శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయనిం వారు ససైన్యంగా కొలరూన్‌నదీ ముఖద్వారం వద్ద, రాత్రికిరాత్రి యుద్ద శిబిరాలను ఏర్పరచుకొని విడిది చేసిరి. ఈ విషయం దేవికోటనేలే చోళగునకు తెలిసినదికాదు. కోట బురుజులపైనుండి దృష్టి సారించిన సేవకుదొకడు, నేల ఈనినటు బిలబిలలాడుతున్న మహాసైన్యాన్ని చూచి, తబ్బిబ్బుపడి తమ ఏలిక చోళగునకు ఆ దుర్వార్తను విన్నవించుకొనుటకు వేగంగా వెడలినాడు.
ఆ దివ్య ప్రభాతవేథ భైరవాలయాన అతి దీక్షగా మంత్రపురస్పరంగా రిపుప్రళయాంతక భైరవుని చోళగుడు ఆవాహన చేస్తూ ఉండెను.
ఓం నమో భూతనాధాయ క్షేత్రపాల
భైరవాయ ఢాకిన్యావేశయ ఆవేశయ
సకల భూత గణ సేవితాయ స్వాహా అని కలశము నుండి జలమును తర్పణం చేస్తూ ఉన్న సమయంలో ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చి ప్రభో....శత్రువుల...వేలు...వేలు నది ఒడ్డున...అని రొప్పుతూ చెప్పబోతూ ఉన్న సేవకుని చిరాకుతో చూచి, తన ఏకాగ్రతకు భంగము కలిగించిన వాని శిరసును ఖండించి, భైరవస్వామిని రక్తతర్పణంతో ఆర్చించినాడు. తృటిలో చోళగుడు మరల సిద్ధాసనం వేసికొని, కనులు మూసికొని,
ఓం అం క్షం హ్రీం గ్లీం
ఐం శ్రీం క్రోం ఏహ్యేహి
రణ భైరవాయ సర్వశత్రు
నివారణాయ సేనాగ్రసన...
రణ భైరవాయ స్వాహా...అని జపము చేయసాగినాడు.
వైశాఖశుద్ధ పాడ్యమినుండి భాద్రపద శుద్ధ పాడ్యమివర ప్రతి దినము నాలుగు వేలమారలు ఈ మంత్రమును శ్రద్ధతో, ఏకాగ్రతతో జపించినవారికి సార్వభౌమత్వము లభిస్తుందని హిమాలయముల నుండి వచ్చిన ఒక సన్యాసి చోళగునికి ఉపదేశించినాడు. నాటికి నెల దినాల నుండి చోళగుడు మంత్ర దీక్షాబద్ధుడాయోను. శాక్తేయ మంత్రములన్నింటిలో ఈ మంత్రము మహామహిమాన్వితమైనదనన్నీ, మహాగోప్యమైనదనిన్నీ, మహాశక్తిమంత మైనదనిన్నీ ఆసాధువు నమ్మబల్కినదాది, చోళగునకు తాను సార్వభౌముడు కావలెనని దురాశ పెచ్చుపెరిగిపోయినది.
చోళగుని దురాళకు బలము కలిగించే విషయాలు అనేకంగా అతనికి అగుపడుతు ఉన్నవి. సహజముగా అతడు భైరవోపాసకుడు. అతని కోట చుట్టూ జలదేవత రక్షాకవచంవలె శత్రువలను ప్రవేశించనీయకుండా చేస్తూ ఉన్నది. దుర్గానికి ఎనిమిది దిక్కులా భైరవస్వామి ఆలయాలను నిర్మించి, బ్రాహ్మీమూహూర్తాన బయలుదేరి, ఎనిమిది దిక్కులను పాలిస్తూ ఉన్న కంకాళ భైరవ, వీరభైరవ, రిపుప్రళయాంత భైరవ, సర్వసంరక్షక భైరవ, కుమారభైరవ, గజభైరవ, వ్యాళభైరవ, అష్టదిగ్రాయభైరవులకు సహస్ర ఘటాభిషేకం చేయడమేగాక సాగరసంగమ స్థానములో వేంచేసి ఉన్న కాల భైరవ, కపాల భైరవ, ప్రతిగండ భైరవ, గణేశభైరవులనూ అర్చించి ద్వాదశభైరవారాధనను పూర్తిగావించిగాని మరే కార్యమున్నూ ప్రారంభించే వాడుకాడు. దేశవిదేశాలనుండి కన్యలను అపహరించి తెచ్చి బంధించి, కొందరి జీవితాలను కాలరాయడమేగాక, కొందరిని బుడతకీచులకు కొందరిని పోర్చుగీసులకూ కాన్నచేసేవాడు. దారిదోపిడి గాండ్రకు నాయకుడై గ్రామాలకు గ్రామలను నిలువుదోపిడీ చేసేవాడు. పోర్చుగీసులు ఇతనికి చేదోడువాదోడుగా ఉండడంచేత, దేశంలోని ప్రజలను ఈతడు అతిక్రూరడై రక్కసుని కన్న మహాభయంకరుడై పీడిస్తూ ఉండేవాడు. తుండీర , జింజి ప్రభువులు ఇతనికి చేదోడు వాదోడుగ ఉంటూ అగ్నికి ఆజ్యంలా ఉంటున్నారు.
శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయనిం వారు ఈ వైనమంత వినిన తరువాత చోళగుని వధించడమే తమ ప్రధమ కర్తవ్యమని నిశ్చయించిరి. నదీ ముఖ ద్వారాన్నుండి జలకందకాన్ని దాటి, ఏదో విధంగా కోటలోనికి తమ సేనలు చొచ్చుకుపోయి నప్పటికిన్నీ భైరవోపాసకుడు, శివపూజా దురంధురుడూ అయిన చోళగుని సంహరింపగలుగుదునా ? అనే అనుమానము రఘునాథ మహారాజులకు కలిగినది. ప్రభువులను చూచి చిరునవ్వు నవ్వి, మహాప్రభూ , ముందు కోటవరకు వెళ్ళిన తరువాత కదా సంహారాన్ని గురించి యోచించవలసినది అని చేమకూర వేంకటపతి అనినాడు. |