32
 

7

గోంవింద‌మ‌ఖి ప‌ర‌మ‌భ‌క్తుడు. స‌క‌ల శాస్త్ర స‌ముద్రుడు. అగ్నిష్టోమం చేసి, ఒక యాగం వెనుక ఇంకో యాగం చేస్తున్నారు. సాగ్నిచిత్య స‌ర్వ‌తోముఖ‌ము సాగ్నిచిత్వత్రిరాత్ర‌ము చేసినారు. వాజిపేయ‌ము చేయ‌సంక‌ల్పింనారు. గోవింద‌మ‌ఖి మ‌హా పండితుడు, ర‌స‌జ్ఞ శేఖ‌రుడు, జైమిని సూత్రాల‌కు, కుమారిల ద‌ర్శ‌న‌మున‌కు ( కౌమారిల ద‌ర్శ‌న‌మ‌ని) వ్యాఖ్యానాలు వ్రాసినారు. అద్వైత‌విద్యాచార్యులు అన్న బిరుదు వారి గురువుల‌గు అప్ప‌య్య దీక్షితుల వారికి మ‌ల్లేనే వీరికిన్నీ వ‌చ్చిన‌ది.

తెల్ల‌వార‌గ‌ట్ల స్నానంచేసి, సంధ్యావంద‌నం ఆచ‌రించి, గాయ‌త్రి వేయిసార్లు జ‌పించి లేచి, భార్య‌తో కూడా అగ్నిహోత్రార్చ‌న చేసుకొని, దేవ‌తార్చ‌న పూర్తి చేసుకొని, విద్యామందిరాన‌కు వేంచేస్తారు. వారింట్లోనే భోజ‌నాలు చేస్తూ జీవించే పండితుల‌తో పాటు విద్యార్ధుల‌కు పాఠాలు చెప్పి, ఉద‌యం ప‌దిగంట‌ల ప్రొద్దు ఎక్క‌గానే కోట‌కు వేంచేస్తారు. వారి మంత్రాంగం అద్వితీయ ప్ర‌తిభ‌తో ఉంటుంది.

కోట‌లో రెండు గ‌డియ‌లుండి, ప‌ని చూసుకొని, అచ్యుత నాయ‌నింవారి ద‌ర్శ‌నం చేసుకొని, రాచ‌కార్యాలు మంత‌నం స‌లిపి అక్క‌డ నుండి అంద‌లంపై ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళ‌గానే స్నానంచేసి, మాధ్యాహ్ని కార్చ‌న‌లు చేసి, పునఃపూజ చేసుకొని, వైశ్య‌దేవ‌భూత‌బ‌లి ఆచ‌రించి, భోజ‌నాత్పూర్వం, య‌తిశ్చ బ్ర‌హ్మ‌చారీవ పక్వాన్న స్వామినాఉభౌ. అను న్యాయానుసారంగా సింహ‌ద్వారానికి పోయి, ఉభ‌యుల కొర‌కై చూచి, అలాంటివారు వ‌స్తే ఆనంద‌మంది, వారితో భోజ‌న‌గృహ‌ములోనికి వ‌చ్చి, సపంక్తికంగా అతిధి, అభ్యాగ‌తి విద్యార్ధి, పండిత స‌హితంగా ష‌డ్ర‌శోపేత‌మైన మృష్టాన్న భోజ‌నం చేస్తారు. భోజ‌నానంత‌రం ఆ మ‌హామంత్రి పండితుల‌తో శాస్త్ర‌, మీమాంస‌, త‌ర్కాది చ‌ర్చ‌లు జ‌రుపుతారు. ఇర‌వై ఘ‌టిక‌ల‌కు కోట‌మోసాల భేరీలు మ్రోగుతుండ‌గా దీక్షితుల‌వారు తిరిగి కోట‌కు వెళ్తారు. అప్ప‌టి నుంచి సాయంకాలం రెండు గ‌డియ‌ల కాలం రాజ‌కార్యాలు నిర్వ‌హించుకొంటారు.

పోర్చుగీసు, డచ్చి, తురుష్క రాయ‌బారుల‌కు మ‌హారాజ ప‌క్షాన ద‌ర్శ‌న‌మిచ్చి. వారితో వ్య‌వ‌హారాలు ప‌రిష్క‌రించుకొన‌డం. సామంతుల‌తో క‌య్యాలు మొద‌లైన‌వి తీర్చ‌డం, గూఢ‌చారులు వివిధ ప్రాంతాల నుండి కొనివ‌చ్చిన వార్త‌లువిని, వానిని ప‌త్రాల‌పై లిఖింపించ‌డం, కోశాగార ప‌రీక్ష , ప‌న్నుల సేక‌ర‌ణ‌, సుంకాల విధింపు, ఎగుమ‌తి దిగుమ‌తుల విచార‌ణ, అగ్ర‌హార దేవాదాయాదుల ప‌రిష్క‌ర‌ణ స‌ల‌ప‌డం మొద‌లైన మ‌హ‌త్త‌ర రాజ‌కీయాల‌లో నిమ‌గ్నులౌతారు.

ఆ వెన‌క మ‌హారాజు న‌గ‌రికి వెళ్ళి అచ్యుత‌నాయనిం వారితో మంత‌నం స‌లిపి, గ‌డియ‌ప్రొద్దు ఉన్న‌ద‌న‌గా త‌న న‌గ‌రిచేరి, స్నానంచేసి, సంధ్యావంద‌నం స‌లిపి, జ‌పం చేసుకుంటారు. సాయంత్రార్చ‌న స‌లుపుతారు. నాట్య, సంగీతాది విద్య‌లు నేర్చు మందిరాన‌కు పోయి శిష్య‌, శిష్యురాండ్ర నిపుణాదుల ప‌రిశీలించి, ఇంటిలోనికి పోయి, స‌క‌ల బంధు, మిత్ర‌, పండిత బృంద, అతిధి, అభ్యాగతుల‌తో భోజ‌నం చేస్తారు.

గోవింద దీక్షితులు ద‌బ్బ‌పండు ప‌సిమ‌ఛాయ‌, బొద్దుగా ఉంటారు. కొంచెం బొఱ్ఱ‌ముక్కు, తీక్ష‌ణ‌మైన క‌ళ్ళు, విశాల‌ఫాలం, కంఠం గంభీరంగా మంద‌ర‌స్థాయిని ఉంటుంది. రుద్రాక్ష స్ప‌టిక‌మాల‌లు, మ‌క‌ర కుండ‌లాలు, చేతికి మ‌క‌ర కంక‌ణాలు, ఉంగ‌రాలు ధ‌రించి ఉంటారు. చిరుబొజ్జ‌తో నిండుగా, స‌మున్న‌తంగా ఉంటారు. కోమ‌మోము అంద‌మైన పెద‌వులుక‌ల ఉత్త‌మ‌జాతి పురుషుని గ‌గ‌న‌యాన హంస‌రూప‌వ‌ద‌న‌ము. లంబ‌క‌ర్ణాల‌తో గోవింద దీక్షితులు మ‌హాపురుష ల‌క్ష‌ణాలు క‌ల‌వాడు. యుద్ధాల‌లో పాల్గొన‌క‌పోయినా యుద్ధ నిర్వ‌హణ ప్ర‌జ్ఞ అవడంచేత అచ్యుత నాయనింవారు ర‌ఘునాథ నాయ‌నిం వారూ స‌ర్వ‌కాలాల ఈ మ‌హాభాగునితో స‌మాలోచిస్తూనే ఉంటారు.

ర‌ఘునాథ‌నాయ‌కునికి యౌవ‌రాజ్యాభిషేకం చేయ‌వ‌ల‌సింద‌ని అచ్యుత‌నాయ‌ని మ‌హారాజుల‌కుప‌దేశించి, ర‌ఘునాధ నాయ‌నింవారినే స‌ర్వ సేనాప‌తుల‌ను చేసి, చ‌క్ర‌వ‌ర్తి వేంక‌ట‌ప‌తి రాయులువారి స‌హాయానికి పంపించి ఉన్నారు గోవింద‌మ‌ఖి. అచ్యుత‌నాయ‌నింవారితో స‌మ‌వ‌య‌స్కులైనా వారికి గోవింద‌మఖి అంటే ఉన్న భ‌క్తి అపార‌ము. ఆయ‌న స‌ర్వ‌భార‌మూ మంత్రి స‌త్త‌మునిపై మోపి, తాము వారి స‌మాలోచ‌న ప్ర‌కారం రాజ్యంచేస్తూ ఉన్నారు.

చోళ మ‌హారాజ్యం గోవింద‌ముఖి మంత్రిత్వంలో శ్రీ కేశ‌వ‌నామాల‌లో గోవిందునితో ప్రారంభించి అచ్యుతుని వ‌ర‌కు ప్ర‌పంచంనిండి దివ్య‌శోభాయుత‌మై ప్ర‌కాశిస్తున్న‌దని ఒక మ‌హాక‌వి వ‌ర్ణించినాడు.