24
 

గోవింద‌మ‌ఖి మంత్రిత్వ‌ము తిమ్మ‌రుసు మంత్రిత్వానికే దీటు. ఆంధ్ర, హొస‌ల‌, క‌ర్నాట బ్రాహ్మ‌ణుల‌కు తామంధ్రుల‌మ‌నే సంపూర్ణ న‌మ్మ‌క‌ము. కాబ‌ట్టే గోవింద దీక్షితుల‌కు ఆంధ్ర మ‌హామంత్రి అయిన అప్పాజీ ఒర‌వ‌డి. ఆయ‌న మంత్రిత్వ హృద‌యాన‌కు అప్పాజీ గురువు. ఆయ‌న కావ్య‌హృయాన‌కూ, ధార్మిక‌హృద‌యాన‌కూ మ‌హాత్ముడ‌కు అప్ప‌య దీక్షితుల‌వారు గురువు. చ‌దువు చెప్పిన‌ది తండ్రిగారే అయినా ప‌ద‌వ‌యేట‌ను గోవింద దీక్షితులు కేవ‌ల ప‌ర‌మ‌శివ‌స్వ‌రూపుల‌ని ప‌ర‌విద్యాదివ్యావ‌తార‌మ‌ని భావించిన అప్ప‌య‌దీక్షితుల‌క‌డ‌కు చ‌దువుకొన విజ‌య‌న‌గ‌ర‌ము నుండి సామంతుడైన చిన్న బొమ్మ‌నృప‌తి రాజ్యంచేసే వేలూరి న‌గరం పోయెను.

అప్ప‌య్య దీక్షితులు గోవిందుని పుత్రునిగా ఆద‌రించి హృద‌యాన క‌దుముకొని స‌ర్వ‌శాస్త్రాలు నేర్పినాడు. తాళికోట యుద్ధంముందే త‌న‌కు వివాహం నిశ్చ‌య‌మైన‌ది. కాబ‌ట్టి త‌న గురువుక‌డ సెల‌వు పుచ్చుకొని గోవింద దీక్షితులు విజ‌య‌న‌గ‌రం వ‌చ్చివేసినాడు.

గోవింద దీక్షితుల హృద‌యంలో శివాద్వైత‌మ‌తం హ‌త్తుకొనిపోయి ఉంది. దేశికులు అప్ప‌య‌దీక్షితుల‌వారు ఈ మ‌హాసంక‌ల్పానికి అనేక విధాల స‌హాయం చేస్తూ ఉన్నారు.

చెంచుల‌క్ష్మి ఉద‌యం గురుద‌ర్శ‌నం చేసుకొని గురుపాద‌పూజ‌చేసి ఆయ‌న ఆశీర్వాదం పొందింది. తల్లికూడా వ‌చ్చి రాజదృష్టి దోష‌ము పోయేటందుకు కొమ‌రిత గురుపాద‌పూజ చేయ గోవింద దీక్షితుల‌వారి అనుమ‌తి పొంది పూజ చేయించిన‌ది.

గోవిందుడు త‌న‌లో న‌వ్వుకొన్నాడు. ఈ బాలిక జాత‌క‌చ‌క్ర‌ము, ఆ ప‌విత్ర బ్రాహ్మ‌ణుడు వైచిన‌దే ! ఆయ‌న ఈ బాలిక ఒక మ‌హారాజుకి ప‌ర‌మ‌ప్రియ కాబోతున్న‌ద‌ని ఇదివ‌ర‌కే జోస్య‌ము చెప్పినాడు. ఇంత అన‌న్య లావ‌ణ్య‌మ‌యి, ఇంత అపురూప దివ్య‌సుంద‌రి, మాహారాజు చెట్ట‌బ‌ట్ట‌క‌పోతే ఈ జ‌గ‌ద‌ద్భుత మ‌నోహ‌ర‌త్వానికి ఫ‌లం శూన్య‌మే అయిపోతుంది.

కొంద‌రు బాలిక‌లు చిన్న‌త‌నంలో వికార‌రూపులుగా ఉండి ఈడుతో సౌంద‌ర్య విల‌సితుల‌వుతారు. కొంద‌రు చిన్న‌త‌నంలో అంద‌క‌త్తియ‌లుగా ఉండి ఈడురాగానే ప‌ర‌మ వికార‌రూపం పొందుతారు. కాని మూడ‌వ‌జాతి వారైన కొంద‌రు బాలిక‌లు శిశువులుగా , బాలిక‌లుగా, ముగ్ధ‌లుగా, ప్రౌఢ‌లుగా, దివ్య‌సౌంద‌ర్య పూర్ణ‌లుగానే ఉంటారు. చెంచుల‌క్ష్మి అలాంటిదే అని గోవింద‌ముఖి త‌ల‌పోసినాడు.

చెంచుల‌క్ష్మి గురువుక‌డ పాఠం చెప్పించుకొంటూ ఉండ‌గా, యువ‌రాజు శ్రీ ర‌ఘునాధ నాయ‌క మ‌హాప్ర‌భువు దేశికుని ద‌ర్శించ‌డానికి ఒక గ‌డియ‌లో వేంచేయ‌డానికి అనుమ‌తి కోరుతున్నార‌ని యువ‌రాజు క‌డ తాంబూల క‌రండ‌వాహ‌కుడు, చిరురంగ నాయ‌క ప్ర‌భువువ‌చ్చి తెలిపినాడు. మ‌హామంత్రి ఆనంద‌మంది ఆవ‌శ్య‌ము ద‌య‌చేయ‌వ‌చ్చును, అన్నారు.

సరిగా ఒక ఘ‌టిక‌కాలం అవ‌గానే భ‌ట్టు, శ్రీ‌శ్రీ తురుష్క గ‌ర్వాప‌హ‌ర‌ణ‌, ఘ‌న‌ప‌ర్వ‌త‌పురీ క‌ట‌క సంర‌క్ష విద్యాన‌గ‌ర సార్వ‌భౌమ‌దాసులు శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాధ నాయంనివారు దేశికుల ద‌ర్శ‌నం ఆపేక్షిస్తున్నారు, అని మ‌న‌వి చేసినాడు. దేశికులు దీక్షిత‌మంత్రి ఆస‌నంపై నుండి లేచి, ఆ విశాల విద్యాగృహ‌ద్వారం క‌డ‌కుపోయి, ప్ర‌భువును లోనికిరా ఆహ్వానించాడు. ర‌ఘునాధ నాయ‌కుడు అయిద‌డుగుల ప‌ద‌నొకండు అంగుష్టాల పొడ‌వువాడు, దీర్ఘ బాహుడు, విశౄల‌స్కంధుడు. ఆ కాలంలో భ‌ర‌త‌ఖండంలో ఈ యువ మ‌హారాజుతో అందాన దీటైన వాడింకొక భూప‌తిలేడు. ఇరువ‌ది నాలుగేడుల ఈడువాడై, య‌వ్వ‌న‌మ‌త్తుడైన సింహ‌రాజువ‌లె లోనికి దేశికుల వెనుక‌నే న‌డిచి వచ్చినాడు. విద్యార్థులు, విద్యార్ధినులు అంద‌రూ లేచి, వారి వారి స్థానాల నిల‌బ‌డినారు. ర‌ఘునాధుడున్నా ఆ విద్యాగృహంలోనే చ‌దువుకొనినాడు. ఆయ‌న దేశికునితో అర్ధ‌సింహాస‌నాన అధివ‌సించి విద్య‌న‌భ్య‌సించేవాడు.

ర‌ఘునాధ ప్ర‌భువు త‌న గురువుగారి నూత‌న శిష్యురాండ్ర‌నున‌, శిష్యుల‌ను మెరుపు చూపుల‌తో పార‌కించి చూచినాడు. నిన్న తాను ఊరేగే స‌మ‌యంలో గురువు భ‌వ‌నం ఉప్ప‌రిగిపై క‌న‌బ‌డిన ఆనాటి నాట్య‌మ‌యూరి గురువుల‌కెదురుగా ర‌త్న‌కంబ‌ళి దాపునే నిలుచుండి క‌న‌బ‌డిన‌ది. ర‌ఘునాథ నాయ‌కుడు గురువువ‌ద్ద‌నే అర్ధ సింహాస‌నాన కూర్చుండినాడు.