శ్రీరంగరాలయు, సకుటుంబంగా వధింపబడిన మరునాటి ఉదయము మృతులను ఖననం చేయమని జగ్గరాజు భటులనాజ్ఞాపించినాడు. నారాయణభట్టు ప్రభూ ! దహనం చేయడం మందిదేమో....ఒక్కసారి ఆలో-- నారాయణభట్లూ ! వ్యర్థంగా ప్రేలకు, జగ్గరాజు హుంకరించినాడు.
నారాయణభట్టు మనస్సు చిన్నబోయినది. ద్రోహమూ, కుట్రా చేసి అధికారం వశం చేసుకొన్నవాడే. అయినా, తానూ మహామంత్రేకదా, అమాత్యులకీయ వలసిన గౌరవాన్ని ఈయికపోగా తృణీకారంగా మాట్లాడతాడా, ఈ జగ్గరాజు ? వీడు పీనుగులను పీక్కుతినే రాబందుకన్న నికృష్టుడు. ఈ దుష్టునకు మంచీ మర్యాదా ఎక్కడి నుండి వస్తుంది ? అని తలపోస్తూ, తలవంచుకొని నిలబడిపోయినాడు.
భట్టూ, శ్రీ రంగరాయల వ్రేలికి ఉన్న రాజముద్రికను తక్షణం తీసుకొనిరా. ఇప్పటికే కాలము వృధాపోయినది. భవంతిని సైనికులు కాపలా కాస్తూనే ఉన్నారుగా ?
చిత్తం ప్రభూ, చీమనికూడా వెలపలి నుండి లోపలికి, లోనుండి బైటకు పోనీయడంలేదు. నగరం చుట్టూ, పొలిమేరలను కూడా మన దళాలు వేయి కన్నులతో కనిపెట్టి ఉన్నారు.
కోటనూ, రాచనగరనూ భద్రం చేసికొనిగాని సామంతులకు విశ్వపతిరాయల వారి పట్టాభిషేకవార్త తెలియనీయము.
నారాయణ భట్టు. జీవము లేఇన మోముతో, రాజముద్రికకై వెడలినాడు. రాజముద్రిక శ్రీరంగరాయల వ్రేలికి లేకుండెను. నారాయణభట్టు, అక్కడ కాపుకాస్తూ ఉన్న సైనికులను అనుమానముతో చూచెను. వారనూ , అక్కడ ఉన్న పరిచారకులునూ, ఏదియో రహస్యమును దాచుచున్నట్లు అతని కగుపడిరి. వారుచెవులు కొరుక్కుంటున్నది తనను గురించేనేమో ? తాను అన్నను చంపి అమాత్య పదవిని కాజేసినాననేమో ? నారాయణభట్టు ఉలికిపడినాడు.
రాజముద్రిక ఏమైపోయినది ? ఎవరుతీసినట్లు ? ఆనందవర్మగాని సైనాధ్యక్షుడు చెంగల్వనాయకుడు కాదుకదా ? భట్టు యోచించసాగెను. చెంగల్వ రాయడో మరియొకడో కుట్రచేసి, తననూగనా, జగ్గరాజునూ, తాము నమ్మినబంట్లనూ మట్టుబెట్టెతానే సింహాసనం అక్రమించును కాబోలు. వెంటనే తాను ఇచటనుండి తప్పించుకొనడం మేలు. ప్రాణముంటే చాలు, పదవి సంగతి దైవానికెరుక ?
నారాయణభట్టు లోలోన గడగడ వణికినాడు. ప్రళయభీకరాకారంతో యమునివలె, చెంగల్వనాయకుడు తనను ముక్కలు ముక్కలుగా ఖండించుటకు బల్లెముతో , బాకుతో, కత్తితో, కళత్తముతో వచ్చినట్లుగా ఒక భయం కరమైన అనుభూతి కలిగి, శ్రీరంగరాయల మృతదేహము దగ్గర చతికిల బడినాడు.
అవును, ఈ ఆలోచన తనకు ఇప్పడే ఎందుకు కలిగినది ? దశాబ్దాల తలబడి, సార్వభౌములకూ సామ్రాజ్యానికి సేవలు చేసిన తన అన్న సోమశేఖర భట్టారకుల వారిని, తాను వధించినప్పుడు ఏలరాలేదు ? ఒక్క చేత పదుగురు శత్రువులను నిలబెట్టగల మేటి వీరుడు వేలప్పనాయకుని దొంగమాటున భుజములను వెన్నుకు విరిచికట్టించి, ఈటెలతో తూట్లు, తూట్లుగా జల్లెడలా చిల్లులుపొడిపించి చంపించినప్పుడు ఎందుకు కలగలేదు ? ధర్మబద్ధంగా సింహాసనం అధిరోహించవలసిన శ్రీరంగరాయలను చంపించినప్పుడు ఎందుకు ఈ యోచన రాలేదు ? ముక్కుపచ్చలారని అదీ....నిద్రిస్తూన్నవారిని, తలలనుతెగగొట్టి ఆ తల్లిదండ్రుల గుండెలు ప్రయ్యలు చేసినప్పుడు ఇట్టి భయంచెంతకు రాలేదే ఎందుచేత ? మహాసాధ్వి, ఎండ కన్నెరుగని సుకుమారి, పరపురుషుని కన్నెతిచూడని ఇల్లాలు, వైశ్యానరీదేవి, తన ముద్దుబిడ్డి వధచూసి గిలగిలలాడిపోతూ, తన పతికన్న, బిడ్డలకన్న ముందు తన ప్రాణాలు తీయమని, హృదయ విదారకంగా విలపిస్తూ విన్నపాలు చేస్తూన్నప్పుడు, ఈ పిశాచపు మనసు వికటాట్టహాసం చేసిందేగాని, అయ్యో పాపం అని ఒక్కసారి అయినా అనుకున్నదా ? ఇటువంటి నీచుడు బ్రతికి ఉంటే ఇంకా ఎన్ని హత్యలు చేయిస్తాడో. ఇంకా ఎన్ని రత్తపుటేరులు పారిస్తాడో ! చంగల్వ నాయకా, చప్పున రావయ్యా, నన్ను ముక్కులు ముక్కులుగా నరకయ్యా ! అని ఆక్రోశిస్తూ నారాయణభట్టు శిరము వంచుకొని శిలవలె నిశ్చలుడైపోయినాడు. |