‌న‌క‌మత్య్సాల‌తో కార్చిచ్చులా మెరుస్తూన్న‌దే ఆ ధ‌న‌స్సు న‌కులుడిది. కాంచ‌న మ‌యూర ఖ‌చిత‌మై మెరుస్తూన్న ఆ చాపం స‌హ‌దేవుడిది. అర్జునుడి గాంఢీవం ఇందాక చెప్పాను క‌దా. ఉద్దండంగా ఉన్న‌దే ఆ గ‌ద భీముడిది అంటూ బృహ‌న్న‌ల ఆయా అస్త్రాలు, శ‌స్త్రాలు పాండ‌వుల్లో ఎవ‌రెవ‌రివో విపులంగా చెప్పాడు.

అయిన‌ప్ప‌టికీ ఉత్త‌రుడు ప‌ర‌మ మూర్ఖుడు కావ‌డం చేత అర్జునుణ్ణి గుర్తించ లేక‌పోయాడు. అయితే బృహ‌న్న‌లా ! ఆయుధాల‌న్నీ ఇక్క‌డ పెట్టి ఆ మ‌హానుభావులు ఎక్క‌డ‌కు వెళ్లారంటావు ?  మ‌న పాండ‌వుల సంగ‌తి నీకు తెలిసిన‌దంతా చెప్పు. నేను ఆ మ‌హానీయుల మేన‌ల్లుణ్ణి. మా మేన‌మామ‌లు ఎంత గొప్ప‌వాళ్ళ‌నుకున్నావు. నేనంటే ఎంతో ప్రేమ ! మా పెద్ద మామ‌య్య ఎక్క‌డ అణిగి ఉన్నాడో ! వాళ్లంతా ఎక్క‌డ ఎలాగ ఉన్న‌రో !  మాయ దేవుడు , అబ్బ‌బ్బ ! ఎంత ఘోరం చేశాడు ! మా అత్త‌య్య దీపం వంటిది. ఆమె ఏ పాట్లు ప‌డుతుందో ! దుర్మార్గుల వ‌ల్ల ఎన్ని క‌ష్టాలు వ‌చ్చాయి. శ‌త్రువున్ని క్ష‌ణంలో రూపుమాప‌గ‌ల శౌర్య‌వంతుడైన‌ప్ప‌టికీ మా మామ‌య్య దుర్యోధ‌నుడు మున్న‌గు నీచుల‌వ‌ల్ల క‌ప‌ల జూదం కార‌ణాన ఎన్నో గొప్ప క‌ష్టాలు అనుభ‌వించాడు తెలుసా ! వారు రాజ్యం వ‌ద‌లి వెళ్లిపోయాక మ‌ళ్ళీ వారి సంగ‌తి తెలియ‌నే లేదు ! నువ్వు ఎటువంటి వార్త‌లు చెపుతావో అన్నాడు ఉత్త‌రుడు. అత‌ని కంఠ‌స్వ‌రంలో ప్రేమ గౌర‌వం విషాదం ప్ర‌స్ఫుటిస్తున్నాయి.

వాళ్ల‌ను గురించి విచారించ‌కు. విధిన‌శాన వ‌చ్చిన ఆప‌ద‌కు ఓర్చుకొని మాట త‌ప్ప‌కుండా వారూ ద్రౌప‌దీ క‌లిసి పన్నేండేళ్లు అర‌ణ్య‌వాసం చేశారు. ప‌ద‌మూడో ఏడు అజ్ఞాత వాసం చేయాలి క‌దూ ?  అందుక‌ని ఇక్క‌డ‌కి వ‌చ్చి మ‌న ఊళ్లోనే అజ్ఞాతంలో ఉన్నారు. ఎవ‌రు ఎవ‌రో చెప్ప‌నా ?  మ‌న కంకుడు ధ‌ర్మ‌రాజు. మ‌న వంట‌వాడు న‌ల‌లుడు భీముడు. మ‌న గుర్రాల‌కు అధిప‌తి న‌కులుడు.  గోవుల కాప‌రి స‌హ‌దేవుడు . చెప్ప‌డం మొద‌లు పెట్టాక ఇంక దాచ‌డ‌మెందుకు?  నేనే అర్జునుణ్ణి ! అంతఃపురంలో మాలిని అనే పేరుతో ఉన్న కాంత ద్రౌప‌ది. ఆమె కోస‌మే సింహ‌బ‌లుణ్ణి, అత‌ని త‌మ్ముళ్ళ‌నీ గంధ‌ర్వుల పేరుతో భీముడు చంపేశాడు అన్నాడు బృహ‌న్న‌ల‌.


సంభ్ర‌మ‌ము,  ఆశ్చ‌ర్య‌ము, సంశ‌య‌ము అన్నీ ఒక్కుమ్మ‌డిగా ముంచెత్తి ఉత్త‌రుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాయి. బృహ‌న్న‌ల అనిమేష దృష్టితో తేరిపార చూచినాడు.

నువ్వు బృహ‌న్న‌లువ కావూ ?  అర్జునుడిలా ! నేనెట్లా న‌మ్మ‌గ‌ల‌ను ?  నువ్వు నిజంగా అర్జునిడివే అయితే అర్జునుడికి ప‌ది పేర్లు ఉన్నాయ‌ట  ! అవ‌న్నీ చెప్పు చూస్తాను ?  అన్నాడు ఉత్త‌రుడు. బృహ‌న్న‌ల న‌వ్వాడు. అర్జునుడు, ఫ‌ల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేత‌వాహ‌నుడు, భీభ‌త్సుడు, విజ‌యుడు, జిష్ణుడు, స‌వ్య‌సాచి, ధ‌నుంజ‌యుడు అనే ప‌ది నా పేర్లే !  అన్నాడాత‌డు. స‌రే ! అర్జునుడికీ  ఈ పేర్ల‌న్నీ ఏకార‌ణ‌వ‌ల్ల వ‌చ్చాయి చెప్పు చూద్దాం ! ఉత్త‌రుడు ప్ర‌శ్నించాడు.