33
 

అమృత ప్ర‌భ‌

భ్ర‌మ‌ర‌వాసిని ఆను న‌వ‌ల‌లో విశ్వ‌నాథ‌వారు భ‌క్తిని విశేష‌విధాన‌మున తెలియ‌చేయ‌ద‌ల‌చినార‌నిపించును. పైకిమాత్ర‌ము కాళీమ‌జిలి క‌థ‌వ‌లెనో క్షేత్ర‌మ‌హాత్మ్య‌మును తెలియ‌జేయు క‌థ‌వ‌లెనో ఉన్న‌ప్ప‌టికిని నిగూఢ‌భావ‌మేదియును లేద‌న‌రాదు. ఇది కేవ‌ల‌ము ఉపాస‌న‌ప‌రుల‌కు బోధ‌ప‌డు న‌వ‌ల‌. పేరులోనున్న భ్ర‌మ‌ర‌ము కుండ‌లిని అనాహ‌త చ‌క్ర‌మువ‌ర‌కు వ‌చ్చినప్పుడా నాద‌బ్ర‌హ్మ‌మున‌కొక క‌ద‌లిక క‌లిగి, ఓంకార‌ము స్ప‌ష్ట‌త‌నంద‌క పూర్వ‌ము జుమ్మను నాద‌ము సాధ‌కుని చెవుల‌కు వినిపించున‌ని పండితుల వాక్కు, మ‌రియు ఒకే నామ‌మును పలుసార్లుచ్చ‌రించు స‌మ‌య‌మున ఉదాత్తానుదాత్త స్వ‌ర‌ముల‌లో మార్పులేని యా యుచ్చార‌ణ‌ము భ్ర‌మ‌ర ఝుంకార‌తుల్య‌మై యొప్పున‌న్న‌ది స‌ర్వుల‌కు విదిత‌మైన విష‌య‌ము.

భ‌క్తుల‌నేకులుండుట‌యు, భ‌క్తిమార్గ‌ముల‌నేక‌ములుండుట‌యు భ‌గ‌వ‌త్కృప య‌నేక మార్గ‌ముల‌లో ల‌భ్య‌మ‌గుచుండుట‌యు జ‌రుగుచునే యుండును. ఎవ్వ‌రేమార్గ‌ము న‌వ‌లంబింప‌వ‌ల‌యును ? ఎవ‌నికే మార్గ‌ము నిషిద్ధ‌ము అన్న‌ది యెవ‌రికివారు నిర్ణ‌యించుకొన‌వ‌ల‌సిన విష‌య‌ము. స్త్రీల‌కు గోపిక‌ల‌వంటి భ‌క్తి శ్రేష్ఠ‌మ‌ని వేయిప‌డ‌గ‌లు న‌వ‌ల‌యందు విశ్వ‌నాథ‌వారు ప్ర‌వ‌చించియున్నారు. కాని యీ మార్గ‌ముకూడ సుల‌భ‌ముకాదు. రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస పురుషులు భ‌గ‌వ‌త్స్వ‌రూప‌మైన పురుషోత్త‌మ‌మూర్తిని, స్త్రీలు స్త్రీ మూర్తియైన జ‌గ‌దంబ‌ను సేవింప‌వ‌ల‌యున‌నిరి. ల‌లితోపాసకులు దేవీ న‌వరాత్రులందు ప్ర‌తి దిన‌ము రెండు సంవ‌త్స‌ర‌ముల‌నుండి ప‌ది సంవ‌త్స‌ర‌ముల వ‌య‌స్సువ‌ర‌కునున్న బాలిక‌ల‌ను జ‌గ‌న్మాతృ స్వ‌రూప‌ముగ నెంచి షోడ‌శోప‌చార‌ముల‌తో పూజింతురు. ఇందుగ‌ల యాంత‌ర్య‌మేమ‌న‌గా స్త్రీల‌ను మాతృమూర్తులునుగ భావించుట య‌నెడి క్ర‌మ‌శిక్ష‌ణ‌మును భ‌క్తుల మ‌న‌స్సున క‌భ్యాస‌ము చేయుట‌యే.

దేవిని మాతృమూర్తిగ‌గాక కామ‌భావ‌మున చూచుట‌వ‌ల‌న మోక్ష‌గామియైన భక్తుడూర్ధ్వ‌గామిగాక య‌ధోమార్గ‌మున ప‌డిపోవును. ప‌ర‌మేశ్వ‌రిని కోరిన శుంభ‌నిశుంభ‌ల నెట్లా దేవి మ‌ర్దించిన‌దో మొద‌ట‌నే గ్ర‌హించి త‌మ మార్గ‌మునెన్ను కొన‌వ‌లెను.

భ్ర‌మ‌ర‌వాసిని న‌వ‌ల‌లోని మ‌ధుసూద‌నుడ‌నువాని రెండు జ‌న్మ‌ల గాథ య‌త‌ని భ‌క్తినాధార‌ముగ జేసికొనియు అత‌ని భార్య యొక్క పాతివ్ర‌త్య‌ము నాధార‌ము చేసికొనియు న‌ల్ల‌బ‌డిన‌ది. మ‌ధుసూద‌నుడు త‌న యిష్ట‌మున‌కు వ్య‌తిరేక‌ముగ నీల‌య‌ను క‌న్య‌ను పెండ్లియాడెను. ఆమె సామాన్య‌మైన సౌంద‌ర్య‌ముగ‌ల‌ది. విన‌య‌వ‌తి, సుగుణ‌సంప‌న్న‌. ఆమె విన‌య‌విధేయ‌త‌ల‌కుగాని సౌశీల్య‌మున‌కుగాని మ‌ధుసూద‌నుడు మోహ‌ప‌డ‌లేదు. ఆమె త‌న‌కు త‌గ‌ని భార్య‌య‌ని అత‌డు భావించెడివాడు. నీల‌మాత్ర‌మ‌త‌ని నిర్లిప్త‌త‌కుగాని ప్రేమ‌రాహిత్య‌మున‌కుగాని వ‌గ‌వ‌క త‌న ధ‌ర్మ‌మును తాను నిర్వ‌ర్తించుకొనుచుండెడిది. అత్త‌మామ‌ల‌కు సేవ‌జేయుచు, భ‌ర్త‌కు వ‌ల‌సిన‌వానిని కోర‌కనే యందిచ్చుచు కాల‌ము గ‌డుపుచుండెడిది.

మ‌ధుసూద‌నున కామెయందుగ‌ల విరుద్ధభావ‌ము క్ర‌మ‌క్ర‌మ‌ముగ త‌గ్గ‌ముఖ‌ము పట్ట‌గా న‌తడామెతో సంభాషించుట మొద‌లు పెట్టెను. అత‌డొక‌నాడు ల‌క్ష్మీవిగ్ర‌హ‌ము నొకదానిని తెచ్చెను. త‌రువాతనాదేవికి చీరెలు న‌గ‌లు కూడ తెచ్చుచుండెను. నీల ఆ దేవిని పూజించుట మొద‌లు పెట్టిన‌ది. మ‌ధుసూద‌నుడు ధ‌న‌మ‌దాంధుడై వ్య‌స‌న‌ముల‌కు లోన‌య్యెను. ప‌తివ్ర‌త‌య‌గు నీల యిందుల‌కు దుఃఖింప‌క ల‌క్ష్మీదేవినే న‌మ్ముకొని ఆమెపైననే త‌న భ‌క్తినంత‌యు వెలార్చుచుండెడిది. భ‌ర్త తెచ్చిన న‌గ‌ల‌నాల‌క్ష్మీ విగ్ర‌హమున‌కమ‌ర్చి, త‌రువాత అమ్మావారు ధ‌రించిన చీర‌ల‌ను న‌గ‌ల‌ను నీల ధ‌రించెడ‌ది.

చీర‌లు న‌గ‌లు ధ‌రించుట‌లో న‌మ్మ‌వారికిని నీల‌కును భేద‌ములేదు. ఇట్లు ధ‌రించుట దోష‌ముకాద‌ని ఆ గ్రామ‌మున‌నున్న నీల‌లోహిత‌భ‌ట్టు అను పండితుడు చెప్పెను. ఈ పూజ‌లందు నిమ‌గ్న‌మైన నీల భ‌ర్త త‌న‌ను నిరాద‌రించెన‌న్న విష‌య‌ము ప‌ర‌చిన‌ను ఆమెక‌త‌నిపై ప్రేమ‌, భ‌క్తి త‌గ్గ‌లేదు. క్ర‌మ‌ముగ మ‌ధుసూద‌నుడు కూడ దేవీ భ‌క్తుడ‌య్యెను అత‌నికి తాను రాజు కావ‌లెన‌నియు, అంతులేని ధ‌న‌ము కావ‌లెన‌నియు గ‌ల కోరిక‌ను దేవితో మొర‌పెట్టుకొను చుండెడివాడు. ఆమెత‌న‌కిది కావ‌లెన‌ని ఎన్న‌డును కోరిన‌దిలేదు. అమ్మ‌కు బిడ్డ‌కేమి కావ‌ల‌యునో తెలిసియేయుండును గ‌దా మ‌ర‌ల కోరుట‌యేల అని నీల భావ‌ము. ఆమె మ‌ధుసూద‌న‌ను క‌న్న నీ విష‌య‌మున గ‌డుస‌రియే అన‌వ‌లెను. ఒక‌నాడు అత‌డు నీల‌ను అమ్మా ! అని సంబోధించెను. ఆమె భార్య అమ్మ‌వ‌లెను అమ్మ భార్య‌వ‌లెను తోచుచున్న‌ద‌ని య‌న్న‌ది. ఈ మాట‌తో నీల‌కు ద‌క్క‌వ‌ల‌సిన సంసార సుఖ‌మును తానుదూర‌ము చేయుచుంటిన‌న్న భావ‌ము మ‌ధు సూద‌నుని మ‌దిలో మెద‌ల సాగిన‌ది.

ఇంత‌లో విధిమ‌ర‌ణ రూప‌మున వ‌చ్చి వారిరువుర‌ను వేరు చేసిన‌ది. చెల్లిలిపెళ్ళికి నీల‌పుట్టినింటికి వెళ్ళ‌గా స‌వ‌తి త‌ల్లి విష‌ము పెట్టి చంపిన‌ది. నీల‌మ‌ర‌ణించ‌క ముందే న‌గ‌ల‌ను చీర‌ల‌ను అత్త‌గారింటికి పంప‌వ‌ల‌యున‌నియు లేనిచో అవియెచ్చ‌ట నున్న న‌చ్చ‌ట తాను స‌ర్వ‌నాశ‌న‌మును చేయుద‌నన్న‌ది.

మ‌ధుసూద‌నుడామె మ‌ర‌ణ‌మున‌కు మిక్కిలి వ‌గ‌చెను. ఓసీ ! మ‌న ఇద్ద‌రికి నీజ‌న్మ‌కింతే, నాకు భార్య అమ్మ‌. అమ్మ భార్య‌. అంటివి. అట్లు కాద‌ని నీకు తెలియ జేయ‌వ‌లెన‌నుకొంటిని. అది య‌ట్లేకావ‌ల‌సియున్న‌ది. నీల‌మ‌ర‌ణ‌ముతో నీల‌గాధ స‌మాప్త‌మైన‌ది. మ‌ధుసూద‌నుడు చాల తీవ్ర‌మైన త‌ప‌స్సు చేసెను. మ‌ధుసూద‌నుడు అమ్మ విగ్ర‌హ‌ము వ‌ద్ద‌నున్న తాటియాకుల గ్రంథ‌ములో వింధ్యావాసిని య‌గువైష్ణ‌వీదేవిని గూర్చియు, ఆమె మ‌హిమ‌ల‌ను గూర్చియు, ఆమెనుపాసించుట‌కు మార్గ‌మును గూర్చియు నుండుట చూచెను. త‌రుపాస‌నామార్గ‌ము మిక్కిలి జ‌టిల‌ము. మ‌ధుసూద‌ను వెనుకాడ‌లేదు. ఈ మంత్ర‌ము కోటిసార్లు చేయ‌వ‌లెను. మొద‌టి ల‌క్ష జ‌ల మ‌ధ్య‌మున కంఠ‌ద‌ఘ్న‌ముగ నిల‌బ‌డి చేయ‌వ‌లెను. రెండ‌వ ల‌క్ష పంచాగ్ని మ‌ద్య‌మ‌మున‌, మూడ‌వ ల‌క్ష ఆశ్వ‌ద్ధ వృక్ష‌ము యొక్క శాఖాగ్ర‌మున కూర్చుండియు, నాల్గ‌వ ల‌క్ష శ్శ‌శాన‌మందున‌, అయిద‌వ ల‌క్ష వింధ్యాచ‌ల‌మందు ప‌శ్చిమోత్త‌ర భాగ‌మున జ్వాలాముఖియ‌ను శిఖ‌ర‌మునందుండి చేయ‌వ‌లెను. ఇంత క‌ఠోర‌మ‌యిన ఆ వృత్తులిరువ‌దిసార్లొన‌రించిన త‌దుప‌రి జ్వాలాముఖి శిఖ‌ర‌మునందున్న రెండు కొమ్మ‌లు సూర్యాస్త‌స‌మ‌య‌మున త‌చ్ఛిఖ‌ర‌ము యొక్క అధోభాగ‌మున‌నున్న నీట‌ప‌డి దేవి యొక్క అడ్డ‌బాస‌వ‌లె, ముత్య‌మువ‌లె క‌నిపించును. ఇట్టి ద‌ర్శ‌న‌ము దేవి య‌నుగ్ర‌హ‌మునుండిన‌గాని ల‌భింప‌దు. మ‌ధుసూద‌నుడింత క‌ఠోర‌త‌ప‌స్సు చేసెను. త‌రువాత భ్ర‌మ‌ర‌వాసిని ద‌ర్శ‌న‌ము మ‌రింత క‌ష్ట‌ము, మ‌హాగుహాంత‌రాళ మార్గ‌మున అయిదు క్రోసుల దూర‌ము నడువ‌వ‌లెను. ఆ మార్గ‌మంత‌యు కోట్లాది సంఖ్య‌లోనున్న కొండ తేనెటీగ‌ల‌తో నిండియుండును. ఆ తేనేటీగ‌లు ఆ మార్గ‌మున వెళ్శువారి శ‌రీర‌మును తూట్లు పొడుచును.

మ‌ధుసూద‌నుడ‌న్ని బాధ‌ల‌ను స‌హించి భ్ర‌మ‌ర‌వాసిని ద‌ర్శ‌న‌భాగ్య‌మును పొందెను. కాని యామె ఆకృతి దంష్ట్రాక‌రాళ‌ముల‌తో భ‌యంక‌ర‌మైన‌దిగ‌నుండెను. మ‌ధుసూద‌నుడా తేజోమూర్తి ద‌ర్శ‌న‌ముతో తృప్తిప‌డ‌క సౌంద‌ర్యాకృతిని కోరుచు మ‌ర‌ల నామెనుపాసించెను. అత‌నిలోనున్న సౌంద‌ర్య‌పిపాస‌చేత‌నే భార్య‌నాద‌రింప‌లేక‌పొయెను. దేవికూడ సౌంద‌ర్య‌వ‌తిగ‌నే ఉండ‌వ‌లెన‌ని వాంఛించినాడు. త‌రువాత ల‌క్ష్మీదేవివ‌లెనున్న జ‌గ‌న్మోహ‌నాకృతిని ద‌ర్శింప‌గ‌లిగినాడు. ఆమె నీల దేహ ప‌రిమాణ‌మున‌నున్న‌ది. అత‌డామె సౌంద‌ర్య‌మును వ‌ర్ణించి త‌న్న‌నుగ్ర‌హింపుమ‌నెను. ఆమె య‌త‌ని రాక్ష‌స త‌ప‌మున‌కు మెచ్చి య‌త‌ని కోరిక తీర్ప‌ద‌ల‌చిన‌ది.

మ‌రు జ‌న్మ‌లో నీల ల‌క్ష్మీ విగ్ర‌హ గ‌త సౌంద‌ర్య‌ముతో అమృత ప్ర‌భ అయిన‌ది. మ‌ధుసూద‌నుడు ర‌ణాదిత్యుడ‌య్యెను. ల‌క్ష్మీదేవి ర‌ణ‌రంభ‌యైన‌ది. ర‌ణ‌రంభాదేవి త‌న‌వంటి విగ్ర‌హ‌మొక‌దానిని చేయించి మ‌ధుసూద‌నునిచేత తాళిగ‌ట్టించి రాత్రి స‌మ‌య‌ములందు భ్ర‌మ‌ర‌నాదముతో న‌త‌నిని నిద్దుర‌పుచ్చి గ‌త‌జ‌న్మ‌ను స్వ‌ప్న‌మున భాసింప‌చేసెడిది. త‌రువాత అమృత ప్ర‌భ‌తో న‌త‌నికి పెండ్లి చేయించిన‌ది. నీల త‌న భ‌క్తితో పాతివ్ర‌త్య‌ముతో మ‌రు జ‌న్మ‌లో భ‌ర్త ప్రేమ నిబ్బ‌డిముబ్బ‌డిగ య‌నుభ‌వించిన‌ది.

శ్రీ విశ్వ‌నాథ భ్ర‌మ‌ర‌వాసిని న‌వ‌ల‌ను వ్రాయున‌ప్పుడు దీక్షితునివ‌లె స్వాతంత్ర్య‌ము న‌వ‌లంబించెన‌ని వారి సోద‌రులు వేంక‌టేశ్వ‌రులుగారు తెలియ‌జేసియున్నారు. దీక్ష‌నైతే పొంద‌లేదుకాని మా అన్న‌గారు శాక్తం విష‌యంలో దీక్షితునివ‌లెనే ప్ర‌వ‌ర్తించేవాడు. గ్రంధ‌ర‌చ‌నాధికం చేసేవాడు. భ్ర‌మ‌ర‌వాసినీ మొద‌లైన న‌వ‌లల్లో ఆయ‌న ర‌చ‌నా స్వాతంత్ర్యం ఆశ్చ‌ర్య‌క‌రంగా వుంటుంది. విశ్వ‌నాథ స్వ‌యంగా ఉపాస‌న‌నాప‌రుల‌నియు వారు జ‌ప‌య‌జ్ఞము వంటివార‌ని వేంక‌టేశ్వ‌ర్లుగారు తెలియ‌జేయుచున్నారు.