151
 

శుక : ప్ర‌భూ, నాదో మ‌న‌వి, మ‌న ఇరువురి ర‌చ‌న‌ల‌లోనూ భావ‌మొక‌టి గానే ఉండ‌వచ్చును. కాని య‌ధాత‌ధ‌మైన అనువాదంగాక సందర్భాను కూలంగా స్వ‌తంత్రంగా ర‌చించేటందుకు నాకు మీ అనుజ్ఞ‌ను ద‌మ చేయించాలి,

ర‌ఘు : దేవీ, నీకు నేను అనుజ్ఞ ఈయ‌డ‌మా ! ఊహు, కాదు. నీవే నాకు అనుజ్ఞ ఈయ‌వ‌ల‌సి ఉంటుంది.
శుక‌వాణి దేవి మ‌ధుర‌హాసం చేస్తూ ల‌జ్జాభారంతో మోమువంచుకొని నిల‌బ‌డి ఉన్న‌ది. ప్ర‌భువులు ఆమె ముంజేతి ప‌చ్చ‌ల కంక‌ల‌ణాల‌ను మీటి ముచ్చ‌టైన మున‌వ్రేళుల‌ను ముద్దాడి వెడ‌లిపోయిరి.

అప్ప‌య దీక్షితుల‌వారితో ప్ర‌సంగించిన త‌రువాత‌, య‌జ్ఞ‌నారాయ‌న దీక్షితులు కృష్ణ శుక్ల యజుర్వేదాల‌లోని భేధాల‌ను గుఱించి కూలంక‌ష‌ముగ యోచించుచుండిరి. రెంటియందునా అంత‌ర్లీనంగా ఉండే మ‌హ‌ద్భావ‌మొక్క‌టియే, అని వారి మ‌న‌స్సున‌కు దృఢ‌ముగా నాటుకొనిన‌ది. త‌న తండ్రిగారు కృష్ణ‌య‌జుర్వేదాన్ని ఎందుకు అంత‌గా అంటిపెట్టుకొని ఉందురో య‌జ్ఞ‌నారాయ‌ణున‌కు అవ‌గ‌త‌ము కాకుండెను.

నాన్న‌గారూ, ఈ మారు మీరు చేసే య‌జ్ఞాన్ని శుక్ల‌య‌జుర్వేదాను సారంగా నిర్వ‌ర్తించ‌రాదా ?
కుమారుని మోమున బ్ర‌హ్మ‌తేజస్సు ఉట్టిప‌డుతూ ఉన్న‌ది. అత‌ని ప‌లుకు కేవ‌ల‌ము వేద‌మూర్తియైన శ్రీ‌మ‌న్నారాయ‌ణుని ప‌లుకుగా గోవింత దీక్షిత‌లువారికి భాసించిన‌ది. ఆయ‌న విస్తుపోయినారు.

ఏమి, య‌జ్ఞ‌య్యా, రెండు మార్గాలూ భిన్నాలుకావ‌ని ఇన్ని నాళ్ళుగా నీవు వారిస్తూంటివి గ‌దా, భేద‌మే లేన‌పుడు ఏమార్గ‌మయినా ఒక‌టేకాదా ?

య‌జ్ఞ : అవునండీ , నాన్న‌గారూ. కృష్ణ శుక్ల యజుర్వేదాలు రెండూ ఒక‌టేనండి. ఎలాగంటే, అప్ప‌య‌దీక్షితుల‌వారు త‌మ‌కు గురువులు, అవునా ?

గోవింద : ఎలా కాద‌న‌గ‌ల‌ను ? వారు నాకు సాక్షాత్తూ గుర‌వులే. నన్ను పుత్ర‌స‌మంగా చూసుకొనేవారు.

య‌జ్ఞ : కాగా, కొలువు కూటంలో మీరిరువురూ చేసిన వాద‌న‌ను వింటే మీరిరువురూ మిత్రులే అనుకొంటారు.

గోవింద : అనుకోవ‌డ‌మేమిటి ? మేమిరువురము మిత్రుల‌మే కాదా , మ‌రి ?

య‌జ్ఞ : భావిత‌ర‌ల‌వారు మీ ఇద్ద‌రిని గురించి ఏలాగున భావిస్తారో తెలుప‌నా, నాన్న‌గారూ ? కొంద‌రు, అప్ప‌య దీక్షితులూ, గోవింద దీక్షితులూ గురుశిష్యులే. అని వాదిస్తే మ‌రికొంద‌రు అది పొర‌బాటు, వారిరువురూ అతి సన్నిహితం అయిన మిత్రులు అని వాదిస్తారు. ఆ ఒక్క అప్ప‌య దీక్షితుల వారే ఒక‌ప్పుడు గురువు, ఒకప్పుడు మిత్రుడు ఆ లాగున‌నే ఈ రెండు వేదాల‌లో ఉన్న ప‌ర‌మ‌భావం ఒక్క‌టే. ఒక‌టి గురువులా శాసిస్తూ ఉంటే, ఒక‌టి మిత్రునిలా స‌ర‌సంగా హిత‌వు చెపుతూ ఉంటుంది...

గోవింద : నాయ‌నా, తైత్తిరీయం వాజ‌స‌నేయంక‌న్న ప్రాచీనం కాదుటోయీ ?

య‌జ్ఞ : ఏది ప్రాచీన‌మైన‌ది అని విచారించ‌డం క‌న్న‌, ఏది శ్రేష్ఠ‌మైన‌ది అని గ‌మ‌నించ‌డం మంచిదికాదా నాన్న‌గారూ ?

గోవింద : అయితే నీ దృష్టిలో వాజ‌స‌నేయ‌మే శ్రేష్ఠ‌మైన‌ది అని అంతేనా ?

య‌జ్ఞ : అలాగ‌కాదంగీ. రెంటినీ భేద‌భావంతో చూడ‌రాద‌ని నా మ‌తం.

గోవింద : రెంటికి భేదం లేనప్పుడు, ఏదైతేనేమి ?

య‌జ్ఞ : మీరు నన్ను మ‌న్నించాలి. క‌ర్మ‌మార్గంలో ద‌క్షిణ భార‌తావ‌ని అంతా ఏక‌దృష్టితో మిమ్ముల‌నే గ‌మ‌నిస్తూ ఉన్న‌ది. క‌ర్మిష్ఠులంద‌రికీ మీరే ఆద‌ర్శ‌మూర్తుల‌వుతూ ఉన్నారు. ఈలాగున మీరు కృష్ణ‌య‌జుర్వేదానికే ప‌ట్టంగ‌డుతూ ఉంటే శుక్ల‌యజుర్వేదానికి నిరాద‌ర‌ణ ఎక్కువ‌యే అవ‌కాశాలు ఉన్న‌వంటారా, లేవంటారా ?

గోవింద : ఆ మాట‌కూడా నీవే చెప్పు

య‌జ్ఞ : కొంత‌కాలంక్రింద‌ట వేద‌పురుష పూజ‌ల‌కు క‌ళింగ గోదావ‌రి, కృష్ణ తుంగ‌భ‌ద్రాది అనేక మండ‌లాల నుండి పండితులు ఇచ్చ‌ట‌కు వ‌చ్చి, స‌న్మానాలు పొంది వెడ‌లిపోయే త‌రుణ‌ములో కృష్ణ య‌జుర్వేద‌మే ప‌ర‌మ‌ప్రామాణ‌మైన‌ద‌నే భావాన్ని వెల్ల‌డి చేసినారు. ఒక పండితుడు అన్నాడుక‌దా, గోవింద‌య‌జ్వుకే ప‌ర‌మ‌స్వీకార్వ‌మై న‌పుడు మ‌న‌కు మాత్రం తైత్తిరీయం శిరోధార్యం ఎందుకు కాకూడ‌దు ? అని. ఇలాటి భేదభావం మీ మూలాన క‌ల‌గ‌డం నాకు బాధ‌గా ఉన్న‌ది, నాన్న‌గారూ !

గోవిందామాత్యుల‌వారు చిరున‌గ‌వుతో త‌ల పంకించి వెడ‌లిరాయెను. ఆ చిరున‌గ‌వే అంగీకారంగా భావించి య‌జ్ఞ‌నారాయ‌ణుడు వేదాశ్ర‌మానికి వెడ‌లేను.

 

20

 

శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌నిం వారు గొబ్బూరి జ‌గ్గ‌రాజుపై స‌మ‌రానికి స‌ర్వ‌సన్నాహాలు చేయ‌వ‌ల‌సిన‌ద‌ని ఆజ్ఞ‌ను ద‌య‌చేసిన నాటి సాయంత్ర‌ము శ‌బ‌ర‌వీరుడైన క‌ప్ప‌న్న‌దొర నుండి వేగు వ‌చ్చిన‌ది. ర‌ఘునాథ ప్ర‌భువుల ఆదేశానుసార‌ము కుబ్జ‌దంతావ‌ళ‌ములు ప‌దివేలు, సేవ ప‌డ‌వ‌లు డెబ్బ‌దివేలు సిద్ధ‌ప‌ర్చిన‌ట్లున్నూ. ప్ర‌భువుల‌వారు విచ్చేసిన‌దే త‌డ‌వుగ దేవికోట నేలుచున్న చోళ‌గునిపై యుద్ధ‌మున‌కు స‌ర్వ‌మూ సిద్ధ‌ప‌ర‌చిన‌ట్లున్నూ ర‌హ‌స్య స‌మారాచ‌ర‌మునందుకొన్న ర‌ఘునాథ ప్ర‌భువులు దిగ్భ్రాంతి నందిరి.

ర‌ఘునాథ ప్ర‌భువుల క‌నుల‌ముందు మూడు ర‌ణ‌రంగ‌ములు క‌ద‌లాడు చుండెను. అంత‌కు కొల‌దిసేప‌టి క్రిత‌ము సింహ‌ళ‌దేశ‌ములోని నేపాళ మండ‌లాధీశ్వ‌రుడైప బుద్ధ సంఘీయ ప్ర‌భువు తంజపుర‌ము వ‌చ్చి, ర‌ఘునాథ ప్ర‌భువుల మ్రోల‌వ్రాలి, రాజ్య‌భిక్ష‌కై మోడ్సులు చేసికొని ఉండెను. ఇరువురు రాజ‌కుమారులు ఆ ప్ర‌భువున‌కు శ‌ర‌ణాగ‌తులై యుండిరి. వారిని సింహాస‌న‌ముల నెక్కించ వ‌ల‌సిన బాధ్య‌త మ‌హారాజుల భుజ‌స్కంధ‌ముల‌పై నుండెను. ఏది శ‌వైపుకు ముందు వెళ్ళ‌వ‌ల‌సిన‌దీ, ఏ యుధ్ధ‌ము ముందు చేయ‌వ‌ల‌సిన‌దీ తేల్చ‌డానికి ప్ర‌భువులు కొంత తబ్బిబ్బుప‌డిరి. ఈ యుద్ధ‌ములు చేసేకాలంలో త‌మ రాజ్య‌భ‌ద్ర‌త‌ను కాపాడ‌గ‌ల యోధులెవ‌రు ?

 

అమాత్యుల‌తో గూడి ప‌లువురు బుద్దిశాలుర‌తో మ‌హారాజు మంత‌నాలు చేసెను. గోవింద‌య‌జ్వ తుద‌కు ఈ ఏర్పాట్లు ఏ రీతిగ నుండ‌వ‌లెనో నిర్ణ‌యించిరి.