158
 



21

గోవిందామాత్యులు దివ్య‌ముహూర్తంలో కుమారుని అధ్వ‌ర్యాన వాజ‌పేయ య‌గానికు య‌జ్ఞ‌వేదిక‌ను నిర్మించుట కొర‌కు, బంగ‌రు ఇటుక‌ను పాతి భూమి పూజ గావించ‌డానికి సంసిద్ధులైరి. య‌జ్ఞ‌నారాయ‌ణుడు య‌జ్ఞ‌మును నూత‌న సంవిధానంతో ప‌రిపూర్తి చేయ‌ద‌ల‌చినాడ‌ని విని, మూఢ‌న‌మ్మ‌క‌ముగ‌ల కొంద‌రు వైదిక పండితులు ఆక్షేప‌ణ‌ముల‌ను లేవ‌నెత్తిరి. య‌జ్ఞ‌వేదిక‌కు ఎన్ని ఇటుక‌లు ఉండ‌వ‌లెను ? ఏ ఆకృతిలో నిర్మించాలి ? వాజ‌పేయంచేసేవానికి ఏ అర్హ‌త‌లుండ‌వ‌లెను ? మున్న‌గు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తి కొంద‌రు చ‌ర్చ‌లు మొద‌లిడిరి. అమాత్యులు రాజ్య‌వాంఛ‌తో ఈ యాగాన్ని చేస్తున్నార‌ని కొంద‌రు అప‌ప్ర‌ధ‌ను పుట్టించిరి.

య‌జ్ఞ‌నారాయ‌ణుని శిష్యులంద‌రిలోను బాల‌స్వామి దీక్షితులు అతిపిన్న‌వాడు, చురుకైన‌వాడన్నూ య‌జ్ఞ‌క్ర‌మ‌మునిట్లు చెప్పినాడు. అగ్న్యాధేయ‌ము ప్ర‌ధ‌మ‌ము, అగ్నిహోత్ర‌ము, ద‌ర్శ‌పూర్ణ‌మాస‌ములు, అగ్రాయ‌ణ‌ము, చాతుర్మాస్య‌లు, ప‌శుబంధ‌ము, అగ్నిష్టోమ‌ము, రాజ‌సూయం, వాజ‌పేయ‌ము, అశ్వ‌మేధ‌ము, న‌ర‌మేధ‌ము, విశ్వ‌జిద్యాగ‌ము అని కూడా అన‌బ‌డే స‌ర్వ‌మేధ‌ము, ద‌క్షిణ‌లు, అద‌క్షిఱ‌లు, స‌హ‌స్ర ద‌క్షిణ‌లు...ఇలా వైఖాన‌స‌సూత్ర‌ము య‌జ్ఞ‌క్ర‌మాన్ని చెబుతూ ఉన్న‌ద‌ని ప‌లికెను. సింహాస‌నం కొర‌కో, పోయిన రాజ్యాన్ని పునఃపొంద‌డం కొర‌కో కొన్ని యాగాల‌ను క్ష‌త్రియులు మాత్ర‌మే చెయ్య‌ల‌న్న‌ది శాస్త్ర‌స‌మ్మ‌త‌మే కాని, బ్రాహ్మ‌ణుడు ఏ కోరికాలేక‌, వాజ‌పేయాన్ని చేయ‌వ‌చ్చును అన‌డానికి అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి అంటూ ఆగ్ర‌హావేశాల‌తో బాల‌స్వామి వ‌ణికిపోయినాడు.

గోవిందామాత్యులు రాజ‌ప్ర‌తినిధిగా రాజ్యాన్ని ప‌రిపాలిస్తూ ఉన్న స‌మ‌యంలో వాజ‌పేయ‌మును రాజ్య‌కాంక్ష‌తో చేస్తున్నార‌న్న అప‌ప్ర‌ధ‌నువిని బిందు మాధ‌వాచార్యుడు ఖిన్నుడాయెను. ఏ స‌త్కార్యం చేయ‌త‌ల పెట్టినా ఆటంక‌ములు ఆభాండ‌ములు త‌ప్పువు కదా అని యోచిస్తున్న అత‌నికి త‌న చిన్న‌త‌నాన అప్ప‌య‌ధీక్షితుల‌వారు వాజ‌పేయ యాగం చేసిన విష‌యం గుర్తున‌కు వ‌చ్చిన‌ది.త‌క్ష‌ణం గుంపుగాచేరి చెవులు కొరుక్కుంటూ ఉన్న‌వారి చెంత‌కు చేఇర అమాత్యుల ధ‌ర్మ‌బుద్ధి ఎరిగి ఉండి కూడా ఈలాగున మాట‌లాడుతూ ఉండ‌డం ఎంతో ల‌జ్జాక‌రం. విశ్వ‌శ్రేయ‌స్సును కోరె వారెవ‌రైనా స‌నే, వాజ‌పేయం చేయ‌డానికి అర్హులే, అప్ప‌య దీక్షితుల‌వారు వాజ‌పేయం చేసినప్పుడు మా తండ్రిగారు స్వ‌యంగా ప్ర‌ధానాధ్వ‌ర్యులుగా వ్య‌వ‌హ‌రించి భూరిదానాల నందుకొన్నారు. అప్ప‌య దీక్షితులు అప‌ర‌శివ‌మూర్తులుగా కీర్తింప‌బ‌డుతూ ఉండ‌గా, వారికి ఏ రాజ్య‌కాంక్ష లేద‌న్న విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్య‌మే కాదా ? అని ఉచ్ఛైయి స్వ‌రాన మంద‌లించినాడు.

అప్ప‌య్య దీక్షితుల యాగ‌ప్ర‌స‌క్తిని విన్న ప్ర‌బుద్ధున‌కు ఆనాటి య‌జ్ఞ‌వైభ‌వ‌ము క‌నుల‌కు క‌ట్టిన‌ది. తంజ‌పురాన్ని పాలించే మ‌హారాజు. నృసింహ భూపాల‌వ‌ర్మ తాను య‌జ్ఞాన్ని వీక్షించ‌డానికి అనుజ్ఞ‌నీయ‌వ‌ల‌సిందిగా స్వ‌యంగా ప్రార్ధించి మ‌రీ వ‌చ్చినారు. అంతేకాదు. స్వ‌యంగా య‌జ‌మానికి వెల్ల‌గొడుడు ప‌ట్టి త‌న ఆనందాన్ని వెల్ల‌డించుకొన్నారు. వివిధ దుర్గాల నుండి వ‌చ్చిన ధ‌న‌రాసులేనా ! ధాన్య‌రాసులేనా ! ఆనాడు జ‌రిగిన అన్న‌దానం ఇంతా అంతాకాదు...వేలూరు చిన‌బొమ్మ నృప‌తిని య‌జ్ఞానికి రానీయ‌కుండా వైష్ణ‌వాచార్యులు తాతాచార్యులు అడ్డుకొన్నార‌ట‌...! అంటూ యాగ విశేషాలు నెమ‌రుకు తెచ్చినాడు.

అయితే అప్ప‌య్య దీక్షితులు య‌జ్ఞాలుకూడా చేశార‌న్న‌మాట ! మొన్న ఆస్థానంలో క‌ర్మ‌కాండ‌ను అలా నిర‌సించి పారేశారే ! అని బాల‌స్వామి వంటి యువ‌కులు విస్తుపోయిరి.

న‌డివ‌య‌సుదాటిన త‌రువాత వ‌చ్చిన ప‌రివ‌ర్త‌న‌మిది. వ‌య‌సులో ఉన్న‌పుడు దేవ‌, పితృ, మ‌నుష్య‌, భూత‌, బ్రాహ్మణాది పంచ‌య‌జ్ఞాల‌నూ, జ్యోతిష్టోమాన్నీ చేసి య‌జ్ఞ‌మూర్తిని సంతోష‌పెట్టినారు. అప్ప‌య‌దీక్షితుల వారు చేసిన‌న్ని యాగాల‌ను మ‌రే క‌ర్మిష్టిన్నీ చేసి ఉండ‌డు. అగ్న్యాధేయ‌, అగ్నిహోత్ర‌, ద‌శ‌పూర్ణ‌మాస్య‌, చాతుర్మాస్య‌, అగ్రాయ‌ణ‌, విశుద్ధ‌, ప‌శుబంధ‌, సౌత్రామ‌ణి, ద‌శ‌పూర్ణ‌మాస్య‌, చాతుర్మాస్య‌, అగ్రాయ‌ణ‌, విశుద్ధ‌, ప‌శుబంధ‌, సౌత్రామ‌ణి మొద‌లైన క్ర‌తువుల‌ను ప‌రిపూర్ణంగా నిర్వ‌ర్తించి ద‌క్షిణ‌, గార్హ‌ప‌త్య‌, ఆవ‌హ‌నీయాది త్రేతాగ్నుల‌తోపాటు తానున్నూ నాలుగ‌వ అగ్నిలా ప్ర‌కాశించినారు కారూ !

ఈలాగున ప‌లువుర దృష్టి అప్ప‌య దీక్షితుల‌వారి పావిత్య్ర‌మూర్తిపై నిల‌చి, వారిని త‌ల‌పోస్తూ ఉండ‌టంతో, ప్ర‌స్తుత స‌మ‌స్య‌, గోవింద దీక్షితుల‌వారి య‌జ్ఞ‌దీక్ష‌, అగ్నిచ‌య‌నాన్ని ఆచ‌రించ‌డానికే అనున‌ది య‌జ్ఞ‌నారాయ‌ణుల‌కు పొడ‌గ‌ట్టిన‌ది. వాజ‌పేయం చేయాల‌నే తండ్రిగారి వాంఛ శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాధ ప్ర‌భువులు వ‌చ్చి స్వ‌యంగా నిర్వ‌హింప‌జేసిన‌ప్పుడు తీరుతుంద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చెను.