135
 

సేవ‌క‌లు తెచ్చిన వార్త‌ల‌ను వినిన నారాయ‌ణ‌భ‌ట్టు, వేంక‌ట‌ప‌తి సార్వ‌భౌముల మ‌ర‌ణ‌వార్త‌, న‌గ‌రాన వ్యాపించ‌లేద‌నే నిశ్చ‌యించుకొనినాడు.ప్ర‌జ‌లు కేవ‌లం సార్వ‌భౌముల అనారోగ్యాన్ని గురించి క‌ల‌త చెందుతూ ఉన్నార‌ని అనుకొనినాడు.

జ‌గ్గ‌రాజు స‌ర్వ‌సైన్యాధిప‌తిని, ఆనంద‌వర్మా..! పట్ట‌ణాల‌లో ఆయుధాల నెవ్వ‌రూ విక్ర‌యించ‌కుండా చ‌ర్య‌లు తీసికొన్నావు క‌దా ? అని ప్ర‌శ్నించి నాడు.

ఆనంద‌వ‌ర్మ : విక్ర‌యించ‌కుండా మాత్ర‌మే కాదు, ప్ర‌భూ, మారుమూల‌ల గ్రామాల‌కు సైతం సైన్యాన్ని పంపి క‌మ్మ‌రివాండ్ల‌పై వేయిక‌న్నుల‌తో క‌నిపెట్టి ఉంచాను.

జ‌గ్గ‌రాజు : దుర్గాధిప‌తులు మ‌న‌వైపున నిల‌చేందుకు సంవ‌త్స‌రాన్నుండి చేస్తూ ఉన్న కృషి స‌ఫ‌ల‌మైన‌ట్లేనా, అమాత్యా ?

నారాయ‌ణ‌భ‌ట్టు : మ‌హాప్ర‌భూ ! మున‌ల్మానుల వ‌శం అయిన కోట‌ల‌న్నీ మ‌న‌కే వంత‌పాడ‌తాయి. మ‌నం సామోపాయంచేత గెలువ‌లేని కోట‌లు కొన్ని ఉన్నాయి. వాటిపైకి దాడి వెడ‌లి అణిస్తే త‌ప్ప ఆ దుర్గాధిప‌తులు లొంగుతార‌ని అనిపించ‌డం లేదు.

ఇంతలో మువ్వురు సైనికులు, కాషాయ వ‌స్త్ర‌ధారుల నిరువుర‌ను బంధించి తెచ్చిరి. వారి ముండ‌న‌శిర‌ములు, వ‌స్త్ర‌ధార‌ణ విధ‌ము మొద‌లైన బాహ్య చిహ్న‌ముల‌ను బ‌ట్టి వారిని బౌద్ధ‌స‌న్యాసులుగా భావించి, వారిని ఎందుకు బంధించ‌వ‌ల‌సి వ‌చ్చిన‌దో తెలుప‌నున్న‌ట్లు జ‌గ్గ‌రాజు క‌నుస‌న్న‌చేసెను.

సైనికుడు : ప్ర‌భూ ! వీరిని గుర్తిగ్రామంలో బంధించాము. వీరిరువురు త్ర‌వ్య‌క‌పు పనిముట్ల‌ను క్ర‌యం చేస్తూ ఉండ‌గా, అనుమాన‌ము క‌లిగి ప్ర‌శ్నించినాము. బౌద్ధారామాన్ని స్వ‌యంగా నిర్మిస్తున్నామ‌ని చెప్పినారు. ఎక్క‌డ నిర్మిస్తున్నారో చూప‌మ‌ని ఒత్తిడి చేశాము. ఒక పాడుబ‌డిన భ‌వంతిని చూపి, దానిని బాగుచేసి అందులో నివాసం ఏర్ప‌ర‌చుకొంటామ‌న్నారు. అంగ‌డివానిని దండిస్తే. గ‌త రెండు దినాలుగా స‌మీప గ్రామాల నుండి ప‌లుగులు పార‌లు దాదాపు ఆరునూర్ల వ‌ర‌కు వీరు, ఉన్న ధ‌ర‌కన్న ప‌దింత‌ల ధ‌నం ఇచ్చి కొన్నార‌ని తెలిపినాడు. కాని ఎంత ప్ర‌శ్నించినా వీరి నుండి స‌రియైన స‌మాధ‌న‌మును రాబ‌ట్ట‌లేకున్నాము.

జ‌గ్గ‌రాజు మైరేయ‌పానం చేస్తూ ఉన్న స్వ‌ర్ణ‌పాత్ర‌ను దారుపీఠిక‌పైన పెట్టి లేచి నిల‌బ‌డినాడు. మిగిలిన వారు కూడ అట్లే చేసి చేతులు క‌ట్టుకొని నిల‌బ‌డిరి. జ‌గ్గ‌రాజు గుంట‌క‌ళ్ళలో గ‌బ్బిలాలు, రాబందులు, విష‌నాగులు వికృత తాండవం చేసిన‌ట్లు కాగా, అత‌ని స‌హ‌చ‌రులు భ‌య‌భ్రాంతులైరి.

నారాయ‌ణ‌భట్టూ, ద‌యాదాక్షిణ్య‌ము, పాప‌మూ పుణ్య‌ము మంచీ చెడు ఇలాంటివి ఏవీలేని ప‌దిమంది బ‌ల‌వంతులైన సేవ‌కుల‌న‌ను సిద్ధం చేయించు. ఈ క‌ప‌ట స‌న్యాసుల త‌ల‌ల‌ను త‌క్ష‌ణం ఎగ‌ర‌గొట్టించు, అని ఆజ్ఞాపించి, జ‌గ్గ‌రాజు విస‌విస న‌డిచిపోయెను.

రాత్రి రెండ‌వ యామ‌ము ముగియ‌బోతూ ఉన్న‌ది. న‌గ‌రం నిద్రాదేవి ఒడిలో ప్ర‌శాంతంగా తూగుతూ ఉండెను. కాని జారుల‌కూ, చోరుల‌కూ, క్రూరుల‌కూ, రాజ‌ద్రోహుల‌కూ మాత్ర‌ము కంటిమీద కునుకురానంత‌గా దుష్ట ఆలోచ‌న‌లు రేగుతూ ఉండెను.

జగ్గ‌రాజు, త‌న ప‌రివార స‌మేతంగా, వడివ‌డిగా, సూటిగా, అంతఃపుర స‌మీపాన ఉన్న జ‌లాశ‌యం క‌డకు న‌డ‌చినాడు. జ‌లాశ‌యం మెట్ల ప్ర‌క్క‌గా ఉన్న పూపొద‌రిళ్ళు వాడిపోయి ఉన్న‌ట్లుగా మ‌ప‌క వెన్నెల‌లో స్ప‌ష్టంగానే క‌నిపిస్తూ ఉన్న‌వి. పూచిన పూవులేగాక‌, మొగ్గ‌లుకూడ మాడిపోయి ఉన్న‌వ‌ని జ‌గ్గ‌రాజు గ‌మ‌నించినాడు. సైనికులు ఆ పూపొద‌ల‌ను చేతితో తాక‌గానే నేల‌మీద‌కు ఒరిగిపోయిన‌వి. ఈ ప్ర‌య‌త్నం ప్రారంభ‌మై రెండు మూడు దినాలు కావ‌చ్చును, అని జ‌గ్గ‌రాజు బిగ్గ‌ర‌గా గొణిగినాడు. అత‌ని మాట‌లు మిగ‌తావారికి బోధ‌ప‌ల‌లేదు.

నారాయ‌ణ‌భ‌ట్టూ ! నేను అడిగిన వీర‌సేవ‌కుల‌ను సిద్ధం చేయించి నావా ? అని జ‌గ్గ‌రాజు ప్ర‌శ్నించినాడు, చిత్తం ప్ర‌భూ ! సిద్దం చేశాను. జంకూ గొంకూ లేకుండా ఏ ప‌ని చెయ్య‌మంటే ఆప‌ని చేస్తారు. తల్లి ఆయేది, తండ్రి ఆయేది, క‌డ‌కు మ‌న‌ల్ని పుట్టించిన ఆ జేజెమ్మ ఆయేది, ఎవ‌రినైనాస‌రే, క్ష‌ణాల్లో మ‌ట్టుపెట్ట‌గ‌ల ప‌దిమందిని, అదిగో ఆ విఠ‌ల‌స్వామి ఆల‌యాన కూర్చుండ‌బెట్టి ఇలా వచ్చాను, అని స‌ర్వ సైన్యాధ్య‌క్షుడు మ‌న‌విచేసి, త‌ల‌వంచి, చేతులు క‌ట్టుకొని నిల‌బ‌డినాడు.