36
 

క‌ళా : అద్భుత‌ము ! మ‌హాక‌విత్రియైన మా చెల్లిలిగారి క‌విత్వ‌ము అమృత గంగాఝురి.

ల‌క్ష్మి : (కొంచెం సిగ్గుతో) చిన్న అక్క‌గారి కీర్తి మా జింజిలో చెప్పుకున్నారు ఇంత చిన్న‌త‌నంలోనే శ‌త‌లేఖిని అనీ, స‌మ‌స్యామ‌య లేఖిని అనీ బిరుదులు...అని

క‌ళా : యువ‌మ‌హారాజులుంవారి స‌మ‌క్షాన‌, మ‌హారాజులంవారి స‌మ‌క్షాన స‌భ‌లో మ‌హాపండిత‌లోకం చెల్లిలిగారికి ఆ బిరుదులు ద‌య‌చేశారు. మేమంతా అవ‌రోధ‌జనులు కూర్చునేచోట బంగారు జ‌ల‌తారు ఉల్లిపొర తెర వెన‌కాల ఉన్నాము. చెల్ల‌లుగారు తెర ద‌గ్గ‌రిగా విద్యా పరీక్ష పీఠం మీద కూర్చుని ఉన్నారు. అప్పుడు ఉద్ధండులైన పండితులు చెల్లిలిగారితో వాదోప‌వాదాలు స‌లిపినారు.

ల‌క్ష్మి : చిన్న అక్క‌గారి పాండిత్య‌ము ముందు అనేకులు పండితులు ఓడిపోయి ఉంటారు.

క‌ళా : కాక చెల్ల‌లుగారు స‌మ‌స్య‌లు ఎంత అందంగా పూర్తి చేశారు ! వారి ఆశుధార వ‌ర్ణ‌నాతీము. ఆ స‌మ‌య‌ములో మా స్త్రీ మండ‌లికి వారి మూర్తిభూమిక‌వ‌త‌ల‌రించిన శార‌దాదేవి మూర్తిలా తోచింది. మా అంద‌రి హృద‌యాలూ ఝల్లుమ‌ని పోయాయి !

ల‌క్ష్మి : ఎన్నాళ్ళ‌యింది పెద్ద అక్క‌గారూ

క‌ళా ఏడాది కావ‌చ్చింది.

ల‌క్ష్మి : నేను చూచే భాగ్యం లేక‌పోయింది.

రామ‌భ‌ద్రాంబ‌దేవి ఇంత‌వ‌ర‌కూ కొంచెం త‌ల‌వాల్చి ఆనంద‌మూ, సిగ్గూ బంగార‌మూ అరుణ‌మూ క‌ల‌సిన‌ట్ల‌యిపోవ వింటున్న‌ది. ల‌క్ష్మి, చూచే భాగ్యం లేక‌పోయింది అన‌గానే ఆ బాలిక త‌లెత్తి ల‌క్ష్మిని చూచి, చెల్ల‌లుగారూ ! మీరు యువ‌రాజులం వారి శిష్యురాలు కారాదా ? అని అన్న‌ది.

క‌ళా : నేను వారి పాదాల‌కాడ మూడేండ్ల నుండి విద్య‌లు అభ్య‌సిస్తూ ఉన్నాను.

రామ : అదేమిటండీ, అక్క‌గారూ ! మొన్నాతాము వారిపై రచించిన ప‌ద్యాలు పారిజాత పుష్పాలులా ఉన్నాయి. ఓహో ! ఆ ప‌ద్యాలు వింటూ ఉంటే మా అంద‌రి మ‌న‌స్సులు ఉప్పొంగిపోయినాయి.

ల‌క్ష్మి : పెద్ద అక్క‌గారూ ! ఆ ప‌ద్యాలు వ‌నిపించ‌ద‌రూ ?

క‌ళా : ఎమున్న‌ద‌మ్మా వాటిలో !

ల‌క్ష్మి : వినిపించండీ !

క‌ళా : వారు వ‌చ్చేవేళ‌యింది.

రామ : వారు భోజ‌నానంత‌ర తాంబూల‌స‌భ‌లో పండితాదుల‌కు తాంబూలార్చ‌న చేస్తున్నారు. ఇంకా అర్ద‌గ‌డియ‌వ‌ర‌కూ ఇక్క‌డ‌కు రారు.

ల‌క్ష్మి : వినిపించండి అక్క‌గారూ!

రామ : నేను తాంబుర తెప్పించుతాను. ఎవ‌ర‌క్క‌డ ? (ఒక ప‌రిచారిక ప‌రుగున వచ్చింది)

ప‌రిచారిక : చిత్తం ! అమ్మా !

క‌ళావ‌తీదేవి తాంబురా స‌వ‌రించి శ్రుతి చూచుకుంటున్న‌ది. ఇంత‌లో పారిపార్శ్విక ఒక‌ర్తు వేగంగా అక్క‌డ‌కు వ‌చ్చి యువ‌రాజుల వారు వేంచేస్తున్నారు అని చెప్పిన‌ది. దూరం నుండి మంగ‌ళ వాద్యాలు, జ‌య జ‌య మంగ‌ళ వాక్యాలు వినిపించిన‌వి. ముగ్గురూ ఒక్క‌సారిగా నిలుచుండినారు.

ఆ మందిర‌ద్వారం ద‌గ్గిర ఉన్న దౌవారిక జ‌య‌, జ‌య మ‌హా ప్ర‌భువుల‌కు అని జ‌య పెట్టిన‌ది. లోనికి గంభీర‌గ‌తితో శ్రీ ర‌ఘునాథ ప్ర‌భువు వేంచేసి తాము కూర్చుండిన పీఠాల‌క‌డ‌నే నిలుచుండి ఉండిన త‌న రాణుల ముగ్గురినీ ఒక్క‌సారి త‌ల‌తిప్పి చూచి, వా మువ్వురి దగ్గ‌ర‌కు వ‌చ్చి కూర్చోండి అని త‌న‌కై ఉన్న సింహ‌పీఠిక‌పై అధివ‌సించినారు. మువ్వురు యువ‌రాణులు త‌మ పీఠిక‌లు అధివ‌సించినారు.

ర‌ఘునాథుడ‌ప్పుడు క‌ళావ‌తీదేవి ప‌క్క‌న పీఠికపైన ఉన్న తంబూర చూచి, దేవీ ! ఆ తాంబూరా నీదికాదా ? అని క‌ళావ‌తీదేవిని ప్ర‌శ్నించినారు.

అవును, ప్ర‌భూ ! అని ఆమె సిగ్గుతో న‌వ్విన‌ది.

ర‌ఘు : మాకు చక్క‌ని పాట ఏదేని పాడి వినిపించి విందు చేయ‌ద‌ల‌చుకొన్నారా, దేవీ

రామ : ప‌్ర‌భూ ! అక్క‌గారు ప్ర‌భువుల‌మీద చ‌క్క‌ని ప‌ద్యాలు వ్రాశారు. అవి పాడ‌వ‌ల‌సింద‌ని మా చెల్లెలుగారూ, నేనూ ప్రార్ధిస్తున్నాము.