32
 

జాన‌కి యొక్క జీవిత‌మును రెండు భాగ‌ములుగ విభ‌జించి విమ‌ర్శింప‌వ‌ల‌సియుండును. మొద‌టి భాగ‌మున ప్ర‌స్తుత జ‌న్న విష‌య‌ముల‌కును పూర్వ‌జ‌న్మ‌లోని సంబంధ‌ముల‌కును పొంత‌న కుద‌ర‌క ప‌డిన యంత‌స్సంఘ‌ర్ష‌ణ‌మున‌కు సంబంధించిన‌ది. జాన‌కి నీల‌కంఠ‌శాస్త్రిని పెండ్లియ‌డుట క‌న్నియు నడ్డంకులే. మొద‌టి య‌డ్డంకి జాన‌కి త‌ల్లి.ఆమె వ‌య‌సులోనున్న కుమార్తెను అరువ‌దేండ్ల‌వానికి్చ్చి చేయుట కిచ్చ‌గింప‌లేదు. కుమార్తె చెప్పిన పూర్వ‌జ‌న్మ సంబంధ‌ముల‌యిన మాట‌ల‌ను వినియు ఆమెకు గ‌త జ‌న్మ జ్ఞాన‌మున్న‌ద‌ని న‌మ్మిక‌కూడ న‌మ్మిన‌ట్లుగ న‌టించి పిచ్చియ‌ని తీసివేయును. శ‌త‌థా రామ‌క్క మ‌న‌స్సును నీల‌కంఠ‌శాస్త్రి నుండి మ‌ర‌లింప‌వ‌ల‌న‌యున‌ని యోచించుచునేయుండెడిది. త‌రువాత జాన‌కి కుమారులు, ప‌తంజ‌లి జాన‌కి పెద్ద‌కుమారుడు. ఇత‌డు త‌ల్లిని వెంట‌నే గుత్తించెను. రెండ‌వ కుమారుడ‌గు భ‌ద్రాద్రి న‌మ్మ‌లేదు. ఊరిలోని జ‌నులంద‌రు రామ‌క్క చెప్పు గుర్తుల‌నుబ‌ట్టి పూర్ఇగ‌గ‌త విశ్వ‌సించుట జ‌రిగిన‌ది. కాని భ‌ద్రాద్రి న‌మ్మ‌డు. నీల‌కంఠ‌శాస్తి విజృంభించి తెలివితేట‌ల‌తో త‌మ‌య‌స్తిని త‌మ‌కిప్పించుట వ్యాపార‌మున లాభ‌మార్జించుట చూచిన ర‌మ‌ణ‌క్క కుమార్తె వివాహ‌మును నీల‌కంఠ‌శాస్త్రితో జ‌రుపుట కియ్య‌గొన్న‌ది. వీరిరువురు వివాహ‌మాడుట‌తో జాన‌కిలోని సంఘ‌ర్ష‌ణ‌ము న‌వ‌లార‌చ‌నోద్ధేశ‌మును ప‌రిస‌మాప్త‌ములైన‌వి.

కాని ర‌చ‌యిత త‌రువాత‌కూడ కొంత క‌థ‌న‌ల్లినారు. వివాహ‌ము జ‌రిగిన త‌రువాత జాన‌కి గ‌డిపిన ప‌ది సంవ‌త్స‌ర‌ముల‌లో ప్ర‌త్యేకించి చెప్పుకొన‌ద‌గిన స‌న్నివేశ‌ముగాని, యామె పాత్ర‌కు మెరుగు పెట్ట‌గ‌ల సంఘ‌ట‌న‌ముగాని లేద‌నియే చెప్ప‌వ‌లెను. కేవ‌ల‌ము క‌థ న‌డుచుట‌కై కాల‌మీడ్చిన‌ట్లుండెను.

జాన‌కి పాత్ర‌యందొక ముఱ్య‌మైన లోప‌మున్న‌ది. ఆమె తాను ఆరు జ‌న్మ‌ల‌నుండి మ‌హాప‌తివ్ర‌త‌న‌ని చెప్పుకొనిన‌ను యోగ‌సాధ‌న‌మున‌కై తిరిగి జ‌న్మించితిన‌నిన‌ను కేవ‌ల‌ము సాధార‌ణ గృహిణియు నేర్పుగ‌ల గృహిణియు చేయ‌గ‌ల ప‌నుల‌చే సాధించిన‌ది. ప్ర‌త్యేకించి చెప్పుకొన‌వ‌లసినంత ఘ‌న‌కార్య‌ములుగాని యాధ్యాత్మిక చింత‌న‌మునుగాని యొన‌ర్చిన‌ట్లు కానుపించ‌దు. మ‌డిక‌ట్టుకొని పుల్ల‌బ‌చ్చ‌ల‌కూర పెస‌ర‌ప‌ప్పువేసి వండుట‌యు గుత్తివంకాయ‌కూర చేయుట‌ము దోసకాయ కాల్చి ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు కొత్తిమీర‌వేసి ప‌చ్చ‌డిచేయుట‌యు మిన‌హాయించి చేసిన ప్ర‌త్యేక విశేష‌మేమియునులేదు. రుచిక‌ర‌ములైన భోజ‌న ప‌దార్ధ‌ముల‌ను వండుట‌కు

మ‌ర‌ణించిన భార్య బ్ర‌తికి రాన‌వ‌ల‌స‌రములేద‌నిపించును. నీల‌కంఠ‌శాస్త్రికి కూడ ముప్ప‌ది సంవ‌త్స‌ర‌ముల త‌రువాత నాకిష్ట‌మైన భోజ‌నం చేస్తున్నాను, న‌న్ను మాట్లాడించ‌కు అనెను. ఈ సంద‌ర్భ‌మున శాస్త్రికి భోజ‌న‌ము ముఖ్య‌మైన‌ట్లుగ ధ్వినంచుచున్న‌ది. వివాహ‌ము త‌రువాత కూడ జాన‌కి వేరుగ‌నే కాపుర‌ముండి యుద్యోగ‌ము చేసికొనిన‌ది. ఆమెకు పెండ్ల‌యిన త‌రువాత ప‌ది సంవ‌త్స‌ర‌ములు మాత్ర‌మే త‌న కాయ‌స్సుగ‌ల‌ద‌ని తెలియును.

ముగ్గురు పుత్రుల‌యందామె చూపిన వాత్స‌ల్య‌ము వైవిధ్య‌ము గ‌ల‌దిగ వ‌ర్ణింప‌బ‌డిన‌ది. ఇరువురు పుత్రులు త‌న పూర్వ‌జ‌న్మ‌లోనివారు. మూడవ‌వాడు నీల‌కంఠ‌శాస్త్రి క‌త‌ని రెండ‌వ భార్య‌యందు జ‌నించిన‌వాడు.

మొద‌ట ప‌తంజ‌లిని అగ్ర‌హార‌ము వెళ్ళి చూచిన‌ది. ప‌తంజ‌లిని క‌లిసికొనిన‌ప్పుడు చాల సంయ‌మ‌న‌ము చూపిన‌ది. పుత్ర ప్రేమ యెంత పొంగులువారుచున్న‌ను అప‌రిచితుల‌వ‌లె తెలియ‌న‌ట్లుగ మిన్న‌కున్న‌ది. ప‌తంజ‌లియే త‌న పోలిక చూచి యోచించున‌ట్లుగ న‌వ‌కాశ‌మిచ్చిన‌ది. ఇచ‌ట జాన‌కి పాత్ర మిగుల ప్ర‌తిభావంత‌ముగ పోషింప‌బ‌డిన‌ది. జాన‌కిని చూచి ప‌తంజ‌లి నివ్వెర‌పోయెను. జాన‌కి ప‌తంజ‌లిని ప్రేమ‌వాహిని జాలువారున‌ట్లుగ ప‌లుక‌రించిన‌ది. అత‌నిని పెద్ద‌కొడుకువ‌ని భావించెద‌న‌న్న‌ది. ప‌తంజ‌లి క‌నుల‌వెంట నీరు పెట్టుకొనినాడు. త‌రువాత జాన‌కి ప‌తంజ‌లి చిన్న‌త‌న‌ములోని కొన్ని ఘ‌ట్ట‌ముల‌ను గుర్తుచేసినది. ప‌తంజ‌లి న‌లుబ‌ది సంవ‌త్స‌ర‌ముల‌వాడు జాన‌కి భుజ‌ముమీద వ్రాలి దుఃఖించినాడు. త‌ల్లియే మ‌ర‌ల జ‌న్మ‌మెత్తి వ‌చ్చిన‌ట్లుగ అతనికి నిశ్చ‌య‌మైన‌ది. అట్లు జ‌రుగుట క‌వ‌కాశ‌మున్న‌టుల యోగ‌శాస్త్రమున సాక్ష్య‌ము ల‌భించిన‌ది. ప‌తంజ‌లి దుఃఖ‌మును చూచిన జాన‌కి నాయ‌నా నీవంతా మారిపోయావ‌న్నారే, నీ అవిసిగుండె అట్లాగే ఉందే అన్న‌ది. ఈ మాట‌లామె మాతృహృద‌య‌మును పిండ‌గా తొణికిన అమృత‌పు చినుకుల‌వ‌లెనున్న‌వి.

రెండ‌వ కుమారుడు భ‌ద్రాది. ఇత‌ను జాన‌కి పున‌ర్జ‌న్మ గాథ‌ను న‌మ్మ‌క న‌లుగురిలో న‌వ‌మానించున‌ట్లు మాట‌లాడ‌గ జాన‌కి కోపించిన‌ది. భ‌ద్రాద్రీ నీకు జ్ఞానంలేదు. నేను నీ త‌ల్లినైతే నీకేమి న‌ష్టం... ఈ వాద‌న వల్ల నీకేమి లాభం ? నీవు నా బిడ్డ‌వ‌ని నాకు తెలుసు. నాకు కోపం వ‌చ్చింది... ఈ జ‌న్మ‌లో నీకు సంతానం క‌లుగ‌దు. ఇది నా శాపం అని శ‌పించింది. జాన‌కి రెండ‌వ కుమారునిప‌ట్ల తొంద‌ర‌పాటు క‌న‌బ‌ర‌చినది. అత‌డు త‌ల్లిని గుర్తించ‌లేదు. ఇందుల‌కు కార‌ణ‌మున్న‌ది. అత‌డు పసివానిగ‌నుండ‌గ‌నే జాన‌కి మ‌ర‌ణించిన‌ది. పెద్ద‌కుమారునివ‌లె నాత‌నికి త‌ల్లిని గుర్తించుట‌క‌నువైన య‌నుభ‌వ‌ములు లేవు. కాకుళ‌మును న‌త‌డు, బంధువ‌లు జాన‌కి చెప్పిన య‌నేక

సంఘ‌ట‌న‌ములు విని ఆమెకు బ్ర‌హ్మ‌ర‌ధ‌ముప‌ట్టిరి. దుర‌దృష్ట‌వంతుడైన భ‌ద్రాద్రికే య‌నుభ‌వ‌ములు లేనందున‌నే త‌ల్లిని గుర్తించ‌లేదు. పుత్రుని శ‌పించుట‌లో జాన‌కి యుక్తాయుక్త‌విచ‌క్ష‌ణ‌మును కోల్పోయిన‌ద‌న‌వ‌లెను.

మూడ‌వ కుమారుడు సీతారామ‌య్య‌ను క‌న్న‌బిడ్డ‌క‌న్న మిన్న‌గ ప్రేమించి అత‌నికి చదువు చెప్పించి పెద్ద ఉద్యోగ‌స్తుడ‌గుట‌కు తోడ్ప‌డిన‌ది. భ‌ర్త‌తో మ‌న బిడ్డ‌లిద్ద‌రూ మీకేకాని వాళ్ళు నాకౌతారా వీడే నా కొడుకు అన్న‌ది. అంత ప్రేమ‌తో సీతారాముని పెంచిన‌ది. ఇచ‌ట జాన‌కి యౌన్న‌త్య‌ము మిక్కుట‌ముగ వెల్ల‌డికాగా ఆమె మాత్స‌ర్య‌ర‌హిత‌మైన ప్రేమ‌కు మ‌రో పేరువ‌లె శోభ‌గాంచిన‌ది.

జాన‌కి పూర్వ‌జ‌న్మ స్మృతుల‌ను చెప్పినంత‌గ పాతివ్ర‌త్య‌మునాచ‌రించి వెలువ‌రించిన స‌త్య‌ములేవియును లేవ‌నియే చెప్ప‌వ‌లెను. జాన‌కి సాధించిన‌దానినిబ‌ట్టి, యింత‌మాత్ర‌మున కామె యారు జ‌న్మ‌ల మ‌హాప‌తివ్ర‌త కాన‌క్క‌ర‌లేద‌నిపించును.