30
 

అంత‌వ్యుత్ప‌న్న‌త ?

ప్ర‌భూ ! విద్య‌లు నేర్చుకోవ‌డం మ‌నోవేగ‌మే.

ర‌ఘునాథుడు చెంచుల‌క్ష్మిని ద‌గ్గ‌ర‌కు పిలువుడ‌ని గుర‌దేవుని కోరినాడు.

గోవింద : అమ్మాయీ ! చెంచుల‌క్ష్మీ ! ఈలారా !

చెంచెల‌క్ష్మి తెల్ల‌బోయిన‌ది. ఆమె చేతిలో శృంగార వైష‌ధ కావ్య‌మున్న‌ది. అదిలోన చ‌దువుకుంటూ, మ‌న‌స్సు ఎక్క‌డో ప్ర‌స‌రిస్తుండ‌గా, మ‌ళ్ళీ మ‌ళ్ళీ గ్రంధం మీద‌కు మ‌న‌స్సును మ‌ర‌ల్పుకుంటూ, క్రీగంట ప‌ర‌మ సుంద‌రాకారుడైన ప్ర‌భువును చూస్తూ కూర్చండి ఉన్న‌ది. దేశికుని ఆజ్ఞ‌కాగానే ఆమె ఉలిక్కిప‌డి, బెదిరిన హ‌రిణంటా దేశికులు, ర‌ఘునాథ ప్ర‌భువూ కూర్చుండిన చోటున‌కు నెమ్మ‌దిగా అడుగులు వేస్తూ వ‌చ్చ‌న‌ది.

ర‌ఘు : ఇప్పుడు సాహిత్య‌ము ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది నీకు ?

చెంచుల‌క్ష్మి : ప్ర‌భూ...! ప్ర‌భూ...! ప్ర‌భూ... నే..నే...నేను నైష‌ధం చ‌దువుకుంటున్నానండి.

ర‌ఘు : నైష‌ధ‌మా ? బాగున్నది. అలంకార‌గ్రంధాలు ?

చెంచుల‌క్ష్మి : కావ్యాద‌ర్శ‌మూ, కావ్యాలంకార‌మూ రెండూ ఒకేసారి ప్రారంభించినారు. ప్ర‌..ప్ర‌భూ !

ర‌ఘు : దండిమ‌త‌ము ? (ఆనాడు నాట్య‌స‌మ‌యాన నామ‌తిమ‌ర‌పున‌కు అతిహేల‌గా న‌వ్విన‌ది. నేడింత బిత్త‌ర‌పోవుచున్న‌దేల‌నో ! ) అనుకున్నాడు.

చెంచుల‌క్ష్మి : దండిభ‌ర‌త శాస్త్రాదుల‌ను పేర్కొన్నాడు. నాట‌క ల‌క్ష‌ణాలు త‌ప్ప కావ్య‌ల‌క్ష‌ణాలు పేర్కొన్నాడు. మార్గ‌నిర్ణ‌య‌ము అలంకార నిర్ణ‌య‌ము, య‌మ‌క‌, ప్ర‌హేళిక‌, కావ్య‌దోష‌, చిత్ర విత్వాదులు నిర్ణ‌యించినాడు. శ‌బ్దం కావ్య‌శ‌రీర‌మ‌న్నాడాయ‌న‌. ఇష్టార్ధ‌స‌హితంగా ఉండాల‌న్నాడు. శ‌బ్దార్దాలు కావ్య‌మ‌న్నాడు.

ర‌ఘు : భామ‌హుడు ?

చెంచుల‌క్ష్మి : బామ‌హుడు వైద‌ర్భి. గౌడీయ సంజ్ఞ‌ల‌రెంటినీ ప‌రిశీలించి నాడు. కావ్య శ‌రీర‌ము, అలంకార‌ములు. కావ్య‌దోషాలు, న్యాయ నిర్ణ‌య‌మూ, శ‌బ్ద‌శుద్ధి అనే అయిదు ప్ర‌ధాన విష‌యాలు నిర్ణ‌యించాడు.

ర‌ఘు : మ‌హారాజః ఈ శ‌బ్దం ఎట్లా సాధువు ? దానికి పాణినీయ సూత్రం ఏమిటి, బాలికా ?

చెంచుల‌క్ష్మి : ఇక్కడ ట‌చ్ ప్ర‌త్య‌యం వ‌స్తుంది, ప్ర‌భూ ! రాజ‌హ‌స్స‌భిభ్య‌ష్ట‌చ్ అనే సూత్రంక్రింద‌.

ర‌ఘు : మంచిది ! మంచిది ! అయితే మేఘుడువాగ్ర‌హితుడుక‌దా, సందేశం ఎలాగు తీసుకొని వెళ్ళుట ? ఇక్క‌డ ఆ దివ్వ‌క‌వి కాళిదాసు ఎలా స‌మ‌ర్ధించాడు ?

చెంచుల‌క్ష్మి : (కొంచెం సిగ్గుప‌డి. ఆమె మోమున అరుణ‌కాంతులు ప్ర‌స‌రింప అస్ప‌ష్ట‌వాక్కుల‌తో )
కామార్తాహీ ప్ర‌కృతి కృప‌ణాశ్చేత‌నా చేత‌నేషు అన్నాడు కదా మ‌హాక‌వి, ప్ర‌భూ !

గోవింద : భ‌ళీ ! ప్ర‌భువున‌కు చ‌క్క‌గా ప్ర‌త్యుత్త‌ర‌మిచ్చావు. చెంచుల‌క్ష్మీ !

ర‌ఘు : దేశికుల‌శ‌క్తి, ఆమె భ‌క్తి ! చెంచుల‌క్ష్మీ ! ఈ సాయంకాలం మేము ఇక్క‌డ‌కు వ‌చ్చి, నీ సంగీత నాట్య విద్య‌ల‌ను ప‌రిశీలించాల‌ని కుతూహ‌ల ప‌డుచున్నాము. సాహిత్య‌లంకారాల‌లో నీ ప్ర‌జ్ఞ అనుప‌మానం. నువ్వు చ‌దివే పుస్త‌కం ఏమ‌టి, ల‌క్ష్మీ !

చెంచుల‌క్ష్మి : ప్ర‌భూ ! అది శృంగార‌నైష‌ధం, నైష‌దానికి శ్రీ‌నాధ మహా క‌వి ఏ అందాలు చేకూర్చాడా, అని చ‌దువుకుంటున్నాను.

ర‌ఘునాధుడు ఆనందంలో త‌న మెడ‌లోని ముత్యాల‌హారం ఒక‌టితీసి. ఆ మాట‌ల‌కు చెంచుల‌క్ష్మికి ఆ హారం బ‌హుమాన‌మిచ్చి, ల‌క్ష్మీ ! ఇంక కొంచెం కాలం ఉంటే, న‌న్ను నిలువుదోపిడీ చేసేస్తావులా ఉన్న‌ది ! అనినారు. ఆ బాలిక‌కు క‌లిగిన ఆనందం వ‌ర్ణ‌నాతీత‌ము. ర‌ఘునాథ ప్ర‌భువు లేచి దేశికున‌కు పాదాభినంద‌న మాచ‌రించి, అంద‌రి న‌మ‌స్కారాలంది, చెంచుల‌క్ష్మిని సాద‌రంగా చూచి, విస‌విస వెళ్ళిపోయినారు.

ర‌ఘునాధుడు వెళ్ళిపోగానే చెంచుల‌క్ష్మికి పూర్ణిమ‌నాటి చంద్రుడు ఆకాశ‌మ‌ధ్యాన చ‌టుక్కున మాయ‌మైన‌ట్లు, క‌టికిచీక‌ట్లు అలుముకున్న‌వి. ఆమె దేహ‌ము గ‌జ‌గ‌జ వ‌ణికిన‌ది. ఆనంద దుఃఖ స‌మ్మిశ్రిత భావ‌సంజ‌నిత భాష్పాలు, న‌వ్వుల‌లో వేద‌న‌ల‌లో కాంతిపొందిన క‌నుకొల‌కుల నుండి జారిన‌వి. ఆమె పెద‌వులు న‌వ్వుతున్న‌వి.