160
 

మండూక‌ము, అన‌గా అనే నీటివాలులో పెరిగే ల‌త‌, వెదురు మొల‌క‌, ఈ మూడున్నూ చల్ల‌దనానికి ప్ర‌తీక‌లు. ఈ మూడింటి చిత్రాల‌ను, మొద‌ట య‌జ్ఞ‌వేదిక ద‌క్షిణ‌ము నుంచి ఉత్త‌ర‌ము న‌డుమువ‌ర‌కు, పిమ్మ‌ట ఉత్త‌రుమున ఉంచి ద‌క్షిణ‌ము భుజ‌ము వ‌ర‌కూ, తదుప‌రి కుడిరెక్క‌మీద‌, త‌రువాత తోక‌మీద యువ‌ల‌పిండితో మ్రుగ్గుగా చిత్రించినారు.

బంగారు రేకులు, నెయ్యి తేనె క‌లిసిన ద్ర‌వ‌మును చేత‌పుచ్చుకొని, య‌జుస్సులు ప‌ఠిస్తూ య‌జ‌మాని య‌జ్ఞ‌వేదిక‌నెక్కి త‌డ‌వ‌కు అయిదు య‌జుస్సులు చ‌దువుతూ అయిదు త‌డ‌వ‌లు, సూక్ష్మ రంధ్రాలుగల ముఖ్య ఇటుక‌కు ద‌ర్భ‌తో త‌ర్ప‌ణం చేసినారు. వేదిక‌పైగ‌ల ఇటుక‌ల‌న్నిటిపైన పుల్ల‌ని పెరుగు, తేనె, నెయ్యి చ‌ల్లి దేవ‌త‌ల‌కు నైవేద్య‌ము పెట్టిరి.

య‌జ్ఞ‌హ‌విస్సుల‌క‌ర్హులు కాని దేవ‌ల‌త‌నీరితిని తృప్తిప‌ర‌చిన పిద‌ప, అగ్నికి, ప్రజాప‌తికి విశ్వ‌క‌ర్మ‌కు ఒక్కొక్క‌రికి త‌డ‌వ‌కు ఎనిమిది చొప్పున రెండు త‌డ‌వ‌లు ఉద్ద‌రిణితో గోఘ్రుతాన్ని ఆహుతి చేసిరి.

మంత్రార్ధ‌ములీరీతిని ఉండెను.

మ‌మ్ముల‌ను మ్రింగ‌జూచే క్రూర రాక్ష‌సుల‌ను అగ్ని త‌న వాడి మంట‌ల‌లో న‌శింప‌చేయుగాక - అగ్ని మాకు యుద్ధాల‌లో జ‌యాన్ని క‌లుగ‌చేయుగాక‌.

మ‌రీచి, అత్రి, అంగీర‌స‌, పుల‌స్త్య‌, పుల్హ‌, క్ర‌తు, వ‌శిష్ఠుల‌క‌న్న మిన్న‌యైన విశ్వ‌క‌ర్మ మాకు అష్ట‌యిశ్వ‌ర్య‌ముల‌ను కలుగ చేయుగాక‌.

ఇలా మంత్ర‌ప‌ఠ‌న మ‌ధ్య‌న ఆహుతుల‌యిన పిద‌ప‌, తెల్ల‌లేగ‌దూడ‌ను క‌లిగిన న‌ల్ల‌ని గోవును అగ్నికి అర్పించి త‌రువాత దానిని స‌ద్ర్భాహ్మ‌ణున‌కు కైంక‌ర్య‌ము చేసిరి. నల్ల ఆవు రాత్రికిన్నీ తెల్ల‌దూడ వెలుగుకున్నూ చిహ్నాలుగా భావించి ఈలాగున చేసిరి.

అగ్నికి మువ్విధాలైన స‌మిధ‌ల‌ను అర్పించిరి. స‌త్ని, వైకంక‌ట‌, ఉదుంబ‌ర అనే ఒక్కొక్క స‌మిధ‌కూ ఒక్కొక్క మంత్ర‌ముతో అగ్నిని అర్చించిరి.

య‌జ్ఞ‌క‌ర్త వైశ్వారున‌కు బియ్య‌పుపిండి రొట్టెను అర్పించిన త‌రువాత‌, స‌ప్త‌మ‌రుత్తుల‌కు, పేరుపేరునా, రొట్టెల‌ను అర్పించి, దివ్యులైన మాన‌వులు య‌జ్ఞ‌క‌ర్త‌కు అనుకూలుర‌గుదురుగాక అని ప్రార్ధ‌న‌లు చేసిరి.

య‌జ్ఞ‌మొన‌రిస్తూ ఉన్న గోవింద దీక్షితుల‌వారు, ప‌చ్చ‌ని ప‌సిమి దేహంతో, బ్ర‌హ్మ‌వ‌లె తేజోమ‌యులై, ప‌విత్రాకృతులై శోఖిస్తూ ఉండ‌గా య‌జ్ఞ నారాయ‌ణ దీక్షితులు యాజ్ఞ‌వ‌ల్క్యునిలా, కృష్ణాద్వైపాయ‌నునిలా, పైలునిలా థౌమ్యునిలా, నారాయ‌ణ‌మూర్తిలా దుర్మిరీక్షుడై. తేరిపార చూచుట‌కు వీలులేనంత‌గా ప్ర‌కాశవంతు డాయెను. మంత్ర‌మ‌హిమ అట్టిది. మంత్ర‌ములోని వైద్యుత కాంతుల‌ట్ట‌వి, దివ్య ప్ర‌భావ‌మట్టిది, శుభ్ర‌ధీధితుల‌ట్టివి.

య‌జ్ఞాంతాన గోవింద‌మఖులు అధ్వ‌ర్యుల‌కుచ హోత‌ల‌కు, ప్ర‌తి ప్ర‌స్థాత‌ల‌కు, ఉన్నేత‌ల‌కు,స‌ద‌స్యుల‌కు శ‌తాధికంగా క‌న‌క‌వ‌స్తు వాహ‌నాదులను గోవుల‌ను దాన‌మును చేసి విప్ర‌వ‌ర్యుల నానందిపెట్టిరి.

ఏడు వార‌ముల‌కు చిహ్న‌ముగా ఏడు గ్రామ‌ముల‌ను దాన‌మిచ్చి, వేలాది ప్ర‌జ‌ల‌కు అన్న‌దాన వ‌స్త్ర‌దాన ధ‌న‌దారాదుల‌తో తృప్తి ప‌ర‌చిరి.

గోవిందామాత్యులు కొమ‌రుని వైదుష్య‌మున‌కు సంత‌సాన ఉర‌ము ఉప్పొంగ‌గా, రెండ‌వ‌మారు తామి యాగ మొన‌రించినందుల‌కు తృప్తులై, ప‌ర‌మ శాంత భావాన్ని చిదానంద‌మూర్తులై చూప‌రుల క‌నుల‌కు చ‌ల్ల‌ని చంద్రునివోలె దీపించిరి.

న‌మ‌శ్శంభ‌వేచ మ‌యోభ‌వేచ‌
న‌మ‌శ్శంక‌రాయ‌చ‌
మ‌య‌స్క‌రాయ‌చ న‌మ‌శ్శివాయ‌చ‌
శివ‌త‌రాయ‌చ‌

బృహ‌దీశ్వ‌రుని ఆల‌యాన స‌హ‌స్ర‌ఘ‌టాభిషేకానంత‌ర‌ము ఆల‌య జేగంటు నిర్విరామంగా మార్ర్మోగిన‌వి.

గోవిందా మాత్యుల‌వారి హృదిన్నీ న‌ట‌రాజ‌స్వామి పాదార వింద‌మున్నూ ఘంటిక‌, నాద‌మువ‌లె, అభేధ్య‌ములై ఒక్క‌టిగ భాసించిన‌వి.