154
 

స‌హ్య‌జాన‌దీ తార చంప‌కారణ్యంలో నిర్మిత‌మైన వేదాశ్ర‌మ‌ము విద్యార్థుల విద్యాఘోష‌తో నినదిస్తూన్న‌ది. ముప్ప‌ది నివ‌ర్తాల భూమిలో మ‌హారాజులు ప‌ర్ణ‌శాల‌ల‌ను అతి దృఢంగా నిర్మింప‌జేసిరి. కుల‌మ‌త వివిక్ష లేక‌, పంచ‌వ‌ర్షాలు నిండిన ప‌సిబాలుర‌ను సహితం ఈ ఆశ్ర‌మానికి నిర్భీతిగా పంపుట‌కు త‌ల్లిదండ్రుల‌కు వెర‌పులేకుండెను. వివిధ వ‌య‌స్సుల‌లోనున్న వారు ఈ ఆశ్ర‌మంలో త‌ర్క న్యాయ కావ్యాలంకార వేదోప‌నిష‌దాది విద్య‌ల‌ను నేర‌స్తూ ఉండిరి.

చ‌తుర్వేదాల సార‌మును కూలంక‌ష‌ముగా అవ‌గ‌త‌ము చేసికొన్న య‌జ్ఞ‌నారాయ‌ణ దీక్షితులు, వేదాల‌కు కొంద‌రు స్వ‌లాభ‌వ‌రులు అపార్ధాలు చెప్పికొన్ని మూఢాచార‌ముల‌ను క‌ల్పించినార‌ని గ్ర‌హించినాడు. అట్టి మూఢాచార‌ముల‌ను రూపుమాపుట‌కు నిర్విరామ‌కృషి చేస్తూ ఉండినాడు.

కుల ప్రాతిప‌దిక‌పై కొంద‌రు వేద‌విద్య‌కు దూరం కావ‌డం య‌జ్ఞ నారాయ‌ణున‌కు హృద‌య‌శ‌ల్య‌మైన‌ది. త‌మ గురుకులానికి వ‌చ్చే విద్యార్ధి యొక్క శ‌క్తి సామ‌ర్ధ్య‌ముల‌ను గ్ర‌హించి, వారికి ఏయే విద్య‌ల‌పై అభిమాన‌మున్న‌దో గ్ర‌హించి ఆయా విద్య‌ల‌నే గ‌ర‌పిస్తూ, విద్య నేర్చుకొనుట అంటే ఆట‌లాడుకొన‌టం అంత ఆనంద‌దాయ‌క‌మే అని అగుప‌డులాగున ఆశ్ర‌మ నిర్వ‌హ‌ణ‌చేస్తూ ఉండిరి. వేద‌పాఠాల‌ను ఉప‌న్య‌సించే స‌మ‌యాల‌లో సర్వ ప్రాముఖ్యంతో బాటు, వాటి అర్ధాల‌నే గాక అంత‌రార్ధ‌ముల‌ను కూడ తెలియ‌జెపుతూ, విద్యార్ధుల మేధ‌స్సును తేజోవంతం చేసేలాగున ప‌రిశోధాత్మ‌కంగా విద్యాబోధ‌నం కావిస్తూ ఉండిరి.

మ‌హారాజులు ఈ వేదాశ్ర‌మాన్ని ప‌రికించి, సంతుష్ఠ‌లై చంప‌కార‌ణ్యాన్ని వేదార‌ణ్యంగా మ‌ల‌చిన త‌న శిష్యుడు, య‌జ్ఞ‌నారాయ‌ణుని కృషికి ప‌ర‌మానంద భ‌రితులైరి. ఉత్త‌ర ద‌క్షిణ భార‌తావ‌నిలో ఉన్న పండిత ప్ర‌కాండులు గురువులుగా నుండి విద్యాబోధ‌న చేస్తూన్న‌ప్పుడు, చ‌దువులు నేర్చిన‌వారి అదృష్ట‌మే అదృష్ట‌మ‌ని
ప్ర‌భువులు ప‌లుమార్లు భావించిరి. తాము వాల్మీకి చ‌రిత‌మునూ రామ‌చరిత‌మునూ నిర్మిస్తూ ఉన్న స‌మ‌యాల ప్ర‌భువులు ఈ ఆశ్ర‌మాన్ని య‌ధాత‌థంగా వ‌ర్ణించి, య‌జ్ఞ‌నారాయ‌ణునిపై త‌మ‌కుగ‌ల గాఢ‌వాత్స‌ల్యాన్ని నిరూపించిరి.

 

ఋక్ య‌జుస్సామ వేద‌ముల‌లో ఏ వేద‌ము ముందుపుట్టిన‌ది ? అని పండితులు త‌ల‌లు బ్ర‌ద్దలు కొట్టుకొనుచుండిరి. అప్పుడు య‌జ్ఞ‌నారాయ‌ణుడు సాయ‌న విద్యార‌ణ్యాది మ‌హానీయుల గ్రంథ సంద్రాల‌ను ప‌రిశోధించి మూడున్నూ స‌మ‌కాలిక‌ములే అని తేల్చేను.

 

ఈ మూడు వేద‌ముల‌నూ ఏక‌ప‌దంతో బంధిస్తూ త్ర‌యి అనే వాడుక‌కూడ ఇందుచేత‌నే క‌లిగిన‌ది. త్ర‌యోవేదే అజాయ‌న్త అని ఐత‌రేయ బ్రాహ్మ‌ణ‌మూ, త్ర‌యీ విద్యాఋచో య‌జూంషి సామాని అని శ‌త‌ప‌ధ బ్రాహ్మ‌ణ‌మూ ఘోషించుచున్న‌వి. ప్రాచీన‌కాలంలో మాన‌వుని ఆస్తిక పాల‌న‌లో య‌జ్ఞ క్ర‌తువులు అత్యంత ముఖ్య‌క‌ర్మ‌లై యుండ‌గా, ఋగ్వేద‌ము వ‌ల‌న హోత‌, యుజుర్వేద‌ము వ‌ల‌న అధ్వ‌ర్యుడు, సామ‌వేద‌ము వ‌ల‌న ఉద్గాత స‌మ‌ర్ధులై ఒప్పిరి. హౌత్ర‌ము బుక్కుచేత‌ను, ఆధ్వ‌ర్య‌ము య‌జుస్సుచేత‌ను ఉద్గీథ‌ము సామముచేత‌ను జ‌రుప‌బ‌డుచున్న‌వి. ఇందువ‌ల‌న‌నే ఋగ్వేదంలో య‌జుస్సంహితులును, య‌జుర్వేదంలో ఋక్కుల‌ను, సామ‌వేదంలో య‌జుస్సులును, ఋక్కులునూ ఉన్న‌వి. అని య‌జ్ఞ‌నారాయ‌ణ దీక్షితులు శిష్యుల‌కు సోప‌ప‌త్తికంగా బోధిస్తూ ఉండెను.

 

ఋగ్వేద సూక్త‌ములు య‌జ్ఞార్ధ‌ములుగా యాజ్ఞికుల‌చేత ప‌ఠింప‌బ‌డుతూ ఉన్న‌ప్ప‌టికిన్నీ, ఇంద్రాగ్ని వ‌రుణ దేవ‌త‌ల‌ను కీర్తించే స్తోత్ర‌ములుగా, ఏ మంత్రానికా మంత్ర‌మే విడిపోతూ ఉన్న‌దిగాని, మంత్రానికీ మంత్రానికీ సంబంధ‌ములేదు. యజుర్వేద మంత్ర‌ములు అట్లాగ‌గాక‌, చెప్ప‌ద‌ల‌చుకొన్న ప్ర‌తి...విష‌య‌ము పూర్తి అయేవ‌ర‌కు స‌మ‌న్వ‌య‌ము క‌లిగే లాగున నిబంధింప‌బ‌డ‌టం వ‌ల‌న‌, వేదాల‌న్నిటా య‌జుర్వేద‌మే మ‌హాత్త్వ‌మైన‌దిగా ప్ర‌శంసింప‌బ‌డుతూ ఉన్న‌ది. సామ‌వేద‌ము ప్రాచుర్య‌ముగా ఋగాశ్ర‌తిమే అని కుల‌ప‌తి స్ప‌ష్ట‌రిచిరి.

 

ఈ మూడు వేదాల‌లోనూ ఏ వేద‌ము ముఖ్య‌ము ? అనే శిష్యుల ప్ర‌శ్న‌ల‌కు, య‌జ్ఞ‌నారాయ‌ణులు, క‌నులు మూసికొని, ఒకించుక యోచించి, విరాట్పురుషున‌కు య‌జుర్వేద‌ము శిర‌స్సు అయితే ఋగ్వేద‌ము ద‌క్షిణ ప‌క్ష‌ము సామ‌వేద‌ము వామ‌ప‌క్ష‌ము అని తైత్తిరీయార‌ణ్య‌క వాక్య‌మును స్మ‌ర‌ణ‌కు దెచ్చిరి.