27
 


కొంద‌రు వ్య‌క్తులు స‌న్య‌సించిన త‌రువాత‌, స‌న్యాసుల‌కు యుక్త‌మైన రీతిలో క‌పాల‌భేద‌ము జ‌రుగ‌క‌పోయిన‌చో నిత‌రులావ్య‌క్తి త‌ల‌పై కొబ్బ‌రికాయ కొట్టి బ‌ల‌వంత‌ముగ శీర్ష భేద‌న‌ము చేయుదుర‌ని వాడుక‌. కాని క‌పాల‌ము త‌నంత తాను విభేద‌మైన యోగిపుంగ‌వున‌కు బాహ్యాభ్యంత‌ర భేద‌ము న‌శించి నీవు, నేను అన్న‌భేద‌ము రూపుమాసిపోయి స‌ర్వ‌ము తాన యైన స్థితి ల‌భించున‌ని శాస్త్ర‌ముద్బోధించుచున్న‌ది.

ఇట్లు గ‌ణ‌ప‌తిముని యొక్క సిద్ధివ‌ల‌న శీర్ష‌మును ఛేదించుకొనుచున‌గ్ని బ‌హిర్గ‌త‌మ‌గున‌ట్లును, ఇదియొక సాధ‌న‌మ‌నియును తెలియుచున్న‌ది. మ‌హావిరాట్స్వ‌రూపుడైన నారాయ‌ణున‌కు మానువుడు ప్ర‌తిబింబ‌ము వంటివాడు. అట్టి విరాట్పురుషుని ఆధ‌ర్వ‌ణ‌మందిట్లు గాన‌ము చేసియున్నారు.


అగ్నిర్మూర్ధా చ‌క్షుషీ చంద్ర‌సూర్యేదిశ‌శ్ర్మోత్రే వాగ్వివృతాశ్చ వేదాః

వాయుఃప్రాణో హృద‌యం విశ్వ‌మ‌స్య ప‌ద్భ్యాం పృధివీ.

స‌ర్వ‌వ్యాపియ‌గు ప‌ర‌మేశ్వ‌రుడిట్టి మ‌హ‌త్స్వ‌రూప‌ము గ‌ల‌వాడు అయిన‌ను మాయావ‌శ‌ముచేత దేహ‌ములందు జీవ‌రూప‌ముతోడ‌ను బ్ర‌హ్మాండ‌మునందు విరాడ్రూప‌ముచేత‌ను ప‌రమేశ్వ‌రుడు ప్రకాశించుచున్నాడు. అన‌గా మాన‌వున‌కుకూడ‌నీ విశేష‌ములు స‌రిప‌డును. మూర్థ‌భాగ‌మున న‌గ్ని క‌న్నుల‌యందు సూర్య‌చంద్రులు దిక్కులు చెవులు..ఇత్యాది వ‌ర్ణ‌న‌మువ‌ల‌న‌ను, వైశ్వాన‌ర‌రూప‌ముతో ప్రాణుల దేహ‌ములందాశ్రితుడ‌నై యుండెద‌న‌న్న గీతావాక్య‌మువ‌ల‌న‌ను ప్రాణుల‌యంద‌గ్ని మాయామేఘ‌ముల‌మాటున దాగిన సూర్యునివ‌లె తెలియుచున్న‌ది. గ‌ణాచారి జ్ఞాన‌సూర్యుని ప్ర‌త్య‌క్ష‌ము చేసి కొనిన‌ది గావున‌నా య‌గ్నిని క‌పాల‌భేద‌న‌రూప‌మున బ‌య‌ట‌కు వెడ‌ల‌గ్ర‌క్కిన‌ది. ఆ య‌గ్నివ‌ల‌న‌నే పాక‌యంటుకొనుట‌యు,తాను విభూతియ‌గుట‌యు సంభ‌వించిన‌ది. ద‌క్షుని య‌జ్ఞ‌మున‌కు వెళ్ళిన దాక్షాయ‌ని తండ్రి చేసిన య‌వ‌మాన‌మున‌కు యెగాగ్నిచేత ద‌గ్ధ‌మ‌గు యెల్ల‌ర‌కును విదిత‌మే. ఈ ప్ర‌కార‌ముగ చేయుట‌కు యోగ‌సాధ‌న‌ముప‌క‌రించున‌ని శాస్త్ర‌ము చెప్పుచున్న‌ది. దేవి ప‌ద్మాస‌నంలో కూర్చుని ప్రాణ‌ముల‌ను బంధించి మూలాధార చిద్వ‌హ్ని నెగ‌యించి నాసాగ్ర‌న‌య‌న‌యై చిద‌గ్నిని ప్ర‌జ్వ‌లింప‌చేసింది. ఈ అగ్ని ఆమె శ‌రీరాన్ని భ‌స్మ‌రాశికూడా లేకుండా ద‌హింప‌చేసింది. 22 కుండ‌లినీశ‌క్తి య‌న‌గా నాగ్నేయ‌శ‌క్తి, కుండ‌లినీ మ‌హాదేవి చిద‌గ్ని కుండ‌మున నుధ్భ‌వించిన‌ది. ప‌ర‌మ‌శివుడుకూడ‌నీ యాగ్నేయ‌చ‌క్ర‌మునుండి యుద్భ‌వించిన య‌గ్నివ‌ల‌న‌నే మ‌న్మ‌ధుని ద‌హించెను. ఇదియే విస్ఫులింగ నేత్ర‌మైన‌ది. యెగ‌శాస్త్ర‌మున ప‌రాశ‌క్తి యును ప‌రాత్ప‌రుడునైన సాంబ‌శివుడును శ్రీ‌ల‌లిత‌యును శివ‌శ‌క్తుల‌న‌బ‌డుచుండిరి.

గ‌ణాచారి సుబ్ర‌హ్మ‌ణ్యున‌కు వ్యాఖ్యాత్రియ‌గుట‌యేగాక శివాంశ సంభూత‌యై కాల స్వ‌రూప‌మై అతిశ‌యించిన యోగ‌స్వ‌రూప‌మై ముక్తినందిన‌ది. న‌త‌స్య‌ప్రాణా ఉత్ర్కామ‌న్తి అత్త్రెవ స‌మ‌వ‌లీయంతే 23 య‌ని శ్రుతి బ్ర‌హ్మ‌జ్ఞానుల‌యొక్క ప్రాణ‌ములు ఉత్ర్క‌మించుట‌లేదు. అచట‌నే లీన‌మ‌గుచున్న‌ద‌వి. ఇందుచేత గ‌ణాచారి మ‌ర‌ణ‌ర‌హిత‌యైన‌ది. అన‌గా మోక్ష‌మునందిన‌ద‌న‌వ‌లెను.

గ‌ణాచారి యొక్క చివ‌రి ద‌శ‌ను వ‌ర్ణించుట‌లో విశ్వ‌నాథ‌వారికి గ‌ణ‌ప‌తిముని య‌నుభ‌వ‌ములు ప్రేర‌క‌ములై యుండ‌వ‌చ్చును.