31
 

స్త్రీ శ‌క్తి  సంఘ‌టితం కావాలి !

 

వ‌ర‌ద బీభ‌త్సంతో దేశం ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. మొన్న‌టిదాకా అనావృష్టి ఇప్పుడు అతివృష్టితో ఆంధ్ర‌కు రెండుచెంప‌లూ వాచిపోతున్నాయి. నీటి ఉర‌వ‌ళ్ళ‌లో కొట్టుకుపోయిన‌వాళ్ళు కొట్టుకుపోగా మిగిలిన‌వార‌ని అంటువ్యాధి మ‌హమ్మారి ఆప్యాయంగా అక్కున‌జెర్చుకుంటోంది. ఎక్క‌డ‌చూసినా క‌ల‌రా, అతిసార‌వ్యాదుల భ‌యంతో ప్ర‌జ‌లు ప్రాణాల్ని గుప్పిట‌లో పెట్టుకుని గ‌జ‌గ‌జ‌లాడిపోతున్నారు. నీళ్ళు కాచుకుని త్రాగండి, మీ ఇళ్ళ ముంగిళ్ళు ప‌రిశుభ్రంగా ఉంచుకోండి అని ప్ర‌భుత్వ బాకాల రేడియో, టీవీలు గొంతుచించుకుంటున్నాయి. ఇలాంటి సంద‌ర్భంలో ఎక్కువ‌గా చిన్న పిల్ల‌లే బ‌లిఅవుతున్నారు. అంటే మూడునుంచి ప‌ద‌మూడు సంవ‌త్స‌రాల‌లోప‌లి పిల్ల‌ల‌కి మ‌రింత ప్ర‌మాద‌మ‌ట‌.

ఇలా అన‌గానే మా సుహాసిని గ‌య్యిమంది. మా అమ్మ‌మ్మ‌కి ఏడుగురు అబ్బాయిలు ముగ్గురుమ్మాయిలు. మా బామ్మ‌కి తొమ్మ‌దిమంది కొడుకులు, అంత‌మంది పిల్ల‌ల్ని మ‌హాత‌ల్లులెలా పెంచారో కాని నేను ఒక అబ్బాయిని, ఒక అమ్మాయికే పెంచ‌లేక చ‌చ్చిపోతున్నాను అని చిట‌ప‌ట‌లాడింది. ఇంత‌కీ నీకొచ్చిన బాదేమిటంటే ఆదేంకర్మోగాని మా పిల్ల‌ల‌కి ఏది తిన‌కూడ‌దంటే అదే తినాల‌ని అన్పిస్తుంది. నిన్న రేడియోలో చెప్పారా రోడ్ల‌ప‌క్క బ‌ళ్ళ‌ల్లో ప‌చ్చి మిర‌ప‌కాయ బ‌జ్జీలులాంటివి తిన‌కూడ‌ద‌ని. వెంట‌నే మావాడు ప‌రుగెత్తుకెళ్ళి రెండురూపాయ‌ల బ‌జ్జీలు కొనుక్కుని తెచ్చుకున్నాడు అంది.

 అది నీ ఒక్క‌దాని క‌ర్మేకాదు హాసినీ, పిల్ల‌ల మెంటాలిటియే అలాంటిది. ఏదివ‌ద్దంటే అదే చేస్తారు అని స‌ర్దిచెప్పబోయాను. ఇంత‌లోనే మా సుహాసిని ఆగ్ర‌హం పిల్ల‌ల మీంచి ప్ర‌భుత్వం మీద‌కి పోయింది.

ఇప్పుడంటే వ‌ర‌ద‌లూ మ‌ట్టిమ‌శాన‌మూ వ‌చ్చాయి కాని అస‌లు మ‌న‌దేశంలో శుచీ శుభ్ర‌తా ఆరోగ్యం అనేవి క‌లికంవేసి చూసినా కనిపించ‌వు. ఆర్టిఫిషియ‌ల్ కల‌ర్సు, ఎసెన్సులు ఆరోగ్యానికి హానిక‌రం అని శాస్త్ర‌జ్ఞులు గోల‌పెడుతున్నారుక‌దా, అస‌ల‌లాంటి వాటికి మార్కెట్‌లోకి ఎందుకు రానిస్తారు. కాకాహోట‌ళ్ళ‌లోనూ, రోడ్డుప‌క్క‌న బ‌ళ్ళ‌ల్లోనూ త‌యారు చేసే తినుబండ‌రాల‌వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ఎంత ముప్పుకలుగుతోంది ?  మిఠాయిషాపుల్లో అమ్మే స్వీట్స్ తింటేకూడా కొత్త కొత్త రోగాలు పుడుతున్న‌య‌ట అంది.

అవును నిజ‌మే అలాంట‌ప్పుడు నువ్వు కొనుక్కోవ‌టం మానేసెయ్యి అన్నాను.

నీ స‌ల‌హా బాగుంది అని హేళ‌న‌గా న‌వ్వి వెనుక నీబోటిదే వండ‌టానికి బియ్యం లేవ‌ని పొయ్యి తవ్వేసింద‌ట ! అస‌లు కొన‌కుండా మానెయ్య‌టంత‌ప్ప అనారోగ్య‌క‌ర‌మైనవాటిని మార్కెట్‌లోకి రాకుండాచేసుకోలేమా ?  అంది ఉగ్రంగా కాళిక‌లా.

అస‌లు న‌న్న‌డిగితే వ‌ర‌క‌ట్నం అన్నిటికంటే పెద్ద స‌మ‌స్య‌కాదు. స్త్రీల‌కు పురుషుల‌తో స‌మాన‌హ‌క్కులు కావాల‌న్న‌దీ స‌మ‌స్య కాదు. బోఫోర్సు, ఫెయిర్‌ఫాక్కులూ, మంత్రులు రాజీనామాలుకూఆ క‌ల్తీ క‌న్నా పెద్ద స‌మ‌స్య‌లేం కానేకావు అంటూ గ‌ట‌గ‌టా మంచినీళ్ళు తాగి ఆవేశాన్ని త‌గ్గించుకుంది.

ఇప్ప‌టి స్త్రీల‌లో నూటికి అర‌వైమంది హిస్ట్ర‌క్ట‌మీ ఎందుకు చేయించుకుంటున్నారో తెలుసా ?  తెలీద‌న్న‌ట్టు త‌ల అడ్డంగాఊపాను.

క‌ల్తీ స‌రుకులు హార్మోన్ల‌ను అస్త‌వ్య‌స్తం చేయ‌టంవ‌ల‌న గ‌ర్భ‌కోశ వ్యాధులు వ‌స్తున్నాయట ! మీ మ‌హిళామండ‌లులు ఏం చేస్తాయి ?  ఈ చీర ఎక్క‌డ కొన్నారు. ఈ గాజులు ఎక్క‌డ చేయించారులాంటి కాల‌క్షేపం క‌బుర్లుమాని క‌ల్తీ వ్యాపారం ఎక్క‌డెక్క‌డ జ‌రుగుతోంది క‌నిపెట్టి హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు ఎందుకు తెలియ చెయ్య‌రు ?  లంచాలు తిని బాధ్య‌త‌లు  మ‌ర‌చిపోయేవారిని ఎందుకు ప‌ట్టించ‌రు ? ఇదంతా ఒక‌ళ్ళు చేసే ప‌నికాద‌ని నాకు తెల్సు. మీకు సంఘం ఉంది కాబ‌ట్టి క‌లిసిక‌ట్టుగా ఏమైనాచేయ‌వ‌చ్చు. కానీ ఎందుకు చెయ్య‌టంలేదు అంది. మా మ‌హిళా మండ‌లిమీద మ‌రో అభాండంవేసింది. ఈ మ‌ధ్య చూస్తున్నానుగా. ఎవ‌రికైనా స‌న్మానం చేస్తుంటే ఫ‌లానాసంఘం త‌ర‌పున అంటూ ఓ పూల‌మాల స‌న్మానితుడిమెడ‌లోవేయ‌టం, టీవీలోనూ, రేడియోలోనూ మీమొహాల‌ని గ‌ళాల‌నీ ప్ర‌ద‌ర్శించుకోవ‌టం మీరు ప‌డే తాప‌త్ర‌యానికి న‌వ్వుపుట్టుకోస్తోంది అంది చీద‌రిపంపుగా.
హాసినీ ?  నువ్వూ మా మండ‌లిలోచేరి నీ ఆలోచ‌న‌ల‌ని కార్య‌రూపంలో పెట్ట‌రాదూ అన్నాను న‌వ్వుతూ. సుహాసిని చెప్పిన‌దంతా నిజ‌మే. ప్ర‌తిదీ ప్ర‌భుత్వ‌మే చేయాలంటే ఎలా ?  ఇన్ని రకాల సంఘాలు ఏర్ప‌డిన దెందుకు ?  ఫండ్స్ కోస‌మా ?  అనుకున్నాను. బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము చ‌లిచీమ‌ల చేత‌చిక్కి   చావ‌దె సుమ‌తీ అన్నాడు వేమ‌న‌. ఏ స‌మ‌స్య అయినా పాములాగా కాటువేసేదే. అయితే స‌మ‌స్య‌లెంత జ‌టిల‌మ‌యినప్ప‌టికి వాటిని రూపుమాపాల‌ని దృఢ‌సంక‌ల్పంతో వ్య‌క్తులంద‌రూ ఒక శ‌క్తిగా సంఘుటిత‌మ‌యితే కూక‌టివేళ్ళ‌తో పెళ్ళ‌గించబ‌డ‌తాయి.