144
 

పేరిశాస్త్రుల‌వారూ, శుక‌వాణి గ్ర‌హ‌సంప‌త్తి నాకు జ్ఞ‌ప్తిలోనే ఉన్న‌ది శాలివాహ‌న శ‌తాబ్దాలు 1506, చంద్ర‌మాన తార‌ణ‌నామ సంవ‌త్స‌ర కార్తీక శుధ్ద పంచ‌మీ భృగువాస‌రం ప‌ద‌మూడు ఘ‌డియ‌ల ఇరువ‌దినాలుగు విఘ‌డియ‌ల‌కు, మూలాన‌క్షత్ర తృతీయ‌చ‌ర‌ణ యుక్త మ‌క‌ర‌ల‌గ్నాన జ‌న్మించిన‌ది.... అంతేక‌దండీ ? దీక్షితుల‌వారు అనినారు.

పేరిశాస్త్రుల‌వారు విస్తుపోయిరి, చిత్తం...ముమ్మాటికీ...అక్ష‌రాలా...అంతేనండి. అనిరి శాస్త్ర‌లు వారూ. ఇంకా వినండి. ద‌శ‌మ‌మున బుధాదిత్య‌యోగ‌ము, అష్ట‌మాన గురుశుక్రులు, ఏకాద‌శాన కుజుడు, ల‌గ్న‌స‌ప్త‌మాదిప‌తులు ష‌ష్ఠ వ్య‌య‌స్థాన‌ముల‌లోనూ న‌వ‌కోణాన రాహువు, తృతీయాన కేతువు - ఇదీ శుక‌వాణి జాత‌కాన గ్ర‌హ సంప‌త్తి. స‌ప్త‌మ‌గృహాన్ని ఒక్క‌మ‌రు ప‌రికించండి, శాస్త్రుల‌వారూ ! అని గోవింద దీక్షితామాత్యులున్నూ జాత‌క‌చ‌క్రాన్ని తీక్ష‌ణంగా ప‌రికిస్తూ ఉండిన‌వారాయెను.

చిత్తం...చిత్తం...దీక్షితుల‌వారూ, ల‌గ్న‌స‌ప్త‌మాధిప‌తుల ష‌ష్ఠ వ్య‌య‌స్థితి. ద్వితీయ‌మున‌కు గురుశుక్రుల దృష్టి, రాజ్యాధిప‌తియైన శుక్రునితో క‌లిసిన గురుడు క‌ళ‌త్ర‌భావాధిప‌తిని చూస్తూ ఉన్నారు అన్నారు శాస్త్రుల‌వారు.

ఇందువ‌ల్ల‌నే ప్ర‌భువున‌కునూ ఈమెకునూ ప‌ర‌స్ప‌ర ప్రేమ, స్నిగ్ధ‌భావ‌ము, అఖండ‌మైన అన్యోన్యాక‌ర్ష‌ణ‌మూ ఉన్న‌వి. శ‌ని చంద్రులు ష‌ష్ఠ‌వ్య‌య‌స్థితి, శ‌నిపై కుజ‌దృష్టీ వివాహ‌మున‌కు...సంశ‌యించ‌కండి, గుర‌దేవా ! వివాహ‌మున‌కు ? అని మూర్తెప్ప నాయ‌నింవారు ఆత్రంగా ప్ర‌శ్నించినారు. క్ష‌ణ‌కాలం క‌నులు మూసుకొని భృకుటి ముడివైచి. తీక్ష‌ణంగా ఆలోచించి....వ్య‌వ -ధాన‌ము త‌ప్ప‌దు అని వాక్యం పూర్తి చేసినారు గోవింద‌య‌జ్వ‌.

మూర్తెప్ప నాయ‌నిం వారి హృద‌యం నీరైన‌ది. వ్య‌వ‌ధాన‌ము త‌ప్ప‌దు ! ఎన్ని నాళ్ళు ? ఎన్ని ఏళ్ళు ? గురుదేవుల‌నోట ఇదేమి మాల ! మ‌ర‌క‌త‌వ‌ల్లికి ఈ మాట ఎలా చెప్పేది ? ఆమెను ఎలా ద‌క్కించుకోనేది ? మ‌ర‌క‌త‌వ‌ల్లీ ! ఎలాగ నిన్నెలాగ ర‌క్షించుకోను అని వ‌గ‌చి, భిన్న‌వ‌ద‌నులై, మూర్తెప్ప నాయ‌కుల‌వారు వెడ‌లిపోయిరి. వారిని పేరిశాస్త్రుల‌వారు అనుస‌రించిరి.

మ‌ర‌క‌త‌వ‌ల్లీ దేవీ, మూర్తెప్ప నాయ‌కుల‌వారి కొర‌కు ఆతృత‌తో ఎదురుచూస్తూ ఉన్న‌ది. ఒక‌చోట్ల నిలువ‌లేక‌పోతూన్న‌ది. భ‌వంతిలోనికి వ‌స్తూన్న మూర్తెప్ప నాయ‌నింవారిని, పేరిశాస్త్రుల‌వారిని చూచి, శుభల‌గ్నం నిర్ణ‌యించుకొనే వ‌చ్చినార‌నే నిశ్చ‌య భావ‌న‌తో, సంత‌సంతో, వారేమి చెప్పుదురో అనే ఉద్వేగంతో నాలుగడుగులు ఎదురేగి, ఉభ‌యుల‌కు న‌మ‌స్క‌రించి ప్ర‌భూ ! శుభ‌వార్త వినిపించ‌రా, అని నాయ‌నిం వారు న‌డిగిన‌ది. నాయ‌నిం వారు శాస్త్రుల‌వారిని సాభిప్రాయంగా చూచిరి.

మ‌న అమ్మ‌ణ్ణిదెంతో ఉత్త‌మ జాత‌క‌మ‌మ్మా, అంటూ శాస్త్రుల‌వారు ప్రారంభించినంత‌నే మ‌ర‌క‌త‌వల్లి మొగము ర‌వంత చిట్లించి, అయ్య‌వారూ ? చెంచుత‌ల్లి జాత‌క ప్ర‌శంస ఇప్పుడ‌లా ఉంచి, ముందు వివాహ‌మెప్పుడు నిర్ణ‌యించారో చెప్పండి త్వ‌ర‌గా అనిన‌ది,. అదే చెప్ప‌బోతున్నాను తల్లీ ! అమ్మ‌ణ్ణి జాత‌కంలో ఎలాటి అవ‌యోగాలూ లేవు. వివాహం అవ‌దేమోన‌నే భీతి మీకు ఎందుకు క‌లుగుతూ ఉన్న‌దో నాకు అవ‌గతం కాకుండా ఉన్న‌ది. .. శ‌ని కుజుల ష‌ష్టాష్ట‌కం ఉంది చూశారూ,. దానివ‌ల్ల‌నే తాత్కాలికంగా విఘ్నాలూ క‌లుగుతూ ఉన్నాయి. ఈ విఘ్నాలు తాత్కాలికం క‌నుక మీరు ధైర్యంగా ఉండాలి తల్లీ ! అన్నారు పేరి శాస్త్రుల‌వారు.

మ‌ర‌క‌త‌వల్లి : ఇలా ఎన్ని సంవ‌త్స‌రాలు వేచి ఉండాలి. అయ్య‌వారూ ? అమ్మాయి తోడిదే అయిన న‌గ‌రాజుని కొచ్చ‌ర్ల కోట దుర్గాప‌తిని స్వీక‌రించాడు కాడా ? అప్పుడే ప‌న‌స‌పండు వంటి పాపాయిన ఎత్తుకోలేదా ? అమ్మాయి ఈడు వారెవ‌రైనా ఇలా ఉన్నారేమో చెప్పండి చూతాం.

మూర్తెప్ప : దేవీ ! దుర్గాధిప‌తి న‌గ‌రాజును స్వీక‌రించిన‌ట్లుగా, మ‌హారాజులు అమ్మాయిని స్వీక‌రించ‌డం, నువ్వూ నేను ఒప్పుకున్నా, మ‌హా రాజులూ అమ్మాయీ అంగీక‌రిస్తార‌నే నీవు న‌మ్ముతున్నావా ? ఇంత‌కుముందు, ఒక్క ఘ‌డియ క్రిత‌మే కాదా శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ మ‌హారాజుల‌వారికి చెంచెల‌క్ష్మి భోగ‌ప‌త్నిగా ఉండ‌కూడ‌ద‌ని తీవ్రంగా విర‌సిస్తూ చెప్పావు ?

మ‌ర‌క‌త : ప్ర‌భూ ! అమ్మాయిని భోగ‌ప‌త్నిగా ఊహించ‌నైనా ఊహించ‌లేను. నా తల్లి ర‌ఘునాథుల అంతఃపురాన ధ‌ర్మ‌ప‌త్నిగానే కాలు పెట్టాలి. ఆ యోగ్య‌త నా కొమ‌రిత‌కు అన్ని విధాలా ఉన్న‌ది. నాకు చూచే యెగ్య‌త ఉన్న‌దా, లేదా అన్న‌దే నా చింత‌.