141
 


18

శుకవాణీదేవి ఇందిరామందిర ప్రవేశం అనంతరం తమ ముద్దు బిడ్డను ఎడబాసి మనలేని తల్లిదండ్రులు బెగ్గటిల్లిపోయిరి. మరకతవల్లీ దేవి శితపద్మ దళాలవంటి సోగకన్నులు దుఃఖంతో ఎర్రవారిపోయినవి. అమ్మాయి ఏమంత దూరం వెళ్ళిందని అంతగా దుఃఖిస్తావు,దేవీ చూడాలని అనుకున్నప్పుడు అరదమెక్కితే కన్నుమూసి తెరచేంతలో కన్నతల్లి ముందు ఉండవా ? అని మూర్తెప్పనాయకుడు తమ ప్రియపత్నిని ఓదారుస్తూ ఉంటారు.

ప్రభువులు ఎంత ఓదార్చినా ఆమె దుఃఖం అంతకు మూడింతలై, మరకతవల్లీ దేవిని విలువనీయదు. ప్రభూ ! చెంచుతల్లిని విడిచి క్షణం ఉండలేననుకున్నాను. గాని ఇన్నాళ్ళు ఎలా ఉండగలుగుతున్నానో ఆశ్చర్యంగా ఉంది అమ్మాయి రాచనగరులో ఎంతోసుఖంగా ఉంది అని నన్ను నేను ఓదార్చుకుంటూనే ఉంటాను. అయినా, సర్వస్వమూ కోల్పోయినట్లు ఇక చేయగలిగినదేమీలేనట్లు ఎంతో విరక్తిగా అనిపిస్తుంది. మన బిడ్డకు వచ్చిన ఆపద ఏమీ లేనప్పటికీ ఇన్నేళ్ళయినా నేను మనసును కుదురు పరుచుకోలేకపోతున్నాను, అన్నదామె బేలగా.

మరకతవల్లీదేవి పడుతూ ఉన్న వేదనను చూడలేక మూర్తెప్ప నాయనిం వారు ముఖమువంచుకొనిరి, స్వామీ ! ఈ మధ్యన నన్ను ఒకే ఒక ఆలోచన భాధిస్తోంది. సర్వకాలాలోనూ ఏం చేస్తున్నా కూడా ఆ భావం నన్ను విడవడంలేదు. అనినదామె, జాలిగా, మూర్తెప్ప నాయకులు మరకతవల్లి స్థితికి కలతచెందుతూ ఉండిరి. ఆమె అప్పుడప్పుడు ఇందిరామందిరానికి వెళ్ళీ కుమార్తెను చూచి వస్తూనే ఉన్నది. అమ్మణ్ని కూడా తల్లితోవచ్చి తల్లిపెట్టే గోరుముద్దలు తిని, తానను అల్లిన కవితలను వినిపించి తిరిగి వెడుతూనే ఉన్నది. అయినప్పటికిన్నీ మరకతవల్లి ఏదో పెన్నధి కోల్పోయిన దానివలె కాంతి తగ్గిన కన్నులతో శూన్యపు చూడ్కలు చూస్తూ, పాలిపోయిన మోముతో, క్షీణించిపోతూ ఉన్నది. మూర్తెప్ప నాయకులు ఎందరెందరో మహా మహాభిషక్కులను రావించి, ఆమెకు ఔషదములను ఇప్పిస్తూ ఉండిరి. వ్యాధే లేనపుడు ఔషదముల వలన ప్రయోజనం ఏమి ఉంటుంది ? ఆమెకు ఉన్నది మానసికమైన వ్యధ. ఆ వ్యధ బాపగల ఔషధం శుకవాణి దేవి వివాహం. అమ్మణ్నికొక బుజ్జితండ్రి పుట్టాలి. లేత లేత గొజ్జంగిపూ చతులనను, కాళ్ళను ఆడిస్తూ, లక్కపిడతవంటి ఎర్రని నోరు తెరిచి. ఉంగా, ఉంగా అని ఏడుస్తూ ఉంటే, లాలీ, లాలీ,లాలీ అంటూ తాను జోలపాటపాడాలి. వెన్నదొంగవంటి ముద్దులవనుమని పట్టువంటి మెత్తని కురులను దువ్వి సంపెంగపూలను సిగలో తురమాలి, ఇది ఎంతటి స్వల్పమైన కోరిక ! తీరే మార్గం ఆమెకు గోచరించడంలేదు.

అమాత్యులవారు అనుజ్ఞ ఈయడం లేదెందుచేత ? మహారాజులకు బహుభార్యాత్వం దోషం లేదని ఇప్పటికే స్పష్టంకదా ! గురుదేవులు చిట్టి తల్లిని ఎందుచేత చిన్నచూపు చూస్తున్నారు ? వారికి అమ్మణ్ని మీద పుత్రికా వాత్సల్యము ఉన్నప్పటికిన్నీ వివాహ విషయంలో జాప్యంచేస్తూ ఉన్నా రెందుచేత ? ఇలాగ కలవరపడుతూన్న మరకతవల్లి మీన నేత్రాల నుండి నీటి ముత్తెములు జాలువారుతూ ఉన్నవి. వాటిని చూచి సహింపలేక మూర్తెప్ప నాయకులు మరింత విన్నవోయి, నిశ్శక్తులై చిత్తరువులా కూర్చుండి పోయిరాయెను.

కొంతవడికి, మూర్తెప్ప నాయకులు, దేవీ ! నిన్ను వ్యధపెడుతున్న సమస్య ఏమిటో నేను తెలసుకొనగూడదా ? సర్వకాల సర్వావస్థలలోనూ, నీమదిలో చెలరేగుతూన్న యోచన ఏమిటో నాకు చెప్పతగనిదా, దేవీ ! నన్ను ఎందుకిలా దూరంగా ఉంచుతున్నావు ? మనిద్దరిదీ ఒకే మనసు ఒకే ప్రాణమూ కాదా, దేవీ , అని గాద్గదికంగా ప్రశ్నించిరి.