145
 

పేరి : అమ్మా , జ్యోతిష శాస్త్రాన్ని తాము న‌మ్మ‌రా, త‌ల్లీ ! చూడండి, చ‌తుర్ధాన్ని ర‌వి, బుధ, గురులు వీక్షిస్తూ ఉన్నారంటే, దాని ఫ‌లితం ఏమో తెలుసునా, త‌ల్లీ ? స‌ర్వ‌శాస్త్ర పారంగ‌తురాలున్నూ, స‌క‌ల క‌ళా ప్ర‌వీణురాలున్నూ అవుతుంద‌నేగా ? అమ్మాయి త‌న పాండిత్యంతో పండితుల‌నేగాక‌, పామ‌రుల‌ను స‌హితం రంజింప‌జేసేలా ఆస్థానంలో క‌వ‌నం చెప్పుతూ ఉంటే, సాక్షాత్తూ శార‌దాదేవినే చూస్తూ ఉన్న‌ట్లుగా మ‌న‌సు పుల‌కించ‌దా తల్లీ ? క‌విత‌కు సాయంగా, చేత‌వీణ లేకుండా, అమ్మాయి ఒక్క ప‌ద్య‌మేనా అల్ల‌దు. విపంచికీ ఈమెకూ అంత విడ‌రాని బంధ‌మేమిటో ! ఇక్క‌డ‌, మ‌రో ముఖ్య‌విష‌యం చెప్పాలి. చిరంజీవి చెంచుల‌క్ష్మీ మ‌హా సుగుణ సౌశీల్యాలు క‌లిగియుండున‌నిన్నీ జాత‌క‌చ‌క్రం చెబుతూ ఉన్న‌ది. చంద్ర‌మామ‌న సోజాతః అని శాస్త్రం. ఇక్క‌డ చంద్రుడు సూక్ష‌స్థాన‌గ‌తుడై ల‌గ్నాధిప‌తిని చూస్తూ ఉండ‌గా జ‌న్మించిన జాత‌కులు నివృత్తి మార్గాన త‌ప్ప ఇహ‌భోగాల వైపున‌కు దృష్టి సారించ‌ర‌ని వ‌ర‌హ‌మిహిరుడు ఘంటాప‌ధంగా చెప్పినాడు. వ్య‌యాధిప‌త్యం గురున‌కు క‌లిగి అష్ట‌మంలో ఉండ‌డం అంటే, అమ్మా ! చిన్న‌వారిని పొగ‌డ‌కూడ‌దుకాని, అలాటి వారికి పెద్ద‌వారుకూడా చేతులు జోడించి న‌మ‌స్క‌రించ‌వ‌ల‌సిందే ! గురు శుక్రుల‌కు ల‌గ్నాధ‌ప‌తి శ‌ని వీక్ష‌ణం ఉన్న‌ది. ఎంత‌టి నిర్లిప్త‌త నిర్మ‌మ‌త్వ‌ము భ‌క్తి , వైరాగ్యాలు అమ్మ‌ణ్ణికి ఉన్నాయో నాకు అవ‌గ‌త‌మేకాని నోరువిప్పి ఎన్న‌డున్నూ ఇలాగ విడ‌మ‌ర్చి త‌మ‌కు చెప్పి ఉండ‌లేదు. ఇంత‌టి ఉత్త‌మ జాత‌కురాలు త‌మ గ‌ర్భాన ఉద‌యించిన‌దంటే, పూర్వ‌జ‌న్మ‌లో చేసికొన్న పుణ్య‌ఫ‌ల‌మే అని భావించాల‌మ్మా ! చిరంజీవి భ‌విష్య‌త్తుకు ఏ భ‌య‌మూలేదు. సాధార‌ణ మ‌న‌వుల‌పేరు నూరేళ్ళ‌కే మాసిపోతే, ఇలాంటి మ‌హ‌నీయుల పేరూ ప్ర‌ఖ్యాతీ వంద‌ల‌, వేల సంవ‌త్స‌రాలు శాశ్వ‌తంగా నిల‌చి ఉంటాయి. అమ్మ‌ణ్ణి వివాహానికి ఆదుర్ధా పడ‌కండి. త‌ప్ప‌క అయి తీరుతుంది. కాక‌పోతే కొంత ఆల‌స్యం త‌ప్ప‌దు. మీరు ధైర్యంగా ఉండండి, త‌ల్లీ ! అని నొక్కి వ‌క్కాణించి పేరిశాస్త్రుల‌వారు సెల‌వు పుచ్చుకొనిరి.

ఆ పండితుడు చెంచుల‌క్ష్మి జాత‌కాన్ని ఎంత‌గానో పొగ‌డి, త‌న కుమార్తె అద్భుత‌మైన‌ద‌నీ, అపురూప‌మైన‌ద‌నీ, ఆణిముత్యంలా స్వ‌చ్ఛ వ‌ర్త‌నం క‌లిగిన‌ద‌ని చెప్పిన‌ది విని, మ‌ర‌క‌త‌వల్లి సంతోషాంత‌రంగ‌యైన‌ది. శాస్త్రుల‌వారు చెప్పిన‌ట్లు, పెండ్లి చేసుకొన‌డ‌మూ పిల్ల‌ల‌ను క‌న‌డ‌మూ స‌ర్వ‌సాధార‌ణంగా ప్ర‌తివ్య‌క్తీ చేసేవ‌నే. చెంచుత‌ల్లి క‌ళామ‌త‌ల్లికి ముద్దుబిడ్డ ! ప‌లికెనా క‌వ‌నం, న‌డిచెనా నాట్యం, వీణ‌మీటెనా నామ‌రూప‌ర‌హిత శ‌బ్ద బ్ర‌హ్మ సాక్షాత్కారం ! చిట్టిత‌ల్లి కాలి అందెల ర‌వ‌ళుల‌లో నిరుప‌మాన నిర్మ‌ల స‌త్య సుంద‌రి దివ్యానంద సంధాయ‌క‌మైన, అనిర్వ‌చ‌నీయ చేత‌నా చేత‌నాత్మ‌క‌మైన స‌ర్వ‌ప్ర‌పంచ‌మూ మ‌నోనేత్రానికి పొడ‌గ‌ట్టుతుంది. ఇట్టి భావాల‌కు, మ‌ర‌క‌త‌వ‌ల్లి హృద‌యం తేలిక‌ప‌డి, త‌న అనుంగు కొమ‌రిక‌తై పాల‌క‌డలిలా పొంగిన‌ది. రెండు చేతులూ బిడ్డ‌ను పొద‌పుకొనాల‌నే త‌హ‌త‌హ‌ను త‌ట్టుకొన‌లేని అకృశాంగిచ చెంచుతల్లి ! ఎప్పుడు వ‌స్తావ‌మ్మా ! నా గుండెలు నీ కోసం ఎలా కొట్టుకుంటున్నాయో చూడు, త‌ల్లీ ! త్వ‌ర‌గా రావా ? అని ఎలుగెత్తి ఆర్ద్రంగా పిలిచిన‌ది. మ‌ర‌క‌త‌వ‌ల్లి హృద‌యాన సంత‌సం వెల్లి విరిసిన‌ద‌ని మూర్తెప్ప నాయ‌నింవారికి అవ‌గ‌త‌మైన‌ది. ఇక‌, త‌న ప్రియ‌స‌తి ఆరోగ్యం మెరుడుప‌డే సూచ‌న‌ల‌ను చూసి వారి ఆవేద‌న నెమ్మ‌దించిన‌ది..