113
 

అమ్మాయీ ! నువ్వు తిరుప్పావు సంస్కృతీక‌రించిన విధాన మెంత‌యో, హృద‌యాహ్లద‌క‌రంగా ఉన్నది.

చిత్తం ! శుక‌వాణీదేవి న‌మ్రత‌తో త‌ల‌వంచుకొన్నది.

నిన్ను మెచ్చుకొని వెడ‌ల‌డానికి మాత్రమే నేనురాలేదు.

ప్రభువులు....సెల‌వీయ ప్రార్ధన‌.

అమ్మాయీ ! నీవంటి ప్రతిభామూర్తినియైన బాలిక‌ను చూడ‌టం నా భాగ్యంగా భావిస్తూన్నాను.

ప్రభువులు పొగ‌డడానికి రాలేదంటూనే పొగ‌డుతున్నారు, అన్నదామె, క‌నీ క‌న‌ప‌డ‌ని చిర్రగ‌వుతో. మహారాజుల‌కు స‌మాధ‌న‌ములు చెప్పడ‌మే ! అని ఆమె చెలియ‌లు విస్తుపోతూ క‌నుల‌ప్పగించి చూస్తూన్నారు.

త‌ల్లీ ! అతిశ‌యోక్తులుప‌యోగించేటందుకు నేను క‌విని కాను. ఉన్నదున్నట్లుగా చెప్పే య‌దార్ధవాది నేన‌మ్మా ! అన్నారు ప్రభువులు చిర్నవ్వుతో. ఆ మాట‌ల‌కు శుక‌వాణిదేవి ల‌జ్జావ‌న‌త వ‌ద‌న‌యైన‌ది.

అమ్మాయీ ! నీవింకేమి మ‌హార‌చ‌న‌లు చేశావో తెలిసికొన‌డానికే నా ఈ రాక‌.

ప్రభూ !  ప్రభూ ! నేను...నేనండీ, కుమార సంభవాన్ని ఇటీవ‌లె పూర్తి చేసినానండి. ఆ మాట‌ల‌కు అచ్యుత‌నాయ‌నిం వారు ఆశ్చర్యచ‌కితులైనారు.

కుమార సంభ‌వ‌మే ! కాళిదాసుల‌వారి దారిలోనే న‌డ‌చిన‌నావా, అమ్మా !

శాయ‌శ‌క్తులా య‌దార్ధ స్వరూపాన్ని వివ‌రించే ప్రయ‌త్నం చేశానండి. శంక‌రుల వారి సౌంద‌ర్యల‌హ‌రి శివానంద ల‌హ‌రుల‌లో ప్రయోక్తమైన నిగూఢ త‌త్వానికి నీ కావ్యం వ్యాఖ్యాన‌తుల్యమైన‌దండి.

అమ్మాయీ ! నీతో భాషించేటందుకే భ‌యం వేస్తూ ఉన్నది. నీవింత‌టి ఉద్దండ పండితురాల‌వే అగుదువు. నీ గ్రంథాన్ని నేనొక‌మారు చూడ‌వ‌చ్చునా ?

మ‌హా ప్రసాదం ప్రభూ !

ప్రస్తుతం నీ కావ్య వ్యవ‌సాయం కుంటుప‌డిన‌ట్లుంది కాదా. నీ నృత్య ప్రాభ‌వాన్ని తిల‌కించాల‌నీ, నీ ర‌చ‌నా వైద‌గ్ధ్యాన్ని శ్రమ‌ణానందంగా గ్రోలాల‌నీ నిన్నిచ‌టికి రావించినాను. ఇచ‌ట నీకు ఎలా ఉంది, త‌ల్లీ ! సౌఖ్యంగా ఉందా ?

ప్రభూ ! ఎంతో బాగా ఉన్నది. ఏ ఇబ్బందీ లేదు.

ల‌వ‌ణ‌ము , శొంఠి, యేల‌కుల చూర్ణము క‌ల‌సిన జంబీర రుచుల‌తో ఉండే తేట‌మ‌జ్జిగ‌ను శుక‌వాణిదేవి రజ‌త‌పాత్రతో స్వయ‌ముగా అందించింది. చామ‌ర గ్రాహిణులు మెల‌మెల్లగా వీవ‌న‌ల‌ను విస‌రుచుండ‌గా మ‌హారాజుల వారు అలవోక‌గా ఆ పానీయ‌మును రెండు గ్రుక్కుల‌ను గ్రోలి ఆ పాత్రను చెలిక‌త్తెకందిచినారు.

మ‌హారాజులు లేచి నిల‌బ‌డిరి.

ప్రభూ ! ఇప్పుడే ఈ నా స‌ఖియ స్వర్ణముఖితో కుమార సంభ‌వ గ్రంథాన్ని త‌మ స‌న్నిధికి అంపుకొంటూ ఉన్నాను. అవ‌ధ‌రించండి...అని శుక‌వాణీదేవి విన‌య‌ముగా చేతులు మోడ్చిన‌ది. మ‌హారాజుల‌వారు ఆప్యాయ‌ముగ ఆమె శిర‌స్సు నిమిరి, ఆశీస్సులిచ్చి వెడ‌లినారు.

శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌నింవారు దైవ‌ప్రతిష్ఠను తిల‌కించ‌డానికి వెళ్ళి, మ‌ధుర నాయ‌కుల‌ను యుద్ధాన ఓడించి, విజ‌య‌ల‌క్ష్మితోడ తిరిగివ‌స్తూ ఉన్నార‌న్న శుభ‌వ‌ర్తమానం ప‌ట్టణ‌మంతా క్షణాల‌లో వ్యాపించిన‌ది. న‌గ‌ర‌మంతా ఆనందోత్సాహాల‌తో తేలియాడిన‌ది. ఇళ్ళముంగిట ముత్తయిదువులు ముత్యాల ముగ్గుల‌ను తీర్చిదిద్దిరి. నాలుగు వీధుల కూడ‌ళ్ళలో రంగురంగుల రంగ‌విల్లులు మెరిసిపోతూ ఉన్నవి. ఆకాశ‌వీధులు ప‌చ్చపచ్చని మామిడాకుల తోర‌ణాల‌తో, రంగురంగుల ప‌ట్టువ‌స్త్రాల‌పై అమీతోత్సాహంగా ఎగిరే గ‌రుడ కేత‌నాల‌తో, జ‌య ప‌తాకాల‌తో పర‌మ ర‌మ్యంగా ఉన్నవి. ఉప్పరి గ‌ల‌పైన ముత్యాల బుట్టల‌తోను, పూల త‌ళ్ళిగ‌ల‌తోను స్త్రీ బాల‌వృద్ధులు ఆత్రత‌తో యువ‌రాజుల రాక‌కై ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభువులు ఈలాగున విజ‌య‌ఘోష‌తో త‌ర‌నిరావ‌డం  ఆ పుర ప్రజ‌ల‌కు నూత్న విష‌యంకాదు. ర‌ఘునాథులు యుద్ధరంగాన ఉన్నప్పుడు విజ‌య‌ల‌క్ష్మి వ‌ర‌మాల వారికే వేస్తుంది. క‌న్యలు మెచ్చే స‌ర్వల‌క్షణ శోభితుడు వీర‌పరాక్రమోపేతుడు అయిన ర‌ఘునాథుల‌నుకాక మ‌రొక‌రిపై ఆమె మ‌న‌సేలాగున నిలుప‌గ‌ల‌దు ?

కూమారుల‌కు ఘ‌న‌స్వాగ‌త‌ము ప‌లుకుచూ ఆనందంగా ఆలింగ‌న‌ము చేసి త‌న పట్టపుటేనుగుపై కూర్చుంచ‌బెట్టుకొని న‌గ‌రికి తీసుకొని రావ‌ల‌సిన అచ్యుత నాయ‌కులు తిరుప్పావు నాట్యాన్నివ‌ద‌లివెళ్ళలేక అమాత్యుల‌వారిని అందుల‌కు నియ‌మించిరి.