159
 

యాజ్ఞ‌వ‌ల్క్యుడు అశ్వ‌మేధ‌యాగాన్ని వివ‌రించినాడా ? అయిన‌, ఏ ప్ర‌కారంగా నిర్వ‌చించెను ? అని శిష్యుల ప్ర‌శ్న‌ల‌కుత్త‌రిమిస్తూ య‌జ్ఞ నారాయ‌ణ దీక్షితులు, వాజ‌ప‌నేయ సంహిత‌ను గురించి విపులంగా చ‌ర్చించెను.

యాజ్ఞ‌వ‌ల్క్యుడు ప్ర‌క‌టించిన శుక్ల‌య‌జుర్వేదాన అశ్వ‌మేధ ప్ర‌స‌క్తి లేదు. అశ్వ‌మేధ‌ము, న‌మేధ‌ము కాల‌క్ర‌మాన వేర్వేరు ఋషుల‌చేత ర‌చింప‌బ‌డి, శుక్ల యజుర్వేదంలో చేర్చ‌బ‌డిన‌వి. సూక్మంగా విచారిస్తే తెలియ‌క‌పోదు.

శిష్యు : శుక్ల‌య‌జుస్సుల ప్రాచుర్యం ఎక్క‌డ అధికంగా ఉండేది ?

య‌జ్ఞ : భార‌త‌దేశం తూర్పు భాగంలో సింధున‌దికి తూర్పుగా కురుపాంచాల దేశంలో శుక్ల‌యజుర్వేదం ఆవిర్భ‌వించి, ప్రాచ్చ‌భాగంలోనూ ఉదీచ్చ భాగంలోనూ అన‌గా స‌ర‌స్వ‌తీన‌దికి తూర్పు, ద‌క్షిణ, ఉత్త‌ర భాగాల్లోనూ, నైఋతి భాగంలోనూ, అంగ‌, వంగ‌, క‌ళింగ, ఘూర్జ‌న దేశాల్లోనూ విశేషించి ప్ర‌వ‌ర్తిల్లిన‌ది. ఇలాగ‌ని ద‌క్షిణ‌దేశంలో దీని ప్రాముఖ్యం అంత‌గా లేద‌న‌రాదు.

శిష్యు : యాజ్ఞ‌వ‌ల్క్యుడు ప్ర‌వ‌ర్తింప‌జేసిన దానిని యాజ్ఞ‌వ‌ల్కీయ‌ము అని పిలువ‌క వాజ‌స‌నేయ‌ము అని....అంటున్నారు.

య‌జ్ఞ : ప్రాచీన‌కాలం నుండి జ‌న్మ‌నిచ్చిన తండ్రిని గౌర‌వించ‌డం మ‌న‌కు అనూచానంగా వ‌స్తున్న‌ది. మొన్న మొన్న‌టి వ‌ర‌కు మ‌న ప్ర‌భువుల‌ను చిన‌చెవ్వాచ్యుత మ‌హారాజులు అని పిలుచుకొని వారి తండ్రిని కూడా త‌ల‌పోస్తూ ఉన్నాము. నేడు అచ్యుత రఘునాథ భూపాలుర‌ని వ్య‌వ‌హ‌రిస్తూ ర‌ఘునాథ భూర‌మ‌ణుల తండ్రిగారిని జ్ఞ‌ప్తి చేసికొంటూ యున్నాము. అలాగున‌నే యాజ్ఞ‌వ‌ల్క్యుని తండ్రి వాజ‌స‌ని తండ్రి గారి కీర్తినాయం చిర‌స్థంగావిస్తూ యాజ్ఞ‌వ‌ల్క్యుడు తాను ప్ర‌వ‌చించిన మంత్రాల‌కు వాజ‌స‌నేయ‌ము అని నామ‌మిడినాడు. ఇదిన్నీ గాక‌, సూర్యుడు వాజిరూపాన అన‌గా అశ్వ‌రూపాన వ‌చ్చి ఈ విద్య‌ను యాజ్ఞ‌వ‌ల్క్యునికి బోధించినాడ‌ని ఒక‌గాధ‌. వాజ అనగా అన్న‌మ‌ని భావం. అన‌గాదానం. వాజ‌స‌ని అపారంగా అన్న‌దానం చేస్తూ ఉండెన‌ని కూడా ఒక‌గాధ‌. ఈ వాజ‌స‌నేయాన్నే శుక్ల య‌జుర్వేద‌మ‌ని పిలుస్తూ ఉంటారు - కృష్ణ అంటే న‌లుపు, శుక్ల అంటే తెలుపు. అలాగ‌ని తెల్ల‌ని య‌జుస్సు అన‌రాదు. కృష్ణ‌య‌జ‌స్సులో విష‌య‌మంతా అన్న‌మూ పెస‌ర‌ప‌ప్పూ క‌లిసిన పుల‌గం వ‌లె, విడ‌దీయ‌రానంత‌గా క‌ల‌పిపోయి ఉన్న‌ది. శుద్ధాని య‌జూంసి ఒక క్ర‌మ‌రూపంలో ఉన్న‌దానినే శుక్ల‌య‌జుస్సు అంటూ ఉన్నారు.

శిష్యు : అన‌గా మొత్త‌ము న‌లుబ‌ది అధ్యాయాలున్నూ యాజ్ఞ‌వ‌ల్క్యుడు నిర్మించిన‌వేనా ?

య‌జ్ఞ : మొద‌టివ ప‌దునెనిమిది అధ్యాయాలు మాత్ర‌మే యాజ్ఞ‌వ‌ల్య్య‌మ‌హ‌ర్షివి. మిగిలిన‌వి ప్ర‌క్షిప్తాల‌ని నాకు అనిసిస్తున్న‌ది.

శిష్యు : ఏవి ప్ర‌క్షిప్తాలో్ ఏలాగున తెలుసుకొవాలి, గురుదేవా ?

య‌జ్ఞ : ఒక వ్య‌క్తిభావ‌నా ప‌రంపర‌, ర‌చించే విధాన‌ము, భాషాప్ర‌యోగ‌ము ఉక్తివైచిత్రి. ఇంక‌నూ కొన్ని స్వ‌భావ‌జ‌న్య‌మైన ప‌ద్ధ‌తుల‌ను కూలంకుషంగా విచారించి చూస్తే ర‌చ‌న‌ల‌ద్వారా ప్ర‌వ‌క్త గోచ‌రిస్తూ ఉంటాడు. ఈలాగున మ‌న‌కు ఏది ప్ర‌క్షిప్త‌మో ఏది ప్ర‌ద‌మ నిక్షిప్త‌మో గ్రాహ్య‌మ‌యి తీరుతుంది.

నాటికి చ‌ర్చ ముగిసిన‌ది.

అగ్నిచ‌య‌న య‌జ్ఞ‌వేదిక‌ను వేద‌ప‌ఘ‌న‌ముల మ‌ధ్య నిర్మించిరి. వేదిక పెద్ద ప‌క్షి ఆకృతిలో ఉండి, ఎగురుట‌కు సిధ్ద‌ముగ‌నున్న గ‌రుడుని తోపించేస్తూ ఉండెను. య‌జ్ఞ‌మును తిల‌కించుట‌కు అశేషంగా ప్ర‌జావాహిని వ‌చ్చిప‌డిన‌ది. భూరిదాన‌ముల నాసించి సీమ‌సీమ‌ల నుండి పేద బ్రాహ్మ‌ణులు తండోప‌తండాలుగా వ‌చ్చిరి. శాస్త్రోక్త ప్ర‌కారం యాజ‌కులు వివిధ త‌రుశాఖ‌ల‌తో యూప‌స్థంభముల‌ను నిలిపిరి.

య‌జ‌మాని, గోవింద దీక్షితులు, య‌జ్ఞ‌వేదిక‌ను ద‌క్షిణాన‌, ఒకింత ద‌క్షిణంగా ఒక‌రాయిని ఉంచి, దానిపై క‌మండ‌ల‌ములోని వీటిని మామిడి ఆకుల‌తో ప్రోక్ష‌ణ చేసినాడు. మ‌హీసురులు ముక్త‌కంఠంతో ఉచ్ఛైస్వ‌రాన స్వ‌స్తిప‌లికిరి. మ‌ల‌ర ఈ రాయిని తీసి, క‌మండ‌ల‌ములో ఉంచి, త‌రువాత ఈ రాతిని ద‌క్షిణ‌దిక్కుగా ఉంచి, అగ్ని దేవ‌త‌నారాధించిరి. ఈ రాయి అగ్ని దేవ‌త‌కున్నూ, క‌మండ‌ల‌జ‌ల‌ము ఇంద్రున‌కున్నూ ప్ర‌తీక‌లు.

య‌జ్ఞ‌వేదిక‌ను నూరుకోట్ల ఇటుక‌ల‌తో నిర్మించ‌వ‌ల‌సి ఉన్న‌ది కాని, అట్లు చేయుట అసాధ్యం కావున‌, ప‌దివేల ఎనిమిదివంద‌ల ఇటుక‌లు మాత్ర‌మే ఉప‌యోగించిరి. ఈ య‌జ్ఞ‌వేదిక‌లోని, సాధ్య‌మైన‌న్ని ఇటుక‌ల‌ను యాజ‌మాని ముట్టుకొనిరి.