26
 

య‌జ్ఞ : గురుదేవా ! ఏ యుద్ధ‌మన్నా ఎదుటివాని హృద‌యం ఎలా ఉన్న‌దో ఆలోచించి, వాని ఎత్తులు గ్ర‌హించివేస్తే నెగ్గ‌డానికి వీలు.

అతి ప్ర‌గ‌ల్బై ర‌ధ పార‌సీకైః
స‌మం ప్ర‌వృత్తే స‌తి సాంప‌రాయే
క‌ర్ణాట ర‌క్షా క‌ర‌ణే నితాంతం
విచార‌వాన్ వేంక‌ట దేవ‌రాయః అనే శ్లోకాన్ని య‌జ్ఞ‌నారాయ‌ణుడు పాడుతూ
ఉంటే, గోవిందులు ఓహొ ! అన్నారు. వెంక‌ట‌మఖి, అక్క‌డ ఉన్న‌విద్యార్ధులూ, విద్యార్ధినులూ ఆనందంతో త‌ల‌లూపినారు. ఇంక, చెంచుల‌క్ష్మీ బాల స‌ర్వ‌మూ మ‌ర‌చి ర‌ఘునాధ‌నాయ‌క యువ‌రాజును చూడ‌డ‌మూ, య‌జ్ఞ‌నారాయ‌ణ‌మ‌ఖి చెప్పేగాధ వింటూనూ ఉన్న‌ది. ఇక ఇత‌ర ప్ర‌పంచ‌మేమీ ఆమెకులేదు.

గోవింద : య‌జ్ఞా ! ఎవ‌రు ర‌చించిన‌వీ శ్లోకాలు ?

య‌జ్ఞ : మా గురువుగారి చ‌రిత్ర ఆ యుద్ధానంత‌రం నేను ద‌ర్శ‌నం చేసుకొన్నప్పుడు, ఆ మ‌హాభాగురాలు రెండ‌వ యువ‌మ‌హారాణీవారు నాక‌ధ‌నం విని తాము వెంట‌నే ఈ శ్లోకాలు ర‌చించి వినిపించినారు.

గోవింద : చిన్న యువ‌రాణివారు రామ‌భ‌ద్రాంబ‌వారా ? నేను గ్ర‌హించాను. వారిదే ఆ మ‌ధుర‌వాహిని ! ఓహొ ! అన్నీ పాడి‌వినిపించు నాయ‌నా ! మీరిద్ద‌రూ యువ‌రాజుల శిష్యులైనందుకు ర‌ఘునాధ నాయ‌నింవారి శేముషీ సంప‌న్న‌తా వ్యుత్ప‌న్న‌తా అన్నిటినీ స‌ముపార్జించుకొన్నారు.

య‌జ్ఞ : వారు ఈ ఘ‌ట్టం అంతా అతి ర‌స‌వంతంగా వ‌ర్ణించారు, బాబ‌య్య‌గారూ ! మాగురువుగార‌ది విని, దేవిగారిని అంత నన్ను పొగ‌డ‌కు దేవీ ! అన్నారు. ప్ర‌క్క‌నే ఆ శ్లోకాలు ఆనందంతో వింటూన్న పెద్ద యువ‌రాణి క‌ళావ‌తమ్మ‌గారు, అది పొగ‌డ‌డ‌మా ప్ర‌భూ ! మా చెల్లెలు గారు చాలా పొందిక‌గా మ‌హా మ‌ధురంగా వ్రాశారు. కానియ్యండి, చెల్లీ ! అన్నారు. త‌ర్వాత రామ‌భ‌ద్రాంబ దేవిగారు

గురోర్ని దేశాద్గురు రాజ్య‌కార్య‌
నిర్వాహ‌కో నీతి ప‌రాధ్వ‌నీనః
సామంత భూపాల శ‌తానుయాతో
జ‌మ ప్ర‌యాణాయ స‌ముద్య‌తో భూత్‌.

గోవింద : ఓహొ ! గురోర్నిదేశాత్ అన్నారూ రామ‌భ్ర‌దాంబ‌వారు ? నిజ‌మే మ‌రి. తండ్రిగారు పూర్తిగా ఇష్ట‌ప‌డ‌క పోయినా నామాట మీదే కాదూ పెళ్ళికి త‌ర‌లి వెళ్ళేలాగున యుద్ధ‌భూమికి త‌ర‌లివెళ్ళారు ప్ర‌భువులు ! జ‌య‌ప్ర‌యాణ‌మ‌నే మాట‌, జైత్ర‌యాత్ర అనే ప‌దానికి ప‌దిరెట్లు బాగా ఉంది. ఊ ! త‌రువాత శ్లోకం ఏదీ ?

కృష్ణ‌ప్ప నాయ‌నింవారి కొమ‌రిత జింజిల‌క్ష్మీ కుమారి మూడ‌వ యువ‌రాణిగా తంజ‌పురి వ‌చ్చిన‌దా, అని మ‌ర‌క‌త‌వ‌ల్లి కొమ‌రిత చెంచుల‌క్ష్మి ఆశ్చ‌ర్య‌మందిన‌ది చెంచుల‌క్ష్మి యొక్క కంఠ మాధుర్య‌మున‌కు అబ్బుర మందిన గోవింద‌మఖి ఆమెను ముచ్చ‌ట‌గా శుక‌వాణీ అని పిలుచుట ప‌రిపాటి అయిన‌ది.

రామ‌భద్రాంబాదేవిగారి క‌విత్వం ఎంత మ‌నోహ‌రం, ఎంత ప‌ర‌మాద్భుతంగా ఉంది, ఒహొ ! పారశీకుల ఒత్తిడికి శ్రీ వెంక‌ట‌ప‌తిరాయ సార్వ‌భౌములుల క‌ల‌త‌పొందినారు. సాంప‌రాయే అనే ప‌దం మ‌హాఅందంగా ప‌డింది.

గంధాంధ భూమీధ‌వ గంధ‌నాగ‌
కంఠీర‌వం శౌర్య‌క‌ధా విదాన‌మ్‌
ర‌ణే స‌హాయం ర‌ఘునాధ దేవ‌

మ‌యా చ‌తుర్జ‌స్వ‌ల మ‌చ్యుతేంద్ర‌మ్‌, త‌న ప్ర‌భువు గందాంధ భూమీద‌వ గంధ‌నాగ కంఠీర‌వులే ! ఎంత చ‌క్క‌ని రీతి, ఏమి మ‌ధుంగా న‌డిచిందీ శ్లోక‌ము, అని ఉప్పొంగిపోయిన‌ది శుక‌వాణి. అచ్యుతప్ప‌నాయ‌కుల వారికి వార్త పంపితే, శౌర్య సుధానిధి అయిన ర‌ఘునాథ ప్ర‌భువును పంపినారు. ఇక్క‌డ‌, విశ్వామిత్రుని స‌హాయానికి ర‌ఘురాముని పంపించ‌మ‌ని ద‌శ‌ర‌ధుని త‌ల‌పింప‌చేస్తారు. అందుకు గురువుగారు ఒప్పుకొని పంప‌మ‌ని ఆలోచ‌న ఇచ్చారు. వ‌శిష్ట మ‌హ‌ర్షి వ‌లెనా ! దారిలో ఆ దివ్య‌సుంద‌ర‌మూర్తి మ‌ల‌యానిలుడు ఆయాసం ఎడ‌బాపినాడా ! మొద‌ట చంద్ర‌గిరి ఆ వెన‌క పెనుగొండ ఆ మ‌హాభాగులు చేరినారా ! ఆలోచించుకుంటూ, ఆ బాలిక‌, మ‌ర‌క‌త‌వ‌ల్లి కొమ‌రిత చెంచుల‌క్ష్మీ బాల ఆనందంతో ఉప్పొంగుతూ యువ‌రాజు మోమును ప‌ర‌మ‌భ‌క్తితో వీక్షిస్తున్న‌ది.