నాసిక నువ్వు పువ్వును చూసి నవ్వుతూ ఉన్నది. రమణి మణి మోవి లే చిగురాకునూ, వేణి మేఘ మాలికనూ మేనికాంతి మెరుమునూ చూసి హసిస్తూ ఉన్నవి, అని నాయికావర్ణనము చేసినాడు. ఈ వర్ణన వినినంతనే త్రపాభారంతో ఎఱ్ఱనైన రఘునాథ నాయనిం వారికి పులుకు పులుకున నవ్వుపుట్టుకొచ్చినది. వేంకటపతీ, ఉవిదనాసికను సంపంగి కుసుమంతో ఉపమించడం కవి సమయంగా భావిస్తూ ఉంటే, నీవు నువ్వు పూవుతో పోల్చి చక్కని లాలిత్యాన్ని చూపించావు. భళీ, మిత్రమా ! అని వెన్నుతట్టి ప్రశంసించిరి.
మహారాజులు తంజపురి నుండి వేగులు తెచ్చిన వార్తలను సావధానులై చిత్తగించిరి, వృధ్ధులైనప్పటికిన్నీ గురుదేవులు అతి సమర్ధవంతంగా రాజ్యపరిపాలన చేస్తూ ఉండడం ప్రభువులకు ఆనందము కలిగించినది. గొబ్బూరి జగ్గరాజుపై రణభేరీ మ్రోగించుటకు ఇంకొక మాసం పట్టవచ్చననే సారాంశము గోవింద దీక్షితులవారి లేఖ తెలియజేస్తూ ఉన్నది. ఇరుశిబిరాలకూ సేనలు వచ్చి చేరడం ఇంకనూ పూర్తికానందున ఈ ఆలస్యం తప్పనిసరి అవుతూ ఉన్నది. ఇరువురు కయ్యానికి కాలుదువ్వక సమయంకొరకు వేచి ఉన్నట్లున్నూ, ప్రళయమాసన్న మగుటకు ముందువలె ప్రశాంతముగనున్నట్లున్నూ కావేరికి ఇరుప్రక్కలా బారులు తీర్చి నిలచిన సేనలు భావిస్తూ ఉండెను.
రఘు : మిత్రమా ఈ సముద్రమద్యాన నడిరేయి దాటేవరకూ వలనమల్లుతున్నావట !
వేంకట : (సిగ్గుతో) చిత్తం నాకవనబాలిక ఒక సంపూర్ణా కృతినందే వరకు అసూర్యం పశ్యయే ప్రభూ.
రఘు : కానిక్షాత్ర ధర్మమెకద నీకు గలది మొదల దమ్ములు సుతుల్ హితుల్ కూడమమ్ము గొలిచితిపుడు....ఒకటిగా దన్నిటప్రయోజకుడవుజుమీ....
వేంకట : చిత్తం ప్రభూతమ అనుగ్రహం
శ్రీశ్రీశ్రీ రఘునాథ ప్రభువులు ఆలోచనామగ్నులై ఉన్నది గ్రహించుకొన్న వారై, సంఘిలక ప్రభువున్నూ, వేంకటపటిరాజున్నూ వందనపూర్వకముగ వంగి నిలచి జయవాక్యములు పలికి నిష్క్రమించిరి....
22
తొండి గ్రామము నుండి, పల్లెకారులవోలె చేపలు పట్టే నెపాన వలల మాటున ఆయుధాలను దాచుకొని, వేలకొలది భటులుగల చోళసైన్యం దొన్నెలలో సముద్రాన ప్రవేశించి. సింహళద్వీపము మీదుగా సాగిపోయినది. పుదుక్కోట నుండి డచ్చి దేశంవారు రఘునాథ ప్రభువులకు రాజ్యరక్షణార్ధం కాన్నజేసిన శతఘ్నలు పేప పడవలలో వైచికొని మరింత సైన్యము ముందునకు పోసాగినది.
ఇక మిగిలినది గజదళమున్నూ, మహారాజుల వెంటనంటి వస్తూ ఉన్న కాల్బలమున్నూ సముద్ర ప్రవేశము చేయవలసి ఉండెను. క్రూరనారాచాలను బల్లాలను విసరి శత్రుమారణం చేయగల నాలుగువేలమంది సైనికులకు నాయకుడైన ఆళగిరి నాయకుడున్నూ, విషలిప్తబాణాలను వర్షించగల సేనకు నాయకత్వం వహించిన చిన్ని తంబి మొదలారిన్నీ, నావలలో అతి బరువైన యుద్ధసామాగ్రిని గొనిపోగల నౌకానిర్మాణ దక్షులకు శిరస్థానీయుడైన చిదంబదాసున్నూ పాంబం సముద్ర తీరము నుండి దృష్టిని సారించి నేపాళ రాజ్యమునకు గజ సైన్యమును చేరవేసే ఉపాయములను చర్చిస్తూ ఉండిరి.
తనలవలనగదా ఇన్ని ఇక్కట్లువచ్చి ఈ రఘునాథ మహారాజులను చుట్టుకొన్నవి అని నేపాళ ప్రభువు బుద్ధ సంఘిలకుడు సిగ్గుతో మోమును దించుకొనినవాడాయెను. శ్రీశ్రీశ్రీ రఘునాథ ప్రభువులు అతనిని చూచి, సంఘిలక ప్రభూ ! భగవంతుడు నాకిచ్చిన...ఈ భుజబలాన్ని ధర్మరక్షణకుగాక మరెందుకోసం వినియోగించును ? దీనికింత చింత ఎందుకు ? అని ఓదార్చిరి.
వేంకట : సంఘిలక ప్రభూ ! ఎన్నినాళ్ళుగానో ఒక ప్రశ్న నన్ను వేధిస్తూ ఉన్నది. మా దేశంలో కూడా పోర్చుగీసు కొన్ని యంత్రాలను నిలబెట్టడానికి అనే మిషతో కర్మాగారాలను నిర్మించుకొన్నారు. వారి దేవాలయాలనూ నిర్మించుకొన్నారు. కాన రాజ్యాలను ఆక్రమించుకొనడానికి గాని సింహాసనాలను అధిరోహించడానికి గాని ఎలాటి ప్రయత్నం చేసేందుకైనా వారికి ధైర్యం లేకపోయింది. కాని మీ దేశంలో ఇందుకు విరుద్ధంగా ఉంది. అలాగున ఏలాగ జరిగిందో చెప్పగలరా ? |