15
 


ఇలాగ పిరికిత‌నంతో మాట్లాడ‌డం బాగున్న‌దా ?  ప‌శువుల్ని దిగ వ‌డిచిపోతే పౌరులు తిట్టిపోయ‌రా ?  అంత‌కంటే దీన‌త్వం ఉన్న‌దా ?  కాగా న‌న్ను గురించి సైరంధ్రి గొప్ప‌గా చెప్ప‌బ‌ట్టే క‌దా నీకు తోడుగా తీసుకొచ్చావు ! పైగా నీ శౌర్యాన్ని పొగ‌డి పౌరులు దీవ‌న‌లు ఇచ్చారు కూడాను. అన్నీపోయి కౌర‌వులు గోవుల‌ను తీసుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకుని వ‌ట్టి చేతుల‌తో వెన‌క్కి పోతామా ?  నీ కెందుకు భ‌యం ?  కొంచెం మ‌న‌స్సును చిక్క‌బ‌ట్టు. కౌర‌వ సైన్యాన్ని చూసి బెద‌ర‌కు. వాళ్ళు విస్తుపోయేట్టా మ‌న బ‌లం, శౌర్యం చూపించి ప‌శువుల‌ను వ‌ళ్లించుకు వెడ‌దాం అంటూ అర్జునుడు ర‌ధాన్ని పోనిచ్చాడు.

ఉత్త‌రుడు తెల‌తెల బోయాడు. అత‌ని గుండె గుభేలుమ‌న్న‌ది.

దూరాన్నుంచే పారిపోతే పౌరులు న‌వ్వుతారా ?  వాళ్ల సొమ్ము ఏం పోయింది ?  న‌వ్వుతే న‌వ్వుతారు. న‌న్ను లాక్కెళ్ళ‌కు. నీ క్రొవ్వు అర‌గ‌క‌పోతే నువ్వెళ్లి త‌ల‌ప‌డు ! నువ్వెలా పోతేనాకేం అంటూ శ‌ర‌ములు, చాప‌ములు ర‌థంలోనే వ‌దిలివేసి ఒక్క గంతులో ర‌థం లోంచి నేల‌మీర‌కు ఉరికి ఉత్త‌రుడు, సిగ్గుమాలిన వాడై ఊరి దెప‌కు పరుగు ప‌రుగున పోబోయాడు.

అత‌ని ప్ర‌వ‌ర్త‌న అర్జునుడికి అస‌హ్యం క‌లిగించిన‌ది. అత‌డు కూడా ర‌థం పైనుండి ద‌భాలున ఉరికి విడివిడి  ఉన్న దీర్ఘ‌కేశ‌ములు వ్రేళ్లాడుతున్నా స‌ర‌కు చేయ‌క ఉత్త‌రుడి వెంట ప‌రుగెత్తాడు.

ఈ దృశ్యం కౌర‌వ బ‌లంలో కొంద‌రు మాత్ర‌మే చూశారు. తెలివైనా మూర్ఖులు వికృత‌మైన పేడి రూపం చూచి అప‌హాస్యం చేశారు. ప్రాజ్ఞాలువ మాత్రం ఆ మూర్తిలోని సౌమ్య‌త‌, ఉదాత్త‌త‌, బాహువుల దీర్ఘ‌తున‌డ‌క తీరు గ‌మ‌నించారు. సందేహంలోప‌డ్డారు.

ఆడ‌వాలకం ! పురుషా కారం ! వేషం విచిత్రంగా ఉందే ?  నివురు గ‌ప్పిన నిప్పులాగ ! ఇత‌డెవ‌రో ! అత‌ని చేతులు న‌డ‌క తీరు అచ్చంగా అర్జునిడిలా ఉన్నాయి. ఎంత మాత్రం సందేహం లేదు. అత‌డే మ‌త్స్య‌రాజ్యంలో పేడి రూపంలో నిగూఢంగా ఉన్నాడు కాబొలు. కాక‌పోతే ఈ కురుసైన్యంతో యుద్ధానికి ఎవ‌డైనా ఒంట‌రిగా రాగ‌ల‌డా ! విరాటుడు ప‌ట్ట‌ణంలో గ‌ల వీరుల్ని సార‌ధుల్నీ వెంట బెట్టుకుని ద‌క్ష‌ణి దిక్కుకు యుద్ధానికిపోయే సరికి ఇక  ప‌ట్ట‌ణంలో ఎవ‌రూ లేక ఉత్త‌రుడు ఇక్క‌డికి రావ‌డానికి సంసిద్ధుడైతే అత‌ని ర‌థం ఇత‌డు తోలుకొని ఇక్క‌డ‌కు తీసుకొచ్చి ఉంటాడు !  ఆల‌మంద‌ల‌ను ప‌ట్టార‌ని తెలిసే స‌రికి ఆవేశం ప‌ట్ట‌లేక పిన్న వ‌య‌సువల్ల క్రిదూ మీదూ గాన‌క ఉత్త‌రుడు ఇటు వ‌చ్చాడు. ఈ మ‌హా సైన్యాన్ని చూచి మ‌తి చెదిరిపోయే స‌రికి పారిపోతున్నాడు కాబోలు ! ఈ ప్ర‌కారంగా కొంద‌రు త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగించారు.

బృహ‌న్న‌ల ప‌ది ఆంగ‌ల‌లో ఉత్త‌రుణ్ణి ప‌ట్టుకొన్నాడు. ఉత్త‌రుడు వెల‌వెల‌బోయాడు. అత‌ని పెద‌వులు ఎండిపోయాయి. శ‌రీరం మ‌చ్చెమ‌ట‌లూ పోశాయి. ఒళ్లు చ‌ల్ల‌బ‌డింది. కాళ్లు చేతులు వ‌ణ‌కుతున్నాయి. గుండె ద‌డ‌ద‌డ‌లాడుతోంది. మెముదీన‌మైంది. వెర్రి చూపు ప‌డింది. త‌న‌ను విడిచి పెట్ట‌మ‌ని ఏడుస్తున్నాడు. గొంతు బొంగురు పోయింది. పరిశుద్ధ‌మైన బంగార‌ము అష్ట‌వైఢూర్యాలు, గుర్రాల‌తో ఒక ర‌థ‌ము, ప‌ది ఏనుగులు, ఒక క్రామ‌ము పట్ట‌ణం చేర‌గానే ఇప్పిస్తానంటూ గ‌ద్గిదిక‌తో బ్ర‌తిమ‌లుకుంటున్నాడు. నా మీద మా అమ్మ‌కు ఎంతో ప్రేమ‌. పుట్టెడు బెంగ‌తో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మా అమ్మ‌ను చూడాలి. న‌న్ను పోనియ్యి. నీకు పుణ్యం ఉంటుంది. అంటూ అతి దీనంగా ప్రార్థిస్తున్నాడు.

అర్జునుడు న‌వ్వాడు. అత‌నిని నెమ్మ‌దిగా ర‌ధం వ‌ద్ద‌కు తీసుకువెళ్లి భ‌య‌ప‌డ‌కు బాబూ ! కురు వీరుల‌తో పోరు నీకు ఆశక్య‌మైతేపోనీలే ! వ‌ద్దు నువ్వు యుద్ధం చెయ్యొద్దు. నువ్వు ర‌ధ‌సార‌ధం చెయ్యి. నేను కార్చిచ్చులాగ పిడుగులాగ శ‌త్రు వీరుల్నంద‌రినీ నాశ‌నం చేస్తాను. ఆ సైన్యాన్ని త‌రిమేస్తాను. ఆల‌మంద‌ల్ని మ‌ళ్లిస్తాను. అంటూ ఉత్త‌రుడు స‌మీపించ‌క‌పోయినా అత‌డ్ని ర‌థం ఎక్కించుకొని స‌రాస‌రిగా జ‌మ్మి చెట్టు త్రోవ బ‌ట్టించినాడు.

ఆ స‌మ‌యంలో కౌర సైనికులు ఏదో చెప్ప‌రాని భ‌యం, నివ్వెర‌పాటు, గ‌గుర్పాటు బాధింప‌గాగిన‌ది. వారికి దువ‌శ్శ‌కునాలు క‌నుపించ‌సాగిన‌వి. ఆకార‌ణంగా ఏనుగులు ఘీంకారం చేయ‌సాగిన‌వి. గుర్రాలు క‌న్నీరు కారుస్తున్న‌వి. కొన్ని ఆయుధాలు ఆక‌స్మాత్తుగా త‌గుల‌బ‌డ్డాయి. ద్రోణుడు త‌ను త‌ను వాహ‌నాలు ఆయుధాలు భ‌ద్ర‌ప‌ర్చుకొని త‌గు జాగ‌రూక‌త‌తో ఆప్ర‌మ‌త్త‌తో ప‌శువుల‌ను కాచుకోవ‌ల‌సిన‌ద‌ని కౌర‌వ సైన్యాన్ని హెచ్చ‌రించారు.

ద్రోణుడు అర్జునుణ్ణి గుర్తించి అత‌ని అజ్ఞాత వాస‌నియ‌ను భంగం  అవుతుందేమో అని భ‌యపడ్డాడు. నెమ్మ‌దిగా భీష్ముడి వ‌ద్ద‌కు చేరి తెలివి త‌క్కువ త‌నం కాకపోతే కౌర‌వుల‌కు ఇలాగ అగుప‌డ‌వ‌చ్చా ?  ఏదో చెట్టువంక‌తో ఇక్క‌డ‌నే అత‌డు రావ‌డం చూస్తే ఆశ్చ‌ర్యంగా ఉంది. వ‌ట్టి అహంకారం త‌ప్ప క్రిందా మీదా కాన‌డు. ఏమ‌నుకుంటున్నాడో ఏమిటో ?  అని నిగూఢంగా ర‌హ‌స్యంగా అన్నాడు భీష్ముడితో.

ద్రోణుడి సందేహం భ‌యంతో భీష్ముడికి అర్థ‌మ‌యింది.

ఇంత‌వ‌ర‌కు శ‌త్రువుల‌ను మించి వ‌చ్చాము. ఇంక బ‌లం చూపించ‌వ‌ల‌సిన స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. మ‌నం చ‌లించ‌కూడదు అని నిగూఢూర్థంతో దుర్యోద‌నుడిని హెచ్చ‌రిస్తున్న‌ట్లుగా అంటూ ద్రోణుడికి సందేహ నివృత్తి చేశాడు.
భీష్ముడి మాట‌ల‌వ‌ల్ల అజ్ఞాత వాస భంగ ప్ర‌మాదం అర్జునుడికీ లేద‌ని ద్రోణుడు గ్ర‌హించి లోలోన సంతోషించాడు. త‌న సంతోషాన్ని పైకి క‌న‌ప‌డ‌నీయ‌కుండా ఆక‌లిగొన్న సింహం గుహ నుండి వెలువ‌డి కుంజ‌ర యూధంపైకి ఉత్సాహంతో క్రోధంతో దూకిన‌ట్లు అర‌ణ్యావాస దుఃఖంతో బాధ‌ప‌డిన అర్జునుడు అల్ల‌దిగో కౌర‌వ సేన పైకి వ‌స్తున్నాడు. అత‌నితో యుద్ధానికి ఇయ్య‌కొన‌ల‌గ‌ల స‌మ‌ర్థుడు మ‌న సేన‌లో ఉన్నాడో లేడో సందేహం. ఆల‌మంద‌ల‌ను వ‌స‌ప‌ర్చుకోవ‌డం అతనికి మిక్కిలి సుక‌ర‌మే ! బాహుబలంలో రుద్ర‌ణ్ణోమెప్పించాడ‌ని వినిన్నాం కామా ?  అన్నాడు.

ద్రోణుని మాట‌ల‌కు క‌ర్ణుడు మండి ప‌డ్డాడు.

పాండ‌వ ప‌క్ష‌పాతంతో నోటికి వ‌చ్చిన‌ట్ల‌ల్లా మాట్లాడుతున్నావు. నిన్నేమి అన‌కూడ‌దుగాని కౌర‌వ సేన‌లోమేటి అనిపించుకొన్న నువ్వు ఇలాగ శ‌త్రువుని గొప్ప‌గా పొగొడుతూ వ‌న వాళ్ళ‌కు నిస్స‌త్తువ పిరికిత‌నం క‌లిగేట్లా అన‌వ‌చ్చా ?  అర్జునుడు అంత ఎక్కువ‌వాడా ?  నిజంగా అర్జునుడే వ‌స్తే నా అస్త్రాల‌తో పార‌దోలి మ‌న వీరుల‌కు ఆనందం క‌లుగ‌చేస్తాను అని క‌ర్ణుడు ద్రోణునికి స‌మాధానం ఇచ్చాడు.