19
 


యోగ సిద్ధాంత‌ము


భ‌క్తి జ్ఞాన వైరాగ్యాదుల‌తోబాటుగ రాజ‌యోగాది యోగమార్గ‌ములు కూడ మోక్ష‌ప్రాప్తి హేతువులు కావ‌చ్చును. ప్రాణాయామాద్య‌భ్యాస‌ము చేత కొన్ని హ‌ర‌యోగాది ప్ర‌ద‌ర్శ‌న‌ముల‌చేత ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టు కుహ‌నాయోగుల వ‌ల‌న‌ను, ఈ మార్గ‌మునున్న అభ్యాస‌క‌ఠిన‌త్వ‌ముచేత‌ను యోగ‌మార్గ‌ము విస్మ‌రింప‌బ‌డుచునో లేక శారీర‌క వ్యాయామ‌ము క్రింద‌నో చూడ‌బ‌డుచున్న‌ది.

విశ్వ‌నాథ‌వారి న‌వ‌ల‌లో యోగ‌మార్గ‌మున‌వ‌లంబించిన స్త్రీల‌లోన‌ది ప్రాణాయామ‌ము వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌ము చేసికొనిన‌ది. వేయి ప‌డ‌గ‌లు లోని మంగ‌మ్మ స‌రోజ‌లోచ‌న యోగ‌ముతో ప్రాణ నిష్క్ర‌మ‌ణ‌ము గావించుకొన‌గ‌లిగిన‌ది. దిండు క్రింద పోక‌చెక్క లోని ర‌త్నావ‌ళి యోగ‌ముతో కాష్ఠ‌ము వ‌లెనైన‌ది.

సంపూర్ణ యోగ‌మున‌కు ప్ర‌తీక‌గ వేయిప‌డ‌గ‌లు లోని గ‌ణాచారి స్వ‌రూప‌ము విశ్లేషింప‌బ‌డిన‌ది ఈమెద్వారా ర‌చయిత యోగ‌మును ప‌ర‌కాష్ట‌ద‌శ‌కు చేర్చిర‌న వ‌చ్చును.

గ‌ణాచారి

వేయిప‌డ‌గ‌లు న‌వ‌ల‌యందు గ‌ణాచారి రూప‌క‌ల్ప‌న‌ము సంపూర్ణ యోగ‌మున‌కు ప్ర‌తీక‌యై యొప్పిన‌ది. న‌వ‌ల‌యందు క‌థాగ‌మ‌న విష‌య‌మున గ‌ణాచారికున్న ప్రాముఖ్య‌ము త‌క్కువ‌గానే యుండిన‌ప్ప‌టికిని ఈమె ద్వారా విశ్వ‌నాథ‌వారు వెల్ల‌డించిన యోగ‌ర‌హ‌స్య‌మ‌లు సామాన్యాములు. విశ్వ‌నాథ తాము ర‌చించిన చాల‌న‌వ‌ల‌లో యోగ‌శాస్త్ర‌ప్ర‌స్తావ‌న‌ము గావించి యున్నారు. ఏక‌వీర మాన‌సిక‌మైన యేకాగ్ర‌త‌తో న‌తిశ‌య‌త్వ‌గింద్రియ జ్ఞాన‌మును వ‌శము చేసికొనిన‌ది. తెఱ‌చిరాజు లోని సార‌ధి కూడ‌నొక యోగ‌మ‌భ్య‌సించి కొల‌ది మాత్ర‌పుసిధ్దిని పొందెను. ఇట్లే దిండు క్రింది పోక‌చెక్క యున్న‌న‌వ‌ల‌లో ర‌త్నావ‌ళియును చంద‌వోలురాణి లోని స‌రోజ‌మును కూడ యోగ‌మ‌భ్య‌సించి త‌త్ఫ‌ల‌ముగ ప్రాణోత్ర్క‌మ‌ణ‌మును సాధించిరి. స్వ‌ర్గానికినిచ్చెన‌లు న‌వ‌ల‌లోని హ‌నిప‌బాలిర శ‌శి చిర‌కాల‌స‌మాధిని సాధింప‌గ‌లిగి మ‌రింత యున్న‌త‌ద‌శ‌కు చేరుకొనిన‌ది. శ్రీ సుప్ర‌స‌న్న గ‌ణాచారిది సుషుమ్న స్థాన మ‌నినుడివిరి. గ‌ణాచారిని కుండ‌లినీశ‌క్తి య‌న‌వ‌లెను. చిద‌గ్నికుండ సంభూత‌యైన ల‌లితా త్రిపుర‌సుంద‌రి దివ్యాంశ‌గ గణాచారి నెన్న‌వ‌లెను.

 

ప్ర‌జ‌ల‌కు పాట‌రూప‌మున గ‌ణాచారి భ‌విష్య‌మును సూచించుచుండును వేయిప‌డ‌గ‌ల‌పాము విప్పారుకొని వ‌చ్చికాటందుకొన్న‌దీ క‌లలోన రాజును. అన్న‌గ‌ణాచారి పాట‌తో వేయిప‌డ‌గ‌లు న‌వ‌ల‌కు శ్రీ‌కార‌ము చుట్టినారు శ్రీ విశ్వ‌నాథ‌. గ‌ణాచారి పాట‌తో న‌వ‌ల‌ను ప్రారంభించుట య‌న‌గా వీరు గ‌ణాచారి పాత్ర‌కు ప్రాముఖ్య‌ము నిచ్చుట‌యే య‌న‌వ‌చ్చును. మ‌రియునిచ‌టి పాము ధ‌ర్మ‌రూప‌ము. గ‌ణాచారి కాల‌రూప‌ము, యోగ‌రూప‌ము న‌గుట‌చే నీ పాట‌కు న‌వ‌ల‌లోని క‌థాసంవిధాన‌మున‌కున‌వినాభావ సంబంధ‌మిచ‌ట వ్వ‌క్త‌ముచేయ‌బ‌డిన‌ది.

గ‌ణాచారి పాత్ర‌వ‌ల‌న క‌లుఉ సాంఘిక పార‌మార్థిక ప్ర‌యోజ‌న‌ముల‌ను త‌దౌచిత్య‌మును గూర్చిచ‌ర్చింప వ‌ల‌యును. భార‌తదేశ‌మును అనాది కాల‌మునుండియు, ఆగ‌తానాగ‌త విషయ‌ములు కొంద‌రికి తెలియుట‌యును వారు ప్ర‌జ‌లకారాబోవు క‌ష్ట సుఖ‌ముల‌గూర్చి హెచ్చ‌రించుట‌యును. వారిని ప్ర‌జ‌లు గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో పూజించుట‌యును జ‌రుగుచునేయున్న‌ది.

ఇట్లు భూత భ‌విష్య‌ద్వ‌ర్త‌మాన కాలిక సంఘ‌ట‌న‌ల‌ను గూర్చి మున్ముందుగ తెలిసికొనుట‌వ‌ల‌న ప్ర‌యోజ‌న‌మేమి జ‌రుగ‌వ‌ల‌సిన‌ది జ‌రిగియే తీరునుగ‌దాయ‌న్న్ చో స‌మాధాన‌ములేదు. కాని ప్ర‌తివ్య‌క్తికిని త‌మ‌భ‌విష్య‌మెటులుండునో తెలిసికొన‌వ‌లెన‌న్న కుతూహ‌ల‌ముండును. ఇది మాన‌వ నైజ‌ము. కొన్ని య‌న‌ర్థ‌ముల‌కుప‌శాంతులున్న‌వి. ఆగ‌తానాగ‌త‌ముల‌ను తెలియ‌గ‌ల‌శ‌క్తి యొక్క మ‌త‌ము వారికి గాని యొక దేశ‌ము వారికి గ‌ని భాష వారికిగాని ప‌రిమిత‌ముగాదు. ఈ శ‌క్తిగ‌ల‌వారెల్ల కాల‌ములందును ప్ర‌పంచ‌మునందెచ్చ‌ట‌నైన గ‌ల‌రు. ఇందుల‌కుదాహ‌ర‌ణ‌ముగ 17వ శ‌తాబ్ద‌మున ఇరాన్‌దేశ‌మున పుట్టిన సూఫీవేదాంతియ‌గు శ‌ర్మ‌ద్ పండితుని పేర్కొన‌వ‌చ్చును. శ‌ర్మ‌ద్ రాజ్య‌ముల‌లోనెట్టి మార్పులు జ‌రుగునో ఏ రాజు తరువాత‌నే రాజు సింహాస‌న‌మ‌ధిరోహించునో చెప్పుచుండెడివాడు. అవిస‌త్య‌ముల‌గు చుండెడివి. ఇట్లు చెప్ప‌గ‌ల్గుట‌కు హిందూ దేశ‌మున ప్రాచీన‌కాల‌మునుండియు అనేక‌శాస్త్ర‌ముల‌న్న‌వి. ఔ్య‌తిష‌ము, యోగ‌ము మొద‌లైన న‌విందుల‌కు మార్గ‌ద‌ర్శ‌క‌ముల‌న‌వ‌చ్చును. ఇటీవ‌లి కామువారైన ర‌మ‌ణ గ‌ణ‌ప‌తుల‌నిచ‌ట పేర్కొన‌వ‌చ్చును. ర‌మ‌ణుడు అరుణాచ‌ల‌మున నివ‌సించెను. నేను అన‌గానెవ్వ‌రో తెలిసికొనుమ‌ని మ‌న‌సునాత్మ వైపున‌కు మ‌ళ్ళించుట‌కై బోధ‌న‌లు చేసిన మ‌హ‌ర్షి. గ‌ణ‌ప‌తి క‌ఠిన‌మైన సాధ‌న‌తోగూడిన యోగ‌మార్గ‌మున‌వ‌లంబించి క‌పాల‌భేద‌న‌ము త‌రువాత కూడ జీవించిన మ‌హాముని. కావున గ‌ణాచారి వంటి పాత్ర‌గాలినుండి జ‌నించిన‌ది కాదు. ఈ పాత్ర‌సృష్టికి ప్రేర‌క‌ములైన య‌నేక ఘ‌ట్ట‌ములు భార‌తీయ పురాణేతిహాస‌ములందు క‌ల‌వు.

.