142
 

ప్ర‌భూ ! చెంచుల‌క్ష్మీదేవి నాగ‌ర్భాన పుట్ట‌డంచేత గురుదేవులు అలుసుచేసి, అంగీకారం తెల‌ప‌డంలేదా ? భోగినీ కుల‌పు ఆడ‌ప‌డుచులు పురుషుల భోగాల‌కు మాత్ర‌మేగాని, పెండ్లి చేసుకొని సంసార స్త్రీల‌య్యేందుకు పనికి రారా ? మ‌హారాజులు అమ్మాయిని వివాహ‌మ‌డ‌ని ప‌క్షంలో అమ్మణ్ణి అంతఃపురంలో అట్టే ఉంచ‌డం ఎందుకండీ ? ప‌్ర‌భూ...ప్ర‌భూ, కాలం గ‌డుస్తూన్న కొద్దీనాకు భ‌యం ఎక్కువ వుతున్న‌దండీ ! మ‌హారాజులు శువాణీదేవిని గాంధ‌ర్వ విధినైనాస‌రే వివాహ‌మాడితేనే గాని నాకు ప్రాణాలు నిల‌చేలా లేవు. అలాగ‌...కాక‌పోతే..కాక‌పోతే అమ్మాయి శ్రీ‌వారికి భోగ‌ప‌త్నిగా మాత్ర‌మే జీవించేందుకు నేను అంగీక‌రించ‌ను. ఇంత‌కంటె.

మూర్తెప్ప నాయ‌నిం వారికి అమిత‌మైన ఆగ్ర‌హం క‌లిగిన‌ది. నిగ్ర‌హించుకొని, నీవు భోగ‌ప‌త్నివికావుగ‌దా ! శుక‌వాణీదేవీ నీవుక‌న్న బిడ్డే కాదా ! మ‌న బిడ్డ భోగ‌ప‌త్నిగా ఉంటుంద‌నే దుష్ట‌భావ‌న నీకెందుకు క‌లిగిందో వింత‌గా ఉంది. మాహారాజుల‌నెంత హీనంగా అంచ‌నా వేశాపు మ‌ర‌క‌త‌వ‌ల్లీ ! అని నిష్ఠూరంగా మంద‌లించి, అమాత్యుల చెంత‌కు వెళ్ళ‌డానికి ఆయ‌త్తులైరి. ప్ర‌భూ ! ఆగ్ర‌హించ‌వ‌ద్దు. మీరు గురుదేవుల వ‌ద్ద‌కు వేళ్ళేట‌ప్పుడు చెంచుల‌క్ష్మీ జాత‌క ప‌త్రిక కూడా తీసుకొని వెళ్ళండి. పేరిశాస్త్రుల వారినిన్నీ వెంట‌గొనిపొండి అంటూ మ‌ర‌క‌త‌వ‌ల్లీ దీనంగా రెండు చేతుల‌నూ జోడించిన‌ది. ముంజేతి ర‌వ్వ‌ల కంక‌ణాలు మోచేతుల‌ను దాటునంత‌గా ఆమె చిక్కిశ‌ల్య‌మైనందుకు వ‌గ‌చుచు మూర్తెప్ప నాయ‌నిం వారు స్వ‌ర్ణ‌పేటిక‌లోని చెంచుల‌క్ష్మి దేవి జ‌న్న‌ల‌గ్న శుభ‌ప్ర‌తిక‌ను చేత పుచ్చుకొని, పేరిశాస్త్రుల వారిని తోడ్కొని అమాత్యుల‌క‌డ‌కు వెడ‌లిన‌వారెయెను.

గోవింద దీక్షితామాత్యుల‌వారు దేవ‌తార్చ‌న పూర్తి గావించుకొని, బంధుమిత్రుల‌తో క‌ల‌సి ష‌డ్ర‌సోపేత‌మైన భోజ‌నం చేసి, విశ్రాంతి మందిరాన‌కు వెడుతూ ఉండిరి. ఆ స‌మ‌యాన మూర్తెప్ప నాయ‌నిం వారు వారికి సాష్టాంగ న‌మ‌స్కార‌ము చేసిరి పేరిశ‌స్త్రుల‌వారు జ‌య‌వంద‌న మాచ‌రించిరి. చిరున‌గ‌వుత, సాద‌ర‌పూర్వ‌కంగా వారిని కూర్చుండ నియ‌మించి, తామూన్నూ ఆశీనులైరి.

సేనానాయ‌కులు నేడెందుచేత‌నో వ్యాకుల‌చిత్తులైన‌ట్లుగా అగ ప‌డుచున్నారు. కార‌ణ‌మేమిటో తెలుసుకొన‌వ‌చ్చునా ? అని మ‌హామంత్రులు ప్ర‌శ్నించిరి.

మ‌హామాత్యుల‌వారికి చెప్ప‌కూడ‌ని ర‌హ‌స్య‌ము ఏమి ఉంటుంది. గుర‌దేవా ! నా ఇంటిదీప‌ము నిల‌బట్టెమ‌ని అర్ధించేటందుకు త‌మ పాద స‌న్న‌ధికి వ‌చ్చాను. మా చిరంజీవి, చెంచుల‌క్ష్మీ దేవి వివాహం చేయాల‌ని తల్లి మ‌ర‌క‌త‌వ‌ల్లీ దేవి ఆరాట‌ప‌డిపోతూన్న‌ది. ఆమె మ‌నోవ్యాధితో క్షిణించిపోతూన్న‌ది. ఏమి చేయ‌లేక‌, అశ‌క్తుడ‌నై మా పాదాల‌పైప‌డి, మీ అనుజ్ఞ‌తో స‌త్వ‌ర‌మే క‌ల్యాణ‌ల‌గ్న ప‌త్రిక‌ను వ్రాయించ ప్ర‌య‌త్న‌మే నా ఈ రాక‌. మ‌హారాజుల‌కు త‌ల్లీ, తండ్రీ, గుర‌వూ అన్న మీరే. శుక‌వాణీ దేవికి కూడా మీరు అట్టివారే. ఇరుప‌క్షాల‌వారి క్షేయంకోరే త‌మ‌రు వివాహ‌నికి అనుజ్ఞ ద‌య‌చేయండి, గురుదేవా అని త‌డ‌బ‌డుతూ క‌ల‌వ‌రిస్తున్న‌ట్లుగ మూర్తెప్ప నాయ‌నిం వారు స‌మాధానం ప‌లికిరి.