31
 

సృష్టియందంత‌ట విరాట్స్వ‌రూప‌మును దాల్చియున్న ప‌ర‌మాత్ముని పూజించుట‌కు మాన‌వ‌మాత్రున‌కు సాధ్య‌ముకాదు. గావున ప్ర‌గాఢ విశ్వాస‌ముతో గూడిన త‌ప‌స్సుగాని య‌జ్ఞ‌యాగాదుల‌గాని చేయుట మిక్కిలి క‌ష్ట‌ము గ‌నుక ప‌తిసేవ‌యే త‌రుణోపాయ‌ముగ నిర్దేశింప‌బ‌డిన‌ది. సృష్టిలో క‌ష్ట‌సాధ్య‌మ‌గు ప్ర‌తిసృష్టిని చేయు స్త్రీ స‌గ‌ము దైవ‌కార్య‌ము చేయుచునేయున్న‌ది. వేద‌ప‌ఠ‌న‌ము, య‌జ్ఞ‌యాగాదుల‌ను చేయ‌నీయ‌క స్త్రీని పూర్వికులు కించ‌ప‌ర‌చిర‌నుట స‌మంజ‌స‌ముకాదు. స్త్రీల‌కు శూద్రుల‌కును వేద‌ము చ‌దువ‌రానందున పంచ‌మ వేద‌మైన మ‌హాభార‌త‌ము ర‌చింప‌బ‌డిన‌ద‌నుట‌లో స‌త్య‌ము లేదు. అట్టి య‌జ్ఞ‌యాగాదుల‌కు ప‌విత్ర‌వైదిక లౌకిక వాజ్ఞ్మ‌య ప‌ఠ‌న‌మున‌కును ఫ‌ల‌రూప ప‌దార్ధ‌మైన ముక్తియే పాతివ్ర‌త్య‌మున‌కుగూడ ఫ‌ల‌ము.

ఇంత‌టి వైవిధ్య‌ముండుట‌చే జాన‌కి పాత్ర‌చిత్ర‌ణ‌మును సాంఘిక న‌వ‌ల‌లోని స్త్రీ పాత్ర‌ల‌తో పోల్చిచూడ‌లేదు. ఈ న‌వ‌ల‌యందు ర‌చ‌యిత ఘ‌ట‌న‌కు ప్రాముఖ్య‌మునిచ్చియున్నారు. ఇందు పాత్ర‌ల క‌ర్తృత్వ‌మున కెక్కువ తావులేదు. అన్ని సంఘ‌ట‌న‌ములు విధాత‌యే త‌న‌కిచ్చ‌వ‌చ్చిన‌ట్లు నిర్మించుట‌యు పాత్ర‌ధారులు మౌన‌ప్రేక్ష‌కుల‌వ‌లె చూచుచుండుట‌యు జరిగిన‌ది. పూర్వ‌జ‌న్మ సంస్కార‌ముల‌కు, జాత‌క‌ముల‌కు సాధువుల‌కు గోసాయిల‌కు క‌థాగ‌మ‌న‌ముతో సంబంధ‌మోక్కువ‌గానున్న‌ది. అందుచేత‌నీపాత్ర‌లోనిన్ని గుణ‌దోష‌ములున్న‌వ‌నుట క‌ష్ట‌ము.

 

జాన‌కికి రెండు స‌మ‌స్య‌లెదురైన‌వి. ప్ర‌స్తుత జ‌న్మ సంబంధికుల‌గు తల్లికి త‌మ్మున‌కుగాని య‌న్యాయ‌ము చేయ‌ద‌ల‌చ‌లేదు.అటు పూర్వ‌జ‌న్మ‌లోని భ‌ర్త‌ను సంబంధ‌ము లేన‌ట్లు విడిచిపుచ్చ‌లేదు. త‌ను ఆరు జ‌న్మ‌లుగా సాగించుచున్న పాతివ్ర‌త్య మ‌హాయ‌జ్ఞ‌మును కొన‌సాగించుకొన‌లేకుండ‌నుండ‌లేదు.


రెండు వైపుల‌నుండి సంక్ర‌మించిన బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మ‌ముగ నిర్వ‌ర్తించుకొనుచు త‌న సంక‌ల్ప‌మునుకూడ నెర‌వేర్చుకొన్న‌ది. ఈమెలో రెండు ప్ర‌కృతులున్న‌వి. ఒక‌టి లౌకిక ప్ర‌కృతి. త‌ల్లిని త‌మ్ముని నొప్పింప‌క సంచ‌రించుట‌.

త‌న‌యొక్క గ‌త‌స్మృతుల‌ను త‌న గ‌త‌జ‌న్మ సంబంధికులొప్పుకొనున‌ట్లు నేర్పుగ గుర్తుచేయుట సీతారాముని పైకి తీసికొనివ‌చ్చుట య‌న్న‌వి. రెండ‌వ‌ది అలౌకిక ప్ర‌కృతి. ఇది పూర్తిగ నాధ్యాత్మిక‌మైన‌ది. నవ‌యౌవన‌వ‌తియైన‌ను గ‌త‌స్మృతుల న‌నుస‌రించి వృద్ధుని పెండ్లియాడి పాతివ్ర‌త్య మ‌హావ్ర‌త‌మును కొన‌సాగించిన‌ది.

జాన‌కి త‌న గ‌త‌జ‌న్మ‌లోని ప‌తియొక్క రెండ‌వ కుమారుని అభివృద్ధిలోనికి తెచ్చిన‌ది. ఇది నిస్స్వార్ధ‌పూరిత‌ము మాత్స‌ర్య‌ర‌హిత‌ము ద‌యాస‌హిత‌మునై న‌ట్టి కార్య‌ము. జాన‌కి గొప్ప‌త‌న‌మీప‌నియందు ద్యోత‌క‌మ‌గుచున్న‌ది. తల్లిని త‌మ్ముని వ‌ద‌ల‌కుండ కాపాడుట‌య‌న్న విష‌య‌మ‌సాధ్య‌ముగాని సాధార‌ణ కార్య‌ముగానికాదు. ఇది ర‌క్తసంబంధికుల‌యందు ప్రేమ‌యున్న ప్ర‌తి వ్య‌క్తియును నెర‌వేర్చు బాధ్య‌త‌యే. నీల‌కంఠ‌శాస్త్రిని పెండ్లి యాడుట‌కూడ ఘ‌న‌కార్య‌ము కానేర‌దు. ఏల‌య‌న జాన‌కి జ‌నించిన‌దే మ‌ర‌ల శాస్త్రిని పెండ్లియాడుట‌కు. ఆత‌డు వృద్ధుడైన‌ను, అనాగ‌రికుడైన‌ను, స్వీక‌రించుట‌కు నిశ్చ‌యించి క‌ర్మ‌పురుషుని కోరి జ‌నించిన‌ది. అత‌నిని పెండ్లియాడుట‌కూడ కేవ‌ల‌మ‌త‌నిమీద ప్రేమ‌చేత కాద‌న్న‌య‌నుమాన‌ము క‌ల్గునట్లు ప‌ల్కిన‌ది. మీయందు నాక‌ధిక‌మైన ప్రేమ‌యో, ఆ ఏకాగ్ర‌త యందు నాక‌ధిక‌మైన ప్రేమ‌యో నాకు తెలియ‌దు అన్న‌ది. లోక‌మున ఏది సాధ్య‌మో, సాధ‌న‌ముమీద యెక్కువ ప్రేమ ఉండున‌న్న‌ది. ఇట్ల‌నుట‌వ‌ల‌న జాన‌కికి ప‌తిమీద‌క‌న్న పాతివ్ర‌త్య‌ము మీద‌ను భావిసిద్ధిమీద‌ను ప్రేమ‌య‌ధిక‌మ‌నుట స్ప‌ష్ట‌ము.

ఈ న‌వ‌ల‌లో జ్యోతిశాస్త్ర‌మున‌కుకూడ న‌ధిక‌మైన ప్రాధాన్య‌మున్న‌ది. నీల‌కంఠ‌శాస్త్రి జాన‌కి మ‌ర‌ణాంత‌ర‌ము దుఃఖించుచుండ‌గా నొక జ్యోతిశ్శాస్త్ర‌వేత్త వ‌చ్చి ఈయ‌న‌కు చెడ్డ‌రోజులు, ఈయ‌నే పోవ‌ల్సింది. భార్య పోయింది గ‌నుక ఈయ‌న పోలేదు. ఈ జాత‌కంలో ఒక చ‌మ‌త్కార‌ముంది. ఆ భార్య బ్ర‌తికి వ‌స్తుంది..ఆవిడ బ్ర‌తికి రావాలి అనెను. అన‌గా జాన‌కి మ‌ర‌ల రామ‌క్క‌గ జ‌న్మించిన‌ది యోగ‌సంపూర్తి కొర‌కు త‌న పుణ్య‌ఫ‌ల‌ము న‌నుస‌రించియా ? లేక మ‌ర‌ల నామె బ్ర‌తికి రావ‌ల‌సిన యోగ‌ము శాస్త్రి జాత‌క‌ములో నుండుట‌వ‌ల‌న‌నా ? జాత‌క‌ములో నుండుట‌వ‌ల‌న‌నా, జాత‌క‌ములోనున్న‌ది గావున నామె వ్ర‌త‌ము చేయ‌క‌పోయిన‌ను జ‌నించునా ? అన‌గా ఇరువురి పుణ్య‌ములు క‌లిసి రావ‌ల‌యున‌ని చెప్ప‌వ‌ల‌యును. గృహ‌ములోని క‌ష్ట‌సుఖ‌ము లిరువురికి స‌మ‌మేగాన నిరువురి క‌ర్మ‌యొక్క‌లాగున నుండ‌క త‌ప్ప‌దు. భార్యాభ‌ర్త‌లిరువురి జీవిత‌ములు విడ‌దీయ‌రానంత‌గ‌, ప్ర‌గాఢ‌ముగ న‌ల్లుకొనుట‌వ‌ల‌న‌నే హిందూదేశ‌మున దాంప‌త్య ధ‌ర్మ‌మింక‌ను చ్యుతికాలేద‌ని చెప్ప‌వచ్చును.

ఒక వ్య‌క్తి యొక్క (జాత‌క‌) గ్ర‌హ సంప‌త్తిన‌నుసరించి భూత భ‌విషద్వ‌ర్త‌మాన జ‌న్మ‌ల‌నుగూర్చి చెప్ప‌వ‌చ్చున‌ని శాస్త్ర‌మునందు క‌ల‌దు. హిందూ సిద్ధాంతం ప్ర‌కారం ఒక శిశువు జ‌నించిన‌ప్పుడు అత‌నిలో అత‌ని గ‌త‌జ‌న్మ‌ల సంస్కార‌ములుంట‌వి అని స‌ర్ ఉడ్‌ర‌ఫ్ భావించెను. శిశువున‌కు గ్రాహ్య‌ము కాక‌ముందుకూడ త‌న‌లో తాను న‌వ్వుకొనుట‌యు నేడ్చుట‌యు, నులికిప‌డుట‌యును చేయును. ఈ కార్య‌ముల‌న్నియు గ‌త జ‌న్మ‌లోని య‌నుభ‌వ‌ము లాధార‌ముగ జేసికొని శిశువు అనుభూతుల‌ను పొందున‌ని గౌత‌ముడు నుడివెను. పుట్టిన వెంట‌నే శిశువు క‌న్నులు విప్ప‌క‌పోయిన‌ను పాల‌ను త్రాగుట‌లో నేర్పును ప్ర‌ద‌ర్శించును. ఇందుల‌కు కార‌ణ‌ము గ‌త జ‌న్మ‌లలోని య‌ల‌వాటేయ‌ని గౌత‌మ‌ముని య‌భిప్రాయ‌ప‌డెను. ఇట్టి గ‌త‌జ‌న్మ సంస్కార‌మెట్టిదైయుండునో గ్ర‌హ‌గ‌తుల‌నుబ‌ట్టి చెప్ప‌వ‌చ్చున‌ని గ‌ణిత‌ఖ‌గోళ జ్యోతిశ్శాస్త్ర‌వేత్త‌య‌గు వ‌రాహ‌మిహిరుడు త‌న బృహ‌జ్జాత‌క గ్రంథ‌మున తెలిపియున్నాడు. పుట్టిన ప్రాణియే లోక‌మునుండి వచ్చి యిచ‌ట జ‌నించెనో తెలుపు శ్లోక‌ము.

గురురుడు ప‌తి శుక్రౌ సూర్య‌భౌమౌ య‌మ‌జ్ఞౌ

విబుధ పితృ తిర‌శ్చో నార‌కీయాంశ్చ కుర్యః

దిన‌క‌ర శ‌శివీర్యాధిష్ఠి తాత్త్ర్యంశ నాధా

త్ప్ర‌వ‌ర స‌మ నికృష్టాస్తుంగ హీనాద‌నూకే

గ్ర‌హ‌ముచ్చ‌రాశి గ‌తుడ‌య్యెనేని గ‌త‌జ‌న్మ‌మున జీవి యుత్త‌ముడ‌నియు గ్ర‌హ‌ము నీచ‌రాశి గ‌తుడయ్యెనేని నికృష్ణుడై యుండున‌నియు ఉచ్చ‌నీచ‌రాసుల‌కు మ‌ధ్య‌న‌నుండెనేని మ‌ధ్య‌ముడై యుండున‌నియు భావ‌ము. ద్రేక్కాణాధిప‌తి యొక్క లోక‌మునుండి జీవుడు వ‌చ్చున‌ని భావ‌ము. ద్రేక్కాణాధిప‌తి గురుడైన‌చో దేవ‌లోక‌మునుండియు, చంద్ర‌శుక్రులైన‌చో పితృలోక‌మునుండియు, శ‌నిబుధులైన‌చో న‌ర‌క‌లోక‌మునుండి వ‌చ్చి జ‌నించున‌ని శాస్త్ర‌ము. ఇట్లే మ‌ర‌ణించిన‌వానికి క‌లుగ‌బోవు గతిని తెలిసికొన‌వ‌చ్చున‌ని మ‌రాహ‌మిహిరుడు చెప్పెను. కావున శాస్త్ర వ్యాఖ్యాత జాత‌క‌మును బ‌ట్టి జీవియొక్క స‌ర్వ‌విష‌య‌ముల‌ను నాడీ గ్రంథ‌ము మొద‌లైన‌వానినుండి కూడ నిట్టి స‌మాచార‌ము ల‌భించును. కాని కాల‌చ‌క్ర‌మ‌మున న‌వ‌నాగ‌రిక‌తా ప్ర‌భావ‌ముచేత హేతువాద ప్రాబ‌ల్య‌మ‌తిశ‌యించి యిట్టి స‌నాత‌న శాస్త్రీయ ప‌ద్ద‌తిపై విశ్వాస‌ము స‌డ‌లిపోవుచున్న‌ది. ర‌చయిత ఈ విష‌య‌మున జాన‌కి పాత్ర‌ను శాస్త్రాధార‌ముగ మ‌ల‌చియున్నాడు.

రామ‌క్క త‌ల్లికూడ రామ‌క్క జాత‌క‌ము న‌నేకుల‌కు చూపించిన‌ది. చాలామంది ఆమె జాత‌క‌ములోని వైచిత్య‌మును గురించి వ్యాఖ్యానింప‌లేక‌పోయిరి. నేను దీని జాత‌కం చాలామందికి చూపించాను. వాళ్ళెవ్వ‌ళ్ళూ ఏమీ చెప్ప‌లేక‌పోయారు. ఈ పిల్ల జాత‌కంలో పెళ్ళి వ్రాసిలేదు కాని అవుతుంది...మ‌హాప‌తివ్ర‌త అని చెప్పెవాళ్ళు. అని రామ‌క్క త‌ల్లి చెప్పిన‌ది. పెండ్లి వ్రాసిలేక‌పోయిన యెడ‌ల మ‌రి పెండ్లి యెట్ల‌గును. వారి మాట‌లు ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌ములుగనున్న‌వి.